కధానిక 22102020
నిర్వహణ
యేరువ ఇందిరా రెడ్డి
వీరా గుడిపల్లి
శీర్షికా సమన్వయం
అక్షర చిత్రాలు రూప శిల్పి
వల్లాల విజయ లక్ష్మి గారు
*****""""************
1.కోరాడ గారు
2.మన్నె లలిత గారు
3.భరద్వాజ గారు
4.యేరువ ఇందిరా రెడ్డి గారు
5.ఉమాదేవి గారు
6.శ్రీలక్ష్మి గారు
7.మిట్టా లక్ష్మి గారు
8.మర్రి జయశ్రీ గారు
9.భాగ్య లక్ష్మి గారు
10.సునంద వురిమళ్ళ గారు
*****************
[22/10, 8:01 PM] Korada: కవుల వేదిక
అంశం:- కథానిక
కోరాడ నరసింహా రావు !
* ఏది మంచిది ...!? *
************
మనం అనుకుంటాంగానీ
కలకాలం... బ్రతక వలసి నభార్దుయా,భర్త...అభిప్రాయ భేదాలతో మనస్పర్థ లు వచ్చి......
విడి పోతున్న రోజులివి!
అలాంటిది....తల్లీ,దండ్రులతో...అన్నదమ్ములు క లిసి...కొడుకులు ,కోడళ్ళు...,మనుమలు,మను మరాండ్రు...అందరూ...
కలసి వుమ్మడి కుటుం బంతో...ఆనందంగాబ్రతికేయాలని...పగటికలలుకంటుంటాం !
ఇది...సాధ్యమయేపనా?
ఈ ప్రప...లో యే యిద్దరి అభిప్రాయాలూ ఒకటి కాలేనపుడు ....
ఇదెలా...సాధ్యమవుతుంది...!?
ఐనా...ఎక్కడివారక్కడ..
ఎవరి బ్రతుకులు వాళ్ళు
హాయిగా బ్రతుకు తూ..
మనుషులు దూరం గా వున్నా....మనసులనిండుగాప్రేమాభిమానాలతో
హాయిగా...ఆనందం గా
బ్రతకటమే...మంచిది ...
కదూ...!కనీసం...కూతురూ,అల్లు
నితో...ఆ మామగారు...
ఆ మామ గారితో...ఈ కూతురు,అల్లుడు... కూడా కలిసి బ్రతక లేరు
అనటానికి...మా నరిసిగాడి అనుభవమే గొప్ప ఉదాహరణ...!
పరిస్థితులు అనుకూలిం చక ...మామగారింటికి ఆ అల్లుడువచ్చి ...కలిసి
బ్రతకాలనుకున్నా...అభిప్రాయాలు...అడ్డువస్తాయని...విడగొట్టి వేరు చే సేస్తాయనివాళ్ళకు బాగా అనుభవమైపోయింది...!
వాళ్ళపద్ధతులు వీళ్లకు నచ్చవు !
వీళ్ళ ప్రవర్తన వాళ్లకు చిరాకు...!!
వాళ్లకు వొప్పనిపించింది వీళ్ళకుతప్పనిపిస్తుంది !
వీళ్లకునచ్చింది ...వాళ్లకు
చిరాకు తెప్పిస్తుంది !!
ఎవరికివారే...రైటు,కరెక్టు సర్దుకు పోయేస్వభావం
ఒక్కరిలోఉంటే సరిపోదు గా....,రెండో వాళ్లలో ఇగో ఎక్కువగా వున్నపుడు!!
నేనుచెప్పినట్టే వాళ్ళు నడచుకోవాలి ...వాళ్ళుచెప్పింది...నేనువినటమేంటి....!?
అనుకునే...అహంభావపుఅహంకారం...ఎక్కువ
కాలం యిమడ నివ్వదు కదా!
అద్వైతంగా...వాదిస్తే...
అడ్డుతగలడం ఒకరి స్వ భావమైతే ...అడ్డుతగి లారని...మరింతరెచ్చిపో వటం మరొకరిస్వభావం!
ఎవరిస్వభావంవారిదే !!
అందుకే....,అంతవరకూ
చిన్న-చిన్నగొడవలతో....
సద్దుమణిగినా ....,
ఆ రోజుగొడవ...నువ్వెంతఅంటే...నువ్వెంతాఅనేవరకూ వచ్చేసింది !
అల్లుడూ...మామలు...
తిట్టు కో కూడనితిట్లన్నీ
తిట్టేసు కున్నారు...!
ఫలితం...ఛీ...యింక నేను నీ ఇంట్లో ఉండను అనుకున్నాడు ఆ అల్లుడు...!అద్దెఇల్లు కోసం...అన్వేషణమొదలు పెట్టాడు...!
పోనీలే...వాళ్ళ దారి వాళ్ళు చూసు కుంటే...
ఇకనైనా ప్రశాంతం గా బ్రతకొచ్చు...అనుకుంటు న్నాడు ఈ మామ...!
అదండీ ...మనబంధాలు ,సంబంధాలపరిస్థితి!
ఇప్పుడుమీరే చెప్పండీ...
దూరంగా...ఉంటూ....
మానసికంగా...ప్రేమాభిమానాలు పెరుగుతూ వుంటే...ఆనందం గా...
ఎవరికి వారు బ్రతకటం మంచిదంటారా....ఉన్నంతవరకూ కలసి ఉంటూ
యింక యిమడ లేక...
నువ్వెంతఅనుకుంటే...నువ్వెంత అనుకుంటూ
విడిపోయేవరకూ...ఈడ్చు కుంటూ....
బద్దశత్రువుల్లా విడి పో వటం,మంచిదంటారా?
ఏది మంచిది ...!?
*******************
........కోరాడ.
2
[22/10, 8:20 PM] +91 74168 63289: కవుల వేదిక
తేదీ :22 10 20 20
పేరు :మన్నె పిన్నక లలిత
అంశం : చిన్నకథ
శీర్షిక :మా తాతగారి పడక్కుర్చీ.
" ముందు అమెరికా పిల్లలకి ఫోను చేయండి .వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది .రెండు రోజులు పడతది .అసలే పెద్ద మనవడు అంటే బాగా ఇష్టం పెంచారు కదా ".
ఆ మాట విని చిన్న కోడలు మొఖం ముడుచుకుంది .అది చూసి ఎవరో అన్నారు" చిన్న మనవడన్నా ఇష్టమేలే". "చిన్నప్పుడు ఇద్దర్ని రెండు భుజాల మీద ఎక్కించి తిప్పేవాడు కదా !సూరయ్య మనవరాళ్ళు ఇక్కడే కాబట్టి ఒక గంటలో వచ్చేస్తారు .అప్పటివరకూ హాస్పటల్ లోనే పెడదాం శవాన్ని . మనవళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చి వెంటనే శ్మశానానికి తీసుకెళ్ళే ఏర్పాటు చేద్దాం" అన్నారు పెద్దమనుషులు.
"ఇంతకూ సూరమ్మ గారు ఏమంటారో"
"అవునవును వెళ్ళి ఒక మాట అడుగుదాం పదండి ." సూరమ్మ గారి దగ్గరకు ఇద్దరు వెళ్లి నెమ్మదిగా చెవి దగ్గర సూరమ్మక్కాయ్! బావని హాస్పిటల్ లో పెడదాము అనుకుంటున్నాం. మన వాళ్ళు వచ్చే వరకు. మీరు ఏమంటారు? వాళ్ళు వచ్చే సరికి రెండు రోజులు పడుతుంది కదా !రాగానే తీసుకొని వెళ్తాము"అని . నోటికి కొంగు అడ్డుపెట్టుకుని ఏడుస్తున్న సూరమ్మ గారు సరేనని తల ఊపారు. ఆవిడకు ఎన్నో గుర్తుకొస్తున్నాయి.
సూరయ్య గారి తండ్రి వెంకయ్య గారు ఆ ఊరికి మునసబు గా పనిచేశారు . సూరయ్య గారు ఒక్కడే కొడుకు కావటంతో బాగా గారాబంగా పెంచారు .ఆడింది ఆట పాడింది పాటగా ఉండేది. చదువుకోటానికి మద్రాసు పంపిద్దాం అనుకుని ఒక్కడే కొడుకు కావడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు .ఊరిలోని బడికి పంపించి ఉన్నంత వరకు చదివించారు .చదవటం రాయటం అంతవరకు నేర్పించారు . వెంకయ్య గారు హూందాగా ఉండేవారు .అందరికీ తలలో నాలుకగా ఉండే వారు .మంచి మనిషి అని పేరు తెచ్చుకున్నారు. అలా తన కొడుకు కూడా పేరు తెచ్చుకోవాలని ఆయన ఆశ.
తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం సూరయ్య గారికి. తండ్రిలాగా రోజ్ఉడ్ పడక కుర్చీలో కూర్చుని చుట్టూ పదిమంది ఉండి చూడటం అంటే చాలా ఇష్టం. అందుకని తండ్రిలాగా హుందాగా ఉండటానికి కోరమీసం పెంచటం మొదలు పెట్టాడు .తండ్రి వ్యవహారాలు చూడలేని పరిస్థితి వచ్చినప్పుడు తాను బాధ్యత తీసుకొని తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు . మునసబు గిరి చేయటమే కాకుండా ఊరికి కావలసినటువంటి సదుపాయములు కరణం గారితో కలిసి చేయటం మొదలు పెట్టి ఊరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దటంలో సూరయ్య గారి పాత్ర ఎంతో ఉన్నది .పడక కుర్చీలో కూర్చుని అన్ని వ్యవహారాలు చక్కదిద్దే వారు. ఆ కుర్చీ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఎవరు దాని దగ్గరికి వెళ్లడానికి భయపడేవారు ."ఆ మహారాజు ఉన్నప్పుడు రోజులే వేరు" అనుకున్నారు మనసులో ఆయనను తలుచుకుని సూరమ్మ గారు.
సూరయ్య గారికి ఇద్దరు కొడుకులు. తన లాగా కాకుండా కొడుకులిద్దర్నీ బాగా చదివించి మంచి ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డారు. దగ్గర్లో ఉన్న ఊరిలో ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో ఇంటి దగ్గర నుండి వెళ్లేవారు . మనవళ్ళు పుట్టి వాళ్లను ఆడిస్తూ మీసాలు పీకించుకుంటూఆనందపడే వారు.
ఆరోగ్యంగానే ఉన్న సూరయ్య గారు గుండె పోటు రావడంతో మరణించారు .మనుమళ్ళు రావటం మనుమరాళ్ళు బంధువుల సమక్షంలో సూరయ్య గారి అంతిమయాత్ర పూల జల్లులతో స్మశానం వరకు సాగింది. అందరూ నిద్ర లేక ఉండి స్నానాలు భోజనాలు అయిన తర్వాత విశ్రమించారు. అప్పుడు పెద్ద మనుమడు సూరమ్మ గారి దగ్గర చేరి విశేషాలు అడిగి" నానమ్మ నాకు తాతగారి పడక్కుర్చీ అమెరికా తీసుకువెళ్లి మా లాన్ లో వేసుకొని దాంట్లో తాత గారి లాగా పడుకోవాలని ఉంది . ఏమనుకోకు ఇలా మాట్లాడుతున్నానని" అన్నాడు కోర మీసం దువ్వుకుంటూ. తాతగారు స్టైల్ లో పెంచడం మొదలు పెట్టాడు. ఒక్కసారి చివుక్కుమంది సూరమ్మ గారి మనస్సు. నానమ్మ పెద్దదైపోయింది నానమ్మకి నడుము వాల్చాలంటే కొంచెం ఉపయోగంగా ఉంటుంది అని అనుకోకుండా తను అమెరికా తీసుకువెళతానని అడగటం, అది ఈ సమయంలో ఈరోజే అడగటం అంతగా నచ్చలేదు ఆమెకు .కాసేపు ఉండి వెళ్లి అమ్మ దగ్గరకు వెళ్లి పోయాడు.
చిన్న మనుమడు వచ్చాడు .చిన్న మనుమడు కూడా అదే కోరిక కోరాడు "చూద్దాం నాన్న "అన్నది చిన్న మనవడుతో. మనుమ రాళ్ళు ఇద్దరు వచ్చారు." నానమ్మ నీకు ఏడువారాల నగలు ఉండేవంట కదా !మీ అమ్మ వాళ్ళు పెట్టారు అంట కదా! పెళ్లి అయ్యాక "కుందనం కూటికి వస్తుందా "అని అమ్మి పొలం కొన్నారట కదా! నీ చంద్రహారం నాకు ,పట్టెడు దీనికి ఇస్తానని అన్నావు కదా నానమ్మ .అవి ఎలాగో ఇక నువ్వు పెట్టుకోవు కదా !మా ఇద్దరికీ ఇచ్చేస్తావు కదా!" జరిగింది బాధపడకుండా ఒక్కొక్కరూ ఇలావచ్చి అడగటం సురమ్మగారికి చాలా బాధ కలిగించింది .ఆ రాత్రి గత స్మృతులతో ఆవిడకు నిద్రపట్ట లేదు. ఎవరిని ముట్టుకోనిచ్చేవారు కాదు పడక్కుర్చీని .పిల్లలు పాడు చేస్తారని ఎవరిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు మనుమలు అడిగితే ఆవిడ సందిగ్ధంలో పడిపోయారు .ఎవరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. నిజానికి పెద్ద మనుమడు అంటే చాలా ఇష్టంగా ఉండేవారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ? మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చి కునుకు పట్టింది.
తెల్లవారుతూనే పెద్ద కేక విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు .పడక్కుర్చీలో కిందపడిపోయి ఉన్న సూరమ్మ గారిని మెల్లగా లేవదీశారు ." నానమ్మ అలా ఎలా పడిపోయావు ?అయ్యో! ఎప్పుడూ ఇలా జరగలేదు .ఎందుకు ఇలా అయింది?" అన్నాడు పెద్ద మనుమడు ."ఏమో నాన్న! నడుము నొప్పిగా ఉండి పడుకుందామని దాని దగ్గరకు వెళ్లాను విరిగిపోయింది. కింద పడిపోయాను ." అన్నారు సూరమ్మ గారు ఆవిడని లేపి అంతా చెక్ చేశారు. మనుమళ్ళు ఇద్దరు ఒకరు అడిగింది ఒకరికి తెలియకపోయినా ఇద్దరి మనసుల్లో బాధగానే ఉంది. పడక్కుర్చీ విరిగిపోయినందుకు సూరమ్మ గారు మాత్రం తన మనసులో మెరిసినటువంటి ఆలోచనకు మనుమళ్ళకు ఏం చెప్పాలా ?అన్న సందిగ్దంలోనుండి బయటపడినందుకు , విరిగిన కుర్చీ ఇక తీసుకువెళ్లరులే "అని మనసులో అనుకొని "ఒక నెల పోయాక కార్పెంటర్ ని పిలిపించాలి .మూడో తరం పడక్కుర్చీ నాతోనే పోతుంది ".అని మనసులో అనుకున్నారు.
3
[22/10, 8:24 PM] భరద్వాజ గారు: కవులవేదిక
కథానిక
శీర్షిక - *నమ్మకం* *తోబతికిన* *భార్య*
"అక్షరలక్షలిచ్చిపొగడ కుబేరుడ్ని కాదు.పద్యాలు చెప్పి పొగడ కవినికాను" అంటూ భార్యభుజం పై చెయ్యివేసి నొక్కాడు.ఆస్పర్శకు అతని ముఖం లోకిచూసింది వరం.ఆమెమనసులో ఆలోచనలు ఈగల్లా.ముసురుకున్నాయి.వరానికి రవికి పెళ్ళికుదిరింది.హనీమూన్ కు పోయే స్ధోమత లేనందున తిరుపతికిబయలుదేరారు.రాత్రిఎక్కిన రైలు తెల్లవారు ఝామున ఏర్పేడు స్టేషన్‌కుచేరింది.సింగిల్ ట్రాక్ కావటంవల్లవెంకటగిరి నుండి రైలు వస్తేగానికదలని రైలు అదివెళ్ళినాకదల్లా.విచారించగా డ్రైవరుస్టీరింగ్ పై పడిఉన్న అతన్ని అందరితోచూసినలుగురిలా ఊరుకోకుండా అతనిచొక్కాఊడదీసి గుండెలపైమర్ధనచేసినోటిలోగాలి పెట్టినోటితో ఊదింది.అందరూముక్కుమీదవేలువేసుకున్నా
ఎగతాళిగామాట్లాడినాపెళ్ళయిమధుపర్కాలు అయినావిప్పనిఆడపిల్లనిచూసిభర్త ఏమంటాడో అనుకుంటేభుజం పైచెయ్యివేసినొక్కితనపైనమ్మకం ఉంచిన భర్తకు కాళ్ళకునమస్కారం చేసిందికన్నీళ్ళతో.లేపిన భర్త గుండెలపైవాలిపోతూ--!
భరద్వాజ రావినూతల
ఊరు-కొత్తపట్నం
చరవాణి9866203795
4
[22/10, 8:26 PM] Indira Reddy Yeruva: యేరువ ఇందిర రెడ్డి
జ్ఞాపకం కథానిక
*******************
ఆ ఊర్లో బతుకమ్మ పండుగ అంటే సూర్యకిరణాలు సోకని
మనిషి ఉండున , వానకు తడువని మనిషి ఉండడు అన్నట్లు . బతుకమ్మ పండుగ తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో
ముందుగా బొడ్డెమ్మ పుట్టమన్ను తెచ్చి
మెత్తగా చేసి ఐదు అంతస్తు ల్లా పేర్చి
కట్ల,రుద్రాక్ష పూలతో పేర్చి చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళు ఆడి పాడి లయబద్దంగా చప్పట్లతో పాటలతో
సందళ్లు , మహాలయ అమావాస్య నాటి వరకు బొడ్డెమ్మ ఆ రోజుతో గునుగు తంగేడు ,గడ్డి జాతుల పూలు ,పట్టుకుచ్చు పూలు ప్రకృతిలో సహజసిద్దమైన పూల బతుకమ్మ పేర్చి చెరువు కుంటల్లో వాగు వంకల్లో నిమజ్జనం చేసే సంప్రదాయం వెనుక శాస్త్రీయ దృక్పథం,ఔషద మూలిక ల గుణాల వల్ల నీటి శుద్ది జరిగేది
అదే సమయంలో పంటలకు ఆ నీరు చీడ పీడల నివారణకు ఉపయోగపడి పంటలుబాగ పండటమే కాక,ఆ ఊరి నుంచి వెళ్లిన ఆడపడుచుల తిరిగి పుట్టింటికి స్వాగతించే పండుగ అందర్నీ ఐకమత్యం తో ఉంచి
పల్లె వాతావరణం ఆస్వాదించే పండుగ బతుకమ్మ పండుగ
ఎప్పుడు ఏదో పనులతో తలమునకలై యాంత్రిక జీవనానికి కొంత విరామం ఇచ్చే స్త్రీల పండుగ. అమ్మ ఒక పక్క, నాన్న ఒక పక్క పేర్చుత ఉంటే మేము గునుగు పూలు తుంపి రంగులు అద్ది
అందించే జ్ఞాపకం మనుసుకెంతో హాయి..
గోల్పుతుంది. ఆ రోజులు పోయి డీజే హోరున మోతలు
తప్ప ఆ చక్కటి వాతావరణమే కరువైంది నేడు.
సాయంత్రం కాగానే ఆడ పిల్లలం అంతా పట్టు పరికిణీలు వేసుకొని అమ్మ వాళ్ళు అంతా పట్టు చీరలు కట్టుకొని అందంగా అలంకరించుకునే పండుగ ఎప్పుడు
మనుసు పొరల్లో నిలిచిన జ్ఞాపకమే...
--యేరువ ఇందిర రెడ్డి
హైదరాబాద్.
****************
5
[22/10, 8:26 PM] Uma Devi MV: కవుల వేదిక
అంశం ... కథానిక కథానిక
పోలీస్ బావ
శరత్ బాబు అంటే నాకు చాలాఇష్టం.మేనమామ కొడుకు,బాల్యమిత్రుడూ కూడా కావడంతో చాలాచనువుగా ఉంటాం.చక్కని ఒడ్డూపొడుగూ,ముఖంలో ఎప్పుడూ చిరునవ్వుతో చాలా మాటలపోగు కూడా శరత్.మనసులో ఏదీదాచుకోడు.డిగ్రీకాగానే నేను టీచర్ ట్రైనింగ్ చేశా.కొంత కాలంచూసినా గవర్నమెంట్ ఉద్యోగంరాకపోవడంతో నలుగురుమిత్రులను కూడేసి అందరంకలిసి స్కూల్ పెట్టి నడుపుతూ ఉన్నాము.క్రమశిక్షణ,ప్రత్యేకశ్రద్ధల వల్లఊరిలో మంచిపేరు వచ్చి, విద్యార్థుల సంఖ్యబాగా పెరిగింది.
శరత్ కి కూడా సొంతమేనమామ పోలీస్ ఉద్యోగం ఇప్పించి కూతురునిచ్చి పెళ్లిచేశాడు.కాస్త ప్రశాంతంగా ఉండే ఉద్యోగం కాకుండా ఇలాంటిది ఎన్నుకోవడం నేను వ్యతిరేకించాను శరత్ ని ముందే హెచ్చరికచేస్తూ !
"ఏం చేసేది బావా !ఏజ్ బారైపొతే ఇదికూడా దక్కదు.చాలా శ్రమపడాల్సి వచ్చింది దీనికికూడా.నా శక్తివరకూ చేస్తాను.బావా!" అన్నాడు శరత్. "సర్లే, జాగ్రత్త"అన్నా.
కొత్తగా టౌన్లో కాపురంతో అప్పుడప్పుడూ కనిపిస్తుండడం, ఉద్యోగం విశేషాలు చెప్తూ ఉండేవాడు శరత్.నా బడిలో అభివృద్ధి చర్యలూ,కొన్ని కొత్త బాధ్యతల వల్ల ఆరునెలలపాటు శరత్ ను కలవడం వీలుకాలేదు. ఫోన్ లో కూడా ముక్తసరి మాటలతో నిమిషం లోనే కట్ చేసేవాడు శరత్. ఆదివారం నాకు తీరిక. వాడు మాత్రం అసలు దొరికే వాడుకాదు ఫోన్ లో కూడా.
మా మామయ్యని అడిగాను ఓసారి."ఎలా ఉంది శరత్ ఉద్యోగం బాధ్యతలూ.. అవీ "అని. "చేయాలిగా ఎలా ఉన్నా.. సమస్యలనేవి ఏరకం ఉద్యోగంలో నైనా తప్పకుండ ఉంటాయి వాసూ !మన వైఖరినే దానికి అనుగుణంగా మార్చుకోవాలి. లేకుంటే ఎక్కడా ఇమడలేరు ! ఆ స్టేషన్లో ఎన్నో సమస్యలున్నాయి నేను చెయ్యలేను అని మొండికేసాడు మొన్న,నేను సర్ది చెప్పిన !"అన్నాడు మామయ్య. "పోలీస్ లంటే జనాలకి భయంకదా మామయ్యా, సమస్యలు ఏముంటాయి? "అన్నా ఆశ్చర్యంగా.
"ఎవరికి తగ్గబాధలు వాళ్ళకి ఉంటాయి వాసూ !పై వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటూ ఉండాలి. దానిలో కూడా మంచి,ధర్మం అంటూ పొతే ఎలా.. ఆ పైవాళ్ళకీ అంత కన్నా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.ఇక ఒకదొమ్మీ లాంటి విషయాలలో లోతుగా చర్చ అనవసరం. అప్పటికి ఏమిటి చేయాలో అవగాహన చేసుకో కుండా అదేదో కుటుంబం విషయం అంతగా తలకెక్కించుకొని ఇంట్లో కూడా అదే ఆలోచన తో ఉంటే ఎలా..? "అన్నాడు మామయ్య.
ఒక రోజు గుడిలో కనిపించడంతో శరత్ భార్య రజనీని పలకరించాను.ఆ అమ్మాయి అదో టైపు.మెటీరియలిస్ట్ అనుకోవచ్చు.అన్నిటికి ఆ.. ఊ లు తప్ప సరిగా మాట్లాడదు."శరత్ ఎలా ఉన్నాడమ్మా? "అనిఅడిగాను.
"ఆయన కేమి బాగానే ఉన్నాడు. మధ్యలో నాకొచ్చింది.. ఆసంపాదన కూడా ఆకేసుల్లో వాళ్ళకోసమే తగలేసి వస్తుంటాడీమధ్య.అదేమంటే నీకు మనసు లేదా అంటాడు అన్నయ్యా.. ఏం మనిషి? ఊరి వాళ్ళ గొడవలు మనకెందుకు? ఒక్కొక్కరు రెండు చేతులా సంపాదన ఏ ఉద్యోగం లో అయినా. ఈయన కూరలు, పళ్ళు తేవడం కూడా నన్నూ పిల్లల్ని ఉద్ధరిస్తూ ఉన్నట్లు మాటలు.. ఇక నేను ఊరుకొనేది లేదని మొన్న గొడవ పెట్టుకున్నా. "ఆవేశంగా చేతులు తిప్పేస్తున్నాది రజని, అది గుడి అనేవిషయం కూడా మర్చిపోయి. బయట మెట్లమీద కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ మూలవిరాట్టు కూడా ఈ పోలీస్ బాధలు వింటూ ముక్కున వేలేసుకునే వాడేమో!"అమ్మాయి, సర్దుకొనిపోమ్మా,వాడు కొంచెం సెన్సిటివ్లే చిన్నప్పటి నుండీ అంతే ! "అని చెప్పి వచ్చేసా."కోరి ఆ ఉద్యోగం ఇప్పించిన మా మామయ్య కూతురికీ ఆ మాత్రం నచ్చజెప్పలేదా.. అనుకున్న. నిజానికి శరత్ మెరిట్ వల్లనే ఆ ఉద్యోగం వచ్చింది. ఈయన కట్నకానుకలు తగ్గింపు కోసమే అందరికి ఆఉద్యోగం తానే ఇప్పించినట్లుగా చెప్పుకున్నాడని తర్వాత తెలిసింది.
ఇంటికివచ్చాక కూడా రెండ్రోజులు దొరకడం లేదు
శరత్ ఫోన్లో. ఒక రోజు రాత్రి పన్నెండు అప్పుడు రజని కాల్ చేసింది. "ఏంటి రజని,
ఇప్పుడు..? ఏమైందమ్మా
"అన్నాను నిద్ర కళ్ళతో.
"ఆయన రాత్రిళ్లు నిద్ర పోకుండా ఏదో ఆలోచనతో పైకప్పు చూస్తూ.. కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు అన్నయ్యా. వారం నుండి."అన్నది రజని.
"మరి ఏంటి అనిఅడిగావా?" అన్నాను. "ఏమో నాకేం తెలుసు.. వొండిపెడుతున్నాగా..? "రజని పెళుసు జవాబుకు చాలా కోపం వచ్చింది నాకు. మాఇంట్లో పద్ధతివేరే. మా అమ్మ గానీ,మా ఆవిడ మోహన కానీ ఇంట్లో ఎంతపని ఉన్నా మగవాళ్ళగురించి మానసికo గా ఆదరణతో అభిమానంతో పట్టించుకుని అవసరమైతే సలహాలు కూడా ఇచ్చి, ఒకభరోసా కలిగిస్తూ ఉంటారు. అదేకాబోలు కార్యేషు మంత్రి పద్యం సారాంశం.
"రజనీ నెమ్మదిగా అడిగిచూడు. పనివొత్తిడి కావొచ్చు.మనం పట్టించుకోకుంటే ఎలా? నాకో సారి ఫోన్ చెయ్యమనిచెప్పు. నేను చేసినా లిఫ్ట్ చేయడంలేదు. అనిచెప్పాను.
కానీ శరత్ ఫోన్చెయ్యలేదు.ఆ మధ్య రోడ్డువెడల్పు చేసేపనిలో ఫుట్ పాత్ మీదపండ్లు అమ్మేవాళ్ళను తొలగిస్తూ, ఒక ముసలామెఅమ్ముతున్న అరటిపండ్లగంప పక్కన కాలువలో పడిపోయిందని.. ఆమె ఏడుస్తూ ఉంటే, అక్కడ డ్యూటీలో ఉన్న శరత్ ఆమెకు. ఓదార్పుగా.. పండ్లఖరీదు గంపఖరీదుతో సహా సొంతడబ్బులు ఇచ్చినట్లు, ఆమె సంతోషంతో శరత్ ను దీవిస్తూ వెళ్లిన కథనము పేపర్ లో వేశారు. ఫర్లేదు..మనోడు బాగా పని చేస్తున్నాడు అనుకున్నాను.
రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈమధ్య బంధువుల శుభకార్యాలలో రెండుసార్లు శరత్ కుటుంబం తో సహా కనిపించడం జరిగింది. కాస్త లావుగా కనిపిస్తున్నా ముఖంలో కాంతి లేదు. నవ్వుతూ కౌగలించుకొని "ఎన్నాళ్ళు అయింది బావా, నిన్ను చూసి "అంటూ గంటసేపు మాటలు నాతో.
బాగానే సరదాగా గడిచింది ఆరోజు".దొమ్మీలు,కులాంతర ప్రేమ పెళ్లిళ్లు,రాజకీయ కేసులలో వొత్తిడి గానే ఉందని. అప్పుడు నిన్నే గుర్తు చేసుకొని ముందుకెళతా వాసు బావా !"అని శరత్ అంటూ ఉంటే ఇద్దరం ఒకే వయసువాళ్ళ మైనా నాకు గురుస్థానం ఇచ్చినట్లు అనిపించి చాలా సంతోషం వేసింది.
రజని కూడా బాగానే సర్దుకుంటూ ఉందని మోహన నాతో అన్నది.ఉన్నట్టుండి ఒక రోజు ఉదయం పేపర్లో వార్తల్లో పేరుమోసిన కేడీని పట్టుకోవడంలో కానిస్టేబుల్ శరత్ బాబుకి కత్తిపోట్లు .. అని ఫోటోతో సహా చూసి వణికిపోయా.వెంటనే మామయ్యకీ ఫోన్ చేశా. నిజమేనా అని. అందరు హాస్పిటల్ దగ్గరేఉన్నామని నిన్న రాత్రి చాలా పొద్దుపోయాక తమకు తెలిసినదని చెప్పడంతో బాటూ ఆయన యేడవడం మొదలు పెట్టాడు."నేను వస్తున్నాను మామయ్యా. మీరు భయపడొద్దు అని మోహనతో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లాను.అక్కడ చాలా మంది పోలీస్ లు, అధికారులు ఉన్నారు.శరత్ కు ఛాతీ లో బలమైన కత్తిపోట్లు తగిలాయని,గుండెకు అతి దగ్గరలో గాయం ఉందని, చాలా రక్తంపోయిందని తెలిసినది.మా వాళ్ళను ఓదార్చి ఇంటికి పంపేసాను.అక్కడ ఉండి ఎప్పటికప్పుడు డాక్టర్ సేవలు అందేలా చూడమని అధికారులు అందరికి చెప్పి వెళ్లారు.వారంరోజులు ఐ సి యు లో ఉన్నాక శరత్ బాగా కోలుకొంటున్నడు. డిశ్చార్జ్ అయ్యాక అతనికి మూడు నెలలు సెలవు మంజూరు అయింది.
ఆరోజు జరిగిన సంఘటనలో శరత్ ఆ రౌడీని లొంగిపొమ్మని చెప్తుంటే నెట్టేసి పరిగెత్తాడని,శరత్ ను కత్తితోబలంగా పొడిచినా పరిగెత్తి రౌడిని పట్టుకొని తోటిపోలీస్ లకు అప్పగించి ఒరిగి పోయాడని తెలిసింది.
శరత్ సాహసం తో అతనికి జాతీయ అవార్డు వచ్చింది.ఇప్పుడు పోలీస్ బావ అంటే ఇంకా ఇష్టం పెరిగింది నాకు!!
(సమాప్తం )
ఎం. వి. ఉమాదేవి
7842368534
6
[22/10, 9:13 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవుల వేదిక
తేదీ :22-10-2020
అంశము: కథానిక
పేరు :శ్రీలక్ష్మి చివుకుల
కథా శీర్షిక: పులిగాడు
సూరి గాడికి ఆకలి వేస్తోంది.
ఇంట్లో చూస్తే మంచాన పడ్డ అయ్యా పనితో సతమతమవుతున్న అమ్మ. తనే పెద్దోడుగా పుట్టడం ఒక శాపంగానే భావిస్తాడు ఎప్పుడూ సూరి గాడు.
చక్కగా అందరికంటే చిన్నవాడిగా పుడితే ముద్దుగా చూసుకుంటారు. తెచ్చినదేదైనా చిన్నోడు అంటూ ఇస్తారు. పని ఎవరైనా చెప్పబోతే….
ఆడికి చెప్పమాకర్రా! చిన్నోడు అంటారు.
సూరిగాడు ఆకలి వేస్తున్నా ఎవరినీ ఏమీ అడక్కుండా గడపలో కూర్చుని ఉన్నాడు. తోటి వాళ్లతో సదువుకుందారి అంటే చిన్నా చితకా పనులు చెప్పి ఎందుకూ కొరగాని వాడిని చేశారు.
ఈరోజు తాగుడు మహమ్మారికి బలైపోయి శరీరం కుళ్ళి లేవలేని స్థితిలో మంచాన పడ్డ తండ్రికి, కూలీనాలీ చేసి, పాచిపని చేసి, తల్లి తెచ్చే డబ్బులే ఆధారం. ఉన్ననాడు అన్నం లేనినాడు గంజే పరమాన్నం!
నిండా 19 ఏళ్లు అయినా లేని సూరిగాడికి ఎందుకో బ్రతుకు అంటే భయం వేసింది. తనకు తెలిసిన విద్య ఒక్కటే! అదే పులి వేషం! అవును! పెద్ద పులివేషం! విజయనగరానికే తలమానికం. పండగలొచ్చినా, అమ్మవారి సంబరాలొచ్చినా, మొక్కుబడుల పేరుతో తాము కట్టే పెద్ద పులి వేషం! మరింక ఏ జిల్లాలోనూ కానరాదు.
అయ్య కూడా అదే వేసేవాడు. లంకాపట్నం ఏరియా పులులకూ, దాసన్నపేట ఏరియా పులులకు పోటీ!
ఝనక్…..ఝనా….ఝనక్…..ఝనా….
డప్పులు మోగుతుంటే పూనకం వచ్చిన వాళ్ళలా పులులు గంతులు వేసేవి. బుట్ట పులులు. గులాబిరంగు. ముదురు రంగులో ఉండే బుట్టలు తమవి. అయ్యా ఆడి స్నేహితులు ఈరయ్యా, గోపాలం ఈ మూడు పులులధాటికి విజయనగరం మొత్తంలో తిరుగేలేదు. క్రిందటి అమ్మోరి పండక్కి ఏసం కట్టిన తర్వాత మంచాన పడ్డ అయ్య మళ్ళా లేవలేదు. అప్పట్నుంచే సూరిగాడికి జీవితం అంటేనే భయం పట్టుకుంది.
ఇంతలో అనుకోని విధంగా అదృష్టం లాగా సూరి గాడికి వచ్చిందా అవకాశం.
ఎన్నికలు ఇంకా ఆరు నెలలలో వచ్చేస్తున్నాయి
వచ్చేస్తున్నాయి అధికారపక్షం ప్రతిపక్షం ప్రతినిధులు సుడిగాలి పర్యటనలు చేపట్టారు. కేంద్రం నుండి రాష్ట్రాలవారీగా, రాష్ట్రాల నుండి జిల్లాల వారీగా పర్యటనలు.
జన సమీకరణ ఎక్కడ భారీ ఎత్తున జరిగితే అక్కడ వాళ్ళ పార్టీకి మంచి సపోర్ట్ ఉన్నట్లు! అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రి వచ్చి వెళ్లారు. వెంటనే వారం రోజుల వ్యవధిలో ప్రధాన నాయకుడిని ఢిల్లీ నుండి రప్పిస్తున్నారు. కేంద్రం నుండి అనగానే ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి.
దారిపొడవునా స్తంభాలు వేసి, ట్యూబ్ లైట్లూ, వాటిపై వాళ్ల పార్టీ రంగులూ, కాగితాలూ ఎంత కరెంటు ఖర్చు కావచ్చు? ఏమో? పార్టీ ఫండు కదా!
డయాస్ ఎత్తుగా….ఎవరికీ అందనంత …. చీమైనా చొరలేనంత... రక్షణ ఏర్పాట్లతో మైకులూ, కెమెరాలూ, టీవీ విలేఖరులూ, ఓహ్! ఇంకా ఊరేగింపులు…. మందు గుండు సామాన్లు ఇంకా….
ఆ!ఆ! ఊరిలో ముఖ్యమైన పులివేషాలు. అవును! పులివేషాలు కట్టిస్తే ఇంకా బాగుంటుంది.
అయితే ఎవరికి చెప్పాలి? సీతయ్య పార్టీ గుర్తొచ్చింది. కార్యదర్శిచే వాడికి కబురు పెట్టారు. సీతయ్య మంచాన పడ్డాడు. గోపాలం గాడికి కబురు పెట్టారు.
"ఏరా! పులేషం కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరేగింపు ముందర డప్పులతో పులులు గెంతితే గాని మన ఇజీ నగరం దెబ్బ తెలీదు.
ఇంద! అడ్వాన్సు ఉంచు." అంటూ 500 చేతిలో పెట్టబోతుంటే…
"అయ్యా! తమకి తెలీనిదేంటి? సీజన్ కాదు కదండీ! రంగులు పూసుకోవాల. బుట్టలు చేసుకోవాలా.. ఆపైన... సుక్కేసుకుంటే గానీ పులులకు కిక్కెక్కదు. అందుకనీ…..
నసుగు తున్న గోపాలాన్ని చూసి
మరో 500 చేతిలో పెట్టి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోయారు.
గోపాలం తన కొడుకుని వెంటేసుకుని సూరిగాడి దగ్గరకు వచ్చాడు.
"ఒరేయ్! లెగరా! బేరవొచ్చింది."
మాట వినగానే సూరిగాడు కళ్ళల్లోకి జీవం వచ్చింది. రెపరెపలాడుతున్న నూర్రూపాయల నోటు చూడగానే అప్పటిదాకా ముసురుకున్న ఆలోచనలు ఎటోపోగా ఏర్పాట్లలో మునిగిపోయారు.
ఉదయం నుంచి రంగులు పులుముకోవడం, బట్టలు కట్టుకోవడం, బుట్టలు సరి చూసుకోవడం
ఆ వార్నిష్ వాసనకి తినడానికేం ఎక్కడం లేదు. 12 గంటలకల్లా అందరూ బయలుదేరారు. హెలికాప్టర్ దిగి కారు ఎక్కే ప్రదేశానికి కొంచెం దూరంలో చెట్ల కింద కూర్చున్నారు. ముఖాన తగిలించుకునే పులి మొహానికి రంగులు అద్దుతూ, మొహానికి తగిలించుకుని కళ్ల దగ్గర రంధ్రాలలోంచి కనిపిస్తోందో,లేదో చూస్తూ గోచికి తగిలించుకున్న బుట్ట సరిగా అమరిందో లేదో చూసుకుంటూ
పులులు ఎటువైపు తిరుగుతూ ఉంటే అటువేపు నడిచే చిన్నా పెద్దా ఆనందంగా అబ్బురంగా చూస్తూ నిలబడి పోయేవారు కొందరైతే. అవి గెంతితే బాగుండు. చంకలో ఉన్న పిల్లాడికి చూపించవచ్చు అని అయిష్టంగా ముందుకు నడిచే వారు కొందరు.
సూరిగాడికి కడుపులో తిప్పుతోంది.
"అయ్యా! గోపాలమయ్య! నాకు కడుపులో ఏదోలా ఉందయ్యా!" అన్నాడు
"ఓర్నీ! ఆ రంగుల వాసనకి అట్టాగే ఉంటాది గాని... నువ్వు మా అబ్బి ఆ పక్కగా వెళ్లి ఓ చుక్కేసుకొచ్చీండి. సీసా అందించాడు. కడుపులో వికారాన్ని భరించలేక తాగేసి వచ్చి కూర్చున్నాడు సూరిగాడు. ఎప్పటికీ మంత్రిగారి జాడే లేదు. అలా గంటలు గంటలు గడిచిపోతున్నాయి. సోలిపోయి అక్కడే సిమెంటు బెంచీ మీద కూలబడ్డాడు. కళ్ళు మూసుకు పోతుంటే ఓ కునుకు తీశాడు.
ఇంతలో పోలీసుల సందడి మొదలైంది ఇంకో అరగంటలో వచ్చేస్తున్నారని. అందరూ హడావుడిగా తిరుగుతూ జాగాల్లో సర్దేసు కుంటున్నారు. మంత్రి గారికై సిద్ధం చేసిన కారు, పైలెట్ కారు, వీటన్నిటికీ ముందు పులి వేష గాళ్ళు, డప్పులు, పోలీసులు, మఫ్టీలో సెక్యూరిటీ…..
మంత్రిగారు కారు ఎక్కకముందే పులులను గెంతమన్నారు. డప్పు మొదలైంది. పులులు ఎర్రటి తమ నాలుకలను ముందుకు చాపుతూ, తలలూపూతూ, గెంతుతూంటే వెనకాల బుట్టలు పట్టుకున్న అనుచరులు వాటితో సమానంగా గెంతలేకపోతున్నారు. డప్పు తీవ్రమైంది. ఝనక్…..ఝనక్...ఝఝనక్కడి ఝనారే….ఝనక్…..ఝనక్...ఝనా...ఝనా.
సూరిగాడికి కడుపులో తిప్పు మొదలైంది. వాంతి వస్తున్నట్లుంది. వస్తున్నట్లు ఉండటమేమిటి? గుంపులోంచి పక్కకు వచ్చేసాడు. పెద్ద వాంతి అయింది. కడుపులో ఏం లేదు. ఖాళీ కడుపు. ఇంకా తిప్పుతూనే ఉంది. మంచినీళ్ళైనా ఇచ్చేవారు లేరు. ఊరేగింపు ముందుకు సాగుతోంది.
గోపాలం కూడా పక్కకి వచ్చేసి ఎవర్నో పిలిచి "ఒరేయ్! ఈడిని రిక్షాలో వేసి సీతయ్య ఇంటి దగ్గర దింపేయరా! సుక్కపడినట్లేదు. నేను ముందుకెళ్ళి ఆళ్ల దగ్గర డబ్బులు తీసుకుని వచ్చేస్తా!" పురమాయించాడు.
సూరిగాడిని రిక్షాలో వేశారు. ఇల్లు చేరేలోగానే వాడికి కింది చూపు - మీది చూపు అయి వెక్కిళ్లు పెట్టాడు. ఇంటిదగ్గర దింపేసరికి ఆడి ప్రాణాలు గాలిలో కలిశాయి. సూరిగాడి చావుకి ఏడ్చేవారెవరు?
వాడి చావుకి కారణాలు వెతకడానికి, విచారణలు జరపడానికి, కమిషన్లు వేయడానికి అంత గొప్పోడు కాదు. వాడికేదైనా అన్యాయం జరిగిందని అరిచి గగ్గోలు పెట్టి ధర్నాలు సమ్మెలు జరపటానికి వాడికో యూనియనూ లేదు. అడవుల్లోని, జూ పార్క్ లోని పులులు చనిపోతే ప్రముఖవార్తగా ప్రచురించే మీడియాకు ఈ సంగతి తెలీదు. ప్రముఖుల పర్యటన విశేషాలతో నిండిపోయిన పత్రికలో వాడి చావు వార్తకి జాగా లేదు.
****************
(సోమవారం మంగళవారం విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ పులి వేషాలకు పెట్టింది పేరు)
7
[22/10, 9:53 PM] +91 94400 97002: కవుల వేదిక
అంశం :కథానిక
22 /10 /2020
.....................
మిట్టాలక్ష్మి
చిత్తూరు
చరవాణి :9440097002
................................
శీర్షిక: కర్తవ్యం
.....................
"అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" రాగయుక్తంగా పాడుతున్నాడు రమేష్.
ఎంతో భక్తిగా అమ్మవారిని చూసుకుంటూ పద్యం పాడుకుంటూ ఉన్నాడు
అటుగా వెళ్తున్న భార్య సుధ కెకేసి పిలిచాడు
"చూడు అమ్మవారు ఎంత బాగుందో సరస్వతి గా ఒకో రోజు ఒకో అవతారంలో ఎంత బాగుందో కదా" అని అడిగాడు
అతను ఎప్పుడూ అంతే టీవీ లో బ్రహ్మోత్సవాలు చేసుకుంటూ ఈ రోజు "వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో కదా ఈ అలంకారం లో ఉన్నాడు కదా ఈ సేవలో వస్తున్నాడు కదా" అని చెబుతూ ఉంటాడు.
సుధా మామూలుగా అయితే సరే సరే అనేది కానీ తన మనసు అసలు ఏం బాలేదు ఏ నవరాత్రుల్లో ఏంటో అమ్మవారిని ఏం సేవించాలి? కరోనావచ్చి ఇల్లు కదల లేని పరిస్థితి అంటే ఈ వరదలు వచ్చి ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి ,ఇప్పుడు అవసరమా అసలు దేవుడంటూ ఉంటే ఇలా జరుగుతుందా దేవుడికి ఎందుకు చేయాలి ఎందుకు కొలవాలి "అని చాలా బాధపడుతుంది.
అదే మాట భర్త తో కూడా అనేసింది
"అదేంటి అలా అనేసావు దేవుడు ఏం చేసాడు?"
"దేవుడు అన్ని ఆయన చేతిలోనే ఉంటుంది ఆయన ఏమి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని చెబుతూ ఉంటారు కదా ఇన్ని అకృత్యాలు ఘోరాలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అదే నేను అడుగుతున్నా"అంది
"అడగడానికి కూడా అర్హత ఉండాలి సుధా , తప్పులన్నీ మనం చేసి దేవుని నిందిస్తే ఎలా?మనము న్యాయంగా ధర్మంగా ఉంటే దేవుని అడిగినా ప్రయోజనం ఉంది. మనం విపరీతమైన వేషాలు అన్ని వేసి దేవుని బాధ్యుణ్ణిచేస్తే ఎలా చెప్పు "అని అన్నాడు
"ఇంత మంది జనాలు కష్టపడుతుంటే దేవుడికి కనిపించదు అంటే ఏదో ఒక దారి చూపించ కూడదా అండి
దేవుడు ఒక ధర్మాన్ని ఇదిఅనే మార్గాన్ని మనకు చూపించాడు దానిలో నడవడమే మన కర్తవ్యం .గుణాలను ఎలా ఉండాలో మనిషి ఎలా ఉండాలో అన్ని దేవుడు భగవద్గీతలో, ప్రసంగాలలో చెబుతూనే ఉన్నాడు.
ప్రతిసారి దేవుడి దిగక్కరలేదు ఆ గుణాలను మనము అలవర్చుకుంటే అదే దైవకృపకుకారణమవుతుంది".అన్నాడు.
"ఇంతకూ మీరేమంటారు?"
"మన కొన్ని విపరీతమైన ఆశలకు, ఎన్నో కారణాలు కావచ్చు, చెరువులు అన్ని ఆక్రమించేసి ప్లాట్లు వేసి ఆకాశహర్మ్యాలు నిర్మించి కురిసే వానలకు అసలు స్థలమే లేకపోతే వరదలు రాకుండా ఏమవుతుంది చెప్పు?"
"మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటారు"
"అవన్నీ మన పరిధిలో లేని విషయాలు చూస్తూ అర్థం చేసుకోవాలి. దేవున్ని నిందించకూడదు.
ఇప్పుడు మనం చేయాల్సింది నీవల్ల ఎంత ఎక్కువ వీలు అయితే అంతనువ్వు వండు ప్యాకెట్లు తీసుకుని ఆహారం లేని వాళ్లకు ఇచ్చి వద్దాం, మన వల్ల అయింది ఇప్పటికి మన కర్తవ్యము ఇదే..
................. ...............
ఈ కథానిక నా స్వీయ రచన దేనికి అనుకరణ కాదు.
8
[22/10, 9:59 PM] మర్రి జయశ్రీ: కవుల వేదిక
మర్రి జయశ్రీ
అంశం..కథానిక
శీర్షిక...అనుబంధాలు
మంచాన పడ్డ తండ్రి,పెళ్ళీడు వచ్చిన చెల్లెలు తమ్ముడు,ఏమి చేయాలో రాముకు అర్థం కాలేదు.తల్లిని అడిగితే అమ్మాయి పేరు మీద కట్నం కోసం తీసిన భూమి ఉంది.దాంతో చేయండి చెల్లెలు పెళ్లి అన్నది అమ్మ మనెమ్మ.రాము,ఆయన శ్రీమతి ఇద్దరు ఉద్యోగస్తులు.ఏదైనా చెప్పబోతే మీరే పెద్దవాళ్ళు,ఇద్దరికి ఉద్యోగాలు అంటూ జనం మాటలు.సమస్యలతో సతమతమవుతున్న వేళ భార్య శ్రీలత ఆడపడుచు పెళ్లి చేద్దామండి అన్నది రాముతో.శ్రీలత పెద్దకొడలిగా అన్ని బాధ్యతలు తీసుకొని కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తున్న సౌమ్యురాలు.తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఉన్నా ముందుండి బరువు బాద్యతలన్నీ మోస్తుంది మంచి పేరు తెచ్చుకుంది.
భూమి అమ్మి పెళ్లి చేయడమంటే అప్పటికప్పుడు తగిన ధర రాదు.రావలసిన సొమ్ము చాలా మంది వాయిదాలు పెడుతున్నారు.వివాహం నిచ్చాయమైంది చెల్లెలు దేవికి.తమ్ముళ్లు రాజు,మనోహర్ని పిలిచి ఎలా చేద్దామని అడిగాడు.ఎవరు సమాధానం చెప్పలేదు.ఇక తప్పదని ఉన్న డబ్బులు స్నేహితుల దగ్గర కొన్ని తీసుకువచ్చి వివాహం జరిపించారు రాము దంపతులు.తెచ్చిన వాళ్లకు సమయం పెట్టి గడువులోగా ఇస్తామని చెప్పాడు.ఇదంతా ఆటగా చూస్తున్నారు కుటుంబం మొత్తము.చివరగా మనోహర్ కొన్ని డబ్బులు ఇచ్చాడు.మా తమ్ముడు బాధ్యత తెలిసినోడు అని మురిసిపోయాడు రాము.దాని వెనుకున్న ప్రమాదం గ్రహించలేకపోయాడు.
శ్రీలత వివాహం పూర్తి అయి ఎవరింట్లో వాళ్ళు హాయిగా వున్నారు.కానీ తెచ్చిన డబ్బలు ఇవ్వాల్సిన బాధ్యత రాము మనసులో తొలుస్తుంది.నీతి నిజాయితీకి విలువనిచ్చే మనిషి రాము.ఏదైనా అడిగితే ఉద్యోగం అంటారు.అలా చేసే సర్వం కుటుంబం కోసం దారపోసాడు.అది ఎవరికి అర్థం కావడం లేదు.చివరికి తమ్ములను,తల్లిని పిలిచి అప్పు తెచ్చిన వాళ్ళు అడుగుతున్నారు చెల్లె పేరుమీద ఉన్న భూమి అమ్మి ఎక్కడివి అక్కడ చేద్దాము అన్నాడు రాము.తల్లి సరే కొడకా నీవు ఇబ్బంది పడకు.ఆమెకు కట్నంగా ఆ భూమిస్తే సరిపోయేది.వాళ్ళు డబ్బులే కావాలంటే మనకు ఇబ్బంది కలిగింది.అది అమ్మి ఎక్కడివి అక్కడ చేయమంది అమ్మ మనెమ్మ.
సరేనని తమ్ములతో మాట్లాడి అమ్ముదామని చెప్పాడు.తమ్ములు అమ్మి ఎక్కడివి అక్కడ చేద్దామన్నారు.సరే అని బేరం పెట్టండి నేను దూరంగా జాబ్ కదా లోకల్ లో వుండే వాళ్ళు చూడండి అని చెప్పాడు రాము.తొడబుట్టిన వాళ్ళు అని ప్రేమ ఎక్కువ రాముకు.వాళ్ళను ప్రయోజకులుగా చేయడానికి ఎంతో శ్రమ పడ్డాడు.ఆ ప్రేమతోనే తమ్ములను అమ్మమన్నాడు.మనోహర్ నా పేరు మీద చేస్తే నేను రియల్ ఎస్టేట్ వాళ్ళు అడిగారు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెబితే సరేనని లెవలేని తండ్రి పేరుమీదున్న భూమిని మనోహర్ పేరుమీద చేయించుకున్నాడు. అక్కడే జరిగింది అసలు మోసం.అమ్మి డబ్బులేవి అంటే అది నాది ఎవరిది కాదని దబాయించడం,గొడవలు నీ డబ్బులే అయినా అప్పు తెచ్చానని అబద్ధం చెబుతున్నావని అన్నను, వదినను తిట్టడం మాటలతో వేధించడం చేసి మొత్తము భూమి తనే ఆక్రమించాడు.అదే సమయంలో తండ్రి కాలం చేశాడు. అన్ని ముగిశాక పంపకాల దగ్గర మళ్ళీ గొడవలు.తన వంతుకు వచ్చిన వాటా అమ్ముకొని అప్పులు తీర్చాడు రాము.ఎవరితో బంధం లేకుండా అయింది.పెళ్లి చేసిన చెల్లెలు కూడ మనోహర్ పంచన చేరింది.
అలా మోసం చేసి,తల్లిని అన్నను, తమ్ముడిని దూరం చేసుకున్న మనోహర్ ఆ డబ్బు మోజులో అధిక ఖర్చులు విలాసాలు చేస్తూ,చిన్న ఉద్యోగం కావడంతో తక్కువ జీతం వస్తుండేది.కొట్టేసిన భూమితో అధికంగా ఖర్చు చేస్తూ ఎంతో సంపన్నుడిలా బిల్డప్ ఇస్తూ,సమాజంలో చూపించుకుంటున్నాడు.ఎంత అధికులమని విర్రవీగిన ఎదో ఒక రోజు కాలమైనా సమాధానం చెబుతుంది కదా.పాపం ఊరికే పోతుందా మోసం చేసినందుకు తగిన శాస్తే జరిగింది మనోహర్ కు.కక్కుర్తితో లంచాలకు మరిగి అక్రమాలు చేశాడని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.మామూలు కేసు అయితే ఉద్యోగంలో తిరిగి తీసుకునేవారు.కానీ అసలు అతని మీద పెద్ద ఆరోపణలు ఉండే సరికి అర్హత లేదని చెప్పారు.ఇప్పుడు దిక్కుతోచక అనుబంధాల కోసం ఆరటపడుతున్నాడు.
ఒకసారి మనసు విరిగిన తర్వాత అతుక్కోవడము కష్టం.చేసిన మోసం అలాంటిది.ఈ రోజుల్లో డబ్బు ప్రధానమైనది బంధాల కంటే.మానవతా విలువలు లేవు.ఎదుటివారు బాధపడితే సంతోషించే కాలం.కానీ అవన్నీ తాత్కాలికమే అనే విషయాన్ని గ్రహించి,నీతి నిజాయితీ తో జీవించిన నాడే,ఆరోగ్యంగా ఉండి, శాంతి సౌఖ్యాలు కలుగుతాయని తెలుసుకుంటే,ఇలాంటి మనోహర్ లు తయారు కారు.
సమాప్తం.
9
[22/10, 10:00 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: కవుల వేదిక
నారాయణ భాగ్యలక్ష్మి
భాధ్యత
********
హాయ్ మచ్చా.. హాయ్ మామ..
వాట్ ఆర్ డూయింగ్.. ప్లేయింగ్ గేమ్స్..
రేయ్..నువ్వు టీవీ చూడలేదా.. లేదు శశి ఎం రా.. అరే ఏం వేష్ట్ గాడివి రా నువ్వు.. సూపర్ మ్యాచ్ మిస్ అవుతున్నావ్ ముందు టీవీ చూడరా వెదవ.. సూపర్ బ్యాటింగ్.. ఒకే దెన్..
ఇలా కొనసాగుతున్నది ఒకే ఊరిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉన్న శీను శశీ స్నేహితుల మధ్య సెల్ ఫోన్ చాటింగ్లు , అప్పుడే బయట నుంచీ వచ్చి తడిసిన బట్టల పిండుకుని లోనికొచ్చి బట్టలు మార్చుకుంటు కొడుకు శీనును తీరును గమనిస్తూ ఎరా వానొస్తోందని ఎదురింటి బాబాయి వాళ్లు పొలంలో పంట తడిసి పోతుంటే సాయంగా నిన్ను పిలిస్తే వెళ్లక ఎం చేస్తున్నావు రా శీను అన్నాడు శీనుతండ్రి గంగాధర్, ఆ.. సెల్ల్లో ఇంపార్టెన్స్ క్లాస్ వింటున్న నాన్న అన్నాడు శీను సులభంగా అబద్దం చెప్పేస్థూ, ఏదీ ఇటువ్వు చూస్తా అన్నాడు దగ్గరగా వస్తూ, అది జస్ట్ ఇప్పుడే అయింది డాడి మరో అబద్దం చెప్పాడు శీను, మౌనంగా కొడుకు చేతిలోని సెల్ ని తీసుకుని చూస్తుండగ పక్కింటి శశిని వాళ్ళ నాన్న గిరిధర్ వెంట బెట్టుకొచ్చాడు, వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ రా గిరిధర్ రండి చూసావా క్లాసుల పేర్లు చెప్పి ఇంట్లో మన రత్నాలు చేస్తున్న పని ఇది, ఒకవైపు టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ, మధ్యమధ్యలో ఈ సెల్ ఫోన్ చాటింగ్లు గేములు ఇది ఇప్పుడు వీళ్ళు రోజు చూస్తున్న క్లాసులు ఇవే అని గిరిధర్ కి సెల్ చాటింగుల పరంపర చూపుతూ గంగాధర్
మీ బాబాయి ఎందుకు పిలిచాడో ఆలోచించారా ఇలా మాతోరండి అంటూ శశి శీనులను తీసుకొని ఊరి చివరనున్న పొలంలోకి తీసుకెళ్లారు గిరిధర్ గంగాధర్,
ఆ పొలం తమ ఎదురింటి సూరీ వాళ్ళది, తను చాలి చాలని సన్నకారు రైతు, అప్పోసప్పో చేసి విత్తనాలు తెచ్చివెసి ఎరువులు వేసి కష్టపడి చెమటోడ్చి పైరు పండిస్తే సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి ఈ తిరవల నెలలో తిరవల జడుం పట్టుక��
9
[22/10, 10:03 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: ఈ తిరవల నెలలో తిరవల జడుం పట్టుకొని వదలకుండా కురుస్తున్న ఈ వానలకు పంట నీట మునిగిపోతుంటే కడుపు చెరువౌతున్నది, ఈరోజు వాన పడక కాస్తా తెరప వదిలిందని,ఎండ కూడ మెల్లిగా వస్తుందని పొద్దున్నుంచి కడుపుకు తిండి కూడా తినకుండా,వంచిన నడుం ఎత్తకుండా వరి పైరు కోసి మడి కళ్ళంలో కుప్పలేస్టూంటే ఏకంగా మొడం మబ్బులతో వాన దిగతాంటే ఆ వానలో తడవకుండా గబగబా కుప్పల్ని కట్టలు కట్టి బండికేసి పసువుల గొట్టంలో వేసేయాలని వాళ్లు అల్లాడుతూ కాస్త సాయంగా మిమ్మల్ని పిలిస్తే మీరు ఏదో పెద్ద పొడిచే పుడింగుల్లాగా ఇంట్లో కూర్చుని చదువుల పేరు చెప్పి సెల్ ఫోన్ లో చాటింగ్ మీరు చేస్తున్న నిర్వాకం ఇది, ఒకసారి ఆలోచించండి దానివల్ల మీకు వినోదం అనుకుంటున్నా ఆ వ్యసనం తాత్కాలిక ఆనందంమే తప్ప మరి ఏదైనా లాభం ఉందా, ఇటు చూడండి ఈ పైరు నిండు కుండలా నిండిపోయిన ఈ మడిలో మునిగి పోయిన ఈ వరిపైరు పంటని, ఒక రైతు పండిస్తే వందల మంది కడుపు నిండుతుంది ఇప్పుడు అంతా వృధా అయినది మట్టిపాలు అయినట్లే కదా, మీరు ఒక చేయి వేసుకుంటే మీ చిన్ని సాయంతో కొంతయినా మాతో కలిసి వారికి సాయపడుంటే మరి కొందరికి కడుపు నింపేందుకు దోహదపడేది, మీరు ఇప్పుడు చిన్న పిల్లలేం కాదు, మేము చెప్పేదే కదు పరిస్థితి అంతా మీ ముందుంది మీకు తెలుస్తున్నది కధ, ఒకసారి ఆ సెల్ ఫోన్ వ్యామోహం నుంచి బయటపడి ఆలోచించండి, టీవీలలో వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా వరదలు బీభత్సం వాటిని చూసి పాపం అని జాలి పడుతూ స్టేటస్లోలో పెట్టుకుంటేనో పెట్టుకున్నంత మాత్రాన వారికి మీ సహాయం ఏమీ అందదు కదా, అక్కడేక్కడో ఉన్న వారికి మనం సాయి సహాయ పడలేకపోవచ్చు, కానీ మన ముందు మన చుట్టుపక్కల ఉన్న వారికైనా మన వంతు సాయం అందించడం మనిషిగా మన కనీస ధర్మం కదా, ఇక్కడ సహాయం చేయని వారు అక్కడ ఉన్నవారికి చేస్తారనుకోవడం ఎంతవరకు నిజం, ఒకసారి ఆలోచించండ�
10
[22/10, 10:04 PM] సునంద ఉరిమిళ్ళ: *కవుల వేదిక*
తేదీ:22-10-2020
పేరు వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం: కథానిక
శీర్షిక:: మలుపు
*********************
తరగతి అంతా నిశ్శబ్దంగా ఉంది.
ముందే హెచ్చరించారు అశోక్ సారు. అటెండెన్స్ తీసుకునే సమయంలో ఎవ్వరూ మాట్లాడకూడదని..
చొక్కా జేబులోంచి బంగారు రంగులో మెరిసే పెన్ను తీసి రాము, చంద్రం,వీరయ్యా, గణేష్,. పేర్లు చదువుతుంటే ఎస్ సర్ అంటూ పలుకుతున్నారు. శరత్.. శరత్.. శరత్ .ఏం శరత్ కుమార్ రాలేదా రిజిస్టర్ లోంచి తలెత్తి పిల్లల వైపు చూశాడు అశోక్ సారు. అప్పటికే "ఒరేయ్! నిన్నేరా పిలిచేది" అంటున్న దోస్తుల మాటలకు ఉలిక్కిపడి 'ఎస్! సార్! ప్రజెంట్ సర్! అంటున్న శరత్ ను ఆశ్చర్యంగా చూస్తూ" ఏమిట్రా ఆ పరధ్యానం! ఏ లోకంలో ఉన్నావు" మందలించి మిగిలిన పేర్లు పిలిచి హాజరు రిజిస్టర్ ఆఫీస్ రూం లో పెట్టమని ఆదేశించాడు శరత్ ను. కొంచెం స్పృహ లోకి వస్తాడని..
ఆ తర్వాత పాఠం చెప్పి నోట్ బుక్స్ దిద్దుతుంటే హెచ్చెం సారు పిలుస్తున్నారని అటెండర్ వచ్చి చెప్పడంతో.. "ఒరేయ్! వీటిని తీసుకుని వచ్చి స్టాఫ్ రూం లో నేను కూర్చునే టేబుల్ మీద పెట్టండి రా!
గబగబా హెచ్చెం దగ్గరకు వెళ్ళాడు.
"నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవాన్ని ఎలా జరుపుకుందాం " ఒక్కొక్కరి అభిప్రాయాలు సలహాలు తీసుకుంటున్నా" ఇప్పుడు మీకు లీజర్ కదా అందుకే పిలిపించాను. మీరేమో ఎప్పుడు లీజరున్నా.. ఏదో ఒక తరగతిలోనే ఉంటారు.కొంచెం అభినందనగా, అది అవసరమా అని అధికారంగా అంటుంటే చిరునవ్వుతో "పిల్లలకు మంచి నైతిక విలువలు పెంపొందించే నాటికలు వేయిద్దాం వివిధ పోటీలు పెడదాం సర్!" చెప్పి తన టేబుల్ దగ్గరికి వచ్చాడు. మిగిలిన నోట్ బుక్స్ దిద్దుదామని పెన్ను కోసం జేబు వెతుక్కుంటే లేదు.... పిల్లల్ని పిలిచి అడిగాడు.. ఏమో సర్ మేం చూడలేదు అన్నారు. శరత్ ను నువ్వేనా తెచ్చింది నోట్స్ అంటే కాదన్నాడు.. ఎవరబ్బా ! పెన్ను తీసింది.. ఆలోచన చేశాడు.. వేరే పిల్లల నుంచి అడిగి దిద్దాడు. మరుసటి రోజు పిల్లలకు ఓ విషయాన్ని చెబుతూ.. పోయిన పెన్ను లాంటిదే తన దగ్గర ఉన్న మరో పెన్ను చూపి ఈ పెన్నుకు ఓ అద్భుతమైన శక్తి ఉంది .. తన తోటి పెన్నుని నిన్న తీసుకున్న వాళ్ళ పేరు ఎవరో చెబుతుంది.. అందరూ కళ్ళు మూసుకుని తెరిచి. కొద్ది సేపు మీ పేర్లు చిట్టీ మీద రాయండి. ఈ డబ్బాలో చుట్టి వేయండి... రాతను బట్టి చెప్పే శక్తి ఉంది.. అనగానే కళ్ళు మూసుకుని తెరిచి.. అందరూ
రాసి డబ్బాలో ఒక్కొక్కరే వేయ సాగారు. అది తీసిన వాడికి భయం వేసింది.. అందరూ కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు గబగబా వెళ్ళి కాగితం తో పాటు పెన్ను కూడా డబ్బాలో వేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అదంతా బయటి నుండి అశోక్ సారు గమనించి.. తర్వాత లోపలికి వచ్చి.. పెన్ను తనకు తానే తన తోటి పెన్నుని రప్పించుకుందిరోయ్.. అన్నాడు శరత్ మోములో కి చూస్తూ..
ఆ తర్వాత శరత్ ను పిలిచి ఈ పెన్ను గిఫ్ట్ గా ఇస్తున్నా అనగానే.. అందరిలో ఆశ్చర్యం. శరత్ లో అపరాధ భావం. తర్వాత ఒంటరిగా పిలిచి అలా చేయకూడదు నాన్నా అని చెప్పిన హితవు మాటలు అతడి జీవితాన్ని గొప్ప మలుపు తిప్పాయి..

Comments
Post a Comment