మేక రవీంద్ర సహస్ర కవి
సమూహ నిర్వహణ
వీరా గుడిపల్లి
యేరువ ఇందిరా రెడ్డి
1.యేరువ ఇందిరా రెడ్డి
2.పార్నంది లలితా కృష్ణ గారు
3.వీరా గుడిపల్లి
4.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
5అనుముల తేజస్విని గారు
6.వాకిటి రాంరెడ్డి గారు
7.తులసి వెంకట రమణాచార్యులు గారు
8.పిన్నక నాగేశ్వరరావు గారు
9.విజయ దుర్గ గారు
10.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
11.శీలోజు శోభన్ బాబు గారు
12.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
13.మూర్తి శ్రీ దేవి గారు
14.శ్రీలక్ష్మి చినుకులు గారు
15.ఉమాదేవి గారు
16.వల్లాల విజయ లక్ష్మి గారు
17.మర్రి జయశ్రీ గారు
18.వురిమిళ్ళ సునంద గారు
19.వెంకట్ బాలగోని గారు
20.వీరా గుడిపల్లి గారు
21.ఇంద్రవత్ రాహుల్ గారు
22.వీరా గుడిపల్లి గారు
23.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
24.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
25.స్వర్ణ సమత గారు
26.. అంబటి భాను ప్రకాష్ గారు
27.పోలా కిషోర్ కుమార్ గారు
28.సంధ్యా శర్మ గారు
29.కాల్వ రాజయ్య గారు
30.రమా కులకర్ణి గారు
31.సునంద వురిమిళ్ళ గారు
32.......
33.విజయ దుర్గ గారు
34.అనుముల తేజస్విని గారు
35.మువ్వ ప్రసాద్ గారు
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44
45.
46.
47.
48.
49.
50.
51.
52.
53.
54.
55.
56.
57.
58.
59.
60.
61.
62.
63.
64.
65.
66.
67.
68.
69.
70.
*********************
1
యేరువ ఇందిర రెడ్డి
అంశం:: తెలుగు భోజుడు
*******************
రవి యై
కవియై
మార్గదర్శి యై
కవుల ఆత్మ భందువై
ఇంజనీరు వై
వృత్తి ధర్మం
ప్రవృత్తి లో
సాహితీ
ప్రేమికుడై
తెలుగు
తల్లి ముద్దు
బిడ్డయై
ఆరు వేల
కవుల
ఏకం చేసి
కవుల
ప్రతిభకు
బిరుదుల
పట్టం గట్టి
నొప్పించక
తానొవ్వక
సూక్తి తో
గర్వం లేని
మహా మనిషి
సాహిత్య
వాట్సప్
సమూహాలలో
ఓ వెలుగు వెలిగిన
రవీంద్రుడు
తెలుగు
కవితా వైభవ
సూత్రదారి
గళ మెత్తి
పాడగా
ప్రోత్సాహం
అందించి
రవివై సుకవియై
స్వచ్ఛతకు
మరో రూపమైన
మీకు
నిర్మలమైన
మనస్సు తో
మీకు మా కవుల
వేదిక కవుల
కవయిత్రుల
పదవీ
విరమణ
అక్షర సత్కారం
అందుకొండి
మహనీయ..
💐💐💐🙏
- యేరువ ఇందిర రెడ్డి
2.
పార్నంది లలితాకృష్ణ*
*సహస్ర సారథి*
వాట్సాప్ వారథిగా
తెలుగు కవితా వైభవానికి
తెర తీసిన
సహస్ర సమూహాల సారథి
రవీంద్రుడు
ప్రసరింపజేసిన
నిస్వార్థ
సాహితీ సేవాతత్పరతా
కాంతులు
పరావర్తనమై
ప్రతిఫలిస్తున్నాయి
ప్రతీ సమూహoలో
సాహితీ బంధంతో
తెలుగుకవులను ఏకం చేసిన
తెలుగు భోజునిగా
అపురూప పురస్కారాల
ఆనవాళ్లతో....
ప్రతీ సదనంలో
చిరు దరహాస వదనమై
కలాన్ని, గళాన్ని
కదిలించాడు
ఆత్మవిశ్వాసానికి
ప్రతీకగా
అద్భుత కవన గరిమకు
పతాకగా నిలిచి పొమ్మంటూ
అక్షరయజ్ఞానికి ఆద్యునిగా
లక్షల కవన సమిధలనర్పించిన సోమయాజిగా
సాహితీ పయనంలో
అలుపెరుగని
బాటసారిగా
అందరి హృదయాల్లో
నిలిచిన అజాత శత్రువయ్యాడు
3
ఇది వీరా గుడిపల్లి కవిత
20/05/2020
శీర్షిక ః అతను మేక రవీంద్ర
**********************
ఎక్కడ ఓ పూవు వికసించినా
అక్షర పరిమళం మనసున పరుచుకున్నా
ఆ వనం తనదేనని ప్రకటించగలడు
ఆరువేల
కవన సైన్యానికి అప్రకటిత రారాజు తాను
అక్షరాలను శ్వాసించేవాళ్ళు
ఆలంబనకై చూస్తున్న రోజుల్లో
ఆశల్ని నాటి
ఒంటరిగా వనాలను నాటిన మాలి మరి
నమ్మలేని నిజాలెన్నింటికో
నమ్మకమైన సాక్ష్యం అతను
కవిమిత్ర నుండి పద్యశ్రీ వరకు ఎన్ని మజిలీలో
అంతర్జాల సమూహాలను
అక్షరాలతో స్నేహింపజేసిన అభినవ తెలుగు భోజుడు
పురస్కారాలకు కొత్త భాష్యం చెప్పి
అక్షర ప్రేమికులకు అందమైన మార్గాలను వేసిన మార్గదర్శి.
సాహిత్య పుర వీధుల్లో అడుగడుగునా కనిపించే కటౌట్....
అందరి హృదయాలలో చెదరని చిత్రం...
పిలవాలను కుంటే పలకాలనుకుంటే
మేక రవీంద్ర అతని పేరు
**********వీరా గుడిపల్లి******
4.
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:30-5-2020
అంశం:మేక రవీంద్ర
ప్రక్రియ: వచనకవిత
శీర్షిక: *సాహిత్య ఇంజనీర్*
**************************
ఆయనొక *అక్షరాల ప్రేమికుడు*
కవులకు *ప్రేరేపకుడు*
నిత్య *స్వాప్నికుడు*
*ప్రతిభాన్వేషకుడు*
నిరంతర *సాహిత్య సేవకుడు*
కవిపక్షాన నిలిచి
కవిలోకానికే *రవి* అయ్యాడు
నమ్మకం కలిగించి,ప్రోత్సాహాన్నిచ్చి
వేదికలనిచ్చి,సంఘటిత పరిచి,
*సాహిత్య ఇంజనీరై* ఆవిర్భవించాడు
*తెలుగు కవితా వైభవాన్ని* ఏర్పరచాడు
*అయుత,ప్రయుత కవితాయజ్ఞాలు* నిర్వహించి
*సహస్రకవులను* సమాయత్తపరచాడు
వాట్సాపే తన చిరునామై
నిత్యసాహిత్య వ్యవసాయం చేసాడు
ఊరూరూ తిరుగుతూ,ప్రతిభకు
పట్టం గట్టాడు
రచనలు చేయించి,బిరుదులనిచ్చి
స్ఫూర్తినింపి,అండదండై నిలిచాడు
అవకాశాలు కల్పించి, ఆలోచనలు రేకెత్తెంచి
*దిక్సూచై* మార్గం చూపించాడు
నిరాడంబరత,నిస్వార్థత
నిజమైన కార్యశీలతలతో
వృత్తిని,ప్రవృత్తిని సార్థకం చేసుకున్న రవీంద్రుడు
*సాహిత్య ఇంజనీరే*
5.
[30/05, 8:04 PM] అనుముల తేజస్విని Poetess: కవుల వేదిక
అంశం:మేకా రవీంద్ర గారిపై కవిత
శీర్షిక:అలుపెరుగని బాటసారి
లక్ష్మణ్ రావు, అంజనీ దేవి
గర్భమ్మున జనియించిన,
తెలంగాణ కవితా పితామహ,
సాంకేతిక విద్యలో రాణించి
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ
ప్రవృత్తి ధర్మoలో సాహిత్యానికి వెలుగు తెచ్చిన సూరీడు
వాసిరెడ్డి నవలలు,
శ్రీ శ్రీ కవితలు,
పోతన భాగవతాలు ,
చలం సాహిత్యం ఇలా
ఎన్నో చదివి
తెలుగుకి వెలుగు తెచ్చిన వ్యక్తి
తెలంగాణ ఆంధ్రభోజుడు
మేలిమి ఆణిముత్యం మేకా రవీంద్ర గారు...
కొత్త కవులకు భవిష్యత్ని చూపి
సహస్ర కవుల సమూహాన్ని నిర్వహించిన ధీశాలి
వారి చేత తెలుగుతల్లి ఖ్యాతి గడిచింది
అలుపెరుగని బాటసారి
తెలుగు సాహిత్య నవకవన దారులకు తానే ఒక రహదారి అయి,
సహస్ర కవి మిత్ర,
సహస్ర పద్యశ్రీ,
సహస్ర గానకోకిల,
సహస్ర దృశ్యకవి చక్రవర్తి
బిరుదులతో కవులను సత్కరించారు
మేకా రవీంద్ర గారు
తెలుగు భాషామతల్లికి ముద్దుబిడ్డ
అక్షరనీరాజనం చేసిన వ్యక్తి
ఎందరో కవిశిఖామణులు
వీరి ప్రోత్సాహంతో వచ్చినవారు
వీరితో సాహితీ బంధాలను ఏర్పర్చుకున్నవారు
కవిత్వాన్ని విస్తరించి
సాహిత్యాన్ని సజీవం చేసిన
మన మేకా రవీంద్ర గారికి
నేడు నా తేజస్సుమాక్షరాంజలులు.........
ధన్యోస్మి🙏
అనుముల తేజస్విని
6.
తేదీ:30/5/2020
నర్సంపేట.
[30/05, 8:04 PM] Vakiti Ramreddy Poet: *** వేడుకోలు ***
పల్లవి : వీడుకోలు వీడుకోలు వీడుకోలు
విడిపోకూడదని వే డుకోలు
1 మేరునగ ధీరుడు మేక రవీంద్రుడు
సాహిత్యసేవలో కమ్మని కవీంద్రుడు
ఉద్యోగ దర్మం లో ఉత్తమ సేవకుఁడు
వికసించే పువ్వోలే నవ్వుల బావకుడు
2 అరవైఏండ్ల వయసులో అలసిన నీ పెదవులు
అలుపెరుగని సేవలో నిలిచిన నీ కరములు
పలువురి మేలుకొరి ప్రశంశలు అందుకుని
పరిపుర్ణ తృప్తితో పసందైన వీడుకోలు
3 తెలుగుతల్లీ సేవలో కొలువైన కవివర్య
అందమైన కవితలతో గడిపావు దినచర్య
నిలువెత్తు సేవలతొ నిగర్విగా నిలిచావు
కవులకు కాంతినింప వెలుగెత్తి చాటావు
4 తల్లిదండ్రులే దైవమని తనువెల్ల కొలిచిండు
నిజాయితీ సేవలో నిలువుటద్ద మయ్యిండు
కవిత్వమే ఊపిరిని కవులే నా ప్రాణమని
సహస్ర కీర్తి పుస్తకమయి వెలిగిండు
5 ఎదిగినకొద్ది తను ఒదిగేటి లక్షణం
ఉత్తమ కవులతోటి నేర్చుకున్న శిక్షణం
అక్షర చైతన్యమై అందరికీ చేరువై
అంతర్జాల కవి సమ్మోహనుడైయ్యిడు
6 అందుకో గురువర్యా వందనాలు
కవుల వేదిక కవన చందనాలు
వందేళ్లు వర్థిల్లు రవీంద్రుడా
కొత్త కవుల మరవలేని కవీంద్రుడా
రచన : వాకిటి రామ్ రెడ్డి ,కవిగాయకుడు
ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి
చరవాణి ,9000702093
🙏💐💐💐🌹💐💐💐🙏
[30/05, 8:07 PM] Vakiti Ramreddy Poet: *** వేడుకోలు ***
పల్లవి : వీడుకోలు వీడుకోలు వీడుకోలు
విడిపోకూడదని వే డుకోలు
1 మేరునగ ధీరుడు మేక రవీంద్రుడు
సాహిత్యసేవలో కమ్మని కవీంద్రుడు
ఉద్యోగ దర్మం లో ఉత్తమ సేవకుఁడు
వికసించే పువ్వోలే నవ్వుల బావకుడు
2 అరవైఏండ్ల వయసులో అలసిన నీ పెదవులు
అలుపెరుగని సేవలో నిలిచిన నీ కరములు
పలువురి మేలుకొరి ప్రశంశలు అందుకుని
పరిపుర్ణ తృప్తితో పసందైన వీడుకోలు
3 తెలుగుతల్లీ సేవలో కొలువైన కవివర్య
అందమైన కవితలతో గడిపావు దినచర్య
నిలువెత్తు సేవలతొ నిగర్విగా నిలిచావు
కవులకు కాంతినింప వెలుగెత్తి చాటావు
4 తల్లిదండ్రులే దైవమని తనువెల్ల కొలిచిండు
నిజాయితీ సేవలో నిలువుటద్ద మయ్యిండు
కవిత్వమే ఊపిరిని కవులే నా ప్రాణమని
సహస్ర కీర్తి పుస్తకమయి వెలిగిండు
5 ఎదిగినకొద్ది తను ఒదిగేటి లక్షణం
ఉత్తమ కవులతోటి నేర్చుకున్న శిక్షణం
అక్షర చైతన్యమై అందరికీ చేరువై
అంతర్జాల కవి సమ్మోహనుడైయ్యిడు
6 అందుకో గురువర్యా వందనాలు
కవుల వేదిక కవన చందనాలు
వందేళ్లు వర్థిల్లు రవీంద్రుడా
కొత్త కవుల మరవలేని కవీంద్రుడా
రచన : వాకిటి రామ్ రెడ్డి ,కవిగాయకుడు
ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి
చరవాణి ,9000702093
7
🙏💐💐💐🌹💐💐💐🙏
[30/05, 8:21 PM] Tulasi Venkata Ramana: కవుల వేదిక:
పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
కలం పేరు: మానస.
అంశం: మేక రవీంద్ర గారు.
శీర్షిక: సాహితి ధ్రువతార
ఆయన ఒక సాహసకుడు
అలుపెరగని సాహితి కెరటం....
సాహిత్య పూదోట లో
కలం పట్టని యోధుడు...
ఎన్నో కలాలకు చేయూతనిచ్చిన
చైతన్య మూర్తి....
తెలుగు భాషంటే మక్కువ ఎక్కువ...
చేసే వృత్తికి ...ఈ కవిత్వం వికృతే ...అయినా..
మదిలో వెలసిన అక్షర రూపం కి ప్రాణంపోసి...
పదాల అల్లికలతో ప్రకృతి అందాలను ఓలలాడించిన అక్షర ప్రేమికుడు...
సాహితి పిపాసి...
చుక్కల్లో చంద్రుడు....
చిద్విలాస మూర్తి....
నిత్య కృషి వలుడు.....
యువ రక్తానికి ....ఊపిరి
విభిన్న ప్రక్రీయల సృష్టి కర్త
నిత్య అక్షర తేజోమయుడు
సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం...
సహస్ర కవులకు ప్రేరకుడు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
నలుదిశలా వ్యాపింపజేసి...
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు...
ఎందరికో చేయుతనిచ్చిన ధన్యమూర్తి.
నిత్య వెలుగొందే దివ్యతార
సాహితి లోకానికి పెన్నిధి
మాకు వారధి ...మా హితుడు మా మార్గదర్శి ..
మా గురువర్యులు "మేక రవీంద్ర"గారు ఓ ధ్రువతార.
వారి పదవికే విరమణ...
పెదవికి లేదు విరమణ....
నిత్య సాహితి కృషి వలుడా ...
మీకివే పదవీ విరమణ శుభాకాంక్షలు...
మేక రవీంద్ర గారికి ఇవ్వే మా అక్షర నీరాజనాలు💐💐🙏
8
***
[30/05, 8:28 PM] Pinnaka Nageshwar Rao: కవుల వేదిక. 30--5--2020.
9
నేటి అంశము :-- శ్రీ మేక రవీంద్ర.
1. ఉ.
ఉన్నత స్థానమున్ పదవి యున్నను ,
మక్కువ మాతృభాషపై
మిన్నగ కల్గియుండి కవిమిత్రుల పేర్లను
సేకరించి తాఁ
మన్నన గొన్న "వాట్సప" ను మాధ్యమ
మందు రవీంద్ర చేర్చియున్
చెన్నుగ తెల్గుభాషకై కృషిని చేయుడటంచు
ప్రోత్సహించెగా!
2. తే.గీ.
తెలుగు కవిత వైభవములు తేజరిల్ల
అయుత కవితల యజ్ఞమారంభ మందు
మద్దతివ్వగ "వాట్సప్పు" మాధ్యమముగ
లక్ష్యముగ పదివేలు నిర్ణయము చేసి....
3. తే.గీ.
నాడు చేరిన కవులను వేడగాను
కవిత సమిథలు వత్సర కాలమంత
పంప యజ్ఞమ్ము తుదకు సఫలత నొంద
సారథి యగు మేక రవీంద్ర శ్రమకు సాక్షి.
4. తే.గీ.
అయుత - ప్రయుతగా మరు వత్సరాన
మారె
లక్ష్యముగ నిర్ణయించగ లక్ష కవిత
లవియు నవలీలగా వ్రాసి కవులు తాము
తిరుగులేదు మాకనుచుఁ దెలియ జెప్పె.
5. తే.గీ.
ప్రయుతయున్ మారెనుగ సత్ర క్రతువుగాను
కడచినట్టి యీ వత్సర కాలమందు
కవుల సంఖ్యయు పెరుగగ కవితలెన్నొ
యలర జేసెను మిత్రులు హర్షమొంద.
6. తే.గీ.
నూతన సహస్ర వాణిన్ వినూత్న రీతి
వీనులకు విందు గొల్పెడు వివిధములగు
శ్లోకముల్,పద్య,కవితలు, సూక్తులెన్నొ
శ్రుతి లయలు తప్పకుండగ ప్రతిభ జూపి
గాన మాధుర్య మొలికించ గళములందు
పరవశత్వాన మేనును మరచినాము.
7. తే.గీ.
మేక వంశమునందు జన్మించినారు
సాధు వర్తనుడు, నిగర్వి,సహనశీలి
పదవి విరమణ చేయు శుభ సమయమున
వీడుకోలు పలుకుచు రవీంద్ర మీకు
నందజేతు శుభాకాంక్ష లార్య! గొనుడు!!
***********************************
9
[30/05, 8:36 PM] Vineelamma: కవులవేదిక
పేరు: విజయదుర్గ
కవితా అంశం : ఆత్మీయ నడక
కవితా సంఖ్య: 31
తేదీ: 30/05/20
కవిలోకంలో మెరిసిన
ధృవతార
సాహిత్య పరిచయం లేకున్న
కవుల ను ఆదరించే ఆత్మగౌరవం....!!
ఎల్లలు లేని ఓర్పు ఓపికలతో
చిరునవ్వు వెన్నెలలతో
ఆత్మీయతా రాగాలను పలికిస్తూ
కవుల సాగరాన్ని సృష్టించిన
మహాభోజుడు....!!
కవులకు వేదికగ నిలచి
మానవతా ద్వారాలు తెరచి
ఎన్నో ప్రక్రియ లలో అడుగేస్తూ
ఒక్కతాటి పై నడపించే రథసారథి....!!
ఇలలో మెరిసిన ఆణిముత్యం
అలవని సాహిత్య నదీ తరంగణి
పరోపకారమే పరమావధిగ
మెరిసే వజ్రమాణిక్యం....!!
విశ్రాంతి సమయం కావాలి
మీ జన్మ సార్థకత
రవి కిరణమై కావాలి
ఎందరో కవులకు మూలాధారమై
అందరి హృదయాల నిలచి
విరబూయాలి చిరకాలం....!!
🌹వినీల🌹
10.
[30/05, 8:38 PM] Balloori Umadevi Poetess: కవుల వేదిక
డాక్టర్ బల్లూరి ఉమాదేవి
అలుపెరుగని సూర్యుడు రవీంద్ర
డా.బల్లూరి ఉమాదేవి
అలుపెరగని సూరీడు వలె
సాహితీ సేవలో నిమగ్నమైన
సాహితిపిపాసి
వందనం శుభాభివందనం
చెరగని చిరునవ్వు తన స్వంతం
మితభాషిత్వం సహజగుణం
ప్రశంసలకు పొగడ్తలకు ఆమడదూరం
అయుత ప్రయుత యజ్ఞాల పేరిట
తెలుగు వారికి ఒక వాట్సప్ వేదిక కల్పించి సహస్ర కవి సమ్మేళనాన్ని ఆరంభించిన వైతాళికుడు
దృశ్య కవిసమ్మేళనం రూపశిల్పి
ప్రపంచంలో నలుమూలల ఉన్న కవుల గళాలను జగతికి పరిచయం చేసిన ధీశాలి
చదువులమ్మ సన్నిధిలో కవి సమ్మేళనం కవులకు బిరుదులొసంగి సత్కారాలు
చేసిన కవి పోషకుడు
వృత్తి ప్రవృత్తులు వేరైనా తెలుగు భాషపై
మక్కువతో తెలుగు కవులను ప్రోత్సహిస్తూ కవి రత్న, కవి మిత్ర,
కవి భూషణ , సహస్ర పద్య శ్రీ ,కవి చక్రవర్తి
బిరుదులిచ్చిసత్కరించిన కవి పోషకుడు
నాటి రాయల ఆస్థానంలో అష్టదిగ్గజకవులే ఉంటే అపర కృష్ణరాయల ఆస్థానంలో
ఆరువేలకు పైగా కవులున్నారు
కథలు కవితలు ఎన్నో ప్రక్రియలు
అంతర్జాల కవి దిగ్గజాలకు దారి
దివ్వెఅయ్యాడు
కవన యజ్ఞం చేయించాడు
యజ్ఞకర్త గా మారాడు
పుస్తకాలను ముద్రించాడు
సభలను చేసి సన్మానించి పంచాడు
దృశ్య శ్రవణ మాధ్యమాలను
సామాన్యులకు పరిచయం చేశాడు
నవయుగ కవి కులభూషణుడయ్యాడు
రెండు రాష్ట్రాల కవులకు చక్కని వేదిక
నొసగి వారి కలాల కు బలం
ఇచ్చినమహామనీషీ రవీంద్ర గారికి
వందనం శుభాభివందనం
శ్రీ మేక రవీంద్ర గారుఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. సాహితీ సేవలో నిమగ్నం అయిన వీరి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను .పదవి విరమణ శుభాకాంక్షల తో
డాక్టర్ బల్లూరి ఉమాదేవి.
డల్లాస్ అమెరికా
11
[30/05, 8:43 PM] Sheeloju Shobhan babu: ఆట వెలది
మేకవంశ ధీర మేకరవింద్ర యు
ఇంజనీరువృత్తి యేనుచేసి
వారువృత్తినుండి వైదొలుచున్నారు
సాటిలేరువార్కి జగతి నందు
శీలోజు శోభన్ బాబు
నందపురం
12
[30/05, 8:55 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** సాహితీ కెరటం ***
✍️డా.పాండాల.
ఆయనొక సాహస సాహితి కెరటం
అలుపెరగని కవన యోధుడు
పెక్కు కలగళాలకు ప్రేరణపంచిన
చైతన్య శీలి...!
మాతృభాషలో ఎక్కువగా కవితా సేద్యం చేసిన కళా పిపాసి...!
మనసులో మెరిసిన భావాలకు రమ్యంగా ప్రాణంపోసి...
పద పొందికలో
ప్రకృతి అందాలను మేళవించి
చదువరుల హృదయాలను
ఊహల ఊయలలో ఓలలాడించిన అక్షర శిల్పి...!
నిత్య కృషీవలుడు..!
యువ తరానికి ఊతంనేర్పి
పలు ప్రక్రియలకు పాదులుతీసిన
సత్య తేజోమయుడు..!
సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం...!
సహస్ర కవులకు ప్రేరకుడు
సాంకేతిక పరిజ్ఞానంలో
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు
శ్రీకారం చుట్టిన ఆదిత్యుడే మన రవీంద్రుడు...!
సాహితి లోకానికి
పెన్నిధిగా,
మార్గదర్శిగా,
మేక రవీంద్రుడు ఓ ధ్రువతార..!
వారి పదవికే
విరమణ కానీ
పదాలకు
పెదాలకు లేదు విరమణ
నిత్య సాహితి కృషీవలునికి
నీరాజన వందన మందారాలు...!
🙏☘️🌺❇️👋🙏
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
13
[30/05, 9:15 PM] Murthy Sreedevi Poetess: మూర్తి శ్రీదేవి
కలం పేరు “గురుసౌభాగ్య”
అంశం: మేక రవీంద్ర గారు
శీర్షిక : కళాపిపాసి
తేది : 30-5-2020
*. *. *. *. *. *. *
వారికి వారే సాటి
వారికి లేరు పోటీ
అభినవభోజుడు
“హైదరాబాదు రవీంద్రుడు”
"చెన్నకేశవ" వంశ తిలకుడై
"అంజనీదేవి" నోము భాగ్యమై
"లక్ష్మణరావు" వరపుత్రుడై
సంకల్ప భగీరథుడై సాగే కెరటం
అయుత, ప్రయుత కవితాయజ్నాలు
నిర్వహించిన సాహిత్య యుగంధరుడు
వాట్సాప్ వేదికగా వర్థమాన కవులను
సమాయత్తపరిచిన సమరాంగణుడు
సహస్రసమూహ సృష్టికర్తయై
సహస్ర బిరుదుల ప్రదాతగా నిలిచిన
తెలుగుతల్లి ముద్దు బిడ్దడు
సహకార సౌశీల్యుడై ఎందరో
మనసుల్లో కొలువైన ఇంద్రుడు
నవ, యువ కవుల ప్రతిభకు
రూపాన్నిచ్చి విశ్వాసానికి ఆజ్యం
పోసిన నిరాడంబర సాగరుడు
సౌహార్ధ పయోనిధుడై స్నేహానికి
శాశ్వత చిరునామా ఏర్పరిచిన
మూర్తీమత్వ సత్యసంధుడు
వాట్సాప్ సాహితీ పితామహుడై
కలం పట్టని కవికులరాజు
ఆన్ లైన్ శిక్షకుడై అలుపెరుగని
కృషీవలుడైన రవీంద్రుడు
వృత్తికి విరమణ వచ్చినా
ప్రవృత్తికి విరామం ఇవ్వబోని
కళాపిపాసి...
సమకాలానికి స్ఫూర్తియై
భావితరానికి ఆదర్శమై
తెలుగునేలకు అజరాజరమై
వెలిగే అక్షర ధ్రువతార...
*మేక రవీంద్ర* గారు
14
[30/05, 9:29 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవుల వేదిక
తేది 30-5-2020
అంశం *రవీంద్రుడు*
పేరు చివుకుల శ్రీలక్ష్మి
కవితా శీర్షిక.
*స్ఫూర్తి ప్రదాత*
నింగిలో సహస్ర కిరణాలతో
వెలిగే సూర్యుడు!
భువిలో సహస్ర వేదికలలో
సహస్ర కవులతో వెలిగే రవీంద్రుడు!
ఎలా పరిచయం? చూసిందెప్పుడు?
*సహస్ర వేదికలో*
వేలాది మంది సాహితీవేత్తలకు
ప్రియమైన వేదికలో
రవీంద్రుని పేరు విన్న పరిచయం
కథలూ, వ్యాసాలూ, పద్యాలూ,
కవితలూ, దృశ్య కవితలూ
పాటలూ, మాటలూ, సూక్తులు
ఒకటా? రెండా? ఎన్నెన్ని సమూహాలు?
మన ప్రతిభా విశేషాల ప్రదర్శనకు
ఎన్నెన్ని వేదికలు!
పురస్కారాలు అందుకునేందుకు!
ఎన్నడైనా ఎరుగుదుమా?
అలనాడెన్నడో
నవరత్నాలతో హర్షుడు
అష్ట దిగ్గజాలతో రాయలవారు
ఈ సాంకేతిక యుగంలో
సహస్ర సహస్ర ప్రతిభకు బిరుదులను
*సరస్వతీ మాత*
*సన్నిధిలో*
ప్రసాదించే రవీంద్రుడు
అప్పుడే చూసాను
*తెలుగు తల్లి* *ఎన్నుకున్న*
*ఆ దివిజుని*
కేవల మర్త్యుడే!
తెలుగు భాష పట్ల అభిమానం
తెలుగు కవుల పట్ల మన్నన
నిర్వహణలో సామర్థ్యం
ఎదిగిన కవి ఒదుగుట చూసి
ఒక చిరునవ్వు
అహంకరించిన కవిని చూసి
రెండు చిరునవ్వులు
నొప్పింపక తానొవ్వక
బాధ్యతాయుతమైన వృత్తి
మనోరంజకమైన ప్రవృత్తి
ఏకకాలంలో నిర్వహిస్తూ
ఎందరికో
*స్ఫూర్తి ప్రదాత!*
పదవీ విరమణ సమయం
కవులందరిమది ఆనందమయం
తమతో గడిపే పూర్తి సమయం
ఈనాటికి వచ్చిందని!
ఆ చిన్న మెదడులో
వినూత్న ఆలోచనలు!
అరచేతిలో
ఆధునిక సాంకేతికత!
సమర్థతకు మారుపేరైన
రవీంద్రులవారికి
నా మనః పూర్వక
అభినందన
పరిమళ సుమాల మాల
సమర్పిస్తూ శ్రీలక్ష్మి
15
[30/05, 9:51 PM] Uma Devi MV: కవుల వేదిక
తేది -30-5-2020
అంశం -మేక రవీంద్ర గారు
శీర్షిక -
కవి మిత్రుడు
కవితలల్లే ఘనాపాటి
కవుల ప్రోత్సహించిన మేటి
మేక రవీంద్ర గారు
నిరాడంబర పంచవటి !
ఈ వాటిక ప్రియమైన కవుల
వేదిక
రస రమ్య భావనలు సృజియించు వాహిక!
తానే రచనలు చేయు
కవి విలువ తెలియజేయు
సహస్రాధిక కవుల వేదిక
నిర్మించిన మహాశయుడు !
వారికి కవుల నమస్సులు !
హార్దిక శుభ కామనలు !
నిరంతరం పదం పదం కలిపి
సమరసతతో అందించు
పుష్ప గుచ్ఛాలు !
******************
ఎం. వి. ఉమాదేవి
నెల్లూరు
16
[30/05, 9:56 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:.**మన *కవీంద్రుడు**
తనకోసం భక్తితో భగవంతుడికి
*గీతాంజలి*ని ఘటించిన
రవీంద్రుని గురించి విన్నాగానీ
సాహిత్యంకోసం రచయితలతోక్ట
సాహితీయజ్ఞాన్ని చేయిస్తున్న *కవీంద్రుణ్ణి* స్వయంగ చూసి తరిస్తున్నా
రవికిరణాలు సోకగనే కమలాలు
వికశించినటుల రవీంద్రుని ప్రోత్సాహoతో
కవుల కలాలు చురుకుగ కదలుచుండు
యువగళాలలో ఉత్తేజం నిండుచుండు
శ్రీకృష్ణదేవరాయల భువనవిజయంలో అష్టదిగ్గజాలే హాయిగ విరాజిల్లరి
రవీంద్రుని కవనసమూహంలో వేలమంది వర్ధమానకవులు ప్రసిద్ధులైరి
'భోజుడు' చంద్రగుప్తుల వంటివారు చక్రవర్థులైనందున కవుల పోషించిరి
*మేక రవీంద్రుడు*' మనసున్నమహారాజై
కవులనెన్నో విధాల ఉత్సాహపరిచెను
మన మార్గదర్శి ప్రశాంతంగ పలకరించు
ఈ ఇoజనియర్ మనకు 'నియర్'అనిపించు
ఈ సాహితీచక్రవర్తిని ప్రతికవి 'డియర్'గ భావించు
ఈ *రవి* కంటబడి వెలుగొందాలని ప్రతికవి తపించు.
:;*వల్లాల విజయలక్ష్మి**
ఆలేరు
17
[30/05, 9:57 PM] మర్రి జయశ్రీ: కవుల వేదిక
మర్రి జయశ్రీ
అంశం..మేక రవీంద్ర గారు
శీర్షిక...కవిపోషకులు
మేక వంశము పూదోటలో విరిసిన సాహితీ సమం
పూర్వీకుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని
సాహితీ సేవ చేస్తున్న సౌజన్యమూర్తి
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ
మాతృభాషపై మమకారంతో
తెలుగు భాషా వ్యాప్తికి నిరంతరం శ్రమిస్తున్న అక్షర ప్రేమికుడు
వాట్సాప్ సాహితీ బృందాలనేర్పరచి
ఎందరో సాహితీ మూర్తులను ప్రోత్సహించిన కవిపోషకులు
కవులకు సముచిత గౌరవాన్ని చ్చి
బిరుదుల నెన్నో ప్రధానం చేసిన
నవ్యాంధ్రభోజుడు
తెలుగు దీప్తిని నలుదిశలా ప్రసరింపజేస్తున్న అలుపెరగని సూర్యుడు
బృహత్తర కవితాయజ్ఞం నిర్వహిస్తున్న ప్రతిభాశాలి
చెరగని చిరునవ్వుతో
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ
యువ సాహితీవేత్తలకు ఉత్సాహాన్ని కలిగించే
కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ
సహస్ర కవుల మదిలో చెరగని ముద్రవేసిన రవీంద్రుడు
తెలుగు కవితావైభవ రథసారథి
కలం పట్టకపోయినా
కవుల ప్రతిభను గుర్తించిప్రేరణ నిచ్చిన సుగుణ శీలి
నిస్వార్థ సేవా రత్నం
సామాన్యంగా కనిపించే అసమాన్యుడు
సభ్యతా సంస్కారానికి చిరునామా
ఉత్తమ ఇంజరింగ్ అధికారి
వృత్రిలో విరమణ పొందుతున్న వేళ
వారికివే నా అక్షర నీరాజనాలు.
18
[30/05, 9:58 PM] సునంద ఉరిమిళ్ళ: కవుల వేదిక
తేదీ::30-05-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: భాషామ తల్లి సేవకులు
::::::::::::::::::::::::::::::::::::::::
నిస్వార్ధమే పరమార్థంగా
తెలుగు భాషామతల్లి కీర్తిని
ప్రపంచమంతా చాటేందుకు
వాట్సప్ వేదికగా
కవితా యజ్ఞం చేయించిన
ఆశయ సాధకుడు
అకుంఠిత దీక్షాపరుడు!
పెదవులపై చిరునవ్వు
మాటల్లో పొదుపరితనం
ఆహార్యం లో హుందాతనం
కవులను కళాకారులను
తయారు చేసిన సహృదయత
ఇదే వారి భావి జీవితానికి
వెలుగునిచ్చే వెన్నెల!
రవీంద్ర నామధేయంతో
కవులందరికీ ఆత్మీయులైన
రవీంద్ర గారికి
హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు!
వారికివే నా అక్షరాల సుమహారం!
19
[30/05, 10:06 PM] +91 98495 70514: కవుల వేదిక అంశం:మేక రవీంద్ర గారు తేది:30-5-2020 రచయిత:వెంకట్ బాలగోని. అతనొక సైన్యం.... అతనొక ధైర్యం..... అక్షరాల పయనం.... అధ్బుతాలే విజయం... అనంత కవితల ప్రధాత.... అలుపెరుగని ఆశయ విధాత... అందరికీ తెలిసిన ఆ రవి ఇంద్రుడు మరెన్నో మహోన్నత శికరగ్రాలను సృషించి సరస్వతీ పుత్రుడు గా నిలిచి పోవాలని కవికులం ఆకాంక్షిస్తూ........మీ వెంకట్ బాలగో ని.
20
మేక రవీంద్ర గారి ఉద్యోగ విరమణ సందర్భంగా
*ఇది వీరా గుడిపల్లి కవిత*
*రాసేద్దాం*
31/05/2020
ఓ నిష్కల్మషమైన హృదయానికి
ఓ సామూహిక పయనానికి
ఓ అసామాన్యమైన వ్యక్తిత్వానికి
ఎడారిలో వర్షాన్ని కలగన్న మనిషికి
సముద్రం లో మంచినీరు సాధించిన మనీషికి
ఇచ్చే అక్షర నైవేద్యం.
......
అమరకుల చెప్పినట్లు
తెలుగు భోజుడు
లలితా కృష్ణ అన్నట్లు
సాహితీ సేనాపతి
గోగులపాటి ఉటంకించినట్లు
ఓ యోగి
అవేరా గారు అన్నట్లు
అసాధ్యుడూ
రాజా వాసిరెడ్డి గారెపుడో చెప్పారు
అవకాశాల సృష్టి కర్త
కళాచందర్ కలగన్న
సాహితీ సోయగం
లింగన్న మాట లోని
సూటిదనం
దాసోజు నిబద్ధత
ఒకటని కాదు
అందరి సౌభాగ్యం
సకల కవుల సంతోషం
తన మార్గంగా
అడుగులు వేస్తున్న...
సాహితీ.... స్వరూపం
మేక రవీంద్ర......
*** *ఇది వీరా గుడిపల్లి మాట*
పోయేదేముంది.... రాసేద్దాం
మంచే కదా చేయమంటుంది
21
[31/05, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
★★★★★★★★★
తేది : 31/05/2020
సమయం : 8:00 PM
వారం : ఆదివారం
అంశం : *సహస్ర సమూహల సృష్టి కర్త అభినవ తెలుగు భోజుడు శ్రీ మేక రవీంద్రులు*
*తెలుగు భాష సేవకుడు*
తెలుగు భాషలో సాటిలేని
కవి మా మేక రవీంద్ర
తెలుగు సాహిత్యం
తన ఊపిరి
తెలుగులో పాండిత్యాన్ని
పట్టుకున్న అక్షర శిల్పి
నవ కవులకు ఆదర్శ
మూర్తి మా రవీంద్రులు
ఇంటి నుండి బడి
వరకు తెలుగు భాషను
గౌరవించిన తెలుగు
భాషాభిమాని మా రవీంద్ర
కవితను గరళం
చేసుకున్న నూతన
కవి పండితులు
నేటి తరానికి
మీ సేవా అద్భుతమైన
ఓ ప్రేరణ తెలుగు
సాహిత్యాన్ని ఆస్వాదించిన
సహస్ర కవి మిత్రుడు
మా మేక రవీంద్ర
ఇంద్ర ఇంద్ర లాగా
మీరు ఎప్పుడు
ఇంద్రధనస్సులా వెలగాలి
తెలుగు సాహిత్య తోటలో
మా నూతన కవులకు
ఆదర్శంగా ఉండాలి
చిరస్మరణీయంగా...
*ఇంద్రవత్ రాహుల్*
*మల్కాపూర్*
*నిజామాబాద్*
*9848054079*
22
[31/05, 8:00 PM] Veera: కవితా గానం సమూహం కోసం
అంశం ః మేక రవీంద్ర
సమన్వయం ః లలితా కృష్ణ
తేదీ ః 31/05/2020
******************
*ఇది వీరా గుడిపల్లి కవిత*
31/05/2020
*ఎవరతను*
**********
ఏమాశించి చేశాడు
సమాధానం లేదు
ఎవరూ తెలీదు
వెతుక్కున్నాడు
దండలేశాడు
షాల్స్ కప్పాడు
తెలుగు అక్షరాలు
చల్లినా, చదివి వినిపించినా
ఎందుకు చేశాడు
సమాధానం లేదు
పాదుల్ని పీకేయాలని చూశినా
పందిళ్ళు కూల్చాలని చూసినా
పెదవి విప్పిందే లేదు
ఓడిపోయిందీ లేదు
ఎందుకిలా
తనకూ తెలీదంటారు
ఒంటరి ప్రయాణమే
ఆరువేల సైన్యమున్నా
ఎడారి జాడలనే వెతుక్కుంటాడు
ఒయాసిస్సులను తవ్వడానికి
కన్నీటి చారలనే కనిపెడుతూ వెళతాడు
తుడిపేయడానికి.
అక్షరాలు ఎక్కడ కనపడతాయోననీ
అక్షర ప్రేమికులెక్కడున్నారని
నిరంతరం
కొత్త కలాల కోసం
కలాల జాడకోసం సాగే అన్వేషణలో
అడుగులేస్తున్న అక్షర ప్రేమికుడు
అక్షరాలను మోస్తున్న వారికోసం
వెల్తున్న అన్వేషి
ఎవరతనంటే.....
*మేక రవీంద్రంటారంతా*
........ *వీరా గుడిపల్లి*
23
[31/05, 8:00 PM] Ramaka: 🌷కవితా గానం🌷
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:31-5-2020
అంశం:(సహస్ర సమూహాల సృష్టికర్త,అభినవ తెలుగుభోజుడు శ్రీ మేక రవీంద్రులు)
శీర్షిక: *సహస్రకిరణుడు*
**************************
అతని చేతిచలవతో వాట్సాప్
అంతా కవులమయం అయ్యింది
*సహస్ర* మనే శబ్దం రాష్ట్రాల
సరిహద్దులు దాటి వ్యాపించింది
కవుల పుట్టినిల్లుగా మారి
సమూహాల సృష్టి మొదలయింది
*రవి* యే *కవి* యై ముందుండి
కవి,గాయక,పృచ్ఛక,లేఖక,
కథక,రచయితలతో
కల్పవృక్షమై,కామధేనువై
కవితాయజ్ఞాలెన్నో చేయించాడు
*సహస్రవాణై* *సహస్రదర్శినై*
*సహస్రపుస్తక యజ్ఞమై*
*కోటిగొంతుకల,కోటికలాల*
ఫలాలు సాకారమై ఆవిష్కృతమైంది
అద్భుతాలు సృష్టించింది
ఒక్కడు *సహస్రకిరణుడై*
సాహితీ సరస్వతి పదమంజీరమై
కచ్ఛపినాదాలు మ్రోగించాడు
శ్రీవాణి ఆశీర్వాదమై,రవీంద్రమైన
కవీంద్రుల కవనామృతాలు
సాహిత్యానికి జీవం పోసి
చిరంజీవమయ్యాయి
నిస్వార్థ,నిరాడంబర,
మౌనయోగై
కవనతపస్సును చేయించి
*తెలుగుకవితావైభవ* కేతనాన్ని ఎగరేసిన *మేక*
వంశోద్భవుడు
సార్థకనామధేయుడై విలసిల్లుతున్నాడు.
24
[31/05, 8:08 PM] Prasoona Sharma Madam: *కవితాగానం*
*నిర్వహణ :వీరాగుడిపల్లి గారు*
💐💐💐💐💐💐💐💐
అంశం:: నిరాడంబరమూర్తి
(శ్రీమేక రవీంద్ర గారు)
*
గందరగోళపు గగనాన
చటుక్కున మెరిసిందో
మెరుపు
నిద్రాణతను చెరిపి
చైతన్య గీతికయై
మేలుకొలిపింది
ఆచైతన్యానికి మరోపేరే
*మేక రవీంద్రులు*
*పూవు పుట్టగానే పరిమళించిన* చందాన
బాల్యం నుండే బహు గ్రంథపఠనాభిలాషతో
సాహితీ పూదోటకు
తోటమాలి అయ్యారు
వృత్తి నిర్వహణలో అజేయులై
సాహిత్యమనే ప్రవృత్తి లో
ఎదురులేని మనిషిగా
విధాతను తలపిస్తూ
నూతన సృష్టికి శ్రీకారం
చుట్టారు.
అవే వాట్సాప్ సమూహాలు.
*ఇంతింతై వటుడింతై*
అన్నట్లు ఒక్కరితో మొదలై
వేలమంది కవులతో
నేడు ప్రభంజనమైనది.
అక్షర సేద్యం లో హాలికులై
కవన సామ్రాజ్య పాలకులై
కవులకు గాయకులకు బాసటయై
తెలంగాణా తల్లిమెడలో
సుమమాలికలై
నిస్వార్థ నిరాడంబరమూర్తులై
వెలుగొందు శారదాస్వరూపులై
సూర్యచంద్ర తేజో విరాజితులైన
తెలుగు భోజులకు నా అక్షరసుమాలమాల
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జ్ఞానప్రసూనా శర్మ. ఎల్లికంటి
కడ్తాల-- రంగారెడ్డి జిల్లా
25
[31/05, 8:09 PM] Swarna Samatha Poetess: **కవిత గానం **
**31/05/2020**
🌅 **సాహితి బ్రహ్మ **🌅
సాహిత్యానికి రథసారధులు
అనితరసాధ్యం వీరి సాహితి సేద్యం
అమోఘం-అద్వితీయం
అయిదువేలకు పైగా కవులను తీర్చిదిద్దిన ఘనత వీరిదే
నిరంతర అక్షర పోరాటయోధులు
ప్రతికవి కలానికి శ్రీకారమూర్తులు
భువిపై మెరిసి నిలిచిన రవి
**న భూతొ న భవిష్యత్ **
అన్నట్టు
**కవుల కర్మాగారం
అక్షర బాండాగారము **
అక్షరానికి వెలుగును -జిలుగును
సృష్టించిన సహస్రకవి సృష్టికర్త సాహితి ప్రస్థానంలో
అలుపెరుగని బాటసారి
పుస్తకపఠనంతో --,కఠోరశ్రమతో సాహితి పరిమళాల
కవనవనానికి ఆద్యుడు అయ్యాడు
వారి ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించి సాహిత్యాన్ని పోషించారు
అయిదువేల కవనసైన్యానికి
అత్యుత్తమ గురువై
సాహితి తరువై
దశదిశలా ఖ్యాతిని విస్తటింపచేసుకున్న
ఏకైక తెలంగాణ కవితా పితామహులు
వాట్సాప్ సాహితి సమూహాల ఆరంభకులు
మరువలేము వీరి కృషి
సాహితి సేవలో మహర్షి .
**మేక రవీంద్ర గారి పదవివిరమణ సందర్బంగా నా చిరు ప్రయత్నం ,వారికీ అక్షర నీరాజనము **
**స్వర్ణసమత**
**నిజామాబాదు **
9963130856
26
[31/05, 8:13 PM] అంబటి Bhanu Prakash: 🌷✒️
కవితా గానం.
మేకరవీంద్ర.
✒️
చేయునుద్యోగమొకటిగ చేసిచూప
దలచె మక్కువ చేతనే తెలుగుకవుల
నొక్కదరిజేర్చిన ఘనుడు నొక్కడితడె
మేకరవి యింద్రుడె గాదె మేదినిపయి!!
దిక్కు దిక్కుల నున్నట్టితెలుగుకవుల
నొక్కదగ్గరజేర్చినునోర్పు
చేత
మార్పు! కలిగించెతెలుగునమాన్యుడయ్యి
ఆంధ్రభోజుడైనిలిచెను నవనిపైన!!
✒️అంబటి భాను ప్రకాశ్
27
31 May 2020
13:23
ఏ లక్ష్యాన్నైనా ఛేదించే శక్తి
మనిషిలో దాగి ఉంటుంది
మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే
లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చే వారవుతారు
అనుకున్నది సాధిస్తే ఇతరులకు మార్గదర్శకులవుతారు
దీనికి నిలువెత్తు నిదర్శనం
మన కవన తాపసి
సాహిత్య పిపాసి
సాహితీసేనాపతి
అభినవ తెలుగుభోజుడు
సహస్ర సమూహాల సృష్టి కర్త
గురువర్యులు మేకా రవీంద్ర గారు
పెద్దలు చెప్పినట్టు
పదవికే విరమణ గాని
మనసుకు భావాలకు
కలానికి కవనానికి లేదు విరమణ
నిత్యం సాహిత్య యజ్ఞం చేస్తూ
నిరంతర నిస్వార్థ సాహతీ సేవకై
సాహిత్యలోకానికి పూర్తి సమయమిస్తూ
తమ జీవితంలో మరొక నూతన అధ్యయాన్ని ప్రారంభించి
మరెందరో నవ్య కవులకు
మార్గదర్శనం చేయబోతున్న
సరస్వతీ ప్రియపుత్రుడు
గురువర్యులు
మేకా రవీంద్ర గారికి
వందన చందనాలు
అభినందన మందారాలు
అక్షర సుమాంజలులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐💐💐💐💐
-------- పోలా కిషోర్ కుమార్
న్యూ బోయిన్పల్లి
సికిందరాబాద్
28
[31/05, 8:24 PM] Kalva Rajaiah: పేరు కాల్వ రాజయ్య
ఊరు బస్వాపూర్
జిల్లా సిద్ధిపేట
శీర్షిక :అంతర్జాల కవి
జయహో జయహో మేక రవీంద్ర గారికి జయహో
ఆధునిక కాలపు సాహిత్యానికి
అత్యాధునిక సాంకేతికతన మర్చి
కొత్త హంగులతో కవనాన్ని
కొంగొత్త రూపురేఖలను తీర్చి దిద్దిన మన
మేక రవీంద్ర గారికి జయహో.
వాట్సాప్ వేదిక నేర్పాటు చేసి
మరుగున పడిన కవులెందరినో ప్రోత్సహించి
నూతన కవులను నిత్య నూతనంగా తీర్చి దిద్ది
ఆన్లైన్ కవిసమ్మేళన మేర్పాటు జేసి
కవులందరిని ఆశ్చర్యచికితులను చేసి
ఆనంద పరిచిన మీకు జయహో జయహో.
నాడు సాహిత్యాన్ని స్వర్ణయుగంగా తీర్చి దిద్దిన వారు ఆంధ్రభోజుడుడని చదివాము.
కాని ఇపుడు ఏ స్వార్థం లేకుండా
ఎందరో కవులకు బిరుదుములిచ్చి, సత్కారములందించి సాహిత్యాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన నేటి
శ్రీకృష్ణదేవరాయలను మేము చూస్తున్నాము వారికిదే మావందనం.
జయహో రవీంద్ర గారికి జయహో జయహో
మీ వృత్తి ధర్మాన్ని ఉరకలేయనుంచి
ప్రవృత్తిగా కవనాన్ని పరుగులు పెట్టించి
పదిమందికి మార్గదర్శకులయ్యారు.
మరెందరో నూతన కవులకు మార్గము చూపిస్తారని కోరుకుంటూ
మీకివే పదవి విరమణ శుభాకాంక్షలు.
జయహో రవీంద్ర గారికి జయహో జయహో
29
Sharma Poetess: కవితా గానం
అంశం: తెలుగు కవితా వైభవం
సృష్టి కర్త శ్రీ మేకా రవీంద్ర గారికి
అక్షర సుమాంజలి
వై.కె.సంధ్యశర్మ
చిత్తూరు
*శీర్షిక : అక్షర కుసుమాంజలి*
తెలుగు వెలుగు కు నిలువెత్తు నిర్వచనం
మాతృభాషా మమకారం
మమత గల మనస్సు భావి తరాలను
కవన దీపికలుగా మలచే
సహస్ర రవికిరణం...
కొమ్మకు కొమ్మకు పూచే పువ్వులన్నీ
ఏర్చి కూర్చి సౌగంధికా పరిమళాల సొబగులద్ది
సహస్ర కవి మిత్ర సౌరభాలను
వెదజల్లిన సాహితీ ప్రియులు
రాగాల జతులన్నీ
స్వరాల వాణుల సంధాత్రులుగా
నిత్య గానామృతాలు
వినిపించే సహస్ర కోకిలల
ఝరులకు పట్టం కట్టిన
కవన కోవిదులు...
మరుగైన మధురానుభూతిని
మనో మందిరంలో నిక్షిప్తం చేసే
లేఖా సాహిత్యానికై కలం కదిలింపజేసి
సహస్ర లేఖల చిత్తురువుల రూప శిల్పి
సినారే కవితాసంపుటులతో
ప్రతి కవి హృదయంలో సుస్థిరమై
అటల్ బిహారీవాజ్ పేయి
సంకలనంలో అక్షర నీరాజనాలు
అర్పించే ఆరాధకుడై
వినూత్న అంతర్జాల విహంగంలో
విశేష సాహితీ ప్రజ్ఞా పాటవాలను
నిత్య నూతనంగా పరిచయ వేదికలా
విస్తరింపచేసిన శ్రీ మేకా రవీంద్రుల గారికి
అక్షర కుసుమాంజలి!
30
[31/05, 8:31 PM] Rama Kulakarni Hyderabad Poet: On duty ever
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
31
[31/05, 8:48 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::31-05-2020
పేరు::వురిమళ్ల సునంద:ఖమ్మం
అంశం;: సాహితీ రథ సారథి
:::::::::::::::::::::::::::::::::
ఉగ్గు పాలతో నేర్చుకున్న అమ్మభాషకు
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అయిన తెలుగు భాషకు
సేవ చేయాలనే సంకల్పం తో
వాట్సప్ ను వేదికగా శ్రీకారం చుట్టిన
భాషామ తల్లి ముద్దు బిడ్డ మేక రవీంద్ర గారు!
రవి కిరణమై
కవుల కలాలను,గళాలను చైతన్య పరచి
ఇంతింతై వటుడింతై అన్న చందంగా
నాటి మేటి కవులకు దీటుగా
నేటి కవులను కళాకారులకు రచయితలకు
చేయూత నిచ్చిన సాహిత్య పోషకుడు!
కవిమిత్ర సహస్రకవి, లేఖాసాసహిత్యం
కవిగాయక సమూహం
వివిధ ప్రక్రియల రూపమెత్తి
గ్రూపుల్లో వారి ప్రతిభకు పట్టం కట్టిన
సాహితీ కవి సార్వభౌముడు రవీంద్ర గారు!
వృత్తి వేరైనా ప్రవృత్తి ఎప్పుడూ
సేవా భావనే
మరుగున పడుతుందని
భయపడుతున్న తెలుగు
తల్లి కన్నీరు తుడిచి
నేనున్నానంటూ తెలుగు భాష కీర్తిని ఖండాంతరాలు చాటిన
సాహిత్య రథ సారథి !
తెలుగు భాష పరిరక్షణ భుజాలపై
వేసుకుని సాగుతున్న
అలుపెరుగని బాటసారి!
మేక రవీంద్ర గారు!
మీ ఆచరణ నిరంతరం కొనసాగుతూనే ఉండాలని
మీ ఆశయం సహస్ర దళ పుష్పమై
పరిమళాలు వెదజల్లుతూ ఉండాలని!
మీ భావి జీవితం సాహిత్య సుందరనందన వనంగా విరబూయాలనీ
ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..
సమర్పించుకున్న ఈ కవితా సుమహారం!
32
:
33
[31/05, 9:22 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : రవితేజము
కవితా సంఖ్య: 27
తేదీ: 29/05/20
ఆ మస్తిష్కం లో పురుడోసుకున్న
సంకల్పం
ఆ గుండెలో వెలిగిన నమ్మకం
మల్లెల పరిమళాన్ని అద్దుకొని
కార్యరూపం లో వెలిగిన వెలుగు....!!
నూతనత్వం చేతపట్టి
వినూత్నతీరులో అడుగేసిన
సాహస వీరుడు
వాట్సాప్ సాహిత్య సమూహానికి
మహారాజు...!!
ఉన్నత వ్యక్తిత్వ వికాసంతో
నొప్పించక
విభిన్న తరహా సమూహాల సందడితో
నడిపించి న రథసారథి....!!
సాహిత్యలోకంలో విస్తృత
కృషితో
సహస్ర కవితా యజ్ఞం తో
కోటి కవితా యజ్ఞానికి నాంది పలికిన అక్షర పూజారి....!!
పదవీ విరమణ శుభాకాంక్షలతో
కలకాలం వెలగాలి రవితేజమున
సాహిత్య నింగిలో
అందరికీ వేదికగ మెరిసి....!!
🌹వినీల🌹
34.
🌼కవితా గానం🌼
*****************
తేదీ:31/5/2020
పేరు:అనుముల తేజస్విని
నర్సంపేట
అంశం:తెలుగు ఆంధ్ర భోజుడు
తెలుగు సాహితీ కిరీటి
నవకవులకు సారధి
సాంకేతికత తన వృత్తి
సాహిత్యసేవ తన ప్రవృత్తి
సహస్ర కవుల సమూహం నిర్మించి
సరస్వతి పుత్రులను తయారు చేసిన కవి
తెలుగు భాషలో
పలు ప్రక్రియలు ఏర్పరచి
నూతన సాహిత్యాన్ని సృష్టించిన వ్యక్తి
నిరంతరం శ్రమించిన ఋషి
వయసుకి విరమణ పదవిలో అయిన
సాహిత్యo లో ఆయనకు లేదు విరమణ
ఎందరో మహోన్నతులు వారికి ప్రియశిష్యులు
ఆడంబరం లేని మనిషి
ఆప్యాయతను పంచె మనిషి
మన మేకా రవీంద్ర గారు
అందుకోండి మా నుండి
పదవి విరమణ మహోత్సవ కవనాక్షరకుసుమాలు......
35
అమ్మ భాష అంటే అభిమానము మీకున్
సహస్ర కవుల సమస్యల సమాధానపరిచి
అవధాన విద్యలోన అద్భుత సృష్టి చేసి
కవిపండితులందరిలోన కీర్తి కిరీటి మీరు
మువ్వ ప్రసాద్ గారు
36
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: పేరు: డా.శ్రీభాష్యం అనూరాధ.
ఊరు: హైదరాబాద్
స.క.స.-2034
💐💐💐💐💐💐💐
కవీంద్ర..... రవీంద్ర ..💐
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
మేక అంజనీదేవిలక్ష్మణరావుల శుక్తిముక్తాఫలంగా,
నిజామాబాద్ ముద్దుబిడ్డగా,
'రవీంద్ర ,నామంతో ఖ్యాతి
నార్జించిన వీరు, సామాన్యంగా కనిపించే అసామాన్యులు . పనియే పరమేశ్వర ఆరాధనగా, నిరంతర కృషీ వలురు... ఒకవైపు వృత్తి ధర్మాన్ని,మరోవైపు సాహితీ కళామతల్లికి వైవిధ్యక్రియలతో సాహిత్య సేవలను అందించడం నిత్యకృత్యమయ్యాయి... వీరి సాహితీ క్షేత్రంలో 'నాలాంటి 'మొలకలకు నీరు పోసి వేదికలు కల్పించి, బిరుదుల ప్రోత్సాహకాలు అందించి, తరువులు గా మలుచుతున్న తీరు
శ్లాఘనీయం.......... "సాహితీ భోజుడైన" వీరు కవుల కుటుంబాలలో మమేకమైన మీరు....చిరునవ్వు ఆభరణంగా... అనితరసాధ్యమైన మేధో సంపత్తితో
నూతన క్రియాశీలురై, సృజనాత్మకతతో మరెన్నో రూపకల్పన చేస్తూ ..
కవన వనంలో సుగంధ కుసుమాలను విరబూయించండి... ఈ వసుదైక కుటుంబం లో మేమంతా మీకు పలుకుతాము ...............జయోస్తు'సాహితీంద్ర'... విజయోస్తు 'కవీంద్ర'..... దిగ్విజయోస్తు ''రవీంద్ర'...🙏
■■□■■■□■■■■■
37
డా.శ్రీభాష్యం అనూరాధ
తెలుగు ఉపన్యాకులు
కుషాయిగూడ,హైదరాబాద్
8790325502
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *తెలుగు భోజుడు*
-------------------------------
లక్ష్మణరావు అంజనీదేవిల సుపుత్రుడు
ఇందూరు రవీంద్రుడు
సార్ధక నామధేయుడయ్యాడు
తెలుగుకవితా వైభవాన్ని
దిగంతాలకు చాటాడు!!
స్మార్ట్ ఫోనులు
అప్పుడప్పుడే రంగప్రవేశం చేస్తున్న వేళ
సహస్రకవుల వేదికను
సృష్టించి
కొన్ని వేల కవులను
లక్షల కవితలను
పుట్టించాడు
తెలంగాణా కవితాపితామహుడుగా భాసిల్లాడు!!
సకస నంబర్లతో
వేలమందిని ప్రోత్సహిస్తూ
సామాజిక మాధ్యమాల వేదికగా
సాహితీ బంధాన్ని పరిపుష్టం చేస్తూ
తెలుగు కవితా వైభవానికి పచ్చటి
గొడుగు పడుతున్నాడు!!
ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గా ఎదిగినా ఒదిగి ఉంటూ
ఏ పొగడ్తలకు పొంగని
స్థితప్రజ్ఞుడు
మితభాషి
నిరాడంబరుడు!!
తెలుగు కవులందరినీ
ఒకే తాటిపై తెచ్చి
వారి మధ్య అనుబంధాన్ని పెంచి
వౌత్సాహిక కవులను
ఉత్సాహపరుస్తూ
వారి కవితా దాహార్తి ని తీరుస్తున్నాడు!!
ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకుని
తెలుగు సాహిత్య
అభివృద్ధికై అలుపెరుగనికృషి చేస్తున్న సామాజిక కవితా ఉద్యమకారుడు!!
సహస్ర కవి మండలిచే బిరుదు ఒసంగబడిన "తెలుగు భోజుడు"
ఆయన సత్సంకల్పాన్ని గౌరవిస్తూ కవులందరు
ఆయనకు బాసటగా నిలవాలి
తెలుగు భాషా వౌన్నత్యాన్ని దశదిశలకు చాటాలి
మేకా రవీంద్ర సాహిత్య కృషి తెలుగు భాషా చరిత్రలో ఆచంద్రతారార్కం
నిలవాలి!!
-------------------------------
*పరిమి వెంకట సత్యమూర్తి*
హైదరాబాద్
చరవాణి:9440720324
38
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: ....అభినవ రాయలు...
కవీంద్రుడు
మేక రవీంద్రుడు
నిరాడంబరుడు
నిష్కల్మషుడు
సరళ స్వభావుడు
చిరుదరహాసుడు
సాహితీ పిపాసకుడు
ఎదిర చెన్నకేశవుల సాహిత్య
వారసుడు
అంజనీ లక్ష్మణుల సుపుత్రుడు
పంచాయతీ రాజ్ శాఖ ఉన్న తోద్యోగుడు
కార్యనిర్వహకదక్షుడు
ఉద్యోగ నిరాటంకుడు
దాశరథి కవితావేదిక అధ్యక్షుడు
తెలుగు కవితా వైభవ వ్యవస్థాపకుడు
కవుల అనుసరణీయుడు
సహస్ర కీర్తి పుస్తక ప్రకాశకుడు
సాహితీసేనాపతుడు
అందరికీ ఆదర్శప్రాయుడు
సరస్వతీ పుత్రులు
సాహితీ పోషకులు
తెలంగాణ అభినవ కృష్ణదేవరాయలు
ప్రపంచమంతా పరిచయస్తులు
సాహిత్య సేవా శిరోమణి
బుదజన స్తోత్రనీయుడు
అత్యంతాత్మీయుడు
గురుతుల్యులు
స్ఫూర్తి ప్రదాత
మేక రవీంద్ర
కరోనా కలికాలంలో
ఉద్యోగానికి దూరమై
వాట్సాప్ కవికులానికి దగ్గరై
శత వసంతాలు ఆయురారోగ్యాలతో
తెలుగుభాషా కళామతల్లి సేవను
నిరంతరం కొనసాగిస్తూ..
మమ్మల్నీ పాత్రులను చేస్తూ..
కల కాలం చల్లగా వర్ధిల్లాలని
కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుతూ...
పదవీ విరమణ హార్థిక శుభాకాంక్షలతో..
శ్రీమతి. శాంతారెడ్డి, పాలమూరు.
38
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *సాహిత్య సేవా శిరోమణి*
నిరాడంబరతకు నిదర్శనం
స్నేహశీలతకు తార్కాణం
తెలుగు సాహిత్యంలో
విరబూసిన మందారం
సాహితీ వారసత్వంతో
పరిమళిస్తున్న సుగుణం
నవయువకవులెందరినో ప్రోత్సహించి
సహస్ర కవిమిత్రాది బిరుదులను
సహస్రాధికంగా బహుకరించిన నిస్వార్థసేవాగుణం
తెలుగు సాహిత్య చరిత్రలో
అదొక అపూర్వమైన ఘట్టం
తెలుగుపూలతోటలో వికసించిన పద్మం
సహస్రాధిక నవయువ కవులను
కవితామయం చేసిన మంత్రదండం
అయుతా ప్రయుతా కవితాయజ్ఞాలను
నిర్వహించిన సాహితీ ప్రభంజనం
సాహితీలోకంలో నిశ్శబ్ధఝరిలా ప్రవహిస్తూ
అక్షరాలను ఆలింగనం చేసుకున్న ఆణిముత్యం
రవీంద్రుడు కవీంద్రుడు కావాలని మనసారా
అభిలషిస్తూ... ఆశిస్తూ... శుభాకాంక్షలు
*డా. భీంవల్లి శ్రీకాంత్*
39
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: మేక రవీంద్ర...💐💐
ఔను...! అతడు ...రవీంద్రుడే...
కాదు...కాదు... కవీంద్రుడే...!
ఎందుకంటారా...!?
ఆ ...రవి ...చేరని చోటుకి
మన కవి చేరగలడు..!?
రవీంద్రుడు...సార్థక నామధేయుడు
ఆ రవీంద్రుడు చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగులిస్తే....
మన రవీంద్రుడు... తామసి పొరలు అలుముకున్న తెలుగు సాహిత్యానికి...
సాంకేతిక విజ్ఞానమనే చందనాన్ని పూసి ..
తెలుగు నందన వనంలో కోట్లాది కవి సుమాలను పరిమళింపజేసిన ప్రజ్ఞాశీలి..!
మాటల్లో మృధుత్వం
చేతల్లో సజ్జనత్వం...
నడకలో ...నడతలో...
శ్వాసలో ...ఆశలో...
అనుక్షణం...అహరహం
తెలుగు భాషాభివృద్ధికై తపించే తత్వం..!
నిగర్వి ,నిత్య సంతోషి,
నిరాడంబర జీవి..నిత్య శ్రమైక జీవి..!
నూతన పోకడలను ఒంటబట్టించుకుని
తెలుగు సాహితీ సుమ పరిమళాలను
నలుదిశలా గుభాళింపజేసిన
సాహితీ సేద్యకాడు..!!
ఓ మహాశయా..!
మీకు హృదయపూర్వకమైన పదవీవిరమణ శుభాకాంక్షలు..💐💐
మీ సాహితీ సేద్యం భవిష్యత్ లో కూడా కొనసాగాలని మరిన్ని ఫలాలు విరబూయాలని
ఆ ఫలాలను ఆస్వాదించే అదృష్టం మాలాంటి వారికి కలగాలని ..మనసా వాచా కర్మేణ కోరుతూ...
మరోమారు ...మీకు హృదయపూర్వకమైన
పదవీ విరమణ శుభాకాంక్షలతో...
మీ ...అభిమాని...
కోరాడ.అప్పలరాజు.( టీచర్ )
అనకాపల్లి-విశాఖ జిల్లా.
40
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
కలం పేరు: మానస.
అంశం: మేక రవీంద్ర గారు.
శీర్షిక: సాహితి ధ్రువతార
ఆయన ఒక సాహసకుడు
అలుపెరగని సాహితి కెరటం....
సాహిత్య పూదోట లో
కలం పట్టని యోధుడు...
ఎన్నో కలాలకు చేయూతనిచ్చిన
చైతన్య మూర్తి....
తెలుగు భాషంటే మక్కువ ఎక్కువ...
చేసే వృత్తికి ...ఈ కవిత్వం వికృతే ...అయినా..
మదిలో వెలసిన అక్షర రూపం కి ప్రాణంపోసి...
పదాల అల్లికలతో ప్రకృతి అందాలను ఓలలాడించిన అక్షర ప్రేమికుడు...
సాహితి పిపాసి...
చుక్కల్లో చంద్రుడు....
చిద్విలాస మూర్తి....
నిత్య కృషి వలుడు.....
యువ రక్తానికి ....ఊపిరి
విభిన్న ప్రక్రీయల సృష్టి కర్త
నిత్య అక్షర తేజోమయుడు
సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం...
సహస్ర కవులకు ప్రేరకుడు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
నలుదిశలా వ్యాపింపజేసి...
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు...
ఎందరికో చేయుతనిచ్చిన ధన్యమూర్తి.
నిత్య వెలుగొందే దివ్యతార
సాహితి లోకానికి పెన్నిధి
మాకు వారధి ...మా హితుడు మా మార్గదర్శి ..
మా గురువర్యులు "మేక రవీంద్ర"గారు ఓ ధ్రువతార.
వారి పదవికే విరమణ...
పెదవికి లేదు విరమణ....
నిత్య సాహితి కృషి వలుడా ...
మీకివే పదవీ విరమణ శుభాకాంక్షలు...
మేక రవీంద్ర గారికి ఇవ్వే మా అక్షర నీరాజనాలు💐💐🙏
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *అపర బ్రౌను*
---------------------
41
తెలుగు సాహిత్య సేవా వారసత్వానికి
చెరగని సంతకం!!
తొణకని చిరునవ్వు
వీడని విశ్వాసం
ఆప్యాయతతో పలకరింపు
ఆఫీసరై ఉండి అందరినీ
సమాదరించే స్వభావం
నిగర్వి నిస్వార్థ పరుడు
నిరాడంబరుడు సద్గుణుడు
నిరంతర సేవాతత్పరుడు!!
వరించి వచ్చి చేరిన బిరుదులు
పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో!!
ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఒడిసిపట్టి
చక్కగా వాడుకుంటూ అలుపెరుగక
మారుమూల ఉండి మరుగున పడ్డ తెలుగు కవులను
ఒకచో చేర్చి
ఒకే వాట్సాఅప్ వేదికపై తెచ్చి
సహస్రకవుల సమూహంతో
కవులకు గుర్తింపునిచ్చిన ఘనుడు సాహిత్య పిపాసి!!
సహస్ర వాణి రేడియోతో
కవుల స్వరాన్ని దిగంతాలకు
వ్యాప్తి చేసిన మహిమాన్వితుడు!!
ఎక్కడెక్కడో తాళపత్రాలను సేకరించి తెలుగు సాహిత్యానికి
చేయూతనిచ్చి వెలుగులునింపి జీతం జీవితం అంకితం చేసిన
తెలుగు భాషాభిమాని
తెలుగు సాహిత్య పోషకుడు
బ్రహ్మచారి బ్రౌన్ నాడు!!
ఎక్కడో ఉన్న తెలుగు కవులకు బాసటగా ఉండి చేయూతనిచ్చి ఉన్నతికి కవుల వికాసానికి చిరునామాగా మారిన బ్రహ్మచారి మేకా రవీంద్రుడు నేడు!!
42
-------------------------------
*డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి*
విశ్రాంత సహాయ ఆచార్యులు
హైదరాబాద్
చరవాణి:9490367383
-------------------------
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: శీర్షిక.......స్నేహశీలి. రవీంద్ర.
అత్యుత్తమ సేవలందించిన
ఆదర్శప్రాయులు
నిగర్వి నిరాడంబరులు
అందరి మన్ననలు పొందిన కవివర్యులు
వృత్తి,ప్రవృత్తి వారికి రెండు కళ్ళు
సహస్ర కవులను ప్రోగు చేసిన
కవి చక్రవర్తులు
అంజనా,లక్శ్మ ణుల పుత్ర రత్నము
కార్య సాధనా దక్షులు
తెలుగు కవితా వైభవ స్థాపకులు
కవులందరికి ఆదర్శ ప్రాయులు
తెలుగు సాహితీ వనంలో పూచిన పుష్పం
కవి పోషకులు, సాహితీ ప్రియులు
తెలుగుభాషకు ఎనలేని సేవలందించిన
అభినవ రాయలు, జగమెరిగిన రవీంద్రులు
వర్ధమాన కవులకు స్ఫూర్తి ప్రదాత
ఆత్మీయ వదనం అదే అతని ధనం
ఆరోగ్యాంగా ఉండాలి ఆయన కలకాలం
శ్రీ మేక రవీంద్ర గారు
తెలుగు తేజమయి వర్ధిల్లాలి.
పదవీ విరమణ శుభా కాంక్షలతో.
43
శ్రీమతి. టీ. అనిత.
ఉపాధ్యాయిని.
అచ్చంపేట.
నాగర్ కర్నూల్.
చర వాణి.....9985888924.
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *కళాబాంధవుడు*
వచన గద్య పద్యములలో
తనకు సాటిలేరు
అనిపించుకుంటూ
వృత్తిని ప్రవృత్తిని
సమయానుకూలంగా నిర్వహిస్తూ
నూతన ఒరవడితో
అంతర్జాల కవిసమ్మేళనాలు
నిర్వహించి అందరి మన్ననలు
పొంది మిగిలిన వారికి
దారిచూపే బాంధవుడై
కళాభిమానియై
అజాతశత్రువై
ఆడంబరమెరుగని
ఆత్మీయుడై అక్షరపూదోటలో
నిరంతరం కవితాసేద్యం చేస్తూ
చెరగని చిరునవ్వుతో
అందరినీ పలకరించే
మృధుహృదయస్వభావుడు
మేకా రవీంధ్రుడు...
*సత్యనీలిమ*
వనపర్తి
950215681
44
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: 🌻 **శ్రీ మేక రవీంద్ర గారికి**🌻
🌹🌹 *అభినందన పత్రం* 🌹🌹
గులాబి అందంగా ఉందంటే కాదు తప్పు
మేక రవీంద్రగారిని పొగిడితే అవును ఒప్పు.
నిశ్చల గంగను ఉరికించిన భగీరథుడు
కవుల రచనలకు ప్రవాహాలద్దిన రవీంద్రుడు
కవి ఉన్నచోట మంచితనం విరబూసి నేరాలను ఘేరావ్ చేస్తాయన్నట్టు
సాంఘిక దురాచారాల గజములను బందింప
కవులను ఐక్యతగా అల్లిన దీక్షితుడు
నీడ కోసం వెతికే కవులకు వేదిక నిచ్చిన దక్షుడు
విరివిగా నున్న సాహిత్య సమూహాలను
ఒకటిగా చేసి కవుల కుటుంబాన్ని పెంపొందించిన కళా సేవకుడు
సాహితీ శ్రేష్టులతో సాహితీ బృందావనం ఏర్పరచి సాహితీ సుమాల మొలకెత్తింది సాహితీ స్వర్ణ పుష్పాల పోయించి సాహితీ లహరి గా మార్చి సాహితీ వేదిక నిర్మించి సాహితీ మహాప్రస్థానాన్ని చూపిన సాహిత్య తపస్వి.
కవుల వేనోళ్ళ పొగిడించుకున్న అర్హుడు.
కవుల అక్షరాల తోవలో కవుల అక్షరాలకు జీవం పోయ తపించిన తపస్వి.
స్వలాభమెరుగక తనకు తాను సాహితీ మాతకు అర్పించుకున్న సన్యాసి.
కళారాధనలో విరమణ చూపక కవుల వెన్నంటి ఉంటాడని ఆశిస్తూ....
*మేక రవీంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు*
45
డా.దీపక్ న్యాతి
సినీ రచయిత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత
దివిటీలు ప్రక్రియ రూపకర్త
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: శ్రీ మేక రవీంద్ర గారికి పదవి విరమణ శుభాకాంక్షలు సార్.
అడుగు ఒక ఆరంభం .
సూక్తులకందని ఆవేశం .
అణువణువు ఒక అంతర్యుద్ధం .
గెలుపు, ఓటముల ఉత్తుంగ తరంగం .
గెలిచి , నిలిచాక గెలుపులోని ఆనందం ,
ఆ తర్వాత ఏమిటనే నిర్వేదం .
నిర్మాణాత్మక మార్పేదో దరిచేరి .. మనసును కుదుపుతున్న భావోధ్వేగం .
అప్పుడే అయిపోయిందా .. సంవత్సరాలు .. రోజుల్లా కరిగిపోయి ..వయస్సును గర్తుకు తెచ్చాయనే చిరు కోపం .
ఈ ప్రపంచంలో బాధ్యత అనేది శాశ్వతం..
విరమణ అనేది తాత్కాలికం .
జీవితంలో ఇది ఒక సంధి సమయం ..
ఈ సమయంలో మరి కొందరిని గెలుపు వైపు నడిపించడం సాధ్యమైతే ...
వారి కనులలోని ఆనందం ..
జీవితపు మరో అంకానికి గొప్ప మలుపు కాగలదని ఆశిస్తూ. ..
మీరు చేస్తున్న సాహిత్య సేవకు
దన్యవాదములు తెలుపుతూ. ..
శివరామప్రసాద్. వక్కలగడ్డ
9963658704
46
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *సాహితీ సవ్వడి రవీంద్ర నడవడి*
*కవితాయాత్రికుడు రవీంద్ర కవీంద్రుడు*
అందరితో స్నేహంగా ఉంటూ
ఆప్యాయత అనురాగాలు చూపి
కాలం వెంట నడిచే నిరాడంబరుడు
సామాజిక సాహితీ సేవనిచ్చే సాహితీ అమరేంద్రుడు
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ
ప్రకృతి ధర్మాన్ని కొనసాగిస్తూ
అందరి మన్ననలు పొందిన నిత్య కృషీవలుడు
మాతృభాషను వదలని కవితామూర్తి
నిత్య చైతన్య శీలిగా ఉంటూ
అందరినీ చైతన్య పరుస్తూ
భిన్న రంగాల్లో నిలిచిన సవ్యసాచి
సేవా తత్పరులు కవివతంసుడు
కవి సమ్మేళనం నిర్వహిస్తూ
అంతర్జాలంతో కొత్త రూపాన్నిచి
సహస్ర కవి సమ్మేళనం నిర్వహించాడు
అందరికీ ఆదర్శమూర్తి మనందరికీ స్ఫూర్తి
మానవత్వమును పరిమళింపచేస్తూ
ముఖము నందు చిరునవ్వును కలిగిన
సాహితీవనంలో మెరిసిన ఆణి ముత్యం
మన కవీంద్రుడు మన మేక రవీంద్రుడు
ఆయన ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్లు వర్ధిల్లాలని
వారి సరస్వతి సేవ నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను
*శ్రీ మేక రవీంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు*
*డాక్టర్ తెలుగు తిరుమలేష్*
తెరసం జిల్లా అధ్యక్షులు
అమరచింత మండలం,వనపర్తి జిల్లా
9908910398
47
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: అభినందన సందేశ సుమమాలిక!!!
తెలుగుభాషాభిరుచుల
నన్నిటినీ ఏకముచేసి
మీ వృత్తిలో ప్రవృత్తిలో మమేకమై
సాహిత్యాభిరుచితో కవివై
పరంపరానుగత వంశాంకురుడవై
తాతగారైన చెన్నకేశవుల వారసత్వాన్ని
పుణికిపుచ్చుకున్న కవివరేణ్యుడవై
ద్విపాత్రాభినయముతో ఒనగూరిన
ఒరవడులతో ద్విశాఖలలోనూ
శిఖరాగ్రానికి చెలిమితో చేరికవై
తెలుగు భాషోన్నతికై
మీ సాన్నిహిత్య ఔన్నత్యములతో
నలుదిశలా వ్యాప్తి కారక కృషీవలుడవై
కొత్త కొంగ్రొత్త వనరులను
ఒడిసిపట్టిన సృష్టి కర్తవై
లక్షలు వెచ్చించి
చేయలేని పనులను
లక్ష్యసిద్దితో సాధికారికంగా సాధించినవాడవై
నిష్కల్మష నిర్మల నిరాడంబర నిజాయితీలతో నడక సాగించి
ఎందరో మరుగునపడిన కవుల
నుత్తేజపరచి పరిమళింపజేసి
వాటి సువాసనలనెల్ల
దశదిశలా వెదజల్లుతున్నవాడవై
ఆదర్శ జీవితానికి
ఆలవాలమై స్ఫూర్తిదాయకమై
కంటికి కనిపించని కరోనాను
గజగజలాడించి వణికించి
నిరాయధ నిరంతర
పోరాట పటిమలతో అగ్రగణ్యుడవై
చెదరని చిరుమందహాస చైతన్యుడవై
నిన్ను నమ్మి వచ్చిన పదవికి వన్నె తెచ్చి
ఔత్సాహిక రచయితల
నెందరినో ప్రోత్సాహపరచి
సామాజిక వేదికల
అల్లికల చొరవలతో దిక్సూచివై
నేడు పదవీవిరమణ చేస్తున్న
శుభసందర్భమును పురస్కరించుకొని
శ్రీ మేక రవీందర్ గారికి
సహృదయాభినందనలు
అందుకోవలసిందిగా
వినయపూర్వక
అభినందన సందేశము.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
ఆయురారోగ్యా ఐశ్వర్యములు
సదా కలుగచేయాలని
ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ
మరొక్కసారి అభినందనలు అందజేస్తూ
సాహితీవిశ్వానికి సుపరిచితులైన మిమ్మల్ని
వినమ్రపూర్వకంగా ఆహ్వానిస్తూ
ఒక విశ్రాంత పెన్షనర్
కాసుల ధీరాజ శర్మ
48
Retired Accounts Officer(Admn.)
EPFO. Hyderabad.
9440522864.
30.05.2020
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 💐💐💐సాహితీ సేనాపతి💐💐💐
చెరగని చిరునవ్వుతో…కలకాలం
సాహిత్య భావుకతతో…తెలుగు భాషకు పట్టాభిషేకం
అక్షర చైతన్య కుసుమాలతో…కవిత్వపు పరిమళాలు
తెలుగు కవితా వైభవంతో…కవుల పరిచయం
సహస్ర కీర్తి పుస్తకంతో…సాహిత్య కార్యక్రమాల గుర్తింపు
ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని మనీషి
సాహితీ సేనాపతి…బిరుదాంకితులు
మంచితనానికి మారుపేరుగా
ఉన్నత వ్యక్తిత్వం…సాహిత్యాభిలాష
పుణికి పుచ్చుకున్న…శ్రీ మేకా రవీంద్ర గారు…………
వారి సాహిత్య సేవ,కృషి…తెలుగు భాషా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, హృదయపూర్వకంగా కోరుకుంటూ………
పదవీ విరమణ శుభాకాంక్షలు 💐💐💐💐💐తెలియచేస్తూ……
కాళంగి.వసంత జెస్సన్,ఖమ్మం
చరవాణి:9490967433
49
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: ..
*కవీంద్రుల రవీంద్రుడు*
తమ ఉద్వేగాల కల్లంలో ఎన్నో అక్షరాలను..
ఎందరో ఆశావహులు
ఆర బోసుకుంటున్నారు
ఆయన వాటన్నిటినీ రాశిగా
పోసి వాసిగల, వాడియైన
కలాలను నక్షత్రాలుగా
మలిచి స్వయం భావ
ప్రకాశితాలుగా నిలిపి వెలిగిస్తున్నారు
అక్షరాలను జేబులో
పోసుకొని అపుడపుడే
పదాల పునాదులు
పేర్చుకొనే భావశిల్ప
ఆకాంక్షితులకు
ఆకాశమంత ఆపన్నహస్తం
కవీంద్రుల రవీంద్రుడు
పరభాషా పారాయణంలో
నిటారుగా నిబడటానికి
ఆధారమైన మాతృభాషల మట్టిని తానే తవ్వుకుంటున్న మనిషి..
గాలిలో దీపమై కొన
ఊపరిలో ఉన్న తెలుగు
భాషకు దాపుయై కాపుయై
ఒత్తిలా వెలుగుతున్నాడు
పనికి రానివని పడేసుకున్న
కలాలకు విశ్వాసాల
విద్వత్తును చిలికి
స్వయం సత్తువల సిరాలు
నింపి కవన భవన నిర్మణాల
గుత్తేదారే మేక రవీంద్ర..
వృత్తి నిష్క్రమణ
శుభాకాంక్షలతో ప్రవృత్తి
కండువా ఆహ్వానమై
మెడలపై వాలిపోయింది
రండి రాళ్ళను రాపిడి
పట్టి కవి రత్నాలుగా
మెరుగులు అద్దండి
*కొప్పోలు యాదయ్య*
7989742920
50
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: *ఒకే ఒక్కడు*
భరతావని ఒడిలో చక్కని బిడ్డ
వృత్తిని నమ్ముకుని ప్రవృత్తితో
పదిమందికి ఆసరాగా నిలిచి
సంఘ సేవకుడైన ఘనుడు
తాను పదవిలో ఉంటూ
పదోన్నతులకు ఎప్పుడూ పాకులాడని
పదిమందికి మేలుకోరి
సాహిత్యాన్ని పోషించిన మరో రాయలు
ఆనాటి గీతాంజలి విశ్వ కవిని చేస్తే
ఈనాటి సహస్ర కవిమిత్ర సమూహంతో
మరో గీతను నడుపుతూ
యువ కవులను ప్రోత్సాహిస్తూ
అత్యున్నత సాహితీ సేవలో
మన ముందు నిలిచిన
మన మార్గదర్శి మానవోత్తముడు
*ఒకే ఒక్కడు* మేక రవీంద్రుడు
_స్పూర్తి రత్న_ ✍🏻
కోలంట్ల రామకృష్ణ
51
జలదుర్గం(కర్నూలు )
9966804126
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: On duty ever
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
52
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్యమే శ్వాసగా...
తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢసంకల్పంతో...
నిరంతరం సరికొత్త ఆలోచనలతో సాహిత్యాన్ని పరుగులు పెట్టిస్తూ...
నవ యువ కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ మేక రవీంద్ర గారి గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే...
సాహిత్య అభిమానిగా,సాహిత్య పోషకుడిగా...
రికార్డులను సృష్టించడంలో మేటి గా చెప్పవచ్చు..
వాట్సప్ సాహిత్య గ్రూపుల ద్వారా ...
అంతర్జాల కవి సమ్మేళనం ను నిర్వహించడం...
కవులకు ప్రోత్సాహకాలను అందించడం..
పుస్తకాలను ప్రచురించడం....మొదలగు సాహిత్య సంబంధిత కార్యక్రమాలకు పెట్టింది పేరుగా మేక రవీంద్ర గారు గుర్తింపు తెచ్చుకున్నారు....
ముఖ్యంగా
అంతర్జాల రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది తన నవకల్పన ఆలోచనకు దర్పణం పట్టింది...
ఎందరో ప్రశంశలు అందుకుంది...
ఇదొక సువర్ణ ఘట్టం...
వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పలువురి మన్ననలు పొంది నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ మేక రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు....
వృత్తిలో నే కాకుండా ప్రవృతికి తన ప్రాణంగా ప్రేమించి ఎంతో మంది సాహిత్య కారుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడం మాములు విషయం కాదు...
చాలావరకు నేను అనే
స్వార్థం తో నిండిపోయిన ఈ లోకంలో మనం అనే తలంపును గట్టిగా నాటి విలువలతో కూడిన సమాజం కోసం....
చైతన్య పూరిత శంఖారావం కోసం...
సాహిత్యం అత్యంత బలమైన ఆయుదంగా భావించిన వారు మేక రవీంద్ర గారు....
ఆలోచనలను ఆచరణలో పెట్టగలగడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైనది...
అంతర్జాలన్ని ఆయుదంగా చేసుకుని అందరిని ఒక వేదికపైకి తీసుకురావడం అనేది మాములు విషయం కాదు...
ఎన్నో సవాళ్లు,విమర్శలు,సాంకేతిక కష్టాలు...
అన్నింటినీ అధిగమించి సఫలీకృతులు అయ్యారు అని సగర్వాంగా చెప్పవచ్చు....
సాహిత్య లోకానికి దొరికిన ఒక మణి మాణిక్యం రవీంద్ర గారు...
ఇక పూర్తి స్థాయిలో సాహిత్య సేవ చేస్తూ...
సరికొత్త పధంలో ముందుకు సాగుతూ...
సాహిత్యలోకాన్ని నడిపించాలని
సమాజ హిత్ సాహిత్యం కోసం కృషిగావించాలని మనసారా కోరుకుంటూ...
హృదయపూర్వక
అభినందనలతో...💐💐💐💐💐💐💐
అక్షరాల తోవ
ఖమ్మం
53
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: కవి:-గాజుల.భారతి శ్రీనివాస్.ఖమ్మం
స.క.స.5158.
సెల్.9849788108.
శీర్షిక:-జయోస్తు రవీంద్ర
లక్ష్మన్ రావు..అంజనీ దేవి మనసపుత్ర.
ఇంద్ర..సహస్ర కవీంద్ర..మా మేక రవీంద్రా.
పుస్తకప్రియులు..తెలుగుభాష కవితా పితా మహులు
సహస్ర కవిసమ్మేళనం యజ్ఞంలా నిర్వహించే ఆధ్యులు
తెలుగు కవితా వైభవం ద్వారా వేల కొలది కవులకు మార్గనిర్దేశకులు మీరు
తెలుగుభోజుడు..సాహితీ సేనాపతి బిరుదాకింతులు
మితభాషి..నిష్కల్మషమూర్తి..మోముపై చెరగని చిరునవ్వు
ఇవ్వడమే తప్పా.. తీసుకోవడం తెలీనీ నిస్వార్థ సేవకులు
తెలుగుభాష అభివృద్ధి కోసం అహర్నిశలు సాహిత్య కృషి చేస్తున్న..నిత్య కృషీవలుడు
రవీంద్రా సార్ సంకల్పానికి మనమంతా తెలుగుభాష ఔన్న త్యాన్నీ ప్రపంచ నలుమూలకు వ్యాపింపచేద్దాం..అందరం ప్రతిన భూనుదాం.
పదాల పూ లతో మీకు అభిషేకం చేయనా
అక్షర మాల అల్లి మీ మెడలో వేయనా..!!!
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: మేక రవీంద్ర...💐💐
54
ఔను...! అతడు ...రవీంద్రుడే...
కాదు...కాదు... కవీంద్రుడే...!
ఎందుకంటారా...!?
ఆ ...రవి ...చేరని చోటుకి
మన కవి చేరగలడు..!?
రవీంద్రుడు...సార్థక నామధేయుడు
ఆ రవీంద్రుడు చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగులిస్తే....
మన రవీంద్రుడు... తామసి పొరలు అలుముకున్న తెలుగు సాహిత్యానికి...
సాంకేతిక విజ్ఞానమనే చందనాన్ని పూసి ..
తెలుగు నందన వనంలో కోట్లాది కవి సుమాలను పరిమళింపజేసిన ప్రజ్ఞాశీలి..!
మాటల్లో మృధుత్వం
చేతల్లో సజ్జనత్వం...
నడకలో ...నడతలో...
శ్వాసలో ...ఆశలో...
అనుక్షణం...అహరహం
తెలుగు భాషాభివృద్ధికై తపించే తత్వం..!
నిగర్వి ,నిత్య సంతోషి,
నిరాడంబర జీవి..నిత్య శ్రమైక జీవి..!
నూతన పోకడలను ఒంటబట్టించుకుని
తెలుగు సాహితీ సుమ పరిమళాలను
నలుదిశలా గుభాళింపజేసిన
సాహితీ సేద్యకాడు..!!
ఓ మహాశయా..!
మీకు హృదయపూర్వకమైన పదవీవిరమణ శుభాకాంక్షలు..💐💐
మీ సాహితీ సేద్యం భవిష్యత్ లో కూడా కొనసాగాలని మరిన్ని ఫలాలు విరబూయాలని
ఆ ఫలాలను ఆస్వాదించే అదృష్టం మాలాంటి వారికి కలగాలని ..మనసా వాచా కర్మేణ కోరుతూ...
మరోమారు ...మీకు హృదయపూర్వకమైన
పదవీ విరమణ శుభాకాంక్షలతో...
మీ ...అభిమాని...
కోరాడ.అప్పలరాజు.( టీచర్ )
అనకాపల్లి-విశాఖ జిల్లా.
55
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు: నీలా రంగనాధం
తేది:31/5/2020
అంశం: *నిగర్వి_364*
అభినవ ఆంధ్రభోజుడై..,
అనితర సాధ్యమైన కవితా సమూహ సారథై..,
నవకవులకు మార్గదర్శియై..,
వేదికనందించ అనవరతం కృషిచేసిన,కృషిచేస్తున్న..,
సాహితీసేవా కృషీవలుడై..,
నిగర్విగా సాహితీ సేవానిరతుడై..!
సాహితీ వన పోషకుడై..!
ఎన్నో పూలవనాలకు తోటమాలిగా నిలిచిన మేకా రవీంద్ర గారు మీకు మా వందనాలర్పిస్తున్నాం..!
హృదయపూర్వక అభినందన వందన సమర్పణం చేస్తున్నాం..!!!!
🔥 *నీలా రంగనాధం* 🔥
56
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహితీసేవ భాగ్యోన్నతుడు....!
<><><><><><><><><><><>
సాధుసౌమ్యశీలి:సాహిత్యరసస్ఫూర్తి,
మృదులభావజాల:మూర్తికీర్తి!
మాటమంజులంబు:మౌనజీవనశైలి!
పఠితమానసంబు:పగలురేయి!!
*
మేకఇంటిపేరు:మేలుకోరురవీంద్ర
తల్లిదండ్రులనిల:తాతయశము
నిల్పిసాగుతున్న:నిర్మలసాహసి!
కవులతతినిపెంచు:కరుణశీలి!!
*
వేనవేలలక్ష:వెలుగులీనుకవీంద్ర
కవితలన్ని గూర్చి:కావ్యమాల!
వెలయజేయఁతాను:వేగిరభా వంబు,
ప్రస్తుతించవలయు:ప్రాజ్ఞులార!!!
*
కవనకదనమందు:కార్యోన్నతుండును,
సమతమమతలందు:చక్రవర్తి!
కఠినతరములైన:కార్యసాధనయుక్తి!
రవియుకవియుజూడఁ:రమ్యతరము!!
*
బహుళరీతిపొగడ:భావ్యమ్ము నేజేయ!
సుముఖపరిచయంబు:సూక్ష్మబుద్ధి!!
ప్రబలదివ్యశక్తి:పరిణితినొందియు
సాగుముందుకెపుడు:సద్వివేకి...!!!!!
---డాక్టర్ గన్నోజుశ్రీనివాసాచారి
8555899493,
పెద్దపల్లి, నాగర్ కర్నూల్.
57
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: మేలిమి జాతి రత్నం
----------------------------
ఎందరో సాహిత్యలోకములో
ఉన్నతస్థానాలని అధిరోహిస్తారు..
కాని అందులో కొందరే తన
నడిచే మార్గములో సాహిత్యపరిమళాలు వెదజల్లాలని ఆశిస్తూ..
ఆకాంక్షిస్తూ..ఎన్నో సాహితీమొక్కలను
నాటుతూ ఆ మార్గాన్నే
ఓ సాహిత్య లోకంగా
సృష్టిస్తారు..అలాంటి మహానుభావులులో
మేలిమి జాతి రత్నము వంటి వారు
తెలుగు సాహిత్య వైభవ
వ్యవస్థాపకులు గౌరవనీయులైన
శ్రీ మేకరవీంద్రగారు...
ప్రతీ ఒక్కరిలో నవనీతములా నిగూఢంగా
దాగియున్న రచనా శక్తిని
తన ప్రోత్సాహముతో
బయటికి తీసి..
ప్రపంచమన్న మాటెరగని
బావిలో కప్పల్లా ఉండే
ఎందరోనో ...
వాట్సప్ సమూహాలు ఏర్పరిచి
జ్ఞానకాంతులు వెదజల్లే కాంతిపుంజాలుగా మలిచేరు..
రెండు రాష్ట్రాలలో
ప్రతీ కవి మనసులో తన స్థానము
ఎప్పుడూ చిరస్మరణీయమే,.
పదవీ విరమణ
శుభాకాంక్షలు సార్ 🙏💐💐💐💐
🖋️శ్రీదేవి సురేష్ కుసుమంచి🖋️
58
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక:తేది:31.05.2020🔥
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
మద్దెల సరోజన(కలం:సహజ)
అంశం: మేక రవీంద్రల
సాహితీ సేవ
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
మనిషై పుట్పిన వాడు
కారాదు మట్టి బొమ్మ
సినీ గేయ కవియన్నట్లు
పట్టుదల కృషిలే పెట్టుబడిగా
ఆత్మవిశ్వాసమే ఆయువుగా
అందరూ నావారన్న భావనే
సాహితీ సమూహాల ఏర్పాటు
సాహిత్య కృషీవలుడుగా...
సాహిత్య కవనాలు పూయింపజేసి
కళామతల్లి ముద్దు బిడ్డగా
సేవలు అందిస్తూనే...
ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో
ఉత్తమ ఉద్యోగిగా మీ సేవలు
అనితర సాధ్యం స్ఫూర్తిదాయకం
ఉదయ సాహితీ హుస్నాబాద్
ఆత్మీయ సమ్మేళనంలో ...
మీ పరిచయం ఆనందదాయకం
గురువులు నిగర్వి నిస్వార్థపరులని
కొద్ది కాలంలో గ్రహించాను
సమూహానికే పరిమితం చేయక వ్యక్తిగతంగా సమాచారాలను అందించి
కవితలు రాయిస్తూ ప్రోత్సహించిన
మాన్యులు మేక రవీందర్ గారు
పదవి విరమణ పొందినా
సాహితీ సేవలను కొన సాగిస్తూ
అయురారోగ్యాలతో ఆనందకరమైన
జీవితం గడపాలని కోరుకుంటూ
మద్దెల సరోజన(జగిత్యాల)
(సాహితీ సోదరి)
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
59
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🙏🙏
సార్
నా నమస్సుమాంజలి
తీర్చలేని తల్లి రుణం
ఆమె అందించిన
మాతృభాష
గొప్పతనము అదే అదే
తెలుగు బాషా ఔన్యత్యము ..
.... అతనిలోని సాహితి అభిమానం.
మేక రవీంద్ర సార్ గారికి
🙏. నా పాదాభివందనం.
తూర్పున ఉదయించు
ఉషస్సు,
సాహిత్యములోని
రవీంద్రుని తేజస్సు
స్వర్గంలోని ఇంద్రుడు
సాహిత్యములో మనకు దేవేంద్రుడు రవీంద్రుడు
. హరివిల్లులోని ఇంద్రధనస్సు,
అతని మనసు
సహస్ర కవులు అందరికీ తెలుసు,
అతని మంచి మనసు.
నింగిలోని ఒక్కొక్క వర్షపు జల్లు,
అవని పైన ప్రవహించే నదులు.
. నేను రాసే కలముతో అక్షరాలు,
సమాజములో కవిత అల్లికలు,
రవీంద్రుని మెడలో పుష్పమాలలు.
మకుటంలేని వజ్రకిరీటం
తెలుగు సాహిత్యానికి గర్వకారణం,
రవీంద్రుడు అంటే
అందరికీ మమకారం
రవీంద్రుని ఆత్మీయత
అభిమానానికి
నా వందనం అభివందనం
మీరు సాహిత్యానికి
విజయకేతనం.
మీకు నా కవిత అంకితం,
🙏🙏🙏🙏.
మీ పదవి విరమణ
అందరి ఆదరణ
తెలుగు సాహిత్యానికి
. మీరు అందించిన
ప్రేరణ
నాకు ఆదరణ
.. ఇట్లు
రజని కులకర్ణి
కలం సంజవిని.
ఉర్దూ చార్మినార్
చరవాణి సంఖ్య
9296450010.
60
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
పేరు: విజయదుర్గ
కవితా అంశం : మేక రవీంద్ర సాహితీసేవ
కవితా సంఖ్య: 248
తేదీ: 31/05/20
సాహిత్య తరువై శాఖోపశాఖలుగా
విస్తరించిన మహోన్నత వ్యక్తి
ఆది విష్ణువులా వాట్సాప్ కి
సింహద్వారమై
సాహీతీ వేత్త లకు ఆహ్వాన గీతిక....!!
నింగి అంత నిబ్బరంతో
భూదేవి అంత ఓర్పుతో
చెదరని చిరునవ్వు సంతకాల తో
ఆత్మీయతా రాగాల భాస్కరుడు....!!
ఉదయరాగాలన్నీ పరుల సేవకే
అజాత శత్రువై స్నేహ వాకిళ్ళకి
గౌరవ పూమాలై
వాగ్ధేవికి పాదకుసుమం తాను....!!
తలచిన వెంటనే సంకల్ప
మధనానికి చైతన్యమై
కవులందరినీ తన అభిమాన దారాలతో అల్లుతూ
ఒక్కటి గా నడిపిన నవీన ఆంధ్రభోజుడు రవీంధ్రసర్....!!
🌹వినీల🌹
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: On duty ever
61
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
62
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥 *కణిక*🔥
*మంచి మనసుకు స్వాగత తోరణం*
పరిచయం అనంతం
మాట మృదుత్వం
సహస్ర కవిత సుమం
పరిమళించెను సాహితి ప్రపంచం
లక్షల రచనల భావం
ఎందరెందరో భాషాభిమానులు చే
వాట్సాప్ వేదికల సమూహము తో
కవి పుంగవులు,కవిశిరోమణులను
పరిచయం చేసిన
సహస్ర కవి దిగ్గజం
కృషి ఉంటే......
మనుషులు ఋషులు అవుతారు
అన్న దృడ సంకల్పం
పొలములో విత్తనమేస్తే
సాగు చేసి పంట పండించినట్టు
ఈ సాహిత్య జగత్తునా
ఎందరికో మార్గదర్శకం అయి
కవికలాదుల చే
కవన కుసుమాలు పండించిన
అతిరత మహారథుడు
*రవి తేజోమూర్తి రవీంద్రుడు*
ఉద్యోగ బాధ్యతలు చేపడుతు
కవన రంగానికి
కలం పట్టిన అక్షర సేద్యుడు
నేడు పదవికి విరమణయే
కాని.....
అక్షర పూ తోటలో
నిత్య ఉషోదయపు సుమం
ఆ సుమధురపు పరిమాళాను
పూయించే
*మంచి మనుసుకు*
*నా స్వాగత తోరణం*
------ *గంగ్వార్ కవిత కులకర్ణి*✍🌹
63
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: కణిక
మొహమ్మద్. అఫ్సర వలీషా
అంశం....మేక రవీంద్ర సార్ సాహితీ సేవ
కవితా సంఖ్య...57
తేదీ....31_5_2020
శీర్షిక..... నిత్య సాహితీ సేవకులు
అలుపెరుగని ఆ దేహం
సాహితీ పరిమళాల సోయగం....
పలు సాహితీ ప్రక్రియల ప్రస్థానం
పలు పలు బిరుదుల ప్రహసనం...
చెరగని చిరునవ్వుల
ఉత్సాహ మయూఖం....
ప్రేమాభిమానాల నిష్కల్మష
నిస్వార్థ నిరాడంబర జాబిలి పూర్ణ చంద్రం....
ఉన్నత వ్యక్తిత్వ మితభాష
నిత్య సాహితీ కుసుమం....
సుగుణాల సంస్కారులు ఎదిరె
చెన్న కేశవులు గారి ముద్దుల (మనవడు) మణిరత్నం....
నైతిక విలువల నిలువెత్తు రూపం
అంజనీదేవి లక్ష్మణరావు దంపతుల ఆరవ ప్రాణం....
తెలుగు వైభవ సృష్టి కర్త
సాహితీ సుస్సంపన్నం...
తెలుగు తల్లి ముద్దు బిడ్డడు
విశిష్ట సేనాపతి బిరుదాంకితం....
శ్రీయుతులు మేకా రవీంద్ర సార్ గారికి హృదయపూర్వక అభినందనం....
ఆయన సాహితీ సౌరభం
దేశ విదేశాల కవులకు అంకితం.....!!
64
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్యమే శ్వాసగా...
తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢసంకల్పంతో...
నిరంతరం సరికొత్త ఆలోచనలతో సాహిత్యాన్ని పరుగులు పెట్టిస్తూ...
నవ యువ కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ మేక రవీంద్ర గారి గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే...
సాహిత్య అభిమానిగా,సాహిత్య పోషకుడిగా...
రికార్డులను సృష్టించడంలో మేటి గా చెప్పవచ్చు..
వాట్సప్ సాహిత్య గ్రూపుల ద్వారా ...
అంతర్జాల కవి సమ్మేళనం ను నిర్వహించడం...
కవులకు ప్రోత్సాహకాలను అందించడం..
పుస్తకాలను ప్రచురించడం....మొదలగు సాహిత్య సంబంధిత కార్యక్రమాలకు పెట్టింది పేరుగా మేక రవీంద్ర గారు గుర్తింపు తెచ్చుకున్నారు....
ముఖ్యంగా
అంతర్జాల రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది తన నవకల్పన ఆలోచనకు దర్పణం పట్టింది...
ఎందరో ప్రశంశలు అందుకుంది...
ఇదొక సువర్ణ ఘట్టం...
వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పలువురి మన్ననలు పొంది నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ మేక రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు....
వృత్తిలో నే కాకుండా ప్రవృతికి తన ప్రాణంగా ప్రేమించి ఎంతో మంది సాహిత్య కారుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడం మాములు విషయం కాదు...
చాలావరకు నేను అనే
స్వార్థం తో నిండిపోయిన ఈ లోకంలో మనం అనే తలంపును గట్టిగా నాటి విలువలతో కూడిన సమాజం కోసం....
చైతన్య పూరిత శంఖారావం కోసం...
సాహిత్యం అత్యంత బలమైన ఆయుదంగా భావించిన వారు మేక రవీంద్ర గారు....
ఆలోచనలను ఆచరణలో పెట్టగలగడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైనది...
అంతర్జాలన్ని ఆయుదంగా చేసుకుని అందరిని ఒక వేదికపైకి తీసుకురావడం అనేది మాములు విషయం కాదు...
ఎన్నో సవాళ్లు,విమర్శలు,సాంకేతిక కష్టాలు...
అన్నింటినీ అధిగమించి సఫలీకృతులు అయ్యారు అని సగర్వాంగా చెప్పవచ్చు....
సాహిత్య లోకానికి దొరికిన ఒక మణి మాణిక్యం రవీంద్ర గారు...
ఇక పూర్తి స్థాయిలో సాహిత్య సేవ చేస్తూ...
సరికొత్త పధంలో ముందుకు సాగుతూ...
సాహిత్యలోకాన్ని నడిపించాలని
సమాజ హిత్ సాహిత్యం కోసం కృషిగావించాలని మనసారా కోరుకుంటూ...
హృదయపూర్వక
అభినందనలతో...💐💐💐💐💐💐💐
అక్షరాల తోవ
ఖమ్మం
65
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్య కృషీవలుడు
సాహిత్య నిధి శ్రీ ఎదిరె చెన్నకేశవులు
వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
అంజనీదేవి లక్ష్మణరావుల తనయుడైన
అభినవ భోజుడు శ్రీ మేక రవీంద్ర గారు
చిరు దరహాస వదనంతో
మృధు మధుర భాషణంతో
నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనమై
ఎంత ఎదిగినా ఒదిగి వుండే ఔన్నత్యంతో
సాహితీ సౌరభాలను గుభాళించే
సహృదయుడు శ్రీ మేక రవీంద్ర
దాశరథి కవితా సమూహంతో
ఎంతోమంది కవులకు మార్గదర్శకుడై
తొలి సాహిత్య సమూహాల సారథి యై
ఎన్నో కవి సమ్మేళనాలను నిర్వహించి
ప్రముఖ వ్యక్తులచే పలు సంస్థలచే
బిరుదులు అందుకున్న సాహితీ సేనాపతి
పేరు ప్రఖ్యాతులను ఆశించకయే
నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తూ
అయిత కవితాయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించి
అంచనాలకు మించి రికార్డు స్థాయిలో
కవితా సునామీని సృష్టించి
అర్హలైన వారిని స్రహస్ర బిరుదాంకితులను చేసిన
సాహిత్య పోషకుడు శ్రీ మేక రవీంద్ర
బాధ్యతాయుత వృత్తిని నిర్వహిస్తూనే
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకుడై
తెలుగు భాషామతల్లికి అక్షరనైవేధ్యం చేసిన
అనితర సాధ్యుడు శ్రీ మేక రవీంద్ర
అంతర్జాల రేడియో కార్యక్రమాలు
సామాజిక మాధ్యమాల ద్వారా
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటి
కవుల హృదయాలలో ఆత్మీయస్థానమందుకున్న స్పూర్తి దాయకుడు సాహిత్యకృషీవలుడు
పాలమూరు జిల్లాకు తలమానికమైన
సాహిత్య సేవకుడు శ్రీ మేక రవీంద్ర
( శ్రీ మేక రవీంద్ర గారి పదవీ విరమణ సంధర్భంగా )
✍పులి జమున
66
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: అతనొక తెలుగు తేజం ......
సహస్ర కవి సమ్మేళనం
సహస్ర చిత్ర కారులు
సహస్ర అంతర్జాలం
సహస్ర వీడియో ఆడియో సమ్మేళనం
ఏవైనా ఏదైనా
కవులను ఉన్నత శిఖరాలపైకి
తీసుకుని రావలనుకుంటరు
మానవత్వం నింపుకున్న
మంచి మనిషి.....
వృత్తిలో ఎదుగుతూ
తెలుగుభాషకై ఒదుగుతూ
ఎన్నో పురస్కారాలు అందుకుని
ఘనత పెంచుకున్న వ్యక్తి ...
మాతృభాష పరిరక్షణకు
అహర్నిశలు కృషి చేస్తున్న
మహోన్నత వ్యక్తిత్వం...
మేకల రవీంద్ర గారికి
అక్షరాలతో కీర్తించడం
వీలైతే అక్షర మాలలు
సమర్పించడం కన్న
మనమందరం ఏం చెయ్యగలం ...
చిరునామా
యడవల్లి శైలజ/కలంపేరు: ప్రేమ్
పాండురంగాపురం( గ్రామం )
ఇంటి నెంబర్ 6-36,బల్లేపల్లి (పోస్ట్ )
ఖమ్మం జిల్లా-507002
చరవాణి: 9394171299
తెలంగాణ రాష్ట్రం
Ysailaja7774@gmail.com
67
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: తేదీ::31-05-2020
🔥కణిక🔥
పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:; అభినవ భోజుని భాషా సేవ
సంఖ్య::169
------------------------------------
తెలుగు సాహిత్యాన్ని
వివిధ ప్రక్రియల్లో విస్తరింపచేసిన
తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన మహనీయుడు
అభినందన తెలంగాణ భోజుడు
అంతర్జాలాన్ని అక్షరాల సేవకై
ఉపయోగించుకున్న తెలుగు భక్తుడు!
ప్రపంచ వ్యాప్తంగా భాషాభిమానులను ఒకటి చేసి
సాహిత్యానికి ఎల్లలు లేవని నిరూపించిన సాహితీ సార్వ భౌముడు!
తాత గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
నిత్యం సాహితీ యజ్ఞం చేయించిన
సోమయాజి!
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటి
ఎందరికో స్ఫూర్తి నిచ్చిన మహా మనిషి!
కవి సైన్యానికి అధ్యక్షుడై భాషను కాపాడుతూ
విశిష్ట సేనాధిపతి బిరుదు పొందిన
మేక రవీంద్ర గారూ!
భావి జీవితం నిత్యం భాషామ తల్లి సేవ చేస్తూ
ఆనందంగా ఆరోగ్యంగా ఇలాగే కలకాలం
కొనసాగాలని మనసారా కోరుకుంటూ
హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
పేరు:: వురిమళ్ల సునంద, ఖమ్మం
తెలుగు భాషోపాధ్యాయిని
9441815722
68
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
కోణం పర్శరాములు
సిద్దిపేట బాల సాహిత్య కవి
అంశం : మేక రవీంద్రుల సాహితీ సేవ
రచన సంఖ్య : (124)
శీర్షిక : సాహితీ ప్రియుడు రవీంద్రుడు
తేది : 31-05-2020
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
అతడు కవి కాదు
కవిత్వ ప్రియుడు
అతడు చేసే వృత్తి వేరు
ఎంతుకున్న ప్రవృత్తి వేరు
అతడు చదివింది ఇంజనీర్
చేస్తుంది అమ్మ భాషకై ఆరాటం
సివిల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తునే
ప్రాచీన భాషకు ప్రాణం పోశాడు
అంతరిస్తున్న అమ్మ భాషకు
ఆయువుపోషాడు
తెలుగుభాష తేజస్సు కై
వెలుగులు విరజిమ్మే దివిటీ
అచ్చులు హల్లులతో అందమైన
నిండైన భాష
ఎందరెందరో నవయువ
కవులను,కవయిత్రులు ఏకంచేసి
ఎన్నెన్నో సాహితీ సమావేశాలు
నిర్వహించిన ఘనత రవీంద్రడు
మరెన్నో కవితా సంకలనాలకు
సంపాదకీయం వహించారు
ఎక్కడ తెలుగు సభలు సమావేశాలు జరుగనున్న
టక్కున అచ్చోట ప్రత్యెక్షం
ఎంతోమంది భాషాప్రియులతో
పరిచయాలు
పుస్తక ముద్రణలు
ఇందుగలడు అందులేడనే
సందేహమే వలదు
ఎందెందు వెదికినా అందందే
కలడు మేక కవీంద్రుడు
రవీంద్రుడు
రవీంద్రుడు ఉద్యోగ విరమణ
పొందినా
అతని పదవికే గాని సాహిత్యానికి కానేకాదు
అతని సాహిత్య సేవ
గంగానది ప్రవాహం లా
సాగిపోతుండాలి
అతని విశ్రాంత జీవితం
భార్యా పిల్లలతో
ఆయురారోగ్యాలతో
సుఖసంతోషాలతో
నిండు నూరేళ్ళు ఆయుష్షును
ఆభగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంందాం!
కోణం పర్శరాములు
సిద్దిపేట,9959524585
69
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: **కవిత గానం **
**31/05/2020**
🌅 **సాహితి బ్రహ్మ **🌅
సాహిత్యానికి రథసారధులు
అనితరసాధ్యం వీరి సాహితి సేద్యం
అమోఘం-అద్వితీయం
అయిదువేలకు పైగా కవులను తీర్చిదిద్దిన ఘనత వీరిదే
నిరంతర అక్షర పోరాటయోధులు
ప్రతికవి కలానికి శ్రీకారమూర్తులు
భువిపై మెరిసి నిలిచిన రవి
**న భూతొ న భవిష్యత్ **
అన్నట్టు
**కవుల కర్మాగారం
అక్షర బాండాగారము **
అక్షరానికి వెలుగును -జిలుగును
సృష్టించిన సహస్రకవి సృష్టికర్త సాహితి ప్రస్థానంలో
అలుపెరుగని బాటసారి
పుస్తకపఠనంతో --,కఠోరశ్రమతో సాహితి పరిమళాల
కవనవనానికి ఆద్యుడు అయ్యాడు
వారి ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించి సాహిత్యాన్ని పోషించారు
అయిదువేల కవనసైన్యానికి
అత్యుత్తమ గురువై
సాహితి తరువై
దశదిశలా ఖ్యాతిని విస్తటింపచేసుకున్న
ఏకైక తెలంగాణ కవితా పితామహులు
వాట్సాప్ సాహితి సమూహాల ఆరంభకులు
మరువలేము వీరి కృషి
సాహితి సేవలో మహర్షి .
**మేక రవీంద్ర గారి పదవివిరమణ సందర్బంగా నా చిరు ప్రయత్నం ,వారికీ అక్షర నీరాజనము **
**స్వర్ణసమత**
**నిజామాబాదు **
9963130856
70
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్య కృషీవలుడు
సాహిత్య నిధి శ్రీ ఎదిరె చెన్నకేశవులు
వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
అంజనీదేవి లక్ష్మణరావుల తనయుడైన
అభినవ భోజుడు శ్రీ మేక రవీంద్రుడు
చిరు దరహాస వదనంతో
మృధు మధుర భాషణంతో
నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమై
ఎంత ఎదిగినా ఒదిగి వుండే ఔన్నత్యంతో
కవన కుసుమాలను గుభాళింపచేస్తూ
సాహితీ సౌరభాలను వెదజల్లుతూ
అక్షర సేద్యం చేసిన సాహితీ వనమాలి
దాశరథి కవితా సమూహమును
అంతర్జాల కవిత్వ వేదికగా మలచి
ఎంతోమంది కవులకు మార్గదర్శకుడై
తొలి సాహిత్య సమూహాల సారథి యై
ఎన్నో కవి సమ్మేళనాలను నిర్వహించి
ప్రముఖ వ్యక్తులచే పలు సంస్థలచే
బిరుదులు అందుకున్న సాహితీ సేనాపతి
పేరు ప్రఖ్యాతులను ఆశించకయే
నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తూ
అయిత కవితాయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించి
అంచనాలకు మించి రికార్డు స్థాయిలో
కవితా సునామీని సృష్టించి
అర్హులైన వారిని స్రహస్ర బిరుదాంకితులను చేసిన
సాహిత్య పోషకుడు సహస్ర కవి దిగ్గజం
బాధ్యతాయుత వృత్తిని నిర్వహిస్తూనే
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకుడై
తెలుగు భాషామతల్లికి అక్షరనైవేధ్యం చేసిన
అనితర సాధ్యుడు సాహిత్య సేవాశిరోమణి
సాహితీ పూదోటలో విరిసిన సుమమై
కవుల హృదిలో ఆత్మీయంగా అల్లుకుని
సాహితీ కవన మాలను
తెలుగు భారతికి అర్పించిన సాహితీ సంపన్నులు
అంతర్జాల రేడియో కార్యక్రమాలు
సామాజిక మాధ్యమాల ద్వారా
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటిన
సాహిత్యకృషీవలుడు నిష్కల్మష హృదయుడు
పాలమూరు జిల్లాకు తలమానికమైన
సాహిత్య సేవకుడు శ్రీ మేక రవీంద్ర
( శ్రీ మేక రవీంద్ర గారి పదవీ విరమణ సంధర్భంగా శుభాకాంక్షలతో 💐💐💐💐 )
✍పులి జమున
వీరా గుడిపల్లి
సమన్వయం.1
మూర్తి శ్రీదేవి
సమన్వయం 2
శివునూరి లలితా కృష్ణ
సమన్వయం 3
తులసి వెంకట రమణాచార్యులు
సమన్వయం 4
శ్రీ కాంత్ కడార్ల
సమన్వయం 5
వాకిటి రాంరెడ్డి
I
సమన్వయం 6
అద్దంకి లక్ష్మయ్య
*****************************
కవితా ప్రశంసలు అందజేసిన కవివరుల జాబితా1.యేరువ ఇందిరా రెడ్డి
2.పార్నంది లలితా కృష్ణ గారు
3.వీరా గుడిపల్లి
4.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
5అనుముల తేజస్విని గారు
6.వాకిటి రాంరెడ్డి గారు
7.తులసి వెంకట రమణాచార్యులు గారు
8.పిన్నక నాగేశ్వరరావు గారు
9.విజయ దుర్గ గారు
10.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
11.శీలోజు శోభన్ బాబు గారు
12.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
13.మూర్తి శ్రీ దేవి గారు
14.శ్రీలక్ష్మి చినుకులు గారు
15.ఉమాదేవి గారు
16.వల్లాల విజయ లక్ష్మి గారు
17.మర్రి జయశ్రీ గారు
18.వురిమిళ్ళ సునంద గారు
19.వెంకట్ బాలగోని గారు
20.వీరా గుడిపల్లి గారు
21.ఇంద్రవత్ రాహుల్ గారు
22.వీరా గుడిపల్లి గారు
23.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
24.జ్ఞాన ప్రసూనా శర్మ గారు
25.స్వర్ణ సమత గారు
26.. అంబటి భాను ప్రకాష్ గారు
27.పోలా కిషోర్ కుమార్ గారు
28.సంధ్యా శర్మ గారు
29.కాల్వ రాజయ్య గారు
30.రమా కులకర్ణి గారు
31.సునంద వురిమిళ్ళ గారు
32.......
33.విజయ దుర్గ గారు
34.అనుముల తేజస్విని గారు
35.మువ్వ ప్రసాద్ గారు
36.
37.
38.
39.
40.
41.
42.
43.
44
45.
46.
47.
48.
49.
50.
51.
52.
53.
54.
55.
56.
57.
58.
59.
60.
61.
62.
63.
64.
65.
66.
67.
68.
69.
70.
*********************
1
యేరువ ఇందిర రెడ్డి
అంశం:: తెలుగు భోజుడు
*******************
రవి యై
కవియై
మార్గదర్శి యై
కవుల ఆత్మ భందువై
ఇంజనీరు వై
వృత్తి ధర్మం
ప్రవృత్తి లో
సాహితీ
ప్రేమికుడై
తెలుగు
తల్లి ముద్దు
బిడ్డయై
ఆరు వేల
కవుల
ఏకం చేసి
కవుల
ప్రతిభకు
బిరుదుల
పట్టం గట్టి
నొప్పించక
తానొవ్వక
సూక్తి తో
గర్వం లేని
మహా మనిషి
సాహిత్య
వాట్సప్
సమూహాలలో
ఓ వెలుగు వెలిగిన
రవీంద్రుడు
తెలుగు
కవితా వైభవ
సూత్రదారి
గళ మెత్తి
పాడగా
ప్రోత్సాహం
అందించి
రవివై సుకవియై
స్వచ్ఛతకు
మరో రూపమైన
మీకు
నిర్మలమైన
మనస్సు తో
మీకు మా కవుల
వేదిక కవుల
కవయిత్రుల
పదవీ
విరమణ
అక్షర సత్కారం
అందుకొండి
మహనీయ..
💐💐💐🙏
- యేరువ ఇందిర రెడ్డి
2.
పార్నంది లలితాకృష్ణ*
*సహస్ర సారథి*
వాట్సాప్ వారథిగా
తెలుగు కవితా వైభవానికి
తెర తీసిన
సహస్ర సమూహాల సారథి
రవీంద్రుడు
ప్రసరింపజేసిన
నిస్వార్థ
సాహితీ సేవాతత్పరతా
కాంతులు
పరావర్తనమై
ప్రతిఫలిస్తున్నాయి
ప్రతీ సమూహoలో
సాహితీ బంధంతో
తెలుగుకవులను ఏకం చేసిన
తెలుగు భోజునిగా
అపురూప పురస్కారాల
ఆనవాళ్లతో....
ప్రతీ సదనంలో
చిరు దరహాస వదనమై
కలాన్ని, గళాన్ని
కదిలించాడు
ఆత్మవిశ్వాసానికి
ప్రతీకగా
అద్భుత కవన గరిమకు
పతాకగా నిలిచి పొమ్మంటూ
అక్షరయజ్ఞానికి ఆద్యునిగా
లక్షల కవన సమిధలనర్పించిన సోమయాజిగా
సాహితీ పయనంలో
అలుపెరుగని
బాటసారిగా
అందరి హృదయాల్లో
నిలిచిన అజాత శత్రువయ్యాడు
ఇది వీరా గుడిపల్లి కవిత
20/05/2020
శీర్షిక ః అతను మేక రవీంద్ర
**********************
ఎక్కడ ఓ పూవు వికసించినా
అక్షర పరిమళం మనసున పరుచుకున్నా
ఆ వనం తనదేనని ప్రకటించగలడు
ఆరువేల
కవన సైన్యానికి అప్రకటిత రారాజు తాను
అక్షరాలను శ్వాసించేవాళ్ళు
ఆలంబనకై చూస్తున్న రోజుల్లో
ఆశల్ని నాటి
ఒంటరిగా వనాలను నాటిన మాలి మరి
నమ్మలేని నిజాలెన్నింటికో
నమ్మకమైన సాక్ష్యం అతను
కవిమిత్ర నుండి పద్యశ్రీ వరకు ఎన్ని మజిలీలో
అంతర్జాల సమూహాలను
అక్షరాలతో స్నేహింపజేసిన అభినవ తెలుగు భోజుడు
పురస్కారాలకు కొత్త భాష్యం చెప్పి
అక్షర ప్రేమికులకు అందమైన మార్గాలను వేసిన మార్గదర్శి.
సాహిత్య పుర వీధుల్లో అడుగడుగునా కనిపించే కటౌట్....
అందరి హృదయాలలో చెదరని చిత్రం...
పిలవాలను కుంటే పలకాలనుకుంటే
మేక రవీంద్ర అతని పేరు
**********వీరా గుడిపల్లి******
4.
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:30-5-2020
అంశం:మేక రవీంద్ర
ప్రక్రియ: వచనకవిత
శీర్షిక: *సాహిత్య ఇంజనీర్*
**************************
ఆయనొక *అక్షరాల ప్రేమికుడు*
కవులకు *ప్రేరేపకుడు*
నిత్య *స్వాప్నికుడు*
*ప్రతిభాన్వేషకుడు*
నిరంతర *సాహిత్య సేవకుడు*
కవిపక్షాన నిలిచి
కవిలోకానికే *రవి* అయ్యాడు
నమ్మకం కలిగించి,ప్రోత్సాహాన్నిచ్చి
వేదికలనిచ్చి,సంఘటిత పరిచి,
*సాహిత్య ఇంజనీరై* ఆవిర్భవించాడు
*తెలుగు కవితా వైభవాన్ని* ఏర్పరచాడు
*అయుత,ప్రయుత కవితాయజ్ఞాలు* నిర్వహించి
*సహస్రకవులను* సమాయత్తపరచాడు
వాట్సాపే తన చిరునామై
నిత్యసాహిత్య వ్యవసాయం చేసాడు
ఊరూరూ తిరుగుతూ,ప్రతిభకు
పట్టం గట్టాడు
రచనలు చేయించి,బిరుదులనిచ్చి
స్ఫూర్తినింపి,అండదండై నిలిచాడు
అవకాశాలు కల్పించి, ఆలోచనలు రేకెత్తెంచి
*దిక్సూచై* మార్గం చూపించాడు
నిరాడంబరత,నిస్వార్థత
నిజమైన కార్యశీలతలతో
వృత్తిని,ప్రవృత్తిని సార్థకం చేసుకున్న రవీంద్రుడు
*సాహిత్య ఇంజనీరే*
5.
[30/05, 8:04 PM] అనుముల తేజస్విని Poetess: కవుల వేదిక
అంశం:మేకా రవీంద్ర గారిపై కవిత
శీర్షిక:అలుపెరుగని బాటసారి
లక్ష్మణ్ రావు, అంజనీ దేవి
గర్భమ్మున జనియించిన,
తెలంగాణ కవితా పితామహ,
సాంకేతిక విద్యలో రాణించి
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ
ప్రవృత్తి ధర్మoలో సాహిత్యానికి వెలుగు తెచ్చిన సూరీడు
వాసిరెడ్డి నవలలు,
శ్రీ శ్రీ కవితలు,
పోతన భాగవతాలు ,
చలం సాహిత్యం ఇలా
ఎన్నో చదివి
తెలుగుకి వెలుగు తెచ్చిన వ్యక్తి
తెలంగాణ ఆంధ్రభోజుడు
మేలిమి ఆణిముత్యం మేకా రవీంద్ర గారు...
కొత్త కవులకు భవిష్యత్ని చూపి
సహస్ర కవుల సమూహాన్ని నిర్వహించిన ధీశాలి
వారి చేత తెలుగుతల్లి ఖ్యాతి గడిచింది
అలుపెరుగని బాటసారి
తెలుగు సాహిత్య నవకవన దారులకు తానే ఒక రహదారి అయి,
సహస్ర కవి మిత్ర,
సహస్ర పద్యశ్రీ,
సహస్ర గానకోకిల,
సహస్ర దృశ్యకవి చక్రవర్తి
బిరుదులతో కవులను సత్కరించారు
మేకా రవీంద్ర గారు
తెలుగు భాషామతల్లికి ముద్దుబిడ్డ
అక్షరనీరాజనం చేసిన వ్యక్తి
ఎందరో కవిశిఖామణులు
వీరి ప్రోత్సాహంతో వచ్చినవారు
వీరితో సాహితీ బంధాలను ఏర్పర్చుకున్నవారు
కవిత్వాన్ని విస్తరించి
సాహిత్యాన్ని సజీవం చేసిన
మన మేకా రవీంద్ర గారికి
నేడు నా తేజస్సుమాక్షరాంజలులు.........
ధన్యోస్మి🙏
అనుముల తేజస్విని
6.
తేదీ:30/5/2020
నర్సంపేట.
[30/05, 8:04 PM] Vakiti Ramreddy Poet: *** వేడుకోలు ***
పల్లవి : వీడుకోలు వీడుకోలు వీడుకోలు
విడిపోకూడదని వే డుకోలు
1 మేరునగ ధీరుడు మేక రవీంద్రుడు
సాహిత్యసేవలో కమ్మని కవీంద్రుడు
ఉద్యోగ దర్మం లో ఉత్తమ సేవకుఁడు
వికసించే పువ్వోలే నవ్వుల బావకుడు
2 అరవైఏండ్ల వయసులో అలసిన నీ పెదవులు
అలుపెరుగని సేవలో నిలిచిన నీ కరములు
పలువురి మేలుకొరి ప్రశంశలు అందుకుని
పరిపుర్ణ తృప్తితో పసందైన వీడుకోలు
3 తెలుగుతల్లీ సేవలో కొలువైన కవివర్య
అందమైన కవితలతో గడిపావు దినచర్య
నిలువెత్తు సేవలతొ నిగర్విగా నిలిచావు
కవులకు కాంతినింప వెలుగెత్తి చాటావు
4 తల్లిదండ్రులే దైవమని తనువెల్ల కొలిచిండు
నిజాయితీ సేవలో నిలువుటద్ద మయ్యిండు
కవిత్వమే ఊపిరిని కవులే నా ప్రాణమని
సహస్ర కీర్తి పుస్తకమయి వెలిగిండు
5 ఎదిగినకొద్ది తను ఒదిగేటి లక్షణం
ఉత్తమ కవులతోటి నేర్చుకున్న శిక్షణం
అక్షర చైతన్యమై అందరికీ చేరువై
అంతర్జాల కవి సమ్మోహనుడైయ్యిడు
6 అందుకో గురువర్యా వందనాలు
కవుల వేదిక కవన చందనాలు
వందేళ్లు వర్థిల్లు రవీంద్రుడా
కొత్త కవుల మరవలేని కవీంద్రుడా
రచన : వాకిటి రామ్ రెడ్డి ,కవిగాయకుడు
ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి
చరవాణి ,9000702093
🙏💐💐💐🌹💐💐💐🙏
[30/05, 8:07 PM] Vakiti Ramreddy Poet: *** వేడుకోలు ***
పల్లవి : వీడుకోలు వీడుకోలు వీడుకోలు
విడిపోకూడదని వే డుకోలు
1 మేరునగ ధీరుడు మేక రవీంద్రుడు
సాహిత్యసేవలో కమ్మని కవీంద్రుడు
ఉద్యోగ దర్మం లో ఉత్తమ సేవకుఁడు
వికసించే పువ్వోలే నవ్వుల బావకుడు
2 అరవైఏండ్ల వయసులో అలసిన నీ పెదవులు
అలుపెరుగని సేవలో నిలిచిన నీ కరములు
పలువురి మేలుకొరి ప్రశంశలు అందుకుని
పరిపుర్ణ తృప్తితో పసందైన వీడుకోలు
3 తెలుగుతల్లీ సేవలో కొలువైన కవివర్య
అందమైన కవితలతో గడిపావు దినచర్య
నిలువెత్తు సేవలతొ నిగర్విగా నిలిచావు
కవులకు కాంతినింప వెలుగెత్తి చాటావు
4 తల్లిదండ్రులే దైవమని తనువెల్ల కొలిచిండు
నిజాయితీ సేవలో నిలువుటద్ద మయ్యిండు
కవిత్వమే ఊపిరిని కవులే నా ప్రాణమని
సహస్ర కీర్తి పుస్తకమయి వెలిగిండు
5 ఎదిగినకొద్ది తను ఒదిగేటి లక్షణం
ఉత్తమ కవులతోటి నేర్చుకున్న శిక్షణం
అక్షర చైతన్యమై అందరికీ చేరువై
అంతర్జాల కవి సమ్మోహనుడైయ్యిడు
6 అందుకో గురువర్యా వందనాలు
కవుల వేదిక కవన చందనాలు
వందేళ్లు వర్థిల్లు రవీంద్రుడా
కొత్త కవుల మరవలేని కవీంద్రుడా
రచన : వాకిటి రామ్ రెడ్డి ,కవిగాయకుడు
ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ
పులిగిల్ల ,వలిగొండ ,యదాద్రి భువనగిరి
చరవాణి ,9000702093
7
🙏💐💐💐🌹💐💐💐🙏
[30/05, 8:21 PM] Tulasi Venkata Ramana: కవుల వేదిక:
పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
కలం పేరు: మానస.
అంశం: మేక రవీంద్ర గారు.
శీర్షిక: సాహితి ధ్రువతార
ఆయన ఒక సాహసకుడు
అలుపెరగని సాహితి కెరటం....
సాహిత్య పూదోట లో
కలం పట్టని యోధుడు...
ఎన్నో కలాలకు చేయూతనిచ్చిన
చైతన్య మూర్తి....
తెలుగు భాషంటే మక్కువ ఎక్కువ...
చేసే వృత్తికి ...ఈ కవిత్వం వికృతే ...అయినా..
మదిలో వెలసిన అక్షర రూపం కి ప్రాణంపోసి...
పదాల అల్లికలతో ప్రకృతి అందాలను ఓలలాడించిన అక్షర ప్రేమికుడు...
సాహితి పిపాసి...
చుక్కల్లో చంద్రుడు....
చిద్విలాస మూర్తి....
నిత్య కృషి వలుడు.....
యువ రక్తానికి ....ఊపిరి
విభిన్న ప్రక్రీయల సృష్టి కర్త
నిత్య అక్షర తేజోమయుడు
సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం...
సహస్ర కవులకు ప్రేరకుడు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
నలుదిశలా వ్యాపింపజేసి...
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు...
ఎందరికో చేయుతనిచ్చిన ధన్యమూర్తి.
నిత్య వెలుగొందే దివ్యతార
సాహితి లోకానికి పెన్నిధి
మాకు వారధి ...మా హితుడు మా మార్గదర్శి ..
మా గురువర్యులు "మేక రవీంద్ర"గారు ఓ ధ్రువతార.
వారి పదవికే విరమణ...
పెదవికి లేదు విరమణ....
నిత్య సాహితి కృషి వలుడా ...
మీకివే పదవీ విరమణ శుభాకాంక్షలు...
మేక రవీంద్ర గారికి ఇవ్వే మా అక్షర నీరాజనాలు💐💐🙏
8
***
[30/05, 8:28 PM] Pinnaka Nageshwar Rao: కవుల వేదిక. 30--5--2020.
9
నేటి అంశము :-- శ్రీ మేక రవీంద్ర.
1. ఉ.
ఉన్నత స్థానమున్ పదవి యున్నను ,
మక్కువ మాతృభాషపై
మిన్నగ కల్గియుండి కవిమిత్రుల పేర్లను
సేకరించి తాఁ
మన్నన గొన్న "వాట్సప" ను మాధ్యమ
మందు రవీంద్ర చేర్చియున్
చెన్నుగ తెల్గుభాషకై కృషిని చేయుడటంచు
ప్రోత్సహించెగా!
2. తే.గీ.
తెలుగు కవిత వైభవములు తేజరిల్ల
అయుత కవితల యజ్ఞమారంభ మందు
మద్దతివ్వగ "వాట్సప్పు" మాధ్యమముగ
లక్ష్యముగ పదివేలు నిర్ణయము చేసి....
3. తే.గీ.
నాడు చేరిన కవులను వేడగాను
కవిత సమిథలు వత్సర కాలమంత
పంప యజ్ఞమ్ము తుదకు సఫలత నొంద
సారథి యగు మేక రవీంద్ర శ్రమకు సాక్షి.
4. తే.గీ.
అయుత - ప్రయుతగా మరు వత్సరాన
మారె
లక్ష్యముగ నిర్ణయించగ లక్ష కవిత
లవియు నవలీలగా వ్రాసి కవులు తాము
తిరుగులేదు మాకనుచుఁ దెలియ జెప్పె.
5. తే.గీ.
ప్రయుతయున్ మారెనుగ సత్ర క్రతువుగాను
కడచినట్టి యీ వత్సర కాలమందు
కవుల సంఖ్యయు పెరుగగ కవితలెన్నొ
యలర జేసెను మిత్రులు హర్షమొంద.
6. తే.గీ.
నూతన సహస్ర వాణిన్ వినూత్న రీతి
వీనులకు విందు గొల్పెడు వివిధములగు
శ్లోకముల్,పద్య,కవితలు, సూక్తులెన్నొ
శ్రుతి లయలు తప్పకుండగ ప్రతిభ జూపి
గాన మాధుర్య మొలికించ గళములందు
పరవశత్వాన మేనును మరచినాము.
7. తే.గీ.
మేక వంశమునందు జన్మించినారు
సాధు వర్తనుడు, నిగర్వి,సహనశీలి
పదవి విరమణ చేయు శుభ సమయమున
వీడుకోలు పలుకుచు రవీంద్ర మీకు
నందజేతు శుభాకాంక్ష లార్య! గొనుడు!!
***********************************
9
[30/05, 8:36 PM] Vineelamma: కవులవేదిక
పేరు: విజయదుర్గ
కవితా అంశం : ఆత్మీయ నడక
కవితా సంఖ్య: 31
తేదీ: 30/05/20
కవిలోకంలో మెరిసిన
ధృవతార
సాహిత్య పరిచయం లేకున్న
కవుల ను ఆదరించే ఆత్మగౌరవం....!!
ఎల్లలు లేని ఓర్పు ఓపికలతో
చిరునవ్వు వెన్నెలలతో
ఆత్మీయతా రాగాలను పలికిస్తూ
కవుల సాగరాన్ని సృష్టించిన
మహాభోజుడు....!!
కవులకు వేదికగ నిలచి
మానవతా ద్వారాలు తెరచి
ఎన్నో ప్రక్రియ లలో అడుగేస్తూ
ఒక్కతాటి పై నడపించే రథసారథి....!!
ఇలలో మెరిసిన ఆణిముత్యం
అలవని సాహిత్య నదీ తరంగణి
పరోపకారమే పరమావధిగ
మెరిసే వజ్రమాణిక్యం....!!
విశ్రాంతి సమయం కావాలి
మీ జన్మ సార్థకత
రవి కిరణమై కావాలి
ఎందరో కవులకు మూలాధారమై
అందరి హృదయాల నిలచి
విరబూయాలి చిరకాలం....!!
🌹వినీల🌹
10.
[30/05, 8:38 PM] Balloori Umadevi Poetess: కవుల వేదిక
డాక్టర్ బల్లూరి ఉమాదేవి
అలుపెరుగని సూర్యుడు రవీంద్ర
డా.బల్లూరి ఉమాదేవి
అలుపెరగని సూరీడు వలె
సాహితీ సేవలో నిమగ్నమైన
సాహితిపిపాసి
వందనం శుభాభివందనం
చెరగని చిరునవ్వు తన స్వంతం
మితభాషిత్వం సహజగుణం
ప్రశంసలకు పొగడ్తలకు ఆమడదూరం
అయుత ప్రయుత యజ్ఞాల పేరిట
తెలుగు వారికి ఒక వాట్సప్ వేదిక కల్పించి సహస్ర కవి సమ్మేళనాన్ని ఆరంభించిన వైతాళికుడు
దృశ్య కవిసమ్మేళనం రూపశిల్పి
ప్రపంచంలో నలుమూలల ఉన్న కవుల గళాలను జగతికి పరిచయం చేసిన ధీశాలి
చదువులమ్మ సన్నిధిలో కవి సమ్మేళనం కవులకు బిరుదులొసంగి సత్కారాలు
చేసిన కవి పోషకుడు
వృత్తి ప్రవృత్తులు వేరైనా తెలుగు భాషపై
మక్కువతో తెలుగు కవులను ప్రోత్సహిస్తూ కవి రత్న, కవి మిత్ర,
కవి భూషణ , సహస్ర పద్య శ్రీ ,కవి చక్రవర్తి
బిరుదులిచ్చిసత్కరించిన కవి పోషకుడు
నాటి రాయల ఆస్థానంలో అష్టదిగ్గజకవులే ఉంటే అపర కృష్ణరాయల ఆస్థానంలో
ఆరువేలకు పైగా కవులున్నారు
కథలు కవితలు ఎన్నో ప్రక్రియలు
అంతర్జాల కవి దిగ్గజాలకు దారి
దివ్వెఅయ్యాడు
కవన యజ్ఞం చేయించాడు
యజ్ఞకర్త గా మారాడు
పుస్తకాలను ముద్రించాడు
సభలను చేసి సన్మానించి పంచాడు
దృశ్య శ్రవణ మాధ్యమాలను
సామాన్యులకు పరిచయం చేశాడు
నవయుగ కవి కులభూషణుడయ్యాడు
రెండు రాష్ట్రాల కవులకు చక్కని వేదిక
నొసగి వారి కలాల కు బలం
ఇచ్చినమహామనీషీ రవీంద్ర గారికి
వందనం శుభాభివందనం
శ్రీ మేక రవీంద్ర గారుఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. సాహితీ సేవలో నిమగ్నం అయిన వీరి జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను .పదవి విరమణ శుభాకాంక్షల తో
డాక్టర్ బల్లూరి ఉమాదేవి.
డల్లాస్ అమెరికా
11
[30/05, 8:43 PM] Sheeloju Shobhan babu: ఆట వెలది
మేకవంశ ధీర మేకరవింద్ర యు
ఇంజనీరువృత్తి యేనుచేసి
వారువృత్తినుండి వైదొలుచున్నారు
సాటిలేరువార్కి జగతి నందు
శీలోజు శోభన్ బాబు
నందపురం
12
[30/05, 8:55 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** సాహితీ కెరటం ***
✍️డా.పాండాల.
ఆయనొక సాహస సాహితి కెరటం
అలుపెరగని కవన యోధుడు
పెక్కు కలగళాలకు ప్రేరణపంచిన
చైతన్య శీలి...!
మాతృభాషలో ఎక్కువగా కవితా సేద్యం చేసిన కళా పిపాసి...!
మనసులో మెరిసిన భావాలకు రమ్యంగా ప్రాణంపోసి...
పద పొందికలో
ప్రకృతి అందాలను మేళవించి
చదువరుల హృదయాలను
ఊహల ఊయలలో ఓలలాడించిన అక్షర శిల్పి...!
నిత్య కృషీవలుడు..!
యువ తరానికి ఊతంనేర్పి
పలు ప్రక్రియలకు పాదులుతీసిన
సత్య తేజోమయుడు..!
సనాతన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం...!
సహస్ర కవులకు ప్రేరకుడు
సాంకేతిక పరిజ్ఞానంలో
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు
శ్రీకారం చుట్టిన ఆదిత్యుడే మన రవీంద్రుడు...!
సాహితి లోకానికి
పెన్నిధిగా,
మార్గదర్శిగా,
మేక రవీంద్రుడు ఓ ధ్రువతార..!
వారి పదవికే
విరమణ కానీ
పదాలకు
పెదాలకు లేదు విరమణ
నిత్య సాహితి కృషీవలునికి
నీరాజన వందన మందారాలు...!
🙏☘️🌺❇️👋🙏
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
13
[30/05, 9:15 PM] Murthy Sreedevi Poetess: మూర్తి శ్రీదేవి
కలం పేరు “గురుసౌభాగ్య”
అంశం: మేక రవీంద్ర గారు
శీర్షిక : కళాపిపాసి
తేది : 30-5-2020
*. *. *. *. *. *. *
వారికి వారే సాటి
వారికి లేరు పోటీ
అభినవభోజుడు
“హైదరాబాదు రవీంద్రుడు”
"చెన్నకేశవ" వంశ తిలకుడై
"అంజనీదేవి" నోము భాగ్యమై
"లక్ష్మణరావు" వరపుత్రుడై
సంకల్ప భగీరథుడై సాగే కెరటం
అయుత, ప్రయుత కవితాయజ్నాలు
నిర్వహించిన సాహిత్య యుగంధరుడు
వాట్సాప్ వేదికగా వర్థమాన కవులను
సమాయత్తపరిచిన సమరాంగణుడు
సహస్రసమూహ సృష్టికర్తయై
సహస్ర బిరుదుల ప్రదాతగా నిలిచిన
తెలుగుతల్లి ముద్దు బిడ్దడు
సహకార సౌశీల్యుడై ఎందరో
మనసుల్లో కొలువైన ఇంద్రుడు
నవ, యువ కవుల ప్రతిభకు
రూపాన్నిచ్చి విశ్వాసానికి ఆజ్యం
పోసిన నిరాడంబర సాగరుడు
సౌహార్ధ పయోనిధుడై స్నేహానికి
శాశ్వత చిరునామా ఏర్పరిచిన
మూర్తీమత్వ సత్యసంధుడు
వాట్సాప్ సాహితీ పితామహుడై
కలం పట్టని కవికులరాజు
ఆన్ లైన్ శిక్షకుడై అలుపెరుగని
కృషీవలుడైన రవీంద్రుడు
వృత్తికి విరమణ వచ్చినా
ప్రవృత్తికి విరామం ఇవ్వబోని
కళాపిపాసి...
సమకాలానికి స్ఫూర్తియై
భావితరానికి ఆదర్శమై
తెలుగునేలకు అజరాజరమై
వెలిగే అక్షర ధ్రువతార...
*మేక రవీంద్ర* గారు
14
[30/05, 9:29 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవుల వేదిక
తేది 30-5-2020
అంశం *రవీంద్రుడు*
పేరు చివుకుల శ్రీలక్ష్మి
కవితా శీర్షిక.
*స్ఫూర్తి ప్రదాత*
నింగిలో సహస్ర కిరణాలతో
వెలిగే సూర్యుడు!
భువిలో సహస్ర వేదికలలో
సహస్ర కవులతో వెలిగే రవీంద్రుడు!
ఎలా పరిచయం? చూసిందెప్పుడు?
*సహస్ర వేదికలో*
వేలాది మంది సాహితీవేత్తలకు
ప్రియమైన వేదికలో
రవీంద్రుని పేరు విన్న పరిచయం
కథలూ, వ్యాసాలూ, పద్యాలూ,
కవితలూ, దృశ్య కవితలూ
పాటలూ, మాటలూ, సూక్తులు
ఒకటా? రెండా? ఎన్నెన్ని సమూహాలు?
మన ప్రతిభా విశేషాల ప్రదర్శనకు
ఎన్నెన్ని వేదికలు!
పురస్కారాలు అందుకునేందుకు!
ఎన్నడైనా ఎరుగుదుమా?
అలనాడెన్నడో
నవరత్నాలతో హర్షుడు
అష్ట దిగ్గజాలతో రాయలవారు
ఈ సాంకేతిక యుగంలో
సహస్ర సహస్ర ప్రతిభకు బిరుదులను
*సరస్వతీ మాత*
*సన్నిధిలో*
ప్రసాదించే రవీంద్రుడు
అప్పుడే చూసాను
*తెలుగు తల్లి* *ఎన్నుకున్న*
*ఆ దివిజుని*
కేవల మర్త్యుడే!
తెలుగు భాష పట్ల అభిమానం
తెలుగు కవుల పట్ల మన్నన
నిర్వహణలో సామర్థ్యం
ఎదిగిన కవి ఒదుగుట చూసి
ఒక చిరునవ్వు
అహంకరించిన కవిని చూసి
రెండు చిరునవ్వులు
నొప్పింపక తానొవ్వక
బాధ్యతాయుతమైన వృత్తి
మనోరంజకమైన ప్రవృత్తి
ఏకకాలంలో నిర్వహిస్తూ
ఎందరికో
*స్ఫూర్తి ప్రదాత!*
పదవీ విరమణ సమయం
కవులందరిమది ఆనందమయం
తమతో గడిపే పూర్తి సమయం
ఈనాటికి వచ్చిందని!
ఆ చిన్న మెదడులో
వినూత్న ఆలోచనలు!
అరచేతిలో
ఆధునిక సాంకేతికత!
సమర్థతకు మారుపేరైన
రవీంద్రులవారికి
నా మనః పూర్వక
అభినందన
పరిమళ సుమాల మాల
సమర్పిస్తూ శ్రీలక్ష్మి
15
[30/05, 9:51 PM] Uma Devi MV: కవుల వేదిక
తేది -30-5-2020
అంశం -మేక రవీంద్ర గారు
శీర్షిక -
కవి మిత్రుడు
కవితలల్లే ఘనాపాటి
కవుల ప్రోత్సహించిన మేటి
మేక రవీంద్ర గారు
నిరాడంబర పంచవటి !
ఈ వాటిక ప్రియమైన కవుల
వేదిక
రస రమ్య భావనలు సృజియించు వాహిక!
తానే రచనలు చేయు
కవి విలువ తెలియజేయు
సహస్రాధిక కవుల వేదిక
నిర్మించిన మహాశయుడు !
వారికి కవుల నమస్సులు !
హార్దిక శుభ కామనలు !
నిరంతరం పదం పదం కలిపి
సమరసతతో అందించు
పుష్ప గుచ్ఛాలు !
******************
ఎం. వి. ఉమాదేవి
నెల్లూరు
16
[30/05, 9:56 PM] విజయ లక్ష్మి యాదాద్రి: శీర్షిక:.**మన *కవీంద్రుడు**
తనకోసం భక్తితో భగవంతుడికి
*గీతాంజలి*ని ఘటించిన
రవీంద్రుని గురించి విన్నాగానీ
సాహిత్యంకోసం రచయితలతోక్ట
సాహితీయజ్ఞాన్ని చేయిస్తున్న *కవీంద్రుణ్ణి* స్వయంగ చూసి తరిస్తున్నా
రవికిరణాలు సోకగనే కమలాలు
వికశించినటుల రవీంద్రుని ప్రోత్సాహoతో
కవుల కలాలు చురుకుగ కదలుచుండు
యువగళాలలో ఉత్తేజం నిండుచుండు
శ్రీకృష్ణదేవరాయల భువనవిజయంలో అష్టదిగ్గజాలే హాయిగ విరాజిల్లరి
రవీంద్రుని కవనసమూహంలో వేలమంది వర్ధమానకవులు ప్రసిద్ధులైరి
'భోజుడు' చంద్రగుప్తుల వంటివారు చక్రవర్థులైనందున కవుల పోషించిరి
*మేక రవీంద్రుడు*' మనసున్నమహారాజై
కవులనెన్నో విధాల ఉత్సాహపరిచెను
మన మార్గదర్శి ప్రశాంతంగ పలకరించు
ఈ ఇoజనియర్ మనకు 'నియర్'అనిపించు
ఈ సాహితీచక్రవర్తిని ప్రతికవి 'డియర్'గ భావించు
ఈ *రవి* కంటబడి వెలుగొందాలని ప్రతికవి తపించు.
:;*వల్లాల విజయలక్ష్మి**
ఆలేరు
17
[30/05, 9:57 PM] మర్రి జయశ్రీ: కవుల వేదిక
మర్రి జయశ్రీ
అంశం..మేక రవీంద్ర గారు
శీర్షిక...కవిపోషకులు
మేక వంశము పూదోటలో విరిసిన సాహితీ సమం
పూర్వీకుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని
సాహితీ సేవ చేస్తున్న సౌజన్యమూర్తి
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ
మాతృభాషపై మమకారంతో
తెలుగు భాషా వ్యాప్తికి నిరంతరం శ్రమిస్తున్న అక్షర ప్రేమికుడు
వాట్సాప్ సాహితీ బృందాలనేర్పరచి
ఎందరో సాహితీ మూర్తులను ప్రోత్సహించిన కవిపోషకులు
కవులకు సముచిత గౌరవాన్ని చ్చి
బిరుదుల నెన్నో ప్రధానం చేసిన
నవ్యాంధ్రభోజుడు
తెలుగు దీప్తిని నలుదిశలా ప్రసరింపజేస్తున్న అలుపెరగని సూర్యుడు
బృహత్తర కవితాయజ్ఞం నిర్వహిస్తున్న ప్రతిభాశాలి
చెరగని చిరునవ్వుతో
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ
యువ సాహితీవేత్తలకు ఉత్సాహాన్ని కలిగించే
కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ
సహస్ర కవుల మదిలో చెరగని ముద్రవేసిన రవీంద్రుడు
తెలుగు కవితావైభవ రథసారథి
కలం పట్టకపోయినా
కవుల ప్రతిభను గుర్తించిప్రేరణ నిచ్చిన సుగుణ శీలి
నిస్వార్థ సేవా రత్నం
సామాన్యంగా కనిపించే అసమాన్యుడు
సభ్యతా సంస్కారానికి చిరునామా
ఉత్తమ ఇంజరింగ్ అధికారి
వృత్రిలో విరమణ పొందుతున్న వేళ
వారికివే నా అక్షర నీరాజనాలు.
18
[30/05, 9:58 PM] సునంద ఉరిమిళ్ళ: కవుల వేదిక
తేదీ::30-05-2020
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
శీర్షిక:: భాషామ తల్లి సేవకులు
::::::::::::::::::::::::::::::::::::::::
నిస్వార్ధమే పరమార్థంగా
తెలుగు భాషామతల్లి కీర్తిని
ప్రపంచమంతా చాటేందుకు
వాట్సప్ వేదికగా
కవితా యజ్ఞం చేయించిన
ఆశయ సాధకుడు
అకుంఠిత దీక్షాపరుడు!
పెదవులపై చిరునవ్వు
మాటల్లో పొదుపరితనం
ఆహార్యం లో హుందాతనం
కవులను కళాకారులను
తయారు చేసిన సహృదయత
ఇదే వారి భావి జీవితానికి
వెలుగునిచ్చే వెన్నెల!
రవీంద్ర నామధేయంతో
కవులందరికీ ఆత్మీయులైన
రవీంద్ర గారికి
హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు!
వారికివే నా అక్షరాల సుమహారం!
19
[30/05, 10:06 PM] +91 98495 70514: కవుల వేదిక అంశం:మేక రవీంద్ర గారు తేది:30-5-2020 రచయిత:వెంకట్ బాలగోని. అతనొక సైన్యం.... అతనొక ధైర్యం..... అక్షరాల పయనం.... అధ్బుతాలే విజయం... అనంత కవితల ప్రధాత.... అలుపెరుగని ఆశయ విధాత... అందరికీ తెలిసిన ఆ రవి ఇంద్రుడు మరెన్నో మహోన్నత శికరగ్రాలను సృషించి సరస్వతీ పుత్రుడు గా నిలిచి పోవాలని కవికులం ఆకాంక్షిస్తూ........మీ వెంకట్ బాలగో ని.
20
మేక రవీంద్ర గారి ఉద్యోగ విరమణ సందర్భంగా
*ఇది వీరా గుడిపల్లి కవిత*
*రాసేద్దాం*
31/05/2020
ఓ నిష్కల్మషమైన హృదయానికి
ఓ సామూహిక పయనానికి
ఓ అసామాన్యమైన వ్యక్తిత్వానికి
ఎడారిలో వర్షాన్ని కలగన్న మనిషికి
సముద్రం లో మంచినీరు సాధించిన మనీషికి
ఇచ్చే అక్షర నైవేద్యం.
......
అమరకుల చెప్పినట్లు
తెలుగు భోజుడు
లలితా కృష్ణ అన్నట్లు
సాహితీ సేనాపతి
గోగులపాటి ఉటంకించినట్లు
ఓ యోగి
అవేరా గారు అన్నట్లు
అసాధ్యుడూ
రాజా వాసిరెడ్డి గారెపుడో చెప్పారు
అవకాశాల సృష్టి కర్త
కళాచందర్ కలగన్న
సాహితీ సోయగం
లింగన్న మాట లోని
సూటిదనం
దాసోజు నిబద్ధత
ఒకటని కాదు
అందరి సౌభాగ్యం
సకల కవుల సంతోషం
తన మార్గంగా
అడుగులు వేస్తున్న...
సాహితీ.... స్వరూపం
మేక రవీంద్ర......
*** *ఇది వీరా గుడిపల్లి మాట*
పోయేదేముంది.... రాసేద్దాం
మంచే కదా చేయమంటుంది
21
[31/05, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం*
★★★★★★★★★
తేది : 31/05/2020
సమయం : 8:00 PM
వారం : ఆదివారం
అంశం : *సహస్ర సమూహల సృష్టి కర్త అభినవ తెలుగు భోజుడు శ్రీ మేక రవీంద్రులు*
*తెలుగు భాష సేవకుడు*
తెలుగు భాషలో సాటిలేని
కవి మా మేక రవీంద్ర
తెలుగు సాహిత్యం
తన ఊపిరి
తెలుగులో పాండిత్యాన్ని
పట్టుకున్న అక్షర శిల్పి
నవ కవులకు ఆదర్శ
మూర్తి మా రవీంద్రులు
ఇంటి నుండి బడి
వరకు తెలుగు భాషను
గౌరవించిన తెలుగు
భాషాభిమాని మా రవీంద్ర
కవితను గరళం
చేసుకున్న నూతన
కవి పండితులు
నేటి తరానికి
మీ సేవా అద్భుతమైన
ఓ ప్రేరణ తెలుగు
సాహిత్యాన్ని ఆస్వాదించిన
సహస్ర కవి మిత్రుడు
మా మేక రవీంద్ర
ఇంద్ర ఇంద్ర లాగా
మీరు ఎప్పుడు
ఇంద్రధనస్సులా వెలగాలి
తెలుగు సాహిత్య తోటలో
మా నూతన కవులకు
ఆదర్శంగా ఉండాలి
చిరస్మరణీయంగా...
*ఇంద్రవత్ రాహుల్*
*మల్కాపూర్*
*నిజామాబాద్*
*9848054079*
22
[31/05, 8:00 PM] Veera: కవితా గానం సమూహం కోసం
అంశం ః మేక రవీంద్ర
సమన్వయం ః లలితా కృష్ణ
తేదీ ః 31/05/2020
******************
*ఇది వీరా గుడిపల్లి కవిత*
31/05/2020
*ఎవరతను*
**********
ఏమాశించి చేశాడు
సమాధానం లేదు
ఎవరూ తెలీదు
వెతుక్కున్నాడు
దండలేశాడు
షాల్స్ కప్పాడు
తెలుగు అక్షరాలు
చల్లినా, చదివి వినిపించినా
ఎందుకు చేశాడు
సమాధానం లేదు
పాదుల్ని పీకేయాలని చూశినా
పందిళ్ళు కూల్చాలని చూసినా
పెదవి విప్పిందే లేదు
ఓడిపోయిందీ లేదు
ఎందుకిలా
తనకూ తెలీదంటారు
ఒంటరి ప్రయాణమే
ఆరువేల సైన్యమున్నా
ఎడారి జాడలనే వెతుక్కుంటాడు
ఒయాసిస్సులను తవ్వడానికి
కన్నీటి చారలనే కనిపెడుతూ వెళతాడు
తుడిపేయడానికి.
అక్షరాలు ఎక్కడ కనపడతాయోననీ
అక్షర ప్రేమికులెక్కడున్నారని
నిరంతరం
కొత్త కలాల కోసం
కలాల జాడకోసం సాగే అన్వేషణలో
అడుగులేస్తున్న అక్షర ప్రేమికుడు
అక్షరాలను మోస్తున్న వారికోసం
వెల్తున్న అన్వేషి
ఎవరతనంటే.....
*మేక రవీంద్రంటారంతా*
........ *వీరా గుడిపల్లి*
23
[31/05, 8:00 PM] Ramaka: 🌷కవితా గానం🌷
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:31-5-2020
అంశం:(సహస్ర సమూహాల సృష్టికర్త,అభినవ తెలుగుభోజుడు శ్రీ మేక రవీంద్రులు)
శీర్షిక: *సహస్రకిరణుడు*
**************************
అతని చేతిచలవతో వాట్సాప్
అంతా కవులమయం అయ్యింది
*సహస్ర* మనే శబ్దం రాష్ట్రాల
సరిహద్దులు దాటి వ్యాపించింది
కవుల పుట్టినిల్లుగా మారి
సమూహాల సృష్టి మొదలయింది
*రవి* యే *కవి* యై ముందుండి
కవి,గాయక,పృచ్ఛక,లేఖక,
కథక,రచయితలతో
కల్పవృక్షమై,కామధేనువై
కవితాయజ్ఞాలెన్నో చేయించాడు
*సహస్రవాణై* *సహస్రదర్శినై*
*సహస్రపుస్తక యజ్ఞమై*
*కోటిగొంతుకల,కోటికలాల*
ఫలాలు సాకారమై ఆవిష్కృతమైంది
అద్భుతాలు సృష్టించింది
ఒక్కడు *సహస్రకిరణుడై*
సాహితీ సరస్వతి పదమంజీరమై
కచ్ఛపినాదాలు మ్రోగించాడు
శ్రీవాణి ఆశీర్వాదమై,రవీంద్రమైన
కవీంద్రుల కవనామృతాలు
సాహిత్యానికి జీవం పోసి
చిరంజీవమయ్యాయి
నిస్వార్థ,నిరాడంబర,
మౌనయోగై
కవనతపస్సును చేయించి
*తెలుగుకవితావైభవ* కేతనాన్ని ఎగరేసిన *మేక*
వంశోద్భవుడు
సార్థకనామధేయుడై విలసిల్లుతున్నాడు.
24
[31/05, 8:08 PM] Prasoona Sharma Madam: *కవితాగానం*
*నిర్వహణ :వీరాగుడిపల్లి గారు*
💐💐💐💐💐💐💐💐
అంశం:: నిరాడంబరమూర్తి
(శ్రీమేక రవీంద్ర గారు)
*
గందరగోళపు గగనాన
చటుక్కున మెరిసిందో
మెరుపు
నిద్రాణతను చెరిపి
చైతన్య గీతికయై
మేలుకొలిపింది
ఆచైతన్యానికి మరోపేరే
*మేక రవీంద్రులు*
*పూవు పుట్టగానే పరిమళించిన* చందాన
బాల్యం నుండే బహు గ్రంథపఠనాభిలాషతో
సాహితీ పూదోటకు
తోటమాలి అయ్యారు
వృత్తి నిర్వహణలో అజేయులై
సాహిత్యమనే ప్రవృత్తి లో
ఎదురులేని మనిషిగా
విధాతను తలపిస్తూ
నూతన సృష్టికి శ్రీకారం
చుట్టారు.
అవే వాట్సాప్ సమూహాలు.
*ఇంతింతై వటుడింతై*
అన్నట్లు ఒక్కరితో మొదలై
వేలమంది కవులతో
నేడు ప్రభంజనమైనది.
అక్షర సేద్యం లో హాలికులై
కవన సామ్రాజ్య పాలకులై
కవులకు గాయకులకు బాసటయై
తెలంగాణా తల్లిమెడలో
సుమమాలికలై
నిస్వార్థ నిరాడంబరమూర్తులై
వెలుగొందు శారదాస్వరూపులై
సూర్యచంద్ర తేజో విరాజితులైన
తెలుగు భోజులకు నా అక్షరసుమాలమాల
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జ్ఞానప్రసూనా శర్మ. ఎల్లికంటి
కడ్తాల-- రంగారెడ్డి జిల్లా
25
[31/05, 8:09 PM] Swarna Samatha Poetess: **కవిత గానం **
**31/05/2020**
🌅 **సాహితి బ్రహ్మ **🌅
సాహిత్యానికి రథసారధులు
అనితరసాధ్యం వీరి సాహితి సేద్యం
అమోఘం-అద్వితీయం
అయిదువేలకు పైగా కవులను తీర్చిదిద్దిన ఘనత వీరిదే
నిరంతర అక్షర పోరాటయోధులు
ప్రతికవి కలానికి శ్రీకారమూర్తులు
భువిపై మెరిసి నిలిచిన రవి
**న భూతొ న భవిష్యత్ **
అన్నట్టు
**కవుల కర్మాగారం
అక్షర బాండాగారము **
అక్షరానికి వెలుగును -జిలుగును
సృష్టించిన సహస్రకవి సృష్టికర్త సాహితి ప్రస్థానంలో
అలుపెరుగని బాటసారి
పుస్తకపఠనంతో --,కఠోరశ్రమతో సాహితి పరిమళాల
కవనవనానికి ఆద్యుడు అయ్యాడు
వారి ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించి సాహిత్యాన్ని పోషించారు
అయిదువేల కవనసైన్యానికి
అత్యుత్తమ గురువై
సాహితి తరువై
దశదిశలా ఖ్యాతిని విస్తటింపచేసుకున్న
ఏకైక తెలంగాణ కవితా పితామహులు
వాట్సాప్ సాహితి సమూహాల ఆరంభకులు
మరువలేము వీరి కృషి
సాహితి సేవలో మహర్షి .
**మేక రవీంద్ర గారి పదవివిరమణ సందర్బంగా నా చిరు ప్రయత్నం ,వారికీ అక్షర నీరాజనము **
**స్వర్ణసమత**
**నిజామాబాదు **
9963130856
26
[31/05, 8:13 PM] అంబటి Bhanu Prakash: 🌷✒️
కవితా గానం.
మేకరవీంద్ర.
✒️
చేయునుద్యోగమొకటిగ చేసిచూప
దలచె మక్కువ చేతనే తెలుగుకవుల
నొక్కదరిజేర్చిన ఘనుడు నొక్కడితడె
మేకరవి యింద్రుడె గాదె మేదినిపయి!!
దిక్కు దిక్కుల నున్నట్టితెలుగుకవుల
నొక్కదగ్గరజేర్చినునోర్పు
చేత
మార్పు! కలిగించెతెలుగునమాన్యుడయ్యి
ఆంధ్రభోజుడైనిలిచెను నవనిపైన!!
✒️అంబటి భాను ప్రకాశ్
27
31 May 2020
13:23
ఏ లక్ష్యాన్నైనా ఛేదించే శక్తి
మనిషిలో దాగి ఉంటుంది
మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే
లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చే వారవుతారు
అనుకున్నది సాధిస్తే ఇతరులకు మార్గదర్శకులవుతారు
దీనికి నిలువెత్తు నిదర్శనం
మన కవన తాపసి
సాహిత్య పిపాసి
సాహితీసేనాపతి
అభినవ తెలుగుభోజుడు
సహస్ర సమూహాల సృష్టి కర్త
గురువర్యులు మేకా రవీంద్ర గారు
పెద్దలు చెప్పినట్టు
పదవికే విరమణ గాని
మనసుకు భావాలకు
కలానికి కవనానికి లేదు విరమణ
నిత్యం సాహిత్య యజ్ఞం చేస్తూ
నిరంతర నిస్వార్థ సాహతీ సేవకై
సాహిత్యలోకానికి పూర్తి సమయమిస్తూ
తమ జీవితంలో మరొక నూతన అధ్యయాన్ని ప్రారంభించి
మరెందరో నవ్య కవులకు
మార్గదర్శనం చేయబోతున్న
సరస్వతీ ప్రియపుత్రుడు
గురువర్యులు
మేకా రవీంద్ర గారికి
వందన చందనాలు
అభినందన మందారాలు
అక్షర సుమాంజలులు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐💐💐💐💐💐💐💐💐
-------- పోలా కిషోర్ కుమార్
న్యూ బోయిన్పల్లి
సికిందరాబాద్
28
[31/05, 8:24 PM] Kalva Rajaiah: పేరు కాల్వ రాజయ్య
ఊరు బస్వాపూర్
జిల్లా సిద్ధిపేట
శీర్షిక :అంతర్జాల కవి
జయహో జయహో మేక రవీంద్ర గారికి జయహో
ఆధునిక కాలపు సాహిత్యానికి
అత్యాధునిక సాంకేతికతన మర్చి
కొత్త హంగులతో కవనాన్ని
కొంగొత్త రూపురేఖలను తీర్చి దిద్దిన మన
మేక రవీంద్ర గారికి జయహో.
వాట్సాప్ వేదిక నేర్పాటు చేసి
మరుగున పడిన కవులెందరినో ప్రోత్సహించి
నూతన కవులను నిత్య నూతనంగా తీర్చి దిద్ది
ఆన్లైన్ కవిసమ్మేళన మేర్పాటు జేసి
కవులందరిని ఆశ్చర్యచికితులను చేసి
ఆనంద పరిచిన మీకు జయహో జయహో.
నాడు సాహిత్యాన్ని స్వర్ణయుగంగా తీర్చి దిద్దిన వారు ఆంధ్రభోజుడుడని చదివాము.
కాని ఇపుడు ఏ స్వార్థం లేకుండా
ఎందరో కవులకు బిరుదుములిచ్చి, సత్కారములందించి సాహిత్యాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన నేటి
శ్రీకృష్ణదేవరాయలను మేము చూస్తున్నాము వారికిదే మావందనం.
జయహో రవీంద్ర గారికి జయహో జయహో
మీ వృత్తి ధర్మాన్ని ఉరకలేయనుంచి
ప్రవృత్తిగా కవనాన్ని పరుగులు పెట్టించి
పదిమందికి మార్గదర్శకులయ్యారు.
మరెందరో నూతన కవులకు మార్గము చూపిస్తారని కోరుకుంటూ
మీకివే పదవి విరమణ శుభాకాంక్షలు.
జయహో రవీంద్ర గారికి జయహో జయహో
29
Sharma Poetess: కవితా గానం
అంశం: తెలుగు కవితా వైభవం
సృష్టి కర్త శ్రీ మేకా రవీంద్ర గారికి
అక్షర సుమాంజలి
వై.కె.సంధ్యశర్మ
చిత్తూరు
*శీర్షిక : అక్షర కుసుమాంజలి*
తెలుగు వెలుగు కు నిలువెత్తు నిర్వచనం
మాతృభాషా మమకారం
మమత గల మనస్సు భావి తరాలను
కవన దీపికలుగా మలచే
సహస్ర రవికిరణం...
కొమ్మకు కొమ్మకు పూచే పువ్వులన్నీ
ఏర్చి కూర్చి సౌగంధికా పరిమళాల సొబగులద్ది
సహస్ర కవి మిత్ర సౌరభాలను
వెదజల్లిన సాహితీ ప్రియులు
రాగాల జతులన్నీ
స్వరాల వాణుల సంధాత్రులుగా
నిత్య గానామృతాలు
వినిపించే సహస్ర కోకిలల
ఝరులకు పట్టం కట్టిన
కవన కోవిదులు...
మరుగైన మధురానుభూతిని
మనో మందిరంలో నిక్షిప్తం చేసే
లేఖా సాహిత్యానికై కలం కదిలింపజేసి
సహస్ర లేఖల చిత్తురువుల రూప శిల్పి
సినారే కవితాసంపుటులతో
ప్రతి కవి హృదయంలో సుస్థిరమై
అటల్ బిహారీవాజ్ పేయి
సంకలనంలో అక్షర నీరాజనాలు
అర్పించే ఆరాధకుడై
వినూత్న అంతర్జాల విహంగంలో
విశేష సాహితీ ప్రజ్ఞా పాటవాలను
నిత్య నూతనంగా పరిచయ వేదికలా
విస్తరింపచేసిన శ్రీ మేకా రవీంద్రుల గారికి
అక్షర కుసుమాంజలి!
30
[31/05, 8:31 PM] Rama Kulakarni Hyderabad Poet: On duty ever
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
31
[31/05, 8:48 PM] సునంద ఉరిమిళ్ళ: కవితా గానం
తేదీ::31-05-2020
పేరు::వురిమళ్ల సునంద:ఖమ్మం
అంశం;: సాహితీ రథ సారథి
:::::::::::::::::::::::::::::::::
ఉగ్గు పాలతో నేర్చుకున్న అమ్మభాషకు
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అయిన తెలుగు భాషకు
సేవ చేయాలనే సంకల్పం తో
వాట్సప్ ను వేదికగా శ్రీకారం చుట్టిన
భాషామ తల్లి ముద్దు బిడ్డ మేక రవీంద్ర గారు!
రవి కిరణమై
కవుల కలాలను,గళాలను చైతన్య పరచి
ఇంతింతై వటుడింతై అన్న చందంగా
నాటి మేటి కవులకు దీటుగా
నేటి కవులను కళాకారులకు రచయితలకు
చేయూత నిచ్చిన సాహిత్య పోషకుడు!
కవిమిత్ర సహస్రకవి, లేఖాసాసహిత్యం
కవిగాయక సమూహం
వివిధ ప్రక్రియల రూపమెత్తి
గ్రూపుల్లో వారి ప్రతిభకు పట్టం కట్టిన
సాహితీ కవి సార్వభౌముడు రవీంద్ర గారు!
వృత్తి వేరైనా ప్రవృత్తి ఎప్పుడూ
సేవా భావనే
మరుగున పడుతుందని
భయపడుతున్న తెలుగు
తల్లి కన్నీరు తుడిచి
నేనున్నానంటూ తెలుగు భాష కీర్తిని ఖండాంతరాలు చాటిన
సాహిత్య రథ సారథి !
తెలుగు భాష పరిరక్షణ భుజాలపై
వేసుకుని సాగుతున్న
అలుపెరుగని బాటసారి!
మేక రవీంద్ర గారు!
మీ ఆచరణ నిరంతరం కొనసాగుతూనే ఉండాలని
మీ ఆశయం సహస్ర దళ పుష్పమై
పరిమళాలు వెదజల్లుతూ ఉండాలని!
మీ భావి జీవితం సాహిత్య సుందరనందన వనంగా విరబూయాలనీ
ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..
సమర్పించుకున్న ఈ కవితా సుమహారం!
32
:
33
[31/05, 9:22 PM] Vineelamma: కవితాగానం
పేరు: విజయదుర్గ
కవితా శీర్షిక : రవితేజము
కవితా సంఖ్య: 27
తేదీ: 29/05/20
ఆ మస్తిష్కం లో పురుడోసుకున్న
సంకల్పం
ఆ గుండెలో వెలిగిన నమ్మకం
మల్లెల పరిమళాన్ని అద్దుకొని
కార్యరూపం లో వెలిగిన వెలుగు....!!
నూతనత్వం చేతపట్టి
వినూత్నతీరులో అడుగేసిన
సాహస వీరుడు
వాట్సాప్ సాహిత్య సమూహానికి
మహారాజు...!!
ఉన్నత వ్యక్తిత్వ వికాసంతో
నొప్పించక
విభిన్న తరహా సమూహాల సందడితో
నడిపించి న రథసారథి....!!
సాహిత్యలోకంలో విస్తృత
కృషితో
సహస్ర కవితా యజ్ఞం తో
కోటి కవితా యజ్ఞానికి నాంది పలికిన అక్షర పూజారి....!!
పదవీ విరమణ శుభాకాంక్షలతో
కలకాలం వెలగాలి రవితేజమున
సాహిత్య నింగిలో
అందరికీ వేదికగ మెరిసి....!!
🌹వినీల🌹
34.
🌼కవితా గానం🌼
*****************
తేదీ:31/5/2020
పేరు:అనుముల తేజస్విని
నర్సంపేట
అంశం:తెలుగు ఆంధ్ర భోజుడు
తెలుగు సాహితీ కిరీటి
నవకవులకు సారధి
సాంకేతికత తన వృత్తి
సాహిత్యసేవ తన ప్రవృత్తి
సహస్ర కవుల సమూహం నిర్మించి
సరస్వతి పుత్రులను తయారు చేసిన కవి
తెలుగు భాషలో
పలు ప్రక్రియలు ఏర్పరచి
నూతన సాహిత్యాన్ని సృష్టించిన వ్యక్తి
నిరంతరం శ్రమించిన ఋషి
వయసుకి విరమణ పదవిలో అయిన
సాహిత్యo లో ఆయనకు లేదు విరమణ
ఎందరో మహోన్నతులు వారికి ప్రియశిష్యులు
ఆడంబరం లేని మనిషి
ఆప్యాయతను పంచె మనిషి
మన మేకా రవీంద్ర గారు
అందుకోండి మా నుండి
పదవి విరమణ మహోత్సవ కవనాక్షరకుసుమాలు......
35
అమ్మ భాష అంటే అభిమానము మీకున్
సహస్ర కవుల సమస్యల సమాధానపరిచి
అవధాన విద్యలోన అద్భుత సృష్టి చేసి
కవిపండితులందరిలోన కీర్తి కిరీటి మీరు
మువ్వ ప్రసాద్ గారు
36
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: పేరు: డా.శ్రీభాష్యం అనూరాధ.
ఊరు: హైదరాబాద్
స.క.స.-2034
💐💐💐💐💐💐💐
కవీంద్ర..... రవీంద్ర ..💐
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
మేక అంజనీదేవిలక్ష్మణరావుల శుక్తిముక్తాఫలంగా,
నిజామాబాద్ ముద్దుబిడ్డగా,
'రవీంద్ర ,నామంతో ఖ్యాతి
నార్జించిన వీరు, సామాన్యంగా కనిపించే అసామాన్యులు . పనియే పరమేశ్వర ఆరాధనగా, నిరంతర కృషీ వలురు... ఒకవైపు వృత్తి ధర్మాన్ని,మరోవైపు సాహితీ కళామతల్లికి వైవిధ్యక్రియలతో సాహిత్య సేవలను అందించడం నిత్యకృత్యమయ్యాయి... వీరి సాహితీ క్షేత్రంలో 'నాలాంటి 'మొలకలకు నీరు పోసి వేదికలు కల్పించి, బిరుదుల ప్రోత్సాహకాలు అందించి, తరువులు గా మలుచుతున్న తీరు
శ్లాఘనీయం.......... "సాహితీ భోజుడైన" వీరు కవుల కుటుంబాలలో మమేకమైన మీరు....చిరునవ్వు ఆభరణంగా... అనితరసాధ్యమైన మేధో సంపత్తితో
నూతన క్రియాశీలురై, సృజనాత్మకతతో మరెన్నో రూపకల్పన చేస్తూ ..
కవన వనంలో సుగంధ కుసుమాలను విరబూయించండి... ఈ వసుదైక కుటుంబం లో మేమంతా మీకు పలుకుతాము ...............జయోస్తు'సాహితీంద్ర'... విజయోస్తు 'కవీంద్ర'..... దిగ్విజయోస్తు ''రవీంద్ర'...🙏
■■□■■■□■■■■■
37
డా.శ్రీభాష్యం అనూరాధ
తెలుగు ఉపన్యాకులు
కుషాయిగూడ,హైదరాబాద్
8790325502
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *తెలుగు భోజుడు*
-------------------------------
లక్ష్మణరావు అంజనీదేవిల సుపుత్రుడు
ఇందూరు రవీంద్రుడు
సార్ధక నామధేయుడయ్యాడు
తెలుగుకవితా వైభవాన్ని
దిగంతాలకు చాటాడు!!
స్మార్ట్ ఫోనులు
అప్పుడప్పుడే రంగప్రవేశం చేస్తున్న వేళ
సహస్రకవుల వేదికను
సృష్టించి
కొన్ని వేల కవులను
లక్షల కవితలను
పుట్టించాడు
తెలంగాణా కవితాపితామహుడుగా భాసిల్లాడు!!
సకస నంబర్లతో
వేలమందిని ప్రోత్సహిస్తూ
సామాజిక మాధ్యమాల వేదికగా
సాహితీ బంధాన్ని పరిపుష్టం చేస్తూ
తెలుగు కవితా వైభవానికి పచ్చటి
గొడుగు పడుతున్నాడు!!
ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ గా ఎదిగినా ఒదిగి ఉంటూ
ఏ పొగడ్తలకు పొంగని
స్థితప్రజ్ఞుడు
మితభాషి
నిరాడంబరుడు!!
తెలుగు కవులందరినీ
ఒకే తాటిపై తెచ్చి
వారి మధ్య అనుబంధాన్ని పెంచి
వౌత్సాహిక కవులను
ఉత్సాహపరుస్తూ
వారి కవితా దాహార్తి ని తీరుస్తున్నాడు!!
ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకుని
తెలుగు సాహిత్య
అభివృద్ధికై అలుపెరుగనికృషి చేస్తున్న సామాజిక కవితా ఉద్యమకారుడు!!
సహస్ర కవి మండలిచే బిరుదు ఒసంగబడిన "తెలుగు భోజుడు"
ఆయన సత్సంకల్పాన్ని గౌరవిస్తూ కవులందరు
ఆయనకు బాసటగా నిలవాలి
తెలుగు భాషా వౌన్నత్యాన్ని దశదిశలకు చాటాలి
మేకా రవీంద్ర సాహిత్య కృషి తెలుగు భాషా చరిత్రలో ఆచంద్రతారార్కం
నిలవాలి!!
-------------------------------
*పరిమి వెంకట సత్యమూర్తి*
హైదరాబాద్
చరవాణి:9440720324
38
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: ....అభినవ రాయలు...
కవీంద్రుడు
మేక రవీంద్రుడు
నిరాడంబరుడు
నిష్కల్మషుడు
సరళ స్వభావుడు
చిరుదరహాసుడు
సాహితీ పిపాసకుడు
ఎదిర చెన్నకేశవుల సాహిత్య
వారసుడు
అంజనీ లక్ష్మణుల సుపుత్రుడు
పంచాయతీ రాజ్ శాఖ ఉన్న తోద్యోగుడు
కార్యనిర్వహకదక్షుడు
ఉద్యోగ నిరాటంకుడు
దాశరథి కవితావేదిక అధ్యక్షుడు
తెలుగు కవితా వైభవ వ్యవస్థాపకుడు
కవుల అనుసరణీయుడు
సహస్ర కీర్తి పుస్తక ప్రకాశకుడు
సాహితీసేనాపతుడు
అందరికీ ఆదర్శప్రాయుడు
సరస్వతీ పుత్రులు
సాహితీ పోషకులు
తెలంగాణ అభినవ కృష్ణదేవరాయలు
ప్రపంచమంతా పరిచయస్తులు
సాహిత్య సేవా శిరోమణి
బుదజన స్తోత్రనీయుడు
అత్యంతాత్మీయుడు
గురుతుల్యులు
స్ఫూర్తి ప్రదాత
మేక రవీంద్ర
కరోనా కలికాలంలో
ఉద్యోగానికి దూరమై
వాట్సాప్ కవికులానికి దగ్గరై
శత వసంతాలు ఆయురారోగ్యాలతో
తెలుగుభాషా కళామతల్లి సేవను
నిరంతరం కొనసాగిస్తూ..
మమ్మల్నీ పాత్రులను చేస్తూ..
కల కాలం చల్లగా వర్ధిల్లాలని
కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుతూ...
పదవీ విరమణ హార్థిక శుభాకాంక్షలతో..
శ్రీమతి. శాంతారెడ్డి, పాలమూరు.
38
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *సాహిత్య సేవా శిరోమణి*
నిరాడంబరతకు నిదర్శనం
స్నేహశీలతకు తార్కాణం
తెలుగు సాహిత్యంలో
విరబూసిన మందారం
సాహితీ వారసత్వంతో
పరిమళిస్తున్న సుగుణం
నవయువకవులెందరినో ప్రోత్సహించి
సహస్ర కవిమిత్రాది బిరుదులను
సహస్రాధికంగా బహుకరించిన నిస్వార్థసేవాగుణం
తెలుగు సాహిత్య చరిత్రలో
అదొక అపూర్వమైన ఘట్టం
తెలుగుపూలతోటలో వికసించిన పద్మం
సహస్రాధిక నవయువ కవులను
కవితామయం చేసిన మంత్రదండం
అయుతా ప్రయుతా కవితాయజ్ఞాలను
నిర్వహించిన సాహితీ ప్రభంజనం
సాహితీలోకంలో నిశ్శబ్ధఝరిలా ప్రవహిస్తూ
అక్షరాలను ఆలింగనం చేసుకున్న ఆణిముత్యం
రవీంద్రుడు కవీంద్రుడు కావాలని మనసారా
అభిలషిస్తూ... ఆశిస్తూ... శుభాకాంక్షలు
*డా. భీంవల్లి శ్రీకాంత్*
39
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: మేక రవీంద్ర...💐💐
ఔను...! అతడు ...రవీంద్రుడే...
కాదు...కాదు... కవీంద్రుడే...!
ఎందుకంటారా...!?
ఆ ...రవి ...చేరని చోటుకి
మన కవి చేరగలడు..!?
రవీంద్రుడు...సార్థక నామధేయుడు
ఆ రవీంద్రుడు చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగులిస్తే....
మన రవీంద్రుడు... తామసి పొరలు అలుముకున్న తెలుగు సాహిత్యానికి...
సాంకేతిక విజ్ఞానమనే చందనాన్ని పూసి ..
తెలుగు నందన వనంలో కోట్లాది కవి సుమాలను పరిమళింపజేసిన ప్రజ్ఞాశీలి..!
మాటల్లో మృధుత్వం
చేతల్లో సజ్జనత్వం...
నడకలో ...నడతలో...
శ్వాసలో ...ఆశలో...
అనుక్షణం...అహరహం
తెలుగు భాషాభివృద్ధికై తపించే తత్వం..!
నిగర్వి ,నిత్య సంతోషి,
నిరాడంబర జీవి..నిత్య శ్రమైక జీవి..!
నూతన పోకడలను ఒంటబట్టించుకుని
తెలుగు సాహితీ సుమ పరిమళాలను
నలుదిశలా గుభాళింపజేసిన
సాహితీ సేద్యకాడు..!!
ఓ మహాశయా..!
మీకు హృదయపూర్వకమైన పదవీవిరమణ శుభాకాంక్షలు..💐💐
మీ సాహితీ సేద్యం భవిష్యత్ లో కూడా కొనసాగాలని మరిన్ని ఫలాలు విరబూయాలని
ఆ ఫలాలను ఆస్వాదించే అదృష్టం మాలాంటి వారికి కలగాలని ..మనసా వాచా కర్మేణ కోరుతూ...
మరోమారు ...మీకు హృదయపూర్వకమైన
పదవీ విరమణ శుభాకాంక్షలతో...
మీ ...అభిమాని...
కోరాడ.అప్పలరాజు.( టీచర్ )
అనకాపల్లి-విశాఖ జిల్లా.
40
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
కలం పేరు: మానస.
అంశం: మేక రవీంద్ర గారు.
శీర్షిక: సాహితి ధ్రువతార
ఆయన ఒక సాహసకుడు
అలుపెరగని సాహితి కెరటం....
సాహిత్య పూదోట లో
కలం పట్టని యోధుడు...
ఎన్నో కలాలకు చేయూతనిచ్చిన
చైతన్య మూర్తి....
తెలుగు భాషంటే మక్కువ ఎక్కువ...
చేసే వృత్తికి ...ఈ కవిత్వం వికృతే ...అయినా..
మదిలో వెలసిన అక్షర రూపం కి ప్రాణంపోసి...
పదాల అల్లికలతో ప్రకృతి అందాలను ఓలలాడించిన అక్షర ప్రేమికుడు...
సాహితి పిపాసి...
చుక్కల్లో చంద్రుడు....
చిద్విలాస మూర్తి....
నిత్య కృషి వలుడు.....
యువ రక్తానికి ....ఊపిరి
విభిన్న ప్రక్రీయల సృష్టి కర్త
నిత్య అక్షర తేజోమయుడు
సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం...
సహస్ర కవులకు ప్రేరకుడు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
నలుదిశలా వ్యాపింపజేసి...
ఆన్ లైన్ కవి సమ్మేళనాలకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు...
ఎందరికో చేయుతనిచ్చిన ధన్యమూర్తి.
నిత్య వెలుగొందే దివ్యతార
సాహితి లోకానికి పెన్నిధి
మాకు వారధి ...మా హితుడు మా మార్గదర్శి ..
మా గురువర్యులు "మేక రవీంద్ర"గారు ఓ ధ్రువతార.
వారి పదవికే విరమణ...
పెదవికి లేదు విరమణ....
నిత్య సాహితి కృషి వలుడా ...
మీకివే పదవీ విరమణ శుభాకాంక్షలు...
మేక రవీంద్ర గారికి ఇవ్వే మా అక్షర నీరాజనాలు💐💐🙏
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *అపర బ్రౌను*
---------------------
41
తెలుగు సాహిత్య సేవా వారసత్వానికి
చెరగని సంతకం!!
తొణకని చిరునవ్వు
వీడని విశ్వాసం
ఆప్యాయతతో పలకరింపు
ఆఫీసరై ఉండి అందరినీ
సమాదరించే స్వభావం
నిగర్వి నిస్వార్థ పరుడు
నిరాడంబరుడు సద్గుణుడు
నిరంతర సేవాతత్పరుడు!!
వరించి వచ్చి చేరిన బిరుదులు
పురస్కారాలు ఎన్నో ఎన్నెన్నో!!
ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఒడిసిపట్టి
చక్కగా వాడుకుంటూ అలుపెరుగక
మారుమూల ఉండి మరుగున పడ్డ తెలుగు కవులను
ఒకచో చేర్చి
ఒకే వాట్సాఅప్ వేదికపై తెచ్చి
సహస్రకవుల సమూహంతో
కవులకు గుర్తింపునిచ్చిన ఘనుడు సాహిత్య పిపాసి!!
సహస్ర వాణి రేడియోతో
కవుల స్వరాన్ని దిగంతాలకు
వ్యాప్తి చేసిన మహిమాన్వితుడు!!
ఎక్కడెక్కడో తాళపత్రాలను సేకరించి తెలుగు సాహిత్యానికి
చేయూతనిచ్చి వెలుగులునింపి జీతం జీవితం అంకితం చేసిన
తెలుగు భాషాభిమాని
తెలుగు సాహిత్య పోషకుడు
బ్రహ్మచారి బ్రౌన్ నాడు!!
ఎక్కడో ఉన్న తెలుగు కవులకు బాసటగా ఉండి చేయూతనిచ్చి ఉన్నతికి కవుల వికాసానికి చిరునామాగా మారిన బ్రహ్మచారి మేకా రవీంద్రుడు నేడు!!
42
-------------------------------
*డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి*
విశ్రాంత సహాయ ఆచార్యులు
హైదరాబాద్
చరవాణి:9490367383
-------------------------
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: శీర్షిక.......స్నేహశీలి. రవీంద్ర.
అత్యుత్తమ సేవలందించిన
ఆదర్శప్రాయులు
నిగర్వి నిరాడంబరులు
అందరి మన్ననలు పొందిన కవివర్యులు
వృత్తి,ప్రవృత్తి వారికి రెండు కళ్ళు
సహస్ర కవులను ప్రోగు చేసిన
కవి చక్రవర్తులు
అంజనా,లక్శ్మ ణుల పుత్ర రత్నము
కార్య సాధనా దక్షులు
తెలుగు కవితా వైభవ స్థాపకులు
కవులందరికి ఆదర్శ ప్రాయులు
తెలుగు సాహితీ వనంలో పూచిన పుష్పం
కవి పోషకులు, సాహితీ ప్రియులు
తెలుగుభాషకు ఎనలేని సేవలందించిన
అభినవ రాయలు, జగమెరిగిన రవీంద్రులు
వర్ధమాన కవులకు స్ఫూర్తి ప్రదాత
ఆత్మీయ వదనం అదే అతని ధనం
ఆరోగ్యాంగా ఉండాలి ఆయన కలకాలం
శ్రీ మేక రవీంద్ర గారు
తెలుగు తేజమయి వర్ధిల్లాలి.
పదవీ విరమణ శుభా కాంక్షలతో.
43
శ్రీమతి. టీ. అనిత.
ఉపాధ్యాయిని.
అచ్చంపేట.
నాగర్ కర్నూల్.
చర వాణి.....9985888924.
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *కళాబాంధవుడు*
వచన గద్య పద్యములలో
తనకు సాటిలేరు
అనిపించుకుంటూ
వృత్తిని ప్రవృత్తిని
సమయానుకూలంగా నిర్వహిస్తూ
నూతన ఒరవడితో
అంతర్జాల కవిసమ్మేళనాలు
నిర్వహించి అందరి మన్ననలు
పొంది మిగిలిన వారికి
దారిచూపే బాంధవుడై
కళాభిమానియై
అజాతశత్రువై
ఆడంబరమెరుగని
ఆత్మీయుడై అక్షరపూదోటలో
నిరంతరం కవితాసేద్యం చేస్తూ
చెరగని చిరునవ్వుతో
అందరినీ పలకరించే
మృధుహృదయస్వభావుడు
మేకా రవీంధ్రుడు...
*సత్యనీలిమ*
వనపర్తి
950215681
44
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: 🌻 **శ్రీ మేక రవీంద్ర గారికి**🌻
🌹🌹 *అభినందన పత్రం* 🌹🌹
గులాబి అందంగా ఉందంటే కాదు తప్పు
మేక రవీంద్రగారిని పొగిడితే అవును ఒప్పు.
నిశ్చల గంగను ఉరికించిన భగీరథుడు
కవుల రచనలకు ప్రవాహాలద్దిన రవీంద్రుడు
కవి ఉన్నచోట మంచితనం విరబూసి నేరాలను ఘేరావ్ చేస్తాయన్నట్టు
సాంఘిక దురాచారాల గజములను బందింప
కవులను ఐక్యతగా అల్లిన దీక్షితుడు
నీడ కోసం వెతికే కవులకు వేదిక నిచ్చిన దక్షుడు
విరివిగా నున్న సాహిత్య సమూహాలను
ఒకటిగా చేసి కవుల కుటుంబాన్ని పెంపొందించిన కళా సేవకుడు
సాహితీ శ్రేష్టులతో సాహితీ బృందావనం ఏర్పరచి సాహితీ సుమాల మొలకెత్తింది సాహితీ స్వర్ణ పుష్పాల పోయించి సాహితీ లహరి గా మార్చి సాహితీ వేదిక నిర్మించి సాహితీ మహాప్రస్థానాన్ని చూపిన సాహిత్య తపస్వి.
కవుల వేనోళ్ళ పొగిడించుకున్న అర్హుడు.
కవుల అక్షరాల తోవలో కవుల అక్షరాలకు జీవం పోయ తపించిన తపస్వి.
స్వలాభమెరుగక తనకు తాను సాహితీ మాతకు అర్పించుకున్న సన్యాసి.
కళారాధనలో విరమణ చూపక కవుల వెన్నంటి ఉంటాడని ఆశిస్తూ....
*మేక రవీంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు*
45
డా.దీపక్ న్యాతి
సినీ రచయిత దర్శకుడు
నంది అవార్డు గ్రహీత
దివిటీలు ప్రక్రియ రూపకర్త
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: శ్రీ మేక రవీంద్ర గారికి పదవి విరమణ శుభాకాంక్షలు సార్.
అడుగు ఒక ఆరంభం .
సూక్తులకందని ఆవేశం .
అణువణువు ఒక అంతర్యుద్ధం .
గెలుపు, ఓటముల ఉత్తుంగ తరంగం .
గెలిచి , నిలిచాక గెలుపులోని ఆనందం ,
ఆ తర్వాత ఏమిటనే నిర్వేదం .
నిర్మాణాత్మక మార్పేదో దరిచేరి .. మనసును కుదుపుతున్న భావోధ్వేగం .
అప్పుడే అయిపోయిందా .. సంవత్సరాలు .. రోజుల్లా కరిగిపోయి ..వయస్సును గర్తుకు తెచ్చాయనే చిరు కోపం .
ఈ ప్రపంచంలో బాధ్యత అనేది శాశ్వతం..
విరమణ అనేది తాత్కాలికం .
జీవితంలో ఇది ఒక సంధి సమయం ..
ఈ సమయంలో మరి కొందరిని గెలుపు వైపు నడిపించడం సాధ్యమైతే ...
వారి కనులలోని ఆనందం ..
జీవితపు మరో అంకానికి గొప్ప మలుపు కాగలదని ఆశిస్తూ. ..
మీరు చేస్తున్న సాహిత్య సేవకు
దన్యవాదములు తెలుపుతూ. ..
శివరామప్రసాద్. వక్కలగడ్డ
9963658704
46
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: *సాహితీ సవ్వడి రవీంద్ర నడవడి*
*కవితాయాత్రికుడు రవీంద్ర కవీంద్రుడు*
అందరితో స్నేహంగా ఉంటూ
ఆప్యాయత అనురాగాలు చూపి
కాలం వెంట నడిచే నిరాడంబరుడు
సామాజిక సాహితీ సేవనిచ్చే సాహితీ అమరేంద్రుడు
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ
ప్రకృతి ధర్మాన్ని కొనసాగిస్తూ
అందరి మన్ననలు పొందిన నిత్య కృషీవలుడు
మాతృభాషను వదలని కవితామూర్తి
నిత్య చైతన్య శీలిగా ఉంటూ
అందరినీ చైతన్య పరుస్తూ
భిన్న రంగాల్లో నిలిచిన సవ్యసాచి
సేవా తత్పరులు కవివతంసుడు
కవి సమ్మేళనం నిర్వహిస్తూ
అంతర్జాలంతో కొత్త రూపాన్నిచి
సహస్ర కవి సమ్మేళనం నిర్వహించాడు
అందరికీ ఆదర్శమూర్తి మనందరికీ స్ఫూర్తి
మానవత్వమును పరిమళింపచేస్తూ
ముఖము నందు చిరునవ్వును కలిగిన
సాహితీవనంలో మెరిసిన ఆణి ముత్యం
మన కవీంద్రుడు మన మేక రవీంద్రుడు
ఆయన ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్లు వర్ధిల్లాలని
వారి సరస్వతి సేవ నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను
*శ్రీ మేక రవీంద్ర గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు*
*డాక్టర్ తెలుగు తిరుమలేష్*
తెరసం జిల్లా అధ్యక్షులు
అమరచింత మండలం,వనపర్తి జిల్లా
9908910398
47
[01/07, 7:52 PM] శాంతా రెడ్డి: అభినందన సందేశ సుమమాలిక!!!
తెలుగుభాషాభిరుచుల
నన్నిటినీ ఏకముచేసి
మీ వృత్తిలో ప్రవృత్తిలో మమేకమై
సాహిత్యాభిరుచితో కవివై
పరంపరానుగత వంశాంకురుడవై
తాతగారైన చెన్నకేశవుల వారసత్వాన్ని
పుణికిపుచ్చుకున్న కవివరేణ్యుడవై
ద్విపాత్రాభినయముతో ఒనగూరిన
ఒరవడులతో ద్విశాఖలలోనూ
శిఖరాగ్రానికి చెలిమితో చేరికవై
తెలుగు భాషోన్నతికై
మీ సాన్నిహిత్య ఔన్నత్యములతో
నలుదిశలా వ్యాప్తి కారక కృషీవలుడవై
కొత్త కొంగ్రొత్త వనరులను
ఒడిసిపట్టిన సృష్టి కర్తవై
లక్షలు వెచ్చించి
చేయలేని పనులను
లక్ష్యసిద్దితో సాధికారికంగా సాధించినవాడవై
నిష్కల్మష నిర్మల నిరాడంబర నిజాయితీలతో నడక సాగించి
ఎందరో మరుగునపడిన కవుల
నుత్తేజపరచి పరిమళింపజేసి
వాటి సువాసనలనెల్ల
దశదిశలా వెదజల్లుతున్నవాడవై
ఆదర్శ జీవితానికి
ఆలవాలమై స్ఫూర్తిదాయకమై
కంటికి కనిపించని కరోనాను
గజగజలాడించి వణికించి
నిరాయధ నిరంతర
పోరాట పటిమలతో అగ్రగణ్యుడవై
చెదరని చిరుమందహాస చైతన్యుడవై
నిన్ను నమ్మి వచ్చిన పదవికి వన్నె తెచ్చి
ఔత్సాహిక రచయితల
నెందరినో ప్రోత్సాహపరచి
సామాజిక వేదికల
అల్లికల చొరవలతో దిక్సూచివై
నేడు పదవీవిరమణ చేస్తున్న
శుభసందర్భమును పురస్కరించుకొని
శ్రీ మేక రవీందర్ గారికి
సహృదయాభినందనలు
అందుకోవలసిందిగా
వినయపూర్వక
అభినందన సందేశము.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
ఆయురారోగ్యా ఐశ్వర్యములు
సదా కలుగచేయాలని
ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ
మరొక్కసారి అభినందనలు అందజేస్తూ
సాహితీవిశ్వానికి సుపరిచితులైన మిమ్మల్ని
వినమ్రపూర్వకంగా ఆహ్వానిస్తూ
ఒక విశ్రాంత పెన్షనర్
కాసుల ధీరాజ శర్మ
48
Retired Accounts Officer(Admn.)
EPFO. Hyderabad.
9440522864.
30.05.2020
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 💐💐💐సాహితీ సేనాపతి💐💐💐
చెరగని చిరునవ్వుతో…కలకాలం
సాహిత్య భావుకతతో…తెలుగు భాషకు పట్టాభిషేకం
అక్షర చైతన్య కుసుమాలతో…కవిత్వపు పరిమళాలు
తెలుగు కవితా వైభవంతో…కవుల పరిచయం
సహస్ర కీర్తి పుస్తకంతో…సాహిత్య కార్యక్రమాల గుర్తింపు
ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియని మనీషి
సాహితీ సేనాపతి…బిరుదాంకితులు
మంచితనానికి మారుపేరుగా
ఉన్నత వ్యక్తిత్వం…సాహిత్యాభిలాష
పుణికి పుచ్చుకున్న…శ్రీ మేకా రవీంద్ర గారు…………
వారి సాహిత్య సేవ,కృషి…తెలుగు భాషా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని, హృదయపూర్వకంగా కోరుకుంటూ………
పదవీ విరమణ శుభాకాంక్షలు 💐💐💐💐💐తెలియచేస్తూ……
కాళంగి.వసంత జెస్సన్,ఖమ్మం
చరవాణి:9490967433
49
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: ..
*కవీంద్రుల రవీంద్రుడు*
తమ ఉద్వేగాల కల్లంలో ఎన్నో అక్షరాలను..
ఎందరో ఆశావహులు
ఆర బోసుకుంటున్నారు
ఆయన వాటన్నిటినీ రాశిగా
పోసి వాసిగల, వాడియైన
కలాలను నక్షత్రాలుగా
మలిచి స్వయం భావ
ప్రకాశితాలుగా నిలిపి వెలిగిస్తున్నారు
అక్షరాలను జేబులో
పోసుకొని అపుడపుడే
పదాల పునాదులు
పేర్చుకొనే భావశిల్ప
ఆకాంక్షితులకు
ఆకాశమంత ఆపన్నహస్తం
కవీంద్రుల రవీంద్రుడు
పరభాషా పారాయణంలో
నిటారుగా నిబడటానికి
ఆధారమైన మాతృభాషల మట్టిని తానే తవ్వుకుంటున్న మనిషి..
గాలిలో దీపమై కొన
ఊపరిలో ఉన్న తెలుగు
భాషకు దాపుయై కాపుయై
ఒత్తిలా వెలుగుతున్నాడు
పనికి రానివని పడేసుకున్న
కలాలకు విశ్వాసాల
విద్వత్తును చిలికి
స్వయం సత్తువల సిరాలు
నింపి కవన భవన నిర్మణాల
గుత్తేదారే మేక రవీంద్ర..
వృత్తి నిష్క్రమణ
శుభాకాంక్షలతో ప్రవృత్తి
కండువా ఆహ్వానమై
మెడలపై వాలిపోయింది
రండి రాళ్ళను రాపిడి
పట్టి కవి రత్నాలుగా
మెరుగులు అద్దండి
*కొప్పోలు యాదయ్య*
7989742920
50
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: *ఒకే ఒక్కడు*
భరతావని ఒడిలో చక్కని బిడ్డ
వృత్తిని నమ్ముకుని ప్రవృత్తితో
పదిమందికి ఆసరాగా నిలిచి
సంఘ సేవకుడైన ఘనుడు
తాను పదవిలో ఉంటూ
పదోన్నతులకు ఎప్పుడూ పాకులాడని
పదిమందికి మేలుకోరి
సాహిత్యాన్ని పోషించిన మరో రాయలు
ఆనాటి గీతాంజలి విశ్వ కవిని చేస్తే
ఈనాటి సహస్ర కవిమిత్ర సమూహంతో
మరో గీతను నడుపుతూ
యువ కవులను ప్రోత్సాహిస్తూ
అత్యున్నత సాహితీ సేవలో
మన ముందు నిలిచిన
మన మార్గదర్శి మానవోత్తముడు
*ఒకే ఒక్కడు* మేక రవీంద్రుడు
_స్పూర్తి రత్న_ ✍🏻
కోలంట్ల రామకృష్ణ
51
జలదుర్గం(కర్నూలు )
9966804126
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: On duty ever
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
52
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్యమే శ్వాసగా...
తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢసంకల్పంతో...
నిరంతరం సరికొత్త ఆలోచనలతో సాహిత్యాన్ని పరుగులు పెట్టిస్తూ...
నవ యువ కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ మేక రవీంద్ర గారి గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే...
సాహిత్య అభిమానిగా,సాహిత్య పోషకుడిగా...
రికార్డులను సృష్టించడంలో మేటి గా చెప్పవచ్చు..
వాట్సప్ సాహిత్య గ్రూపుల ద్వారా ...
అంతర్జాల కవి సమ్మేళనం ను నిర్వహించడం...
కవులకు ప్రోత్సాహకాలను అందించడం..
పుస్తకాలను ప్రచురించడం....మొదలగు సాహిత్య సంబంధిత కార్యక్రమాలకు పెట్టింది పేరుగా మేక రవీంద్ర గారు గుర్తింపు తెచ్చుకున్నారు....
ముఖ్యంగా
అంతర్జాల రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది తన నవకల్పన ఆలోచనకు దర్పణం పట్టింది...
ఎందరో ప్రశంశలు అందుకుంది...
ఇదొక సువర్ణ ఘట్టం...
వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పలువురి మన్ననలు పొంది నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ మేక రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు....
వృత్తిలో నే కాకుండా ప్రవృతికి తన ప్రాణంగా ప్రేమించి ఎంతో మంది సాహిత్య కారుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడం మాములు విషయం కాదు...
చాలావరకు నేను అనే
స్వార్థం తో నిండిపోయిన ఈ లోకంలో మనం అనే తలంపును గట్టిగా నాటి విలువలతో కూడిన సమాజం కోసం....
చైతన్య పూరిత శంఖారావం కోసం...
సాహిత్యం అత్యంత బలమైన ఆయుదంగా భావించిన వారు మేక రవీంద్ర గారు....
ఆలోచనలను ఆచరణలో పెట్టగలగడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైనది...
అంతర్జాలన్ని ఆయుదంగా చేసుకుని అందరిని ఒక వేదికపైకి తీసుకురావడం అనేది మాములు విషయం కాదు...
ఎన్నో సవాళ్లు,విమర్శలు,సాంకేతిక కష్టాలు...
అన్నింటినీ అధిగమించి సఫలీకృతులు అయ్యారు అని సగర్వాంగా చెప్పవచ్చు....
సాహిత్య లోకానికి దొరికిన ఒక మణి మాణిక్యం రవీంద్ర గారు...
ఇక పూర్తి స్థాయిలో సాహిత్య సేవ చేస్తూ...
సరికొత్త పధంలో ముందుకు సాగుతూ...
సాహిత్యలోకాన్ని నడిపించాలని
సమాజ హిత్ సాహిత్యం కోసం కృషిగావించాలని మనసారా కోరుకుంటూ...
హృదయపూర్వక
అభినందనలతో...💐💐💐💐💐💐💐
అక్షరాల తోవ
ఖమ్మం
53
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: కవి:-గాజుల.భారతి శ్రీనివాస్.ఖమ్మం
స.క.స.5158.
సెల్.9849788108.
శీర్షిక:-జయోస్తు రవీంద్ర
లక్ష్మన్ రావు..అంజనీ దేవి మనసపుత్ర.
ఇంద్ర..సహస్ర కవీంద్ర..మా మేక రవీంద్రా.
పుస్తకప్రియులు..తెలుగుభాష కవితా పితా మహులు
సహస్ర కవిసమ్మేళనం యజ్ఞంలా నిర్వహించే ఆధ్యులు
తెలుగు కవితా వైభవం ద్వారా వేల కొలది కవులకు మార్గనిర్దేశకులు మీరు
తెలుగుభోజుడు..సాహితీ సేనాపతి బిరుదాకింతులు
మితభాషి..నిష్కల్మషమూర్తి..మోముపై చెరగని చిరునవ్వు
ఇవ్వడమే తప్పా.. తీసుకోవడం తెలీనీ నిస్వార్థ సేవకులు
తెలుగుభాష అభివృద్ధి కోసం అహర్నిశలు సాహిత్య కృషి చేస్తున్న..నిత్య కృషీవలుడు
రవీంద్రా సార్ సంకల్పానికి మనమంతా తెలుగుభాష ఔన్న త్యాన్నీ ప్రపంచ నలుమూలకు వ్యాపింపచేద్దాం..అందరం ప్రతిన భూనుదాం.
పదాల పూ లతో మీకు అభిషేకం చేయనా
అక్షర మాల అల్లి మీ మెడలో వేయనా..!!!
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: మేక రవీంద్ర...💐💐
54
ఔను...! అతడు ...రవీంద్రుడే...
కాదు...కాదు... కవీంద్రుడే...!
ఎందుకంటారా...!?
ఆ ...రవి ...చేరని చోటుకి
మన కవి చేరగలడు..!?
రవీంద్రుడు...సార్థక నామధేయుడు
ఆ రవీంద్రుడు చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగులిస్తే....
మన రవీంద్రుడు... తామసి పొరలు అలుముకున్న తెలుగు సాహిత్యానికి...
సాంకేతిక విజ్ఞానమనే చందనాన్ని పూసి ..
తెలుగు నందన వనంలో కోట్లాది కవి సుమాలను పరిమళింపజేసిన ప్రజ్ఞాశీలి..!
మాటల్లో మృధుత్వం
చేతల్లో సజ్జనత్వం...
నడకలో ...నడతలో...
శ్వాసలో ...ఆశలో...
అనుక్షణం...అహరహం
తెలుగు భాషాభివృద్ధికై తపించే తత్వం..!
నిగర్వి ,నిత్య సంతోషి,
నిరాడంబర జీవి..నిత్య శ్రమైక జీవి..!
నూతన పోకడలను ఒంటబట్టించుకుని
తెలుగు సాహితీ సుమ పరిమళాలను
నలుదిశలా గుభాళింపజేసిన
సాహితీ సేద్యకాడు..!!
ఓ మహాశయా..!
మీకు హృదయపూర్వకమైన పదవీవిరమణ శుభాకాంక్షలు..💐💐
మీ సాహితీ సేద్యం భవిష్యత్ లో కూడా కొనసాగాలని మరిన్ని ఫలాలు విరబూయాలని
ఆ ఫలాలను ఆస్వాదించే అదృష్టం మాలాంటి వారికి కలగాలని ..మనసా వాచా కర్మేణ కోరుతూ...
మరోమారు ...మీకు హృదయపూర్వకమైన
పదవీ విరమణ శుభాకాంక్షలతో...
మీ ...అభిమాని...
కోరాడ.అప్పలరాజు.( టీచర్ )
అనకాపల్లి-విశాఖ జిల్లా.
55
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు: నీలా రంగనాధం
తేది:31/5/2020
అంశం: *నిగర్వి_364*
అభినవ ఆంధ్రభోజుడై..,
అనితర సాధ్యమైన కవితా సమూహ సారథై..,
నవకవులకు మార్గదర్శియై..,
వేదికనందించ అనవరతం కృషిచేసిన,కృషిచేస్తున్న..,
సాహితీసేవా కృషీవలుడై..,
నిగర్విగా సాహితీ సేవానిరతుడై..!
సాహితీ వన పోషకుడై..!
ఎన్నో పూలవనాలకు తోటమాలిగా నిలిచిన మేకా రవీంద్ర గారు మీకు మా వందనాలర్పిస్తున్నాం..!
హృదయపూర్వక అభినందన వందన సమర్పణం చేస్తున్నాం..!!!!
🔥 *నీలా రంగనాధం* 🔥
56
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహితీసేవ భాగ్యోన్నతుడు....!
<><><><><><><><><><><>
సాధుసౌమ్యశీలి:సాహిత్యరసస్ఫూర్తి,
మృదులభావజాల:మూర్తికీర్తి!
మాటమంజులంబు:మౌనజీవనశైలి!
పఠితమానసంబు:పగలురేయి!!
*
మేకఇంటిపేరు:మేలుకోరురవీంద్ర
తల్లిదండ్రులనిల:తాతయశము
నిల్పిసాగుతున్న:నిర్మలసాహసి!
కవులతతినిపెంచు:కరుణశీలి!!
*
వేనవేలలక్ష:వెలుగులీనుకవీంద్ర
కవితలన్ని గూర్చి:కావ్యమాల!
వెలయజేయఁతాను:వేగిరభా వంబు,
ప్రస్తుతించవలయు:ప్రాజ్ఞులార!!!
*
కవనకదనమందు:కార్యోన్నతుండును,
సమతమమతలందు:చక్రవర్తి!
కఠినతరములైన:కార్యసాధనయుక్తి!
రవియుకవియుజూడఁ:రమ్యతరము!!
*
బహుళరీతిపొగడ:భావ్యమ్ము నేజేయ!
సుముఖపరిచయంబు:సూక్ష్మబుద్ధి!!
ప్రబలదివ్యశక్తి:పరిణితినొందియు
సాగుముందుకెపుడు:సద్వివేకి...!!!!!
---డాక్టర్ గన్నోజుశ్రీనివాసాచారి
8555899493,
పెద్దపల్లి, నాగర్ కర్నూల్.
57
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: మేలిమి జాతి రత్నం
----------------------------
ఎందరో సాహిత్యలోకములో
ఉన్నతస్థానాలని అధిరోహిస్తారు..
కాని అందులో కొందరే తన
నడిచే మార్గములో సాహిత్యపరిమళాలు వెదజల్లాలని ఆశిస్తూ..
ఆకాంక్షిస్తూ..ఎన్నో సాహితీమొక్కలను
నాటుతూ ఆ మార్గాన్నే
ఓ సాహిత్య లోకంగా
సృష్టిస్తారు..అలాంటి మహానుభావులులో
మేలిమి జాతి రత్నము వంటి వారు
తెలుగు సాహిత్య వైభవ
వ్యవస్థాపకులు గౌరవనీయులైన
శ్రీ మేకరవీంద్రగారు...
ప్రతీ ఒక్కరిలో నవనీతములా నిగూఢంగా
దాగియున్న రచనా శక్తిని
తన ప్రోత్సాహముతో
బయటికి తీసి..
ప్రపంచమన్న మాటెరగని
బావిలో కప్పల్లా ఉండే
ఎందరోనో ...
వాట్సప్ సమూహాలు ఏర్పరిచి
జ్ఞానకాంతులు వెదజల్లే కాంతిపుంజాలుగా మలిచేరు..
రెండు రాష్ట్రాలలో
ప్రతీ కవి మనసులో తన స్థానము
ఎప్పుడూ చిరస్మరణీయమే,.
పదవీ విరమణ
శుభాకాంక్షలు సార్ 🙏💐💐💐💐
🖋️శ్రీదేవి సురేష్ కుసుమంచి🖋️
58
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక:తేది:31.05.2020🔥
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
మద్దెల సరోజన(కలం:సహజ)
అంశం: మేక రవీంద్రల
సాహితీ సేవ
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
మనిషై పుట్పిన వాడు
కారాదు మట్టి బొమ్మ
సినీ గేయ కవియన్నట్లు
పట్టుదల కృషిలే పెట్టుబడిగా
ఆత్మవిశ్వాసమే ఆయువుగా
అందరూ నావారన్న భావనే
సాహితీ సమూహాల ఏర్పాటు
సాహిత్య కృషీవలుడుగా...
సాహిత్య కవనాలు పూయింపజేసి
కళామతల్లి ముద్దు బిడ్డగా
సేవలు అందిస్తూనే...
ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో
ఉత్తమ ఉద్యోగిగా మీ సేవలు
అనితర సాధ్యం స్ఫూర్తిదాయకం
ఉదయ సాహితీ హుస్నాబాద్
ఆత్మీయ సమ్మేళనంలో ...
మీ పరిచయం ఆనందదాయకం
గురువులు నిగర్వి నిస్వార్థపరులని
కొద్ది కాలంలో గ్రహించాను
సమూహానికే పరిమితం చేయక వ్యక్తిగతంగా సమాచారాలను అందించి
కవితలు రాయిస్తూ ప్రోత్సహించిన
మాన్యులు మేక రవీందర్ గారు
పదవి విరమణ పొందినా
సాహితీ సేవలను కొన సాగిస్తూ
అయురారోగ్యాలతో ఆనందకరమైన
జీవితం గడపాలని కోరుకుంటూ
మద్దెల సరోజన(జగిత్యాల)
(సాహితీ సోదరి)
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
59
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🙏🙏
సార్
నా నమస్సుమాంజలి
తీర్చలేని తల్లి రుణం
ఆమె అందించిన
మాతృభాష
గొప్పతనము అదే అదే
తెలుగు బాషా ఔన్యత్యము ..
.... అతనిలోని సాహితి అభిమానం.
మేక రవీంద్ర సార్ గారికి
🙏. నా పాదాభివందనం.
తూర్పున ఉదయించు
ఉషస్సు,
సాహిత్యములోని
రవీంద్రుని తేజస్సు
స్వర్గంలోని ఇంద్రుడు
సాహిత్యములో మనకు దేవేంద్రుడు రవీంద్రుడు
. హరివిల్లులోని ఇంద్రధనస్సు,
అతని మనసు
సహస్ర కవులు అందరికీ తెలుసు,
అతని మంచి మనసు.
నింగిలోని ఒక్కొక్క వర్షపు జల్లు,
అవని పైన ప్రవహించే నదులు.
. నేను రాసే కలముతో అక్షరాలు,
సమాజములో కవిత అల్లికలు,
రవీంద్రుని మెడలో పుష్పమాలలు.
మకుటంలేని వజ్రకిరీటం
తెలుగు సాహిత్యానికి గర్వకారణం,
రవీంద్రుడు అంటే
అందరికీ మమకారం
రవీంద్రుని ఆత్మీయత
అభిమానానికి
నా వందనం అభివందనం
మీరు సాహిత్యానికి
విజయకేతనం.
మీకు నా కవిత అంకితం,
🙏🙏🙏🙏.
మీ పదవి విరమణ
అందరి ఆదరణ
తెలుగు సాహిత్యానికి
. మీరు అందించిన
ప్రేరణ
నాకు ఆదరణ
.. ఇట్లు
రజని కులకర్ణి
కలం సంజవిని.
ఉర్దూ చార్మినార్
చరవాణి సంఖ్య
9296450010.
60
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
పేరు: విజయదుర్గ
కవితా అంశం : మేక రవీంద్ర సాహితీసేవ
కవితా సంఖ్య: 248
తేదీ: 31/05/20
సాహిత్య తరువై శాఖోపశాఖలుగా
విస్తరించిన మహోన్నత వ్యక్తి
ఆది విష్ణువులా వాట్సాప్ కి
సింహద్వారమై
సాహీతీ వేత్త లకు ఆహ్వాన గీతిక....!!
నింగి అంత నిబ్బరంతో
భూదేవి అంత ఓర్పుతో
చెదరని చిరునవ్వు సంతకాల తో
ఆత్మీయతా రాగాల భాస్కరుడు....!!
ఉదయరాగాలన్నీ పరుల సేవకే
అజాత శత్రువై స్నేహ వాకిళ్ళకి
గౌరవ పూమాలై
వాగ్ధేవికి పాదకుసుమం తాను....!!
తలచిన వెంటనే సంకల్ప
మధనానికి చైతన్యమై
కవులందరినీ తన అభిమాన దారాలతో అల్లుతూ
ఒక్కటి గా నడిపిన నవీన ఆంధ్రభోజుడు రవీంధ్రసర్....!!
🌹వినీల🌹
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: On duty ever
61
కొందరెప్పటికీ
ఒక అద్భుతమే..!
వృత్తికి, ప్రవృత్తికి
అంతుచిక్కని
ఆశ్చర్యమే... !
చదువేమో
సాంకేతికం
అనురక్తి చూస్తే
సాహిత్యం... !.
అదేందో మరీ
గమ్మత్తుగా
నేర్పించి రాయించి
రాయంచగా మలచి
తిరిగి సన్మానించి
సహస్ర కిరీటములనిచ్చి
తను మాత్రం
పసిపాపలాంటి
ఓ తెల్లని నవ్వు రువ్వుతూ
అలా ఉండిపోతారు...!
ఆ బుర్ర సాహిత్యానికొక
ప్రయోగశాల మరి,
పొద్దస్తమానం
ప్రయోగాలు
చేస్తూనే ఉంటుంది...!
వాట్సాప్ కనిపెట్టిందెవరో కానీ
కవిత్వానికి దీనిని
వేదిక చేసింది మాత్రం తానే... !
అక్కడితో ఆగుతామా
అస్సలు లేదు
పోడ్కాస్ట్ లు జూములు
వేల వేల పుస్తకయజ్ఞాలు
ఏది చేసినా
అగ్రతాంబూలం తనదే... !
ఆ మేధస్సు నిత్య ఉషస్సు
ఓ మేకా రవీంద్ర సారూ
ఎవరన్నారు మీకు
పదవీ విరమణ అని
మీరెప్పుడూ on duty యే
ఇంకెందరెందరో నవ్యకవులు
మీ నిస్వార్థమైన
చేయూతకై వేచిచూస్తున్నారు
తల్లి శారదాంబకు ప్రియపుత్రులు
వర్ధిల్లాలి నిండు నూరేళ్లు
ఆయురారోగ్యాలతో
హాయిగా.... !!
రమాదేవి కులకర్ణి
సహస్ర కవిమిత్ర
కణిక
( సాహిత్య, సామాజిక సేవా వేదిక )
హైదరాబాద్
8985613123
62
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥 *కణిక*🔥
*మంచి మనసుకు స్వాగత తోరణం*
పరిచయం అనంతం
మాట మృదుత్వం
సహస్ర కవిత సుమం
పరిమళించెను సాహితి ప్రపంచం
లక్షల రచనల భావం
ఎందరెందరో భాషాభిమానులు చే
వాట్సాప్ వేదికల సమూహము తో
కవి పుంగవులు,కవిశిరోమణులను
పరిచయం చేసిన
సహస్ర కవి దిగ్గజం
కృషి ఉంటే......
మనుషులు ఋషులు అవుతారు
అన్న దృడ సంకల్పం
పొలములో విత్తనమేస్తే
సాగు చేసి పంట పండించినట్టు
ఈ సాహిత్య జగత్తునా
ఎందరికో మార్గదర్శకం అయి
కవికలాదుల చే
కవన కుసుమాలు పండించిన
అతిరత మహారథుడు
*రవి తేజోమూర్తి రవీంద్రుడు*
ఉద్యోగ బాధ్యతలు చేపడుతు
కవన రంగానికి
కలం పట్టిన అక్షర సేద్యుడు
నేడు పదవికి విరమణయే
కాని.....
అక్షర పూ తోటలో
నిత్య ఉషోదయపు సుమం
ఆ సుమధురపు పరిమాళాను
పూయించే
*మంచి మనుసుకు*
*నా స్వాగత తోరణం*
------ *గంగ్వార్ కవిత కులకర్ణి*✍🌹
63
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: కణిక
మొహమ్మద్. అఫ్సర వలీషా
అంశం....మేక రవీంద్ర సార్ సాహితీ సేవ
కవితా సంఖ్య...57
తేదీ....31_5_2020
శీర్షిక..... నిత్య సాహితీ సేవకులు
అలుపెరుగని ఆ దేహం
సాహితీ పరిమళాల సోయగం....
పలు సాహితీ ప్రక్రియల ప్రస్థానం
పలు పలు బిరుదుల ప్రహసనం...
చెరగని చిరునవ్వుల
ఉత్సాహ మయూఖం....
ప్రేమాభిమానాల నిష్కల్మష
నిస్వార్థ నిరాడంబర జాబిలి పూర్ణ చంద్రం....
ఉన్నత వ్యక్తిత్వ మితభాష
నిత్య సాహితీ కుసుమం....
సుగుణాల సంస్కారులు ఎదిరె
చెన్న కేశవులు గారి ముద్దుల (మనవడు) మణిరత్నం....
నైతిక విలువల నిలువెత్తు రూపం
అంజనీదేవి లక్ష్మణరావు దంపతుల ఆరవ ప్రాణం....
తెలుగు వైభవ సృష్టి కర్త
సాహితీ సుస్సంపన్నం...
తెలుగు తల్లి ముద్దు బిడ్డడు
విశిష్ట సేనాపతి బిరుదాంకితం....
శ్రీయుతులు మేకా రవీంద్ర సార్ గారికి హృదయపూర్వక అభినందనం....
ఆయన సాహితీ సౌరభం
దేశ విదేశాల కవులకు అంకితం.....!!
64
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్యమే శ్వాసగా...
తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢసంకల్పంతో...
నిరంతరం సరికొత్త ఆలోచనలతో సాహిత్యాన్ని పరుగులు పెట్టిస్తూ...
నవ యువ కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ మేక రవీంద్ర గారి గురించి ఎంత చెప్పుకొన్న తక్కువే...
సాహిత్య అభిమానిగా,సాహిత్య పోషకుడిగా...
రికార్డులను సృష్టించడంలో మేటి గా చెప్పవచ్చు..
వాట్సప్ సాహిత్య గ్రూపుల ద్వారా ...
అంతర్జాల కవి సమ్మేళనం ను నిర్వహించడం...
కవులకు ప్రోత్సాహకాలను అందించడం..
పుస్తకాలను ప్రచురించడం....మొదలగు సాహిత్య సంబంధిత కార్యక్రమాలకు పెట్టింది పేరుగా మేక రవీంద్ర గారు గుర్తింపు తెచ్చుకున్నారు....
ముఖ్యంగా
అంతర్జాల రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది తన నవకల్పన ఆలోచనకు దర్పణం పట్టింది...
ఎందరో ప్రశంశలు అందుకుంది...
ఇదొక సువర్ణ ఘట్టం...
వృత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని పలువురి మన్ననలు పొంది నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ మేక రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు....
వృత్తిలో నే కాకుండా ప్రవృతికి తన ప్రాణంగా ప్రేమించి ఎంతో మంది సాహిత్య కారుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవడం మాములు విషయం కాదు...
చాలావరకు నేను అనే
స్వార్థం తో నిండిపోయిన ఈ లోకంలో మనం అనే తలంపును గట్టిగా నాటి విలువలతో కూడిన సమాజం కోసం....
చైతన్య పూరిత శంఖారావం కోసం...
సాహిత్యం అత్యంత బలమైన ఆయుదంగా భావించిన వారు మేక రవీంద్ర గారు....
ఆలోచనలను ఆచరణలో పెట్టగలగడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైనది...
అంతర్జాలన్ని ఆయుదంగా చేసుకుని అందరిని ఒక వేదికపైకి తీసుకురావడం అనేది మాములు విషయం కాదు...
ఎన్నో సవాళ్లు,విమర్శలు,సాంకేతిక కష్టాలు...
అన్నింటినీ అధిగమించి సఫలీకృతులు అయ్యారు అని సగర్వాంగా చెప్పవచ్చు....
సాహిత్య లోకానికి దొరికిన ఒక మణి మాణిక్యం రవీంద్ర గారు...
ఇక పూర్తి స్థాయిలో సాహిత్య సేవ చేస్తూ...
సరికొత్త పధంలో ముందుకు సాగుతూ...
సాహిత్యలోకాన్ని నడిపించాలని
సమాజ హిత్ సాహిత్యం కోసం కృషిగావించాలని మనసారా కోరుకుంటూ...
హృదయపూర్వక
అభినందనలతో...💐💐💐💐💐💐💐
అక్షరాల తోవ
ఖమ్మం
65
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్య కృషీవలుడు
సాహిత్య నిధి శ్రీ ఎదిరె చెన్నకేశవులు
వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
అంజనీదేవి లక్ష్మణరావుల తనయుడైన
అభినవ భోజుడు శ్రీ మేక రవీంద్ర గారు
చిరు దరహాస వదనంతో
మృధు మధుర భాషణంతో
నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనమై
ఎంత ఎదిగినా ఒదిగి వుండే ఔన్నత్యంతో
సాహితీ సౌరభాలను గుభాళించే
సహృదయుడు శ్రీ మేక రవీంద్ర
దాశరథి కవితా సమూహంతో
ఎంతోమంది కవులకు మార్గదర్శకుడై
తొలి సాహిత్య సమూహాల సారథి యై
ఎన్నో కవి సమ్మేళనాలను నిర్వహించి
ప్రముఖ వ్యక్తులచే పలు సంస్థలచే
బిరుదులు అందుకున్న సాహితీ సేనాపతి
పేరు ప్రఖ్యాతులను ఆశించకయే
నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తూ
అయిత కవితాయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించి
అంచనాలకు మించి రికార్డు స్థాయిలో
కవితా సునామీని సృష్టించి
అర్హలైన వారిని స్రహస్ర బిరుదాంకితులను చేసిన
సాహిత్య పోషకుడు శ్రీ మేక రవీంద్ర
బాధ్యతాయుత వృత్తిని నిర్వహిస్తూనే
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకుడై
తెలుగు భాషామతల్లికి అక్షరనైవేధ్యం చేసిన
అనితర సాధ్యుడు శ్రీ మేక రవీంద్ర
అంతర్జాల రేడియో కార్యక్రమాలు
సామాజిక మాధ్యమాల ద్వారా
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటి
కవుల హృదయాలలో ఆత్మీయస్థానమందుకున్న స్పూర్తి దాయకుడు సాహిత్యకృషీవలుడు
పాలమూరు జిల్లాకు తలమానికమైన
సాహిత్య సేవకుడు శ్రీ మేక రవీంద్ర
( శ్రీ మేక రవీంద్ర గారి పదవీ విరమణ సంధర్భంగా )
✍పులి జమున
66
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: అతనొక తెలుగు తేజం ......
సహస్ర కవి సమ్మేళనం
సహస్ర చిత్ర కారులు
సహస్ర అంతర్జాలం
సహస్ర వీడియో ఆడియో సమ్మేళనం
ఏవైనా ఏదైనా
కవులను ఉన్నత శిఖరాలపైకి
తీసుకుని రావలనుకుంటరు
మానవత్వం నింపుకున్న
మంచి మనిషి.....
వృత్తిలో ఎదుగుతూ
తెలుగుభాషకై ఒదుగుతూ
ఎన్నో పురస్కారాలు అందుకుని
ఘనత పెంచుకున్న వ్యక్తి ...
మాతృభాష పరిరక్షణకు
అహర్నిశలు కృషి చేస్తున్న
మహోన్నత వ్యక్తిత్వం...
మేకల రవీంద్ర గారికి
అక్షరాలతో కీర్తించడం
వీలైతే అక్షర మాలలు
సమర్పించడం కన్న
మనమందరం ఏం చెయ్యగలం ...
చిరునామా
యడవల్లి శైలజ/కలంపేరు: ప్రేమ్
పాండురంగాపురం( గ్రామం )
ఇంటి నెంబర్ 6-36,బల్లేపల్లి (పోస్ట్ )
ఖమ్మం జిల్లా-507002
చరవాణి: 9394171299
తెలంగాణ రాష్ట్రం
Ysailaja7774@gmail.com
67
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: తేదీ::31-05-2020
🔥కణిక🔥
పేరు:వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:; అభినవ భోజుని భాషా సేవ
సంఖ్య::169
------------------------------------
తెలుగు సాహిత్యాన్ని
వివిధ ప్రక్రియల్లో విస్తరింపచేసిన
తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన మహనీయుడు
అభినందన తెలంగాణ భోజుడు
అంతర్జాలాన్ని అక్షరాల సేవకై
ఉపయోగించుకున్న తెలుగు భక్తుడు!
ప్రపంచ వ్యాప్తంగా భాషాభిమానులను ఒకటి చేసి
సాహిత్యానికి ఎల్లలు లేవని నిరూపించిన సాహితీ సార్వ భౌముడు!
తాత గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
నిత్యం సాహితీ యజ్ఞం చేయించిన
సోమయాజి!
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటి
ఎందరికో స్ఫూర్తి నిచ్చిన మహా మనిషి!
కవి సైన్యానికి అధ్యక్షుడై భాషను కాపాడుతూ
విశిష్ట సేనాధిపతి బిరుదు పొందిన
మేక రవీంద్ర గారూ!
భావి జీవితం నిత్యం భాషామ తల్లి సేవ చేస్తూ
ఆనందంగా ఆరోగ్యంగా ఇలాగే కలకాలం
కొనసాగాలని మనసారా కోరుకుంటూ
హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు
పేరు:: వురిమళ్ల సునంద, ఖమ్మం
తెలుగు భాషోపాధ్యాయిని
9441815722
68
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: 🔥కణిక🔥
కోణం పర్శరాములు
సిద్దిపేట బాల సాహిత్య కవి
అంశం : మేక రవీంద్రుల సాహితీ సేవ
రచన సంఖ్య : (124)
శీర్షిక : సాహితీ ప్రియుడు రవీంద్రుడు
తేది : 31-05-2020
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
అతడు కవి కాదు
కవిత్వ ప్రియుడు
అతడు చేసే వృత్తి వేరు
ఎంతుకున్న ప్రవృత్తి వేరు
అతడు చదివింది ఇంజనీర్
చేస్తుంది అమ్మ భాషకై ఆరాటం
సివిల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తునే
ప్రాచీన భాషకు ప్రాణం పోశాడు
అంతరిస్తున్న అమ్మ భాషకు
ఆయువుపోషాడు
తెలుగుభాష తేజస్సు కై
వెలుగులు విరజిమ్మే దివిటీ
అచ్చులు హల్లులతో అందమైన
నిండైన భాష
ఎందరెందరో నవయువ
కవులను,కవయిత్రులు ఏకంచేసి
ఎన్నెన్నో సాహితీ సమావేశాలు
నిర్వహించిన ఘనత రవీంద్రడు
మరెన్నో కవితా సంకలనాలకు
సంపాదకీయం వహించారు
ఎక్కడ తెలుగు సభలు సమావేశాలు జరుగనున్న
టక్కున అచ్చోట ప్రత్యెక్షం
ఎంతోమంది భాషాప్రియులతో
పరిచయాలు
పుస్తక ముద్రణలు
ఇందుగలడు అందులేడనే
సందేహమే వలదు
ఎందెందు వెదికినా అందందే
కలడు మేక కవీంద్రుడు
రవీంద్రుడు
రవీంద్రుడు ఉద్యోగ విరమణ
పొందినా
అతని పదవికే గాని సాహిత్యానికి కానేకాదు
అతని సాహిత్య సేవ
గంగానది ప్రవాహం లా
సాగిపోతుండాలి
అతని విశ్రాంత జీవితం
భార్యా పిల్లలతో
ఆయురారోగ్యాలతో
సుఖసంతోషాలతో
నిండు నూరేళ్ళు ఆయుష్షును
ఆభగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంందాం!
కోణం పర్శరాములు
సిద్దిపేట,9959524585
69
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: **కవిత గానం **
**31/05/2020**
🌅 **సాహితి బ్రహ్మ **🌅
సాహిత్యానికి రథసారధులు
అనితరసాధ్యం వీరి సాహితి సేద్యం
అమోఘం-అద్వితీయం
అయిదువేలకు పైగా కవులను తీర్చిదిద్దిన ఘనత వీరిదే
నిరంతర అక్షర పోరాటయోధులు
ప్రతికవి కలానికి శ్రీకారమూర్తులు
భువిపై మెరిసి నిలిచిన రవి
**న భూతొ న భవిష్యత్ **
అన్నట్టు
**కవుల కర్మాగారం
అక్షర బాండాగారము **
అక్షరానికి వెలుగును -జిలుగును
సృష్టించిన సహస్రకవి సృష్టికర్త సాహితి ప్రస్థానంలో
అలుపెరుగని బాటసారి
పుస్తకపఠనంతో --,కఠోరశ్రమతో సాహితి పరిమళాల
కవనవనానికి ఆద్యుడు అయ్యాడు
వారి ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించి సాహిత్యాన్ని పోషించారు
అయిదువేల కవనసైన్యానికి
అత్యుత్తమ గురువై
సాహితి తరువై
దశదిశలా ఖ్యాతిని విస్తటింపచేసుకున్న
ఏకైక తెలంగాణ కవితా పితామహులు
వాట్సాప్ సాహితి సమూహాల ఆరంభకులు
మరువలేము వీరి కృషి
సాహితి సేవలో మహర్షి .
**మేక రవీంద్ర గారి పదవివిరమణ సందర్బంగా నా చిరు ప్రయత్నం ,వారికీ అక్షర నీరాజనము **
**స్వర్ణసమత**
**నిజామాబాదు **
9963130856
70
[01/07, 7:54 PM] శాంతా రెడ్డి: సాహిత్య కృషీవలుడు
సాహిత్య నిధి శ్రీ ఎదిరె చెన్నకేశవులు
వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని
అంజనీదేవి లక్ష్మణరావుల తనయుడైన
అభినవ భోజుడు శ్రీ మేక రవీంద్రుడు
చిరు దరహాస వదనంతో
మృధు మధుర భాషణంతో
నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమై
ఎంత ఎదిగినా ఒదిగి వుండే ఔన్నత్యంతో
కవన కుసుమాలను గుభాళింపచేస్తూ
సాహితీ సౌరభాలను వెదజల్లుతూ
అక్షర సేద్యం చేసిన సాహితీ వనమాలి
దాశరథి కవితా సమూహమును
అంతర్జాల కవిత్వ వేదికగా మలచి
ఎంతోమంది కవులకు మార్గదర్శకుడై
తొలి సాహిత్య సమూహాల సారథి యై
ఎన్నో కవి సమ్మేళనాలను నిర్వహించి
ప్రముఖ వ్యక్తులచే పలు సంస్థలచే
బిరుదులు అందుకున్న సాహితీ సేనాపతి
పేరు ప్రఖ్యాతులను ఆశించకయే
నిస్వార్థంగా సాహిత్య సేవ చేస్తూ
అయిత కవితాయజ్ఞం నిర్విఘ్నంగా నిర్వహించి
అంచనాలకు మించి రికార్డు స్థాయిలో
కవితా సునామీని సృష్టించి
అర్హులైన వారిని స్రహస్ర బిరుదాంకితులను చేసిన
సాహిత్య పోషకుడు సహస్ర కవి దిగ్గజం
బాధ్యతాయుత వృత్తిని నిర్వహిస్తూనే
తెలుగు సాహిత్య వైభవం వ్యవస్థాపకుడై
తెలుగు భాషామతల్లికి అక్షరనైవేధ్యం చేసిన
అనితర సాధ్యుడు సాహిత్య సేవాశిరోమణి
సాహితీ పూదోటలో విరిసిన సుమమై
కవుల హృదిలో ఆత్మీయంగా అల్లుకుని
సాహితీ కవన మాలను
తెలుగు భారతికి అర్పించిన సాహితీ సంపన్నులు
అంతర్జాల రేడియో కార్యక్రమాలు
సామాజిక మాధ్యమాల ద్వారా
తెలుగు వైభవాన్ని దశదిశలా చాటిన
సాహిత్యకృషీవలుడు నిష్కల్మష హృదయుడు
పాలమూరు జిల్లాకు తలమానికమైన
సాహిత్య సేవకుడు శ్రీ మేక రవీంద్ర
( శ్రీ మేక రవీంద్ర గారి పదవీ విరమణ సంధర్భంగా శుభాకాంక్షలతో 💐💐💐💐 )
✍పులి జమున







సాహితి పోషకులు, సహృదయులు, గురువర్యులు అయిన శ్రీ మేక రవీంద్ర గారి సాహిత్య సేవను ప్రశంసిస్తూ వారి పదవి విరమణ సందర్భంగా ఇలా అక్షరాభిషేకం గావించడం చాలా అభినందనీయం. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసిన వీరా గుడిపల్లి గారికి, ఇందిరమ్మ గారికి కృతజ్ఞతలు. ఇందులో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు ధన్యవాదాలు. తమ అమృత కవితలు అందించిన ప్రతి ఒక్కరికి అభినందనలు
ReplyDeleteవయసుకు విరమణ ఉంటుంది కానీ ఆలోచనకు, ఆశయానికి కాదు . ఈ విశ్రాంత జీవితంలో మేక రవీంద్ర గారు మరింత సాహిత్య, సమాజ సేవ చేయాలని ఆశిస్తూ... వారికి ఆయురారోగ్యాలను అందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ReplyDelete