కవి సమయం 6


అంశం: *కష్టజీవి*
*కవితల సమీక్ష *
సమీక్షకుడు- *అరవిందరాయుడు దేవినేని*
మొత్తం కవితలు- 33

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹   

           *కవులవేదిక*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

         *కవిసమయం-06*                                                   🏵️నగదుబహుమతుల కవితాపోటీ. 🏵️                   

   
🌺 తేది 14-05-2020🌺       
     
      🌻నిర్వహణ-🌻     
     .                   
*శ్రీ వీరాగుడిపల్లి*                               
*శ్రీమతి యేరువ ఇందిరారెడ్డి* 
             
 న్యాయనిర్ణేత: *అరవిందరాయుడు దేవినేని* 

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️   
   
                   *విజేతలు*                                                     🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ 

1.శ్రీ శివలక్ష్మి రాజశేఖరుని గారు.       
2.శ్రీమతి సంధ్యశర్మ గారు.     
3.డా౹౹పాండాల గారు.                                                          4. శ్రీ నిమ్మ రాంరెడ్డి గారు                                              5.శ్రీమతి లలితాకృష్ణ గారు.                                         6.శ్రీమతి వురిమళ్ళ సునంద గారు.                                        7 శ్రీ దేశపతి మోహనశర్మ గారు.                                   8.శ్రీమతి మూర్తి శ్రీదేవి గారు.                                               9.శ్రీ మండ శ్రీధర్ గారు.                                            10.శ్రీపిన్నక నాగేశ్వర్ గారు. 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

పాల్గొన్న కవిమిత్రులందరికీ                     విజేతలకు .హృదయపూర్వక
           అభినందనలు.                                                                 

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


【విభాగం ౼01】
~~~కవితలు -11~~~

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 అంశం కష్టజీవి

ప్రక్రియ పాట/గీతం

శీర్షిక
"కష్టజీవి త్యాగం"

పల్లవి:

కత్తి,సుత్తి,కొడవలి, నాగలి... జీవనాధారంరా..
ఆ కొడవలి పట్టిన చేతుల శక్తికి... చేతులెత్తి మొక్కరా.. నాగలి పట్టిన చేయి లేకుంటే.. బుక్కెడు బువ్వేదిరా..
ఆ బువ్వ పెట్టే
కష్టజీవి త్యాగానికి.. చేతులెత్తి మొక్కరా..

ఆ బువ్వ పెట్టే కష్టజీవి త్యాగానికి చేతులెత్తి మొక్కరా..

చరణం 1

ఎర్రని ఎండకు నెత్తురు కరిగి చెమట ధారలయితే ...  చేతిలో ఉన్న నాగలి మేడి .. చేయిజారుతుంటే.(2)

నెర్రెలు వారిన నేల తల్లి నా చెమట  ధారలొ తడిసి (2)

చల్లని పిల్ల తెమ్మెరగా మారి నన్ను సేద దీర్చే...

ఎర్రని ఎండను ఎర్రగ చూసి పిడికిలి బిగించి..(2)

ఆ భూమిని సక్కగ సదును సేసి....
నా సత్తా చూపినా....

కత్తి, సుత్తి,కొడవలి, నాగలి.. జీవనాధారంరా..
ఆ కొడవలి పట్టిన చేతుల శక్తికి.. చేతులెత్తి మొక్కరా.. నాగలి పట్టిన చెయి లేకుంటే..
బుక్కెడు బువ్వేదిరా..
ఆబువ్వ పెట్టే కష్టజీవి త్యాగానికి.. చేతులెత్తి మొక్కరా..

చరణం 2

సైరను మోతతో సైకిలెక్కి.. పనికి నేను పోతున్నా.. మింటను చుక్కలు పొడిచిన వేళకు ఇల్లు సేరుతున్న..(2)

కండల్లు కరిగించి.. యంత్రంలో యంత్రంగా మారిపోతున్నా.. పసిబిడ్డ పాలడబ్బా ఖర్చుకు..జేబులు వెతుకుతున్న..

నా చెమటను ఖరీదు కట్టే..షరాబు లేకున్నా..
వంచిన నడుము ఎత్తకుండా..(2)

నే కష్టం చేస్తున్నా..

కత్తి,సుత్తి,కొడవలి, నాగలి... జీవనాధారం రా..
ఆ కొడవలి పట్టిన చేతుల శక్తికి.. చేతులెత్తి మొక్కరా.. నాగలి పట్టిన చేయి లేకుంటే..బుక్కెడు బువ్వెదిరా..
ఆ బువ్వ పెట్టే కష్టజీవి త్యాగానికి.. చేతులెత్తి మొక్కరా..

చరణం 3

తూరుపు తెల్లవారకముందే.. వీధులన్నీ తిరిగి (2)

నా చేతుల చేటతో.. నేలపై కసువును   ఊడ్చెస్తా..

ఊరు,వాడా, సందు గొందూ...
శుభ్రం చేసేస్తా (2)

హాలాహలాన్ని కంఠంలో దాసే... శివుడిలా నే ఉన్నా.. నన్ను చూసిన వారు పక్కకు తొలిగే దుస్థితి నాదన్నా..

 కాలే కడుపుకి మండే బుగ్గి... దొరక లేకున్నా (2)

నా చేతుల చేటతో.. కసువుల బాటను ఊడుస్తునే ఉంటా...

కత్తి, సుత్తి, కొడవలి, నాగలి.. జీవనాధారం రా..
ఆ కొడవలి పట్టిన చేతుల శక్తి కి.. చేతులెత్తి మొక్కరా..
నాగలి పట్టిన చేయి లేకుంటే.. బుక్కెడు బువ్వెదిరా..
ఆ బువ్వ పెట్టే కష్టజీవి త్యాగానికి.. చేతులెత్తి మొక్కరా..

ఆ బువ్వ పెట్టే కష్టజీవి త్యాగానికి.. చేతులెత్తి మొక్కరా.... ఆ...

🌹
మండా. శ్రీధర్, శ్రీకాకుళం

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 01

..మండ శ్రీధర్ గారూ...

గాయాలకు మలాం రాసి సాంత్వననిచ్చే శక్తి గేయానికి ఉంది ..పల్లవిలో జీవనపోరాటానికి ఆయుధాలైన పనిముట్లపేర్లను ప్రయోగించడం  బాగుంది..నెర్రెలుబారిన నేలతల్లి చెమటధారలో తడిసినట్లు వర్ణించడం..యంత్రంలో యంత్రంగా మారే శ్రామికుని తీరును..కసువుల బాటను ఊడ్చడానికి చేతుల చేటను వాడుతున్నట్లు చెప్పడం నచ్చింది..మీకు నా అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*కష్టజీవి*
..............................

కష్టజీవి
  కరుణశ్రీ  శ
    బిరుదాంకితుడు.

హలికుని చెమట చుక్కలు
శ్రామికుని స్వేదము
కవులకు మోదము
జనావళి కామోదము
 *కష్టజీవి చేతనమే  ప్రజా చైతన్యం*

నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన   పరాయణత్వం

 పాలకులు శ్రామికులను
         నిర్లక్ష్యం చేసినపుడు

కష్టజీవుల నుండి
     నష్టజీవి ఉద్భవిస్తాడు

ప్రభుత
     జనత కొరకు చరిస్తే

నష్టజీవి అంతమై
   కష్టజీవి మనగలిగి

దేశమంటే
మట్టి కాదు మనుషులే నని
మరోమారు చాటుదాం
అలసి సొలసిన
కష్టజీవి
*తాత్కాలిక ఉపశమనం కోసం*

 *మద్యాన్ని ఆశ్రయిస్తే*

అలవాటు   పొరపాటై
చివరకు గ్రహపాటై
కుటుంబాలనే కాకుండా
 తరతరాలనే
తుదముట్టిస్తూంది మద్యం

మద్యం
   మొదలైన దురలవాట్లు
మరియు సాంఘిక దురాచారలను
రూపు మాపే విధంగా
 విధి విధానాలు రూపొందించాలి

  శ్రామిక
       కార్మిక
            కర్షక  లోకానికి

  *ఉపన్యాసాలు కాదు*
*మహాన్యాసాలు కావాలి*

 ఎంత   పెరిగినా   విజ్ఞానం

కంప్యూటర్
ఆహార పదార్థాలు
తయారు చేయదు
అని అనుకోకపోతే
*అది అజ్ణానమే*


తిండి తింటే కండ కలదోయ్
కండ కలవాడే మనిషోయ్
అనే సూత్రం ఒక్కటే ప్రమాణం

మరి  కేవలం

*రూకలిస్తే నూకలొస్తాయ్*

కష్టజీవి దేముంది అని అనుకుంటే
అదే మూర్ఖత్వం వితండవాదం

కృతజ్ఞతా భావంతో  మాత్రమే
*ఆహారం స్వీకరించాలి*

ఆదియే భగవత్ ప్రసాదం

 మనిషి పుట్టుకతో   
       *ధనవంతుడు*
                కాక పోవచ్చు

కానీ ..
*గుణవంతుడు కావచ్చు*

అట్టి గుణవంతుడే
 మన కష్టజీవి భగవంతుడు
               కష్టే ఫలే సుఖే

        *శ్రమయేవ జయతే*

       

...............................
.....నిరంతర
 కవితా హాలికుడు
  మీ
గట్టు రవి చౌటుప్పల్
98 48 44 56 07

■■■■■■■■■■■■■■

 సమీక్ష 02.... 

గట్టురవిగారూ...

కవిత్వం రాసే వారు లక్షలు కవిత్వానికి ఊతమిచ్చేవారు నూటికో కోటికో ఒక్కరు... హృదయం నిండా ఔదార్యంతో ఓ చేత్తో కవిత్వం రాస్తూ మరోచేత్తో కవిత్వానికి దన్నుగా నిలిచేమీరు సాహిత్యాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని మీ కవితను చూస్తే అవగతమౌతోంది కష్టజీవిచేతనమే ప్రజాచైతన్యం కంప్యూటర్ ఆహారపదార్థాలు తయారుచేయదు..అన్న మీ భావం యంత్రలోకంగా తయారౌతోన్న వర్తమానంపై వదిలిన వ్యంగ్యోక్తి..శ్రమయేవ జయతే మీ ఆకాంక్ష ఫలించాలని ఆకాంక్షిస్తూ మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

కవి పేరు : శ్రీహరి. ఏలె
కలం పేరు : ఏలె శ్రీ
అంశం : కష్ట జీవి
శీర్షిక : నేటి మన ఉపాధ్యాయుడు

****************************
తన పాఠశాలను
ఒక ఎవుసముగా
నల్లని పొలంలో
తెల్లని విత్తనాలు నాటి
పిల్లల కు పచ్చని జీవితాన్ని
కోరుకునే పల్లె పైరు " అతడు"

ఎండాకాలం(మే నెల)లో పొలాన్ని
చదును చేసి నట్టుగా
పాఠశాలను సిద్ధం చేసి
వర్షాకాలం (జూన్ నెల) పిల్లల
ప్రవేశానికి విత్తనాలను
చల్లే అల్ప సంతోషి " అతడు "

పిల్లల పఠనా పఠిమను
పరీక్షలతో కలుపును తీస్తూ
జీవితమనే పంటను తీయాలని
చదువుల శిఖరానికి ఎదగాలని
కోరుకునే బడి నాగలి " అతడు"

ఆరుగాలం చేను వృద్ధి కై
సాల్ల మధ్యలో ఎరువు అనే
పౌష్టిక సర్కారు భోజనాన్ని
సాంకేతిక విధ్యను జోడించి
తన బోధననే పెట్టుబడి గా
' మానవీయ విలువలే' రాబడి గా
చల్లని మనసున్న సేధ్యగాడు " అతడు "
అతడే ఎవరంటే...............
నేటి మన  "ఉపాధ్యాయుడు"

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 సమీక్ష..3.....

శ్రీహరి ఏలె గారు..
పిల్లల పచ్చని జీవితాన్ని కోరుకునే పల్లెపైరు అతడు..ఉపాధ్యాయుని గురించి  మీరిచ్చిన చక్కని కవితాత్మక నిర్వచనం..బడిని నాగలిగా..పరీక్షలను కలుపుతీతగా మానవీయ విలువలను రాబడిగా అభివర్ణించిన మంచి కవితండీ..మీకు అభినందనలు🌻

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

వకుళ వాసు
హన్మకొండ
అంశం- కష్టజీవి

శీర్షిక-🍃ప్రేమ కిరణాలు🍃

కష్ట జీవే నాన్న అలుపెరుగని సూర్యునిలా సాగుతూనే వుండేది....

పేగుబంధాల ఎదుగుదలకై తాను మాడుతూ నిత్యవసంతాలు పూయించడానికై....

 వెలుగు కిరణాలను కురిపించి కాంతులు పంచుతాడు ....

ఏ తెల్లారగట్లనో మగతనిదుర నుంచి మేల్కొని ఆశల పందిరి అల్లుతాడు తెరిచిన కళ్ళ నుండి మస్తిష్కానికి....

కొలువుకు పోయేలోపు ఎంత ఆసరైతడో అమ్మకు చెమట పై చేరే పిల్లతెమ్మెరలా...

అరటిచెట్లలా అందంగా ఎదిగే ఆడబిడ్డల చదువుల నడకలలో ఎన్ని కలలు కంటాడో ....

తన ఆశల తోరణాలకు ఎల్లలెరుగని  పరిమళాలను వెదజల్లుతూ వాడని కీర్తితో వెలుగులీనాలని....

కొబ్బరిచెట్టులా ఎదిగే కొడుకు కోసం ఎన్ని తిప్పలు పడతాడో నాన్న....

ఖరీదైన ఎరువులను కొనలేని కడుపునిండ చల్లని నీళ్ళతో నింపే ఊటబావి నాన్న....

ఇంట్ల చీకుడు పట్టిన లుంగీని చిల్లులు పడిన బనీన్ లను ఎన్ని సార్లు కట్టించుకున్నాడో అమ్మతో పాపం....

ఉన్న నాలుగు జతలనే ఇస్తిరిజేసుకొని అత్తరు పూసుకొని సైకిలేసుకొని ...

ఆఫీస్ కి పోతుంటే మా నాన్న మాకండ్లకు హీరోలాగుండెటోడు.....

బుద్ది తెలిసిన కాన్నుంచి గవే బట్టలల్ల చూసి చూసి బోరు కొడ్తాంది ఏందినాన కొత్తయి కొనుక్కోరాదంటె....

నీకు బడి డ్రెస్ కుట్టియ్యాలె బిడ్డా అన్నప్పుడు అర్ధం కాలె ....

ఎందుకన్నడో అట్ల అని కాని ఇప్పుడర్ధమైతాంది నాన్న....

 నీ సెలయేటి ఒడ్డున పెరిగిన మేము నదిలా మారినా గాని....

సముద్రమంత ఆశలనావనుఎలా నడపాలో తెల్వక మా నాన్న నిజంగ కష్టజీవే అని....

సాయం సంధ్యలో కూడా ఎంత ఆరాటమో మాపై ప్రేమ కిరణాలను చల్లుతూ....

హరివిల్లు రంగులు మా బతుకులలో నింపి తృప్తిగా తాను...

గోదారి ఒడిలో ఒదిగిపోయాడు బతుకు పోరాటంలో గెలిచి నాన్న....

🍀🌹వకుళ వాసు🌹🍀

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻:

సమీక్ష 04...వకుళ వాసు గారూ...

ప్రేమకిరణాల శీర్షికతో మీరు రాసిన కవితలో నాన్నను కష్టజీవిగా అభివర్ణిస్తూ..తాను మాడిపోతూ పేగుబంధాల్లో వసంతాలు పూయిస్తాడనడం..పిల్లల జీవితాలను స్వప్నించే స్వాప్నికుడనడం నచ్చింది..ఊటబాయి..సూర్యుడు అన్నపోలికలు హృద్యం..గోదారి ఒడిలో  ఒదిగిన నాన్నకు స్మృతిపట్టం కట్టారు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

పేరు:డా.రామక కృష్ణమూర్తి
శీర్షిక: *భాగ్యవిధాతలు*
**************************

ఎవరి చెమటచుక్కలతో తడిసి
అవని పావనమయ్యిందో
ఎవరి శ్రమశక్తితో మేడలు నిర్మింపబడి
ధరణి సంపన్నమయ్యిందో
ఎవరి అమృతహస్తాలతో విత్తులను‌ తనయందు ఇముడ్చుకొని‌ పుడమి
సస్యశ్యామలమయిందో
ఎవరి సమ్మెట దెబ్బలతో బండరాళ్ళు ఆనవాళ్ళు
కోల్పోయాయో
ఎవరు పాతాళగంగను తోడి పైపైకి తెచ్చు పరమ పావన కృత్యమును సల్పినారో
ఎవరు నల్లబంగారపు గనుల యందు నల్లసూరీళ్ళై లోకానికి
వెలుగులు పంచినారో
ఎవరు ప్రాజెక్టుల యందు పరవళ్ళు తొక్కిన జలదృశ్యాన్ని ఆవిష్కరించినారో
ఎవరు నెత్తిన బరువులెత్తి దేశాభివృద్ధికి తోడ్పడినారో
ఎవరి చేతుల రాపిడితో రహదారులు త్రవ్వబడి పైపులు,కేబుళ్ళు పరుచుకున్నాయో
ఎవరి స్వచ్ఛ హస్తాలతో మురుగు శుద్ధిచేయబడి పారుతున్నదో
ఎవరి కరకమలాలతో శౌచాలయాలు దేవాలయాలవుతున్నాయో
ఎవరు వీధుల్లో చెత్తనెత్తి పరిశుభ్రతను,ఆరోగ్యాన్ని అందిస్తున్నారో
ఎవరు బాక్సైట్ గనుల్లో బతుకులు‌ అర్పించి
బంగారుబాటలు వేస్తున్నారో
ఎవరు వ్యవసాయంలో తమ సాయంతో అన్నపూర్ణను అభిషేకిస్తున్నారో
ఎవరు కర్మాగారాల్లో శ్రమశక్తిని ధారవోసి సంపదలు సృష్టిస్తున్నారో
వారికి చేతులెత్తి ప్రణతులిడుదును
రాష్ట్రాలను,దేశాలను,
ప్రపంచాన్ని సుసంపన్నం చేస్తున్న కష్టజీవులు మీరే భావిభాగ్యవిధాతలు.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻:

సమీక్ష 05... 

డా౹౹రామకకృష్ణమూర్తిగారూ....

భాగ్యవిధాతలు అనే శీర్షికతో మీరు రాసిన కవితలో నల్లబంగారపు గనుల్లోని కార్మికులను నల్లసూరిళ్ళుగా అభివర్ణించడం బాగుంది..వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల శ్రమకు పట్టంగట్టారు ..శౌచాలయాలు వాటిని శుభ్రపరిచే కార్మికుల చేతులను కమలములతో పోల్చి..చేతులెత్తి ప్రణమిల్లుతాననడం నచ్చింది..అభినందనలు మీకు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

 *శీర్షిక:కష్టజీవి*

కుటుంబం కోసం నానా కష్టాలు పడుతూ
అత్యంత శ్రమకోర్చి
పిల్లల భవితకు
బంగారుబాట వేసేందుకు
మూలాధారమైన నాన్న కష్టజీవి

తను తిన్నా తినకున్నా
తన రక్తాన్ని పంచుకున్న
బిడ్డలకు కడుపునింపి
ప్రేమాభిమానాలను
పంచే అమ్మ కష్టజీవి

రేయనక పగలనక
కష్టపడి హలాన్ని పట్టి
పొలాన్ని దున్ని పంటలు
పండించి దేశంలోని
ప్రతిఒక్కరికి తినడానికి
తిండిపెట్టే అన్నదాతలు
అసలైన కష్టజీవులు

దేశరక్షణకై తమ ప్రాణాలను
సైతం త్రుణప్రాయంగా
భావించి తుపాకీ గుళ్ళకు
గుండెచూపి ధైర్యంగా
నిలబడి భరతమాత నుదుట
రక్తసిందూరం దిద్దే
సైనికులు కష్టజీవులు

రోగాలు రొష్టులు వచ్చినప్పుడు
తమ ఆరోగ్యాలను లెక్కచేయక
అందరికీ వైధ్యం చేసి
ప్రాణాలను కాపాడే
వైధ్యులు, నర్సులు కష్టజీవులు

మనలోని అజ్ఞానాంధకారాన్ని
తొలగించి జ్ఞానమనే వెలుగును
మస్తిష్కంలో నింపి మంచిచెడు
నేర్పించి సమాజంలో మనకంటూ
ఒక గుర్తింపు తీసుకురావడానికి
నిరంతరం శ్రమించే
గురువులు కష్టజీవులు

*సత్యనీలిమ*

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 06....

సత్యనీలిమ గారూ...

మీ కష్టజీవి కవితలో నాన్న అమ్మ..సైరికుడు..సైనికుడు..వైద్యసిబ్బంది తదితరుల శ్రమకు అగ్రతాంబూలమందించారు..శ్రమ ఎంతైనా తలకెత్తుకునే నాన్న ..రక్తాన్ని పంచిఇచ్చి కడుపునింపే అమ్మ..జనం కడుపునింపేరైతు..త్యాగజీవులైన వీరులు ..సేవమార్గపు పథికులు వైద్యసిబ్బంది చేసే సేవలకు తగిన భావాలను ప్రోదిచేసి కవితగా ఆవిష్కరించారు.. అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*కష్టజీవి...!!*

ఆకలి కొలిమి
ఊపిరే ఆయుధం
కరిగే కన్నీరు
పేదవాడి చెమట  ...!!

కాళ్లు అంటిన మట్టి
గిరగిరా తిరిగే చక్రం
కుమ్మరి చేతులో పుట్టిన
అందమైన ఆకారం...!!

రెక్కలు నష్టము
చెక్కలును చీల్చి
ఱంపము నూరి
అధ్బుతమైన చిత్రం ....!!

రైతన్న  సేద్యం
స్వేదము వూరి
పొలము తడిసే
ఆహారం పండే....!!

రాట్నం పోగులు
ఊడిన దారము
పిడికెడు మెతుకులు
జానడు వస్త్రము...!!

అడివిలో కర్రలు
శ్రమతో నిలువునా చీలి
ఆకలితో అల్లుకున్న
బొమ్మల చిహ్నాలు....!!

కొండలలో రాళ్లు
చేతులు నలిగి
వులి గాయాలు తిని
సుందర ఆకృతులు...!!

శుభ్రమైన వస్త్రాలు
మురికి విదిలించి
తలతల మెరిపించి
ఇస్త్రీ తో పరువు నిలిపె....!!

తలను దువ్వి
వెంట్రుకలు తరిగి
ముఖానికే వెలుగులు
మనిషికే రూపం తేచ్చి...!!

చర్మము తీసి
కాటిని కాపు కాసి
సమస్తము నడిపించే
అన్నింటికీ ముందుండి..!!

కర్మాగారపు యంత్రాలు
రక్తము తాగే పిశాచాలు
శ్రామికుడు వస్తువు సృష్టించే
ఆర్థిక ఫలాలు అందించే..!!

రంపము కొడవలి
సుత్తి గొడ్డలి
నాగలి ఱంపము
కష్టానికి చిహ్నాలు..!!

జాతుల వృత్తులు
సాంఘిక శాస్త్రలు
సమానత్వ ధర్మాలు
కావాలి అందరికీ న్యాయలు..!!

దేశ ఆర్థిక పుష్టికి
సమస్త శక్తులు
ప్రతి పౌరుడు
ముందుకు నడవాలి..!!

సామాజిక సంక్షేమం
సమస్త జాతుల క్షేమం
నిలబడిన నాడే దేశం
ప్రపంచములో అగ్రస్థానం..!!

*కొప్పుల ప్రసాద్*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 07....

కొప్పుల ప్రసాద్ గారూ...

లయాత్మకంగా సాగే మీకష్టజీవి కవితలో వివిధవృత్తులకూ సమప్రాధన ఇస్తూ శ్రమకు పట్టంగట్టారు..ఆకలిని కొలిమితో పోల్చడం నచ్చింది పిడికెడు మెతుకులు జానెడు వస్త్రం ఆస్తులుగల నేతన్న వెతలను ప్రతిబింబింపజేశారు..సామాజిక సంక్షేమం సాధించిననాడే ప్రపంచంలో అగ్రస్థానం సాధిస్తామనడం ఔచితీవంతంగా ఉంది అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

: శీలోజు శోభన్ బాబు

శీర్షిక  కర్మ జీవి రైతు

బక్క చిక్కున వాడు
కష్ట జీవి చూడు కర్మ జీవి అయినాడు
భూమిని నమ్మిన వాడు
పంట విలువ తెలిసినోడు
కష్ట జీవి అతడు
కర్మ జీవి అయినాడు

ఎండకు ఎండిన
వానకు తడిసిన
చలికి వనికిన
రోగమొచ్చిన
రాత్రినక పగలనక
ఆరుగాలం కష్ట పడే కష్ట జీవి
రైతే కర్మ జీవి అయినాడు
ప్రకృతి కాటేసిన
పచ్చని పేరునే పాపాయిలాగా సాకి
కష్టాన్ని బాధను గుండెలో నిలుపుకొని
ఎదిగే బిడ్డ వలె పంటను సాకుతూ
పైరును పండించి
చేతి కందిన పైరు పసిడిని కాళ్లకు అద్దుకొని
మార్కెట్లు కు తరలించి
దళారుల మాయకు మోసపోయి
అప్పులేమో పెరిగిపోయి
విషాదాన్నీ హృదయాన మూసుకొని
గుండె గుబేలు మనిపించిన పంట రేటును చూసిన
కష్టాన్ని కంటి నీటిలో దాచుకుని
మరల
తొలకరి జల్లుకై వేచిచూస్తూ
తొలికరి జల్లు కురియగానే
సంబర పడుతూ
నెలతల్లికి పూజ చేసి
పశువులకు మొక్కి
ప్రకృతిని వేడుకొని
ఏరువాక సాగించువాడు
కష్టజీవి రైతు కర్మ జీవి
మత్తోనే పుట్టి
మట్టిని నమ్ముకొన్న
మట్టితో బంధాన్ని పెంచుకొని
ప్రకృతిని ప్రేమిస్తూ
మట్టిని పూజిస్తూ
పెట్టు బడులు పదరిగునా
తిప్పలేన్ని ఎదురైన
గిట్టుబాటు కాకపోయినా
మట్టి వాసనకు వదలడు
మన కష్ట జీవి
అన్నదాత
కర్మ జీవి అయినాడు

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 08  .....

శీలోజు శోభన్ బాబు గారూ....

 పైరును పసిబిడ్డలా పెంచుకుంటూ మట్టితో అనుబంధాన్నిపెనవేసుకుపోయే రైతు తత్వాన్నీ...దళారీచేతుల్లో మోసపోయే తన దీనత్వాన్ని చక్కగా ఆవిష్కరిస్తు మట్టివాసనను వదులుకోలేని కష్టజీవి కర్మజీవి అని సూత్రీకరించడం నచ్చింది అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

 నేటి అంశం : కష్టజీవి

కవితా శీర్షిక :బడుగు జీవులు

మేమంతే..మా బతుకింతే
అభాగ్యులమైనా..ఆశాజీవులం
రెక్కల్ని నమ్ముకుంటాం...
డొక్కల్ని మాడ్చుకుంటాం ...
దిక్కుల్ని చుట్టి వస్తాం ...
చిక్కుల్ని భరిస్తాం .
గంజి నీళ్లు కడుపారా తాగుతాం .
గింజ కోసం కడు దూరం సాగుతాం
బిందె నీళ్లకి ...మైళ్ళు తిరుగుతాం
సందెవేళ దాకా ఊళ్ళుమారుతాం
ఎడారి బతుకులు మావి
తడారిన గొంతులు మావి
గుడారపు జీవనం మాది
వడగాలి సెగలకు వాడిన బతుకులు మావి
కూలీనాలీ చేస్తాం ...
పంట పైరు కోస్తాం...
రాయి రప్ప మోస్తాo..
కష్టం నష్టం భరిస్తాం .
బతుకు కోసం సంచారం,
మెతుకు కోసం సంసారం ,
కాయా కష్టమే ఆధారం,
వలస పోవడమే ఆచారం
ఎండ వాన చలి  తోడైనా..
నిండని కడుపు తో నైనా ..
గుండెలనిండా ఆశలతోనే ..
బండబారిన బతుకుల్లో ...
సంచార బడుగు జీవులమై..
అడుగులతో వడివడిగా ...
సుదూర ఆశల కొండలవైపు ..
బహుదూరపు బాటసారులమై సాగిపోతాం .

✍️దేశపతి మోహన్ శర్మ

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 09--

దేశపతి మోహన్ శర్మగారూ.....

ఉత్తమపురుషలో సాగిన మీ "బడుగు జీవులు"కవితలో శ్రామికుని నిర్వేదాన్ని సమాజం పై విసుర్లను..చక్కగా ఆవిష్కరించారు..సందర్భశుద్ధితో చేసిన అనుప్రాసల ప్రయోగం  లయాత్మకంగా సాగి ముచ్చటగొల్పింది.. మైళ్ళుతిరుగుతూ ఊళ్ళుమారుతూ గుడారం జీవనాలు వడగాలి సెగలు కవితకు అవసరమైన  పదునునూ ఉత్కంఠనూ ఆసక్తినీ సమకూర్చాయి..అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

: : కష్ట జీవులు
🙏🙏🙏🙏🙏🙏
ఇందు గలడందు లేడని
సందేహం లేనట్లు
అన్ని పనులలో తానై యుంటూ
కంటికి కనిపించని పనులెన్నో
జేసె కష్టజీవి‌.‌‌..
గనులు కర్మాగారాల్లో కార్యోన్ముఖుడవై
జీవన క్షేత్రంలో జీవచ్ఛవములా
అర్ధాకలితో ఆలు పిల్లల సాధు కుంటూ ‌‌.‌..
అలుపెరుగని ఉషోదయ భానుడిలా
రుధిరం బొట్లు ఇంధనంగా మార్చి
చెమట దారులు చింతిస్తూ..
ధనవంతుల పెంపు జేస్తు...
ఆశనిరాశల నడుమ
ఊగిస లాడుతు...
ఆత్మవిశ్వాసంతో అడుగిడుతుంటే..
ఈ మాయదారి కరోనా ఇక్కట్లు పెడుతూ..
కష్టజీవుల బతుకులు కృంగదీస్తుంది...
దినము కూలి లేక దిక్కుతోచక
రెక్కల మూలవడి డొక్క లెండి పోయె
ఇంట్లోనే ఇష్టం లేకుండా నుండు
 మంటే
కడుపు ఆకలితో అలమటించే..
ఉన్నోడికి ఉగాదైపోయింది
లేనోడికి శివరాత్రై పోయింది
చితికిన హృదయాల్లో ఎన్నో జ్ఞాపకాలు
ఆకలి బాధలు తీరని వ్యథలు
ప్రతి మనిషిని కుదిపేస్తుంది కరోనా..
కష్టజీవి లేక కలుగదువృధ్ధీ..
మీరే దేశానికి భాగ్యరేఖలు
భావితరానికి బాటలు మీరే
అయినా ....
గౌరవము దక్కలేదు
గంజి మెతుకులు దొరకలేదు.

జెగ్గారి నిర్మల.

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 10....

జెగ్గారి నిర్మల గారూ.. 

మీ కష్టజీవులు కవితలో శ్రమజీవు కష్టాన్ని...వలసజీవుల  వెతల్ని  ..అభివ్యక్తంచేస్తూనే అశనిపాతంగా శరాఘాతంలా సామాజం హృదయాన్ని తాకిన కరోనా సమస్యకు గురౌతున్న పేదల బాధలను కవితలో చక్కగా ఉటంకించారు..అభినందనలు.             

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

 అంశం:- కష్టజీవి

అబ్ధుల్ కలాంకు చేస్తున్నా సలాం

*************************
గంజాం భ్రమరాంబ
🏵️
ఎన్ని పుష్కర స్నానాల ఫలితమో
మరెన్ని రాజసూయ యాగాల ఫలితమో

మన కర్మభూమి భరతావనిలో
ఇంతగొప్ప మనిషి జన్మించాడు

ఎక్కడి రామేశ్వరం
మరెక్కడి షిల్లాంగ్
ఎనుబది నాలుగేళ్ల ప్రయాణం

అతని జీవితం అంతా కృషిమయం
ఎంతో విజ్ఞానం ఆ ఋషి మయం

అగ్ని..త్రిశూల్‌..పృథ్వి వంటి
క్షిపణులను సైతం
భారతదేశ అంబులపొదిలో
ఆయుధాలుగా కాకుండా

భరతమాత సిగలో
సిరి మల్లెలుగా అమర్చిన
శాంతమూర్తి

శాస్త్ర విజ్ఞానం
మన ధీరత్వానికి ప్రతీకలే గానీ
పౌరుషానికి సమిధలు కావని తేల్చి చెప్పిన
సహనమూర్తి

రాకెట్ తయారు చేసే సమయంలో
పోలియో కాలిపర్స్
తయారు చేసిన... ఘనుడు

క్షిపణుల తయారీ సూత్రంతో
గుండెకు ఉపయోగించే
స్టంట్ ను రూపొందించిన.. ధన్యుడు

దైవాన్ని నమ్మడంలో
మతంలో మానవత్వంలో
ఏకత్వం చూపిన ఘనాపాఠీ

తనతో పనిచేసిన వారిలో
కేవలం మంచినే గ్రహించిన
హంస స్వభావి

చివరి నిమిషం వరకూ
తన గురువుల ప్రభావాన్ని
మరిచిపోలేని..మంచి విద్యార్థి

దేశం లోని ప్రతివిద్యార్థి మదిలో
నిత్య స్ఫూర్తిని నింపిన చిరంజీవి

మనదేశాన్ని ప్రపంచ దేశాలముందు
అగ్రస్థానంలో నిలపాలని
తాపత్రయపడిన స్వప్నజీవి

తన చివరి నిమిషం వరకూ
 తన చివరి రక్తపు బొట్టునూ
మన దేశాభివృద్ధికి వినియోగించిన *కష్టజీవి*

వివేకానంద.. గాంధీజీ.. మదర్ థెరెస్సా
వరుసలో ఒదిగిపోయి
మన మనస్సుల్లో
ఎప్పటికీ అలాగే నిలిచిపోయి

ఆయన సంపాదించిన
అత్యున్నత పురస్కారాలన్నీ
మనకోసం వదిలి
మన ప్రేమాభిమానాలు మాత్రం
పట్టుకెళ్లిన ...

 భారతరత్నా..  ఓ అబ్ధుల్ కలాం
అందుకోవయ్యా నా సలాం

మళ్లీ నువ్వూ..
చెరగని నీ చిరునవ్వూ..
 భారతావనిలోనే తిరిగి జన్మించాలనీ...
మనసారా కోరుకుంటూ
పలకనీ దిక్కులు పిక్కటిల్లేటట్లు..

జై..అబ్దుల్ కలాం..
జయహో..అబ్దుల్ కలాం...

గంజాం భ్రమరాంబ

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

 సమీక్ష 11...

గంజాం భ్రమరాంబ గారూ..

మీ కవితలో మేథోశ్రమను కవితావస్తువుగా స్వీకరించి మహనీయుడైన కలాం వ్యక్తిత్వావిష్కరణ చేశారు..పుష్కరయాగాల రాజసూయ యాగాల ఫలితమే కలాం అంటూ ప్రశంసించారు..ఋషిగా శాంతమూర్తిగా..మానవతా స్వరూపంగా.. గుండె చికిత్సకు అవసరమైన స్టంట్ రూపకల్పన సరళీకృతం చేసిన పేదలపెన్నిధిగా..మంచినే గ్రహించిన హంసగా ఆయన మహనీయత్వంలోని అనేక పార్శ్వాలు స్పృశించడం బాగుంది అభినందనలు.                     

 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*కవులవేదిక కవితల పోటి- విభాగం (2)*
*11 కవితలు* సమీక్షలు*

◆◆◆◆◆◆◆◆◆◆◆◆
 అంశం - కష్టజీవి
శీర్షిక - ఉద్యోగిని
*******************

సహజ సుందరమైన మనో రీతులలోనే...
మేధకు శ్రామిక శకటమై.. తన
పర బేధమెరుగని పలకరింపుతో..
చెరగని చిరునవ్వుతో సదా..
ఆమె కష్టజీవి ఉద్యోగిని !

తాను లేచి సూరీడుని నిదుర
లేపి...ప్రవహించే నదిలా..
ఎక్కడ పని అక్కడే చక్కబెడుతూ... శరీరం,మనసు ఒకే లక్ష్యాన్ని
సాధించ గల చైతన్యo !

ఇంటా బయటా మానసిక గాయాలు సలుపుతూ ఉన్నా
కుటుంబం కొరకు పడే శ్రమకు
ఆత్మ, ఆరోగ్యం దెబ్బ మీద
దెబ్బ తింటూ ఉన్నా..
కనిపించని ధైర్యం, మనో నిబ్బరం,తేజస్సు నిస్తూ..
తోటి వారికి సాయం చెసే సహజ జ్ఞానం..
ఆమె బాటలో పల్లేళ్లు జిల్లేళ్లు
పరిచే సంఘాన్ని తిప్పి కొడుతూ...
సమాజ చేతనకు బడుగుల,నిరక్షరాస్యులకు
చిన్ని ఓదార్పు,పెద్ద వెన్నుదన్ను
ఇస్తున్న కష్టజీవి ఉద్యోగినికి
కోటి దండాలు !
**********************           
 ఎం. వి. ఉమాదేవి
   నెల్లూరు

[🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

సమీక్ష 12....

యం.వి. ఉమాదేవిగారూ...

మీ "ఉద్యోగిని" కవితా శీర్షికతోనే మీ లక్ష్యాన్ని ప్రస్ఫుటంచేశారు..మేథోశ్రామిక శకటంగా ఆమెను అభివర్ణించారు..ఇఃటాబయటా మానసిక గాయాలనడంలో సమాజపు వివక్షాదోరణిని అంతర్లీనంగా ప్రస్ఫుటంచేస్తూ నర్మగర్భంగానే ఎత్తిపొడిచారు...అనేకానేక సవాళ్ళమధ్యకోల్పోనిమనోనిబ్బరానికి ప్రతీకగా పేర్కొంటూ అమెను ఉదాత్తంగా చిత్రించడం బాగుంది అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

అంశం:  కష్టజీవి
పేరు:శ్రీకాంత్ కడార్ల
కలం :శ్రీశైనిక 🚩
హన్మకొండ
_-_-_-_-_-_-__-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

చెమటలతో తడిసిముద్దై
నిప్పుల కొలిమిలో ఆవిరై
విపరీతమైన శ్రమతో పనిచేయు
డొక్కచిక్కిన మనిషే కాదు కష్టజీవి

అసలు మనిషంటేనే  కష్టజీవి
అమ్మ కడుపులోనే మొదలయ్యే రణం
ఆయువు తీరేవరకు తప్పదు సమరం

ఉన్న గుడిసె ఊడిపోకుండా ఒకరు
కోటల్లాంటి ఇంటిలో మూటలు మూటలు పేర్చడానికి ఇంకొకరు.
ప్రాణం ఉన్నంత వరకు పాకులాటనే...

ధారల్లా కురిసే చెమట చుక్కలను తుడుచుకుంటూ
భారంగా కాసే ఎండలో కూడా నారుమడికి నీరుపట్టే రైతు ఓ.. కష్టజీవి

బ్రతుకు భారమై మెతుకు దూరమై
మోయలేని జీవితం అయినప్పటికీ
చంటిబిడ్డ ఆకలి తీర్చడం కోసం
రక్తాన్ని పాలగా మార్చి పట్టే తల్లి ఓ... కష్టజీవి

కన్నబిడ్డలకోసం కంటిమీద కునుకులేక
ఒంటిమీద అలుపులేక శ్రమించే
ప్రతీ తండ్రీ  ఓ.. కష్టజీవి

అమ్మ నాన్నల మాటపై గౌరవంతో ఇష్టంలేని మొరొటొన్ని పెళ్లాడి అతనితోనే జీవితం పంచుకునే ఆడబిడ్డలందరూ... కష్టజీవులే

రహదారులపై రయ్యిరయ్యిమని
ఉరికే ఏ వాహానమైన ఎవరిచేతిలో
రూపుదిద్దుకుందో ఎవరి స్వేధబిందువులతో అభిషేకించబడిందో ఆ కార్మికులందరూ.. కష్టజీవులే

పట్టెడన్నం కోసం పల్లెను ఒదిలి
పనికోసం పట్నానికి బయలెల్లిన
వ్యధతో నిండిన వలసకూలీలంతా.. . కష్టజీవులే

తాము కొనలేని బస్తాలను వీపులపై మోసే కూలీలందరూ.. కష్టజీవులే

కనిపించని స్వేదంతో, మేథోమదన
ఆలోచనలతో కుస్తీ చేసే  అన్నిరంగాల
ఉద్యోగులూ.... కష్టజీవులే
                     ...........
ఈ చెమటచుక్కల వాసన ఎన్నటికీ గుబాళింపుల అత్తరు అవ్వలేదు

ఈ పేదపూలు ఏనాడు దేవుని
పూజకు నోచుకోలేవు

నేతల ఊకదంపుడు ఉపన్యాసాలకు ఈ కన్నీటి రెక్కలే కావాలసిన సరుకులు

డెభ్బై యేండ్ల స్వతంత్ర్య భారతావనిలో
ఇంకా కొత్తగా వెలుస్తున్న గుడిసెలెన్నో

ఏడు పదుల గణతంత్ర రాజ్యంలో
మురికి వాడల్లో మగ్గుతున్న ప్రాణాలెన్నో

కష్టజీవుల రెక్కలు యజమానులను గాలిలో మోసే విహంగాలుగా
కష్టజీవుల కాళ్లు యజమాలను పరుగెత్తించే రథ చక్రాలు గానే మిగులుతున్నాయి.......

ఎంత పనిచేసినా  ఎంత నేర్పుగలవారైనా
ఎదుగుబొదుగు లేకుండా అక్కడే ఉంటున్నారు కష్టజీవులు వీరే
జాతికి ఆయువైన శ్రమజీవులు

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻.. 

సమీక్ష 13...

శ్రీకాంత్ కడార్లగారూ....

అమ్మకడుపలోనే మొదలయ్యే రణం ఆయువుతీరే వరకు తప్పదు రణమంటూ..గుడిసెలూడిపోకుండా పేద..కోటలు పెంచుకోవడానికి డబ్బున్నవాడూ చేసే ఆరాటాన్ని ఎత్తిచూపారు..చెమట చుక్కల వాసన అత్తరుపరిమళాన్ని మించలేదనిచెప్పడం బాగుంది..మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

[***నేను కష్టజీవిని***
                             ✍️డా.పాండాల

నేను ప్రస్తుతాన్ని
గతానికి శిఖరాన్ని
భవిష్యత్తుకు ఆధారాన్ని...!!

నిన్నటి స్వప్నాన్ని
రేపటి జ్ఞాపకాన్ని
నేటి నిజాన్ని యిజాన్ని కష్టపడే జీవాన్ని---!!

గతాన్ని స్వగతంగా
భావితరానికి స్వభావంగా
కవన బలంగా కదిలే
కాలచక్ర గమన కష్టాల కిష్టయ్యను..!

అనుభవాల్ని ఆనందదాయకంగా
పారించె శ్రమజీవన
సౌందర్యానుభూతున్ని...

నేనే నిత్య పరంజ్యోతిని
కాయకష్టాన్ని నమ్ముకున్న
కర్మయోగిని--!!

నేను అక్షరాలతో సాగే క్షణాన్ని
క్షణంలో శుభ తరుణంగా
మార్చే ప్రస్తుతాన్ని..--!!

నిత్య చైతన్యాన్ని
దశాంశాల శతమానాన్ని
త్రికాలాలలో
త్రికరణ శుద్దుల్లో...!!

మానవీయతల
మమతాలాపన
ఆదర్శాల
అనుక్రమాల...!!

నయగారాల
నవరస మయాల
నాగరికున్ని నవీనకాలశ్రమదోపిడికి
గురైన  నిర్భాగ్యున్ని..
దేశ సార్వభౌమాధికారానికి
మూలధాతువున్ని
నేను కష్టజీవిని...!!

సమున్నత గౌరవంగా
త్యాగమయశీలంగా
చేతనమే వినిమయంగ
జీవించే  నైతిక
విలువల సౌరభాన్ని...!!

సౌబ్రాతృత్వాన్ని ఎదజల్లే
సగటు కష్టాల సనాతనాన్ని
సంస్కరణల వరవడిని
ఒడిసిపట్టే నడవడికాన్ని...!!

భరతవాస భాగ్యాన్ని
ఆత్మీయతల ఆహ్లదాన్ని
చేయూతల స్నేహాన్ని
విశ్వశ్రేయ వినయాన్ని...!!

మనోవాక్కాయ కర్మల
కండల కొండల్లో
జాలువారే స్వేధ జలపాతాన్ని
దేశ దిశను మార్చె
తొలిమెట్టును నేను ..కష్టజీవిని...!!

అణువణువు అనునిత్యం
ఆకాంక్షల ఆచరణకు
ఆదర్శపు నడవడికి
సహకరించె సాధారణ
ఘర్మజలపు కార్మికుడిని..!!

కాల గతిలో కర్మయోగి
మూలధనపు మర్మయోగి
న్యాయ ధర్మ కీర్తి సుధల
శ్రేయమెంచె శీరోధారి..!!

శ్రమజీవుల ధర్మాన్ని
కాలచక్ర సత్యాన్ని
సమస్తలోక గమకాన్ని
సర్వ శ్రేష్ఠ ఓం శాంతిని...!!!

✍️డా. పాండాల మహేశ్వర్

[🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

సమీక్ష 14...

డా౹౹ పాండాల గారూ....

"నేను కష్టజీవిని" ఉత్తమపురుషలో సాగిన మీ కవితలో వర్తమానం గతానికి శిఖరమనీ భవిష్యత్తుకు ఆధారమనీ మంచి ఎత్తుగడతో చెప్పడంలో కష్టించే తత్వం త్రికాలాలను శాసిస్తుందని చెప్పకనే చెప్పినట్లయింది...గతాన్ని స్వగతంగా సూత్రీకరించడమూ బాగుంది...కాయకష్టాన్ని నమ్ముకున్న కర్మయోగిననిచెప్పడంలో శ్రమశక్తిని చక్కగా వ్యక్తీకరించారు.. దేశసార్వభౌమాధికారానికి మూలధాతువునని చెప్పడం సామాన్యుని మాన్యతేమిటో స్పష్టీకరించారు..కండలకొండల్లో స్వేదజలపాతాలంటూ కవనస్రోతస్సును పారించారు..అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

[ శీర్షిక:**కష్టజీవి***
----------*******--------------------------
*కష్టజీవి తత్వం వూహలకు అతీతం*                             
*తనో మంచిచెడుల సమ్మిళితo*
తన రెండు రెక్కలాడితేనే గానీ-
తనవారి డొక్కలాడని స్థితి కష్టజీవిది

ఎండల్లో  గాలివానల్లో
రాళ్ళల్లో రహదారుల్లో
బండ్లల్లో భవననిర్మాణాల్లో
గనుల్లో కర్మాగారాల్లో అన్నిటా తానే

రెక్కలు ముక్కలు చేసుకుంటూ
నెత్తురును మరిగిoచె.శ్రమను కొ న సా గి స్తూ
చెమటచుక్కలను చిందిస్తూ...
దేశ ప్రగతికి తోడ్పడే కృషీవలుడు

కీసాలో పైసలుంటే తానో పైలాపచ్చీసు
పలు దురలవాట్లకు గాఢ సహవాసి
శ్రమశక్తిని బూడిద పాలు చేస్తడు
సినిమాలు షికార్లతో గడిపేస్తడు

*భార్య జీవితాన్ని మందుమంటల్లొ పడేస్తడు*
పిల్లల తల్లిదండ్రుల గాలికి వదిలేస్తడు
*సంతోషానికి చిరునామాలా తోస్తడు*
*మధ్యతరగతోళ్లకు అసూయ కలిగిస్తడు*

*రూపీ*లేకుంటే బికారితత్వం పాటిస్తడు*
కాస్త చదివినోడు వేదాంతం వల్లిస్తడు
నిరాశతో అలసత్వమేదో చూపిస్తడు
*ఆశవాధై అదృష్టంతో అదృశ్య పందెమేస్తడు*

ప్రభుత్వ సాయానికై  ఎదురుచూస్థుoటడు
*ఏ సాయo చేయటానికైనా సిధ్ధంగుంటడు*
*నాయకులకై ప్రాణాన్నీ తృణప్రాయమంటడు*
ఓట్లధంధాలో నోటుకు అమ్ముడయ్యే ఓటైతడు

*బ్రతుకుదెరువుకై బహుదూరపు బాటసారైతడు*
*ఆయుష్షుంటెనే సొంతగూటికి చేరతడు*
*అల్పాయుశ్కుడై వేలమైళ్లు నడిచినోడూ*..
*పట్టాలమీద కదలక చెల్లని నాణెమైతడు*

*రేపటి గురించి యోచించని *యోగిపుంగవుడు*
*భవిష్యత్తు గురించి బాధపడని *స్థితప్రజ్ఞుడు*
పిల్లల భవిష్యత్తుకై అహరహం పాటుపడే
ప్రతి తల్లిదండ్రీ వెలలేని కష్టజీవుడే

*కష్టజీవికి ఇరువైపుల అక్షరాస్త్రాలతో నిలిచి*
*స్పష్టంగ స్పందించే*సుకవి*సైతం కష్టజీవే*
ఎల్లరికష్టాలను తనవిగ భావించే కలంయోధుడు  *కవి*
అందరి ఎద చీకట్లను తరిమే *రవి*

*వల్లాల విజయలక్ష్మి**,,*ఆలేరు*

[🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻     

సమీక్ష 15...విజయలక్ష్మిగారూ.....ప్రకృతి ప్రతికూలాలమధ్య అన్నీ తానై శ్రమించే శ్రామికుని తత్వాన్ని రెక్కలు ముక్కలుచేసుకుంటూనే మరోపక్క దురలవాట్ల దౌర్భల్యాన్ని ఎత్తిచూపారు...ఇదే సందర్భంలో "రైలుపట్టాలపై కదలక చెల్లని నాణెమైతడంటూ"  ఈమధ్య జరిగిన రైలుప్రమాదాన్ని ఉద్దేశించిన కవితావాక్యాలు గుండెను తడిచేస్తాయి...ఎన్నిసుగుణాలున్నా ఓట్లసమయంలో నోటుకు అమ్ముడుపోవడాన్ని నిరసించడమూ నచ్చింది అభినందనలు మీకు.               

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

వై.కె.సంధ్యశర్మ
* **************** *
*శీర్షిక: కష్టజీవి*

ఆకాశపు అంచుల్ని తాకుతూ
స్వేచ్ఛనే జయించే తాయిలమేదో
అరకమోసే
ఆ చెమట చుక్కలెపుడూ
చెబుతూనే వుంటాయి..
పచ్చని వాకిళ్ళ మధ్య ....
*అన్నదాతల కథల వ్యథలు....*

మందిలో మర్మమెరిగిన మనసు
శూన్యపు లావాను పలకరించి
మొండి మొనల్ని తడుముకుంటూ
శుద్దముక్కతో బీజాక్షరాల హేతువు
నాటి సమాజపు పందిరి తీర్చిదిద్దే
ఆ చేతులెపుడూ చెబుతూనే వుంటాయి...
నల్లబల్లపై శ్వేతాక్షర మాలగా
*చిట్టి చీమల ప్రపంచాన్ని...*

జాలి లేని దారిలో
నమ్మిన విశ్వాసంలో
ముళ్ళ కిరిటాన్నీ మన్నించి
ఆత్మగౌరవ అస్థిత్వాన్ని నిలబెట్టే
సామ్యమేదో సామాన్య మధ్యతరగతి
గదిలో వల్లెవేసే పాఠలేవో
చెబుతూనే వుంటాయి. ...
జీవిత సాగరంలో ఈదే
*చేప పిల్ల కథల తరగలను...*

ఆశలు ఆవిరిచేసే
ఆంక్షల వలయాలు చుట్టుముట్టినా
క్రొత్త చిగురులేసి
సృజనకు పట్టం కట్టే ఊపిరులన్నీ
ఉజ్వల భవితలో పునాదులై
నిశిని వెలివేసే వెన్నెల ఝరులన్నీ
చెబుతూనే వుంటాయి....
*శకలాలుగా రాలే అమ్మ రెక్కల కష్టాన్ని...*

*బాధనీ వెలితినీ తవ్వుకునే*
*తీతువులమైనా....గుప్పెడు ఔదార్యపు వాక్యాలతో...*
*జీవిత నిఘంటువులోని ప్రతి జీవీ*
*కష్టజీవుల జాబితాలో ముందు వెనుక*
*తరతమ భేదాలు లేని*
*సామ్యవాద పరిమళమేదో*
*ఒంటికి రాసుకునే వుంటాయి....*
*రేపటికి ఓ వెలుగు వాకిలిని* *తెరిచుంచాలని...!*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻       

 సమీక్ష 16...

సంధ్యశర్మ గారూ...

ఆకాశాన్ని తాకే విజయరహస్యం చెమటచుక్కలకే తెలుసంటూ బలమైన అభివ్యక్తితో ఎత్తుగడను ప్రారంభించారు..మర్మమెరిగిన మనసు శూన్యపులావాను పలుకరించిందనడం..నల్లబల్లపై శ్వేతాక్షరమాలగా చిట్టిచీమలప్రపంచాన్నీ పరిచయించడం..జీవితసాగరంలో ఈదే చేపపిల్లకథలూ..ఆంక్షల వలయంలోకొత్తచిగురులేసిందనడం అమ్మకష్టం  శకలాలుగా రాలిందనడం ఇలా ప్రతీవాక్యం మీకవితలో పదునుతో కవితాత్మకమై కదంతొక్కింది అభినందనలు

◆◆◆◆◆◆◆◆◆◆◆◆

 డా. బల్లూరి. ఉమాదేవి
శీర్షిక అన్నదాత
ప్రక్రియ పద్యములు

1ఆ.వె: హలము పట్టి సాగు నన్నదాత యిలను
       పగలు రేయి కష్టపడుచు చుండు
    పంటలందు వేళ  భారీగ వర్షమ్ము
      కురిసి నంత గాంచి కుమిలి పోవు.

2.ఆ.వె:అరక చేత బట్టి యహరహమ్మును తాను
     పనులు చేయుచుండు వసుధ యందు
     మూడు పనులు విడక ముచ్చటగా చేయు
     విత్తు  తెచ్చి నాటి పెంచు చుండు.

3.ఆ.వె: పొలమె సర్వ మనుచు పొద్దస్తమానము
 కష్టపడిన  గాని కరము లందు
   కాసు మిగలకుండ ఖర్చు కే సరిపోగ
   కలత పడుచు నుండు కష్టజీవి.

4.ఆ.వె:అందమైన పంట యవనిలో పండించి 
        మురిసి పోవు చుండు ముదము తోడ
       అంత లోన వాన యధిక మగుచు పంట
       చేయి జార పోగ చింత చేయు.

5ఆ.వె: కరువొ కాటకమ్మొ కారణమేదైన
      కష్టజీవి  కెపుడు కష్ట మొకటె
       మిగులు చుండె గాని మేలైన భాగ్యము
         కాన రాక రైతు కనలె మదిని.

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻.     

సమీక్ష 17....

ఉమాదేవిగారూ...

నాలుగు ఆటవెలది పద్యాలను కర్షకుని  శ్రమను ప్రకృతి పైన ఆధారపడుతూ అనుకూలించని పరిస్థితుల్లో తానెంతకుములుతాడో వర్ణించారు పొలమే సర్వస్వంగా భావించినా పెట్టుబడి సైతం రాబడికినోచుకోని దుస్థితిని బాగుగా వర్ణించారు మీకు అభినందనలు

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

: పేరు: శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుని
 శీర్షిక: అదృష్ట జీవి

 ఎగజిమ్మిన నిప్పు రవ్వల రహస్యాల్ని శోధిస్తూ
 కలపు సంకెళ్ళను చేధిస్తున్నాను
 ఆ నిప్పుల్లో రగిలే కష్టజీవిని వెతుకుతూ
 నిష్కృతిలేని ఆ  ఆకృతి వెనకున్న
 అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తున్నాను

 ఆ అవిశ్రాంత శ్రమ తరంగాలేవీ
 జననమరణాల్ని ధ్యాసించట్లేదు
 ఆ కళ్ళలో ఏ కాలాంకిత భావోద్వేగాలు
 రంగుల కలలై భ్రమించట్లేదు

 పగులుతున్న కొండల్లోనో
 రగులుతున్న గుండెల్లోనో
 రేపటిని శాసించే ఆత్రుత
 కనిపించడం లేదు

 చిందిన  చెమట చుక్కల్లో
 ఎండిన ఆకలి డొక్కల్లో
 రాలిన కన్నీటి చుక్కల్లో
 గుప్పెడు మెతుకుల కోసం పోరాడే రెక్కల్లో
 అతని రూపం అస్పష్టంగా
రూపుదిద్దుకుంది నా సిరా చుక్కల్లో !!!

 అలసిన కాలం ఆవలిస్తుంటే
 చేసిన పగటి కష్టం సగమే కడుపు నింపినా
 సుఖంగానే  నిద్ర పోతున్నాడు
 రేపటి తన కాయకష్టాన్ని నమ్ముకొని
 ఏం దాచుకోవాలో,  ఎలా దోచుకోవాలో
 ఎరుగని ఆ కష్టజీవి…..
 అదృష్ట జీవి…..!!!

: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

  సమీక్ష-18...

శ్రీశివలక్ష్మి రాజశేఖరుని గారూ...

మీ అదృష్టజీవి కవితలో నిప్పుల్లో రగిలే కష్టజీవిని అన్వేషించి సఫలీకృతులయ్యారు... జననమరణాలను ధ్యాసించని శ్రమతరంగాలనూ దర్శించారు..వారికళ్ళల్లో భావోద్వేగరహిత స్థితిని దర్శించారు..గుప్పెడుమెతుకులకై ఆరాటపడే ఆకలిడొక్కల ప్రభావానికి పగిలిపోతున్న కొండల్లోనో రగులుతున్న గుండెల్లోనో న్యాయమైన కోర్కెమాత్రమే ప్రతిబింబిస్తోందన్న సత్యాన్ని మీ కవిత ఆవిష్కరించింది కష్టజీవిని మీ కలంలోకి విజయవంతంగా ఆవాహనం చేసుకోగలిగారు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

: శీర్షిక: కర్షక శ్రామిక కార్మిక

రేయింబగలు
ఎండనక వాననక
సేద్యం చేసే
కర్షకుడు కష్టజీవి!

తను కష్టపడితే కాని
ఈ లోకానికి తిండి
దొరుకదు, మరి
లోకం కడుపు నింపే
అన్నదాతకు నిండా
ఐదువేళ్ళు నోట్లోకెళ్ళడం
గగనకుసుమమైంది
ఈ రోజుల్లో!

సకాల వర్షాలు రాక
పంటలకు పెట్టుబడుల్లేక
అకాల వర్షాలతో
హైరానా పడి
పంట చేతికొచ్చేసరికి
దిగుబడికి
సరైన విలువ రాక
చేసిన అప్పులు
తీర్చలేక
విధివంచితుడైన
రైతన్న నిజమైన
కష్టజీవి!!!   (1)

రాత్రనక పగలనక
తన శ్రమను ధారవోసి
నవలోక నిర్మాణం చేసే
రెక్కాడితేగాని డొక్కాడని
శ్రామికుడు కష్టజీవి!

ఎర్రటెండల్లో
నేటి ఇన్నర్ ఔటర్ రీజనల్
రాష్ట్ర జాతీయ రహదారుల్లో,
గొప్ప గొప్ప భవన నిర్మాణాల్లో భాగస్వామైన
ఈ శ్రామికుని జీవనం
నేటికీ గుడిసెల్లో, రోడ్లపైనే!

శ్రమదోపిడీకి గురౌతూ
అన్నమో రామచంద్రా అనే
శ్రామికుడు నిజమైన
కష్టజీవి!!!       (2)

నిరంతరం కర్మాగారాల్లో
చెమటను చిందిస్తూ
ప్రమాదం అంచుల్లో
పనిచేస్తూ
అత్తెసరు బతుకులీడుస్తున్న
కార్మికుడు కష్టజీవి!

గుండుసూది నుండి
లోహవిహంగాల వరకు
అత్యున్నత సదుపాయాలన్నీ
నీ చేత నిర్మితాలే,
అయినా నీ బతుకు
కడగండ్లు తొలగిపోలే!

లోకానికి సుఖాలనందిస్తూ
చాలీచాలని జీతాలతో
కష్టాలను అనుభవిస్తున్న
కార్మికుడు నిజమైన
కష్టజీవి!!!       (3)

రోజూ సుష్టుగా
భోంచేస్తాం కానీ
భోజనాన్నందించిన
ఆ రైతును మాత్రం
ఎవరూ కనీసం
తలువనైనా తలువరు!

పునాదిరాళ్ళు భవనాన్ని
చూడలేవన్నట్టు
కష్టం మాత్రం వాళ్ళది!
అంతా తాజ్మహల్ బాగుందంటారు కానీ
ఆ నిర్మాణానికి రాళ్ళెత్తిన
ఆ శ్రామికులను మాత్రం
ఎవరూ కనీసం
తలువనైనా తలువరు!

ఎన్నో సాంకేతిక
సదుపాయాలను
అనుభవిస్తాం
హాయిని పొందుతాం
కానీ ఆ కార్మికుని శ్రమను
మాత్రం ఎవరూ కనీసం
తలువనైనా తలువరు!

కష్టం సుఖం (కష్టసుఖాలు)
జంటగుంటాయంటారే,
ఇదేమి చిత్రమో కానీ
లోకానికి సుఖాలను
సౌభాగ్యాలను అందించే
కర్షక శ్రామిక కార్మిక
వర్గాలకు ఎప్పుడూ
ఒక్క కష్టమే తోడై ఉంటోంది !!!
🌹
✍️వరయూరు జానకిరామ్

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

సమీక్ష 19...

జానకీ రామ్ గారూ....

రోజూ సుష్టుగా భోంచేస్తాం కానీ భోజనాన్నందించిన రైతును మాత్రం తలువరు..అత్తెసరు బతుకులీడుస్తున్నకార్మికడు కష్టజీవి అంటూ నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని కవిత్వీకరించారు..కవిత ప్రథమపురుషనుండి మధ్యమపురుషలోకి.. పమధ్యమపురుషనుండి ప్రథమపురుషలోకి మారడం మినహాయిస్తే..బాగుందండీ కవిత... అభినందనలు
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

: కోరాడ నరసింహా
          రావు;
   శ్రమయేవజయతే
   ***************
"ఘర్మజలానికి...కర్మ
జలానికి ఖరీదుకట్టే
షరాబు లేడోయ్"
అంటూ...శ్రీ శ్రీగుర్తించి
అండనిలిచి...ముందుకు నడిపించిన...
ఉత్తేజం..,ఉత్సాహం
కష్ట జీవి !
తన చేతి నైపుణిని
వృత్తిగా స్వీకరించి
ప్రతిభను ప్రదర్శించి నా...కడుపునిండని
కష్ట జీవు లెందరో !
కార్మిక,కర్షక,శ్రామిక
కష్ట జీవులే ...ఈ సమాజ సౌందర్యం!
కమ్మరి,కుమ్మరి,సాలె
వడ్రంగి...వారని -వారని వేరు వేరు గా
చెప్పుటదేలా...కాయకష్టముతొ బ్రతికెడి
ప్రతి వోక్కరును...
ప్రగతి రథానికి ఉపకరణమ్ములే  !
ఈ శ్రామికులంతా
ఒక ఎత్తు !  ఇంటా
బయటా...అవిశ్రాన్తాముగ...సమర్ధంగ
తమబాధ్యతలన్నీ
విజయవంతముగ
నిర్వర్తించే మహిళామణులె
కదా...నిజమైన
కష్ట జీవు లన్న...!!
కుటుంబంకోసమెంత
శ్రమించిన...తృప్తితొ
కలుగునలఆనందమే
అది ఆరోగ్యమే...!
సుఖాలను పంచుతూ బ్రతికే కష్ట జీవులు కలత చెంది కన్నీరు పెడితే ....
అదీసమాజానికి శ్రేయమా...!?ఆ సుఖాలే కష్టాలుగా
మారిపోలేదా...!
ఆందోళనలు,తిరుగు
బాట్లు,పోరాటాలుగా
పరిణమించలేదా..!!
అభిమానించి...గౌరవించి అండ నిలిచి నపుడే కదా...అది
మానవత్వమవుతుంది....!
*****************
........కోరాడ.

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻...

సమీక్ష20...

కోరాడ నరసింహారావు గారూ...

కాయకష్టముతో బతికే ప్రతీఒక్కరూ ప్రగతిరథానికి ఉపకరణాలే అన్నమీ వాక్కుయథార్థం..శ్రమను నమ్మే కష్టజీవులు కన్నీరుపెడితే అదిసమాజానికి మేలుకాదన్న మీ హితవుతో కూడి వాక్కు వాస్తవం అభినందనలు
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

పేరు అనంతలక్ష్మి
కవిత శీర్షిక: కష్ట జీవి

ఎంత కష్టం బడుగుజీవికి
రెక్కల నమ్ముకుని
పొట్టకూటికై ఊరు విడచి
ఆలు బిడ్డల వెంట బెట్టుకుని
చంటి దానిని చంకనేసుకుని
ఉన్న కాస్త ఆస్తి మూట
నెత్తికెత్తుకుని రోడ్డెక్కిన
కష్ట జీవి పయనం అనంతం
గమ్యమెరుగని ప్రయాణంలో
ఆశే ఆసరాగా సాగి పోయేవా
కడుపు నిండిన నేతలంతా
నిర్ణయాలు ప్రకటిస్తుంటే
నమ్మకం పోయిన తాను
సాగుతూనే ఉన్నాడు
కరిగిన ఏ దయార్ద్ర హృదయమో
దయతో కడుపు నింపితే
కదలిపోయి కన్నీరు పెట్టే
ఆ శ్రమ జీవికి ఏది భరోసా?
నెత్తుటి చుక్కలనే
స్వేద కణాలుగా మార్చి
ధారపోసే ఓ కష్టజీవీ
నీవే లేకుంటే బ్రతుకు అస్తవ్యస్తం
ఈనాడే నీ బ్రతుకే
అతలా కుతలం
       ---అనంతాభిరుచి

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష..21..

అనంతలక్ష్మిగారూ....

వలసకూలీల దురవస్థలకు ఆవేదనాత్మకమైన మీ కవిత అద్దంపట్టింది...నేతల తప్పుడునిర్ణయాలే కూలీల దుస్థితికి కారణమనీ వారికి భరోసాకావాలనే మీ ఆకాంక్ష ప్రగాఢమైంది అభినందనలు
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

మహేందర్ జవ్వాజి
అంశం.కష్టజీవి
$$$$$$$$$$$$$$$$$$

పంటపొలాలు సాగు చేయ
అరకదున్నే రోజు రైతన్న హలంచేబూనీ...
రేయింబవళ్లు తేడా ఎరుగని ఎకైక కష్టజీవి  మన రైతన్న.
అన్ని పంటల్లో ఆరితేరినవాడు మానవాళికి ఆదర్శ ప్రాయుడు గురుతెరుగని నావికుడు ముప్పొద్దుల  నలుగురికి బువ్వ పెట్టె బుద్ధుడు కుటుంబ సభ్యులో కన్ను పాడి పంట రెండో కన్ను గా అలుపెరుగని దీరుడు పేరుకే రైతు..పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అరిగోసలె వారికి అందిన గొప్ప బహుమతులలాయె ఎటెటా సుమా..పాడైన భూముల సైతం వ్యవసాయం చేస్తు మనందరికీ సాయపడుతున్న శ్రామికుడె మన రైతన్న. రోజులు మారినా రాజ్యాలు మారిన ప్రభుత్వ నేతలెందరున్నా  రైతుల బందిల బాధలు తప్పవాయె ఏనాడూ...

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

సమీక్ష 22..

జవ్వాజి మహేందర్ గారూ.. 

రైతు గురుతెరుగని నావికుడు...మీరన్నమాట నిజమే.....సమాజ నావను జీవనసంద్రంలోనడుపుతూ కష్టిస్తున్నాడు..అరిగోసలే వారికి బహుమతులన్న మాటకూడా నిజమే..పెట్టుబడి మిగిలినా బహుమతిగా భావించే రైతుస్థితిని మీ కవితలో వర్ణించారు..అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

*కవులవేదిక కవితలపోటి*
*విభాగము -03*
*కవితలు- సమీక్షలు (11)*

◆◆◆◆◆◆◆◆◆◆◆

కవులవేదిక
శీర్షిక:కష్టజీవి

 కడగండ్ల  సేద్యపు గుండె బావిలో ఆనందపు తడి కానరాక
గిట్టుబాటు ఎండమావి యై
పెట్టుబడులకు ఠికాణా  నిండుశూన్యమై
తప్పని అప్పులు తడిసి మోపెడై
బండబారిన బతుకుతో రెక్కలు ముక్కలైన...
తానే కదా  కష్టజీవి

విపత్తుల వికృత కేళిలో విలవిలలాడుతూ
ఆరుగాలం శ్రమిస్తూ..
పండుగ పూటా పస్తులుంటూ
జాతికి మెతుకులందిస్తూ
బతుకంతా వెతలతో
 చితికి పోయిన...
 తానే కదా  కష్టజీవి

 అగ్గిపెట్టెలోఅద్భుతాల్ని
సృష్టిస్తూ ...
దారంఆధారమై ఆదరణేకరువై ..
 సాగని సంసారచక్రoలో
అలుపెరుగని శ్రామికరాట్నమై
మగ్గాల్లోనే మగ్గిపోతున్న....
తానే  కదా కష్టజీవి

కళ్లల్లోని కాంతుల్ని  కమనీయవస్త్రాలకు రంగులద్ధి
గుండెతడిని దారపు కండెలకద్ధి సాంచెల సవ్వడి గా సందడి చేస్తూ..   ...
విపణివీధులoదు  వేసారినపాదాలతోతిరిగే..
తానే  కదా కష్టజీవి

కాలచక్రం తో పోటీ పడుతూ
కాళ్లకు చక్రాలు కట్టుకొని
కష్టాలు కన్నీళ్లకు వెరవక
రుధిరాన్ని స్వేదం చేస్తూ
చెదరని చెదపట్టని అక్షరాలలోఒదిగినకార్మికులు....
 కదా కష్టజీవులు

********లలితాకృష్ణ

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 23...

లలితాకృష్ణ గారూ....

కడగండ్ల సేద్యపు గుండె బాయి...గిట్టుబాటు ఎండమావి..ఉపమానోపమేయాల మోహరింపు బాగున్నది..పండుగపూట పస్తులు బతుకంతా వెతలు అగ్గిపెట్టెలో అద్భుతాలు..దారం ఆధారం శ్రామికరాట్నం కాలచక్రంతో పోటీకి కాళ్ళకు చక్రాలు కట్టుకోవడం.. *గుండెతడిని దారపుకండెలకద్దడం వంటి*  పదునైన భావస్ఫోరక వాక్యాలతో కవనసేద్యం చాలాబాగుందండీ అభినందనలు...

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

అంశము కష్టజీవి
పేరు చివుకుల శ్రీలక్ష్మి
కవితా శీర్షిక *ఎవరు కష్టజీవి?*
కాయకష్టం చేసే వాడే కష్టజీవి
కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి
ఎంత చక్కని మాటలు!
ఎంత పద గుంభనం!

 కష్టజీవి ని గుర్తించేదెలా?
మేనుతో పని చేసే వాడొకడు!
మేధతో  పని చేసే వాడొకడు!

నమ్ముకున్న భూమాతను వదలలేక
నింగి నుండి చినుకు పడే ఆశలేక
నాటిన విత్తులు మొలకెత్తునో? లేదో?
పండిన పంటను  దాచుకునే వీలు లేక
అందరికీ అన్నం పెట్టగలనో? లేనో?
రేయింబవళ్ళు ఒత్తిడితో బ్రతికే
ప్రథమ కష్టజీవి! రైతన్నా నీకు  జోహార్లు!

మండే వేసవిలోనైనా చల్లని శీతలమైన
నీ మేను మాత్రం మండే కొలిమి చెంతే!
కలుషితమైన కార్ఖానాలలో
వేడి మీద తీరు తెచ్చే
లావా వంటి ద్రవముపై
సుత్తి దెబ్బలు కొడుతుంటే
నీ నుండి ఉరికే స్వేద జలం
కొలిమికి ఒక లెక్కా!
ఎన్నడు నీ బ్రతుకుకి ఒక మంచి బాట!
ఎన్నడు తండ్రీ! అందుకో నా జోహార్లు!

చల్లని శీతల గదిలో
మనిషి కనిపెట్టిన యంత్రం
ముందు కూర్చుని రేయింబవళ్ళు
24 బై 7 అంటూ
జీ హుజూర్! అంటూ
మెదడు పగిలిపోయేలా ప్రోగ్రాములు రాసి
నిదుర కూడా కరువై పోగా
తెచ్చుకున్న డాలర్లు
ఖర్చుపెట్టే సమయమే లేక
కుటుంబానికి మానసికంగా దూరమై
వ్యధ పడుతున్న ఓ కష్టజీవీ!
నీ కష్టాన్ని గుర్తించే వారు కూడా లేరాయె తండ్రీ!
అయినా ఈనాడు
భూగోళం ఒక కుగ్రామం అయిందంటే
నీవే నీవే కారణం
అందుకో నీకే నీకే మా జోహార్లు!

కష్టజీవులారా!
మీ వెతలను గుర్తించే రోజొచ్చింది
కవులంతా కలాలు తీశారు
మేనులో మనసులో మెదడులో
నిక్షిప్తమైన మీ కష్టాలను బాధలను
జల్లెడ పట్టి వెతుకుతారు
ప్రపంచానికి చూపుతారు.
పరిష్కారాలను సాధిస్తారు!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻     

సమీక్ష 24....

చివుకుల లక్ష్మి గారూ...

మీ కవితలో మేను,మేథో శ్రామికులకిరువురికీ సమప్రాధాన్యత నివ్వడం బాగుంది..ఏ కాలమైనా కష్టజీవి శరీరం మండే కొలిమేనంటూ వర్ణించడం నచ్చింది..స్వేదజలం సైతం ఆర్పలేని కొలిమిని మోస్తోన్న కష్టజీవి శ్రమకు పట్టం కట్టడమూ బాగుంది అభినందనలు.                                   

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

// కష్టమంటే ప్రాణం //
--------- నిమ్మ రాంరెడ్డి

పేగులెండి అట్టలుగట్టినా
ఉమ్మినీరు లేక పుండుపై బండ రాకినట్లు రాకుతున్నా
పూలసజ్జలో తొమ్మిది నెలలు మోసే అమ్మ  మొదటి కష్టజీవి

అమ్మను గుండెలపై మోసే శ్రామిక చక్ర ఎముకల గూడు నాన్న రెండో కష్టజీవి

ఆశల గుడ్లను పొదిగించి గొంగలిపురుగునుంచి సీతాకోకచిలుకలుగా ఎగరవేయించే గురువు
మూడో కష్టజీవి

సందెడు గడ్డితిని
సాయంత్రముదాకా ఈగవాలకుండా దుక్కిదున్ని గుమ్మిలు నింపే కాడెద్దు
నాలుగో కష్టజీవి

కష్టమంటేంటో
సిమెంటుబండలనుంచి చొచ్చుకొనొచ్చే చీమనడుగు
వేల మైళ్లు దాటుకొనొచ్చే సైబీరియన్ కొంగనడుగు
వాతలొచ్చేటట్లు కొట్టినా బిడ్డకు పాలిచ్చి యజమానికి కడుపునింపే గేదెనడుగు
ఎన్ని సార్లు నరికినా చిగురుతో పలకరించే చెట్టునడుగు

కష్టమంటే
గుడ్డునుంచొచ్చే పిల్లనడుగు
కుబుసం విడిసే పామునడుగు
వెలుగునిచ్చే సూర్యున్నడుగు
వెన్నెలనిచ్చే చంద్రున్నడుగు

కష్టమంటే
నరాలతో తాళిబొట్టు  పేనుకొని
పసుపు రాసుకునే ఇల్లాలుకెరుక

గూడుచెదరగా
మూట నెత్తిమీద పెట్టుకొని
సంకలో పిలగాడు
పిలగాని చేతిలో ఫోటోతో
సాగిపోతున్న చెమటవాగుకెరుక

మట్టిరేణువులనుంచి
మెతుకు పుష్పాలను పూయించే హరితమిత్రకెరుక

కన్నీటి దారలతో నేసిన
స్వాభిమాన పరదా చాటున
గుక్కపట్టిన నేతన్నకెరుక

దావాఖానే గూడైన గువ్వకెరుక
పాదాలపై బుగ్గపెట్టిన దారికెరుక

కష్టమంటే
బుగ్గను కనిపెట్టిన అడిషన్నడుగు
శక్తిగుట్టును విప్పిన ఐన్ స్టీన్నడుగు
పేపరమ్మి ప్రెసిడెంటైన కలామ్నడుగు
రథాన్ని నడుపుతున్న చాయివాలానడుగు

కష్టమంటే ప్రాణమని
కష్టమంటే జీవమని
భయపెడుతున్న కరోనానడుగు చెబుతుంది

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻.....

సమీక్ష.25...

నిమ్మరాంరెడ్డి గారూ...

ఉమ్మనీరు లేక పుండుపై బండరాకినట్లు..అమ్మయొక్క శ్రమ త్యాగ సహన గుణాలకు అద్దంపట్టిన ఎత్తుగడ..నాన్నను ఎముకలగూడు అనీ..గురువును అందమైన భవిష్యత్తు దార్శనికుడనీ వర్ణించడం నచ్చింది..సిమెంటును చీల్చే చీమలు..వేలమైళ్ళుదాటే సైబీరియన్ కొంగల వైనాన్ని కళ్ళకు కట్టించారు... కలాం మోడిల ప్రస్తావనతో శ్రమ అందలాలనూ అవరోహింపజేయగలదన్న ఆశావాద ధోరణి అభివ్యక్తం చేయడం నచ్చింది అభినందనలు మీకు...

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

కె.జగదీశ్వరి
అంశం.. కష్టజీవి
శీర్షిక..కష్టం లేక సౌఖ్యమెక్కడ?

సృష్టికి పునాది అమ్మ!
కష్టానికి ప్రతిరూపం అమ్మ!
కడుపున మోసి కన్నుల ఉంచుకొను,
అపురూప జన్మ అమ్మ!

మగడికి మమతలనిచ్చి,
అత్తామామలకు విలువలనిచ్చి,
కడుపున కాచిన కాయలను,
కమ్మని పండ్లుగా మార్చే తరువు!
వర్ణించ భాష లేనిది అమ్మ!

ఆమేలే కష్టజీవి!
ఆమే! సృష్టికర్త బ్రహ్మ!!

శిశుప్రాయం నుండి
చేయూతను అందించి,
తరగని ప్రేమకు గనియై,
తనువును ధార పోసిన
త్యాగశీలి నాన్న!!

అతడేలే కష్టజీవి!
ఇల నడిచే ఇలవేలుపు!!

పలకన అక్షరాలు దిద్దించి
ఒద్దికను,విద్యను నేర్పించి
అనన్య సామాన్యులుగా తీర్చిదిద్ది,
సమాజాన అన్యాయాలకు,
విద్యార్థులనస్త్రాలుగ మలచి,
అమూల్య రత్నాలను జగతికి
అందించు కర్మాగారపు కృషి!

అతడేలే కష్టజీవి!
అలుపెరుగని ఒజ్జయతడు!

చెమటలేరులు పారించువాడు!
రెక్కలు ముక్కలు చేసుకొనువాడు!
రేయింబవళ్ళు పంట కాచేవాడు!
అప్పులే కుప్పలై ఉప్పెనైనా!
దుఃఖమున్నా దుక్కి దున్నేటోడు!
లోకానికి అన్నాన్ని బెట్టువాడు!

అతడేలే కష్టజీవి!
సృష్టిని బతికించు రైతన్న!

సరిహద్దుల ముప్పొద్దులుండువాడు!
యుద్ధానికైన వెరవని వాడు!
దేశభధ్రతకై ప్రాణమొడ్డువాడు!
కంటిరెప్పలా జనుల కాచువాడు!
భరతమాత ముద్దుబిడ్డయతడు!

అతడే సిసలైన కష్టజీవి!
జగతిని కాపాడు జవానన్న!

ఆపదవేళ ఆదుకొనువాడు!
అనారోగ్యాన్ని తరిమికొట్టి
ఆరోగ్యాన్ని తట్టి లేపువాడు!
ప్రాణం పోవువేళ జీవమిచ్చువాడు!
అమ్మ జన్మనిస్తె,వెజ్జు ఆపద బాపు!

అతడేలే కష్టజీవి!
వైద్యుడనే నారాయణుడు!

తల్లిలాగ లాలించి
రోగమున సేదదీర్చి
విసుగొందక,విరామమెరుగక
అక్క, చెల్లెలి అనురాగము పెంచు!

ఆమే లే! కష్టజీవి!
సేవకు ప్రతిరూపు నర్సమ్మ!!

దౌర్జన్యాలకు యమకింకరుడై,
మగువల మానప్రాణాలకు
రక్షణ కల్పించు రుద్రుడై!
జనుల గుండెల్లోని భద్రతే!
అన్యాయాన్ని ధిక్కరించు,
న్యాయమే ఇతడు!

అతడేలే కష్టజీవి!
అలుపెరుగని పోలీస్!!

కృషి ఉంటే అంతా ఋషులే!
కష్టిస్తే జగమే స్వర్గప్రాయం!
కష్టం లేనిది విజయం లేదు!
కష్టజీవులు లేని విశ్వం లేదు!

           కానీ!!

ఎక్కడ కష్టం?
కడుపు కాలే వాడికే కష్టం!
చల్ల కదలని వాడికే నష్టం!

బోరు యంత్రాలొచ్చినయ్!
బావినీరు తోడేదెక్కడ?
చేతులు లావెక్కుతున్నయ్!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

మిక్సర్ గ్రైండర్లొచ్చాయ్!
రోకటి దంపుళ్ళు పొయినయ్!
జబ్బల కొవ్వులు పెరిగినయ్!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

సాబాసు బండలొచ్చినయ్!
ఎర్రమన్ను అలుకుళ్ళు పొయినయ్!
మోచేతుల గుంజుళ్ళు పెరిగినయ్!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

రాత్రుళ్లు లైట్లొచ్చినయ్!
పొద్దుపోయినా నిద్దర్లు లేవు!
అర్థరాత్రి టీవీల దరువు!
తెల్లారంగ మొద్దు నిద్దుర!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

ఉషోదయపు కాంతి తగలక,
ఏసీ గదుల నిషా వదలక,
చల్లని గాలిని కోల్పోయే
మొద్దు నిద్ర మెదళ్ళకు,
రోగాలు మొదలాయె!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

పనిమనుషులను నెపముతొ,
పనికి రాని అలవాట్లతో,
రోగాలెన్నొ ముంచుకొచ్చె!
ఒళ్ళు చచ్చుబడిపోవట్టె!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

బైక్ లు,కార్లొచ్చినయ్!
బైట నడుచు రీతే లేదు!
ఒంటి కండల కదలిక లేదు!
ఒళ్ళు పెరిగె, కొవ్వు పెరిగె!

కష్టమెక్కడ?
నష్టమే ఎక్కువ!

ఈ కరువు కాలాన,
ఇద్దరు నౌకరి చేస్తేనె,
ఒద్దికగా బతుకు బండి!

ఐనా!

అభివృద్ధి అందలాలెక్కితే
ఆరోగ్యం అందని ద్రాక్షైంది!
పరుల శ్రమను అత్తరుగ వాడితే!
ఆ శ్రమ శాపమై గత్తరైతది!

కష్టజీవులెపుడు నష్టపోరు!
స్వార్థపరులెప్పుడూ బాగుపడబోరు!
లోకమంతా శ్రామిక నాదం!
కష్టించడమే మానవ నినాదం!!

✊✊✊✊✊✊✊✊

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

 సమీక్ష 26...

కె. జగదీశ్వరి గారూ...

అమ్మను బ్రహ్మతోనూ తరగని ప్రేమగని గానూ వర్ణించారు...చెమటలేరులు..సరిహద్దుల ముప్పొద్దులు..పరుల శ్రమను అత్తరుగ వాడడం..శ్రమశాపం గత్తరైతదనడం మొదలైన వాక్యాలలో పదునుంది..పెరిగే విజ్ఞానం నాగరికతలు మనిషిని సుఖాలవైపు రోగాలవైపు మళ్ళిస్తోందన్న మీ ఆవేదన బాగుంది అభినందనలు.                       🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

పేరు:వురిమళ్ల సునంద,
అంశం:: కష్టజీవి
"""""""""""""""""""""""""""""""""
బతుకు పోరాటంలో
తెగిపోని ఓ నమ్మకమే
ఆశల పంటను పండించడానికి
నిత్యం సూర్యుని నెత్తికెత్తుకుని సాగిపోతుంది!
కండలను కరిగించి పారించిన
చెమట చుక్కలతో  పుడమిని అభిషేకిస్తూ
ఆకలి తీర్చే అన్నదాతలు!

నిప్పుల కొలిమిలో
ప్రతి క్షణం దగ్ధమవుతున్న దేహంతో
పనులకు నగిషీలు చెక్కి
ప్రపంచానికి సుఖాలను బహుమతిగా ఇచ్చే  కార్మికులు!

ఆకలి వేసే పొలికేకల్లో ఆహుతవుతూ
అడ్డా దగ్గర తాకట్టు పెట్టిన దేహంతో
ఎండల్లో బండలను మోస్తూ
ఐదు వేళ్ళు నోట్లోకి పోవడానికి
మరణం అంచున  సాము చేసే
కూలన్నలు!

తెలుసుకున్న పోరాట మెళకువలు
జీవన పరమార్థాలేవో
రేపటి తరానికి అందించేందుకు
పరితపించే బోధనా తప్త హృదయాలు..

ఎడారులవుతున్ప కలల్లో
ఒయాసిస్సులను ఒంపుకునేందుకు
విరిగిన ఆశలను అతికేసుకుంటూ
సాగే సగటు మనుషులు!

ఎక్కడ చూసినా 
స్వేద జీవుల శ్రమ జీవన యాగాలే..
దిగులు మబ్బుల్ని చీల్చుకుంటూ
వెలుగుల చైతన్యం వైపుకు పయనించే
కష్ట జీవుల  యథార్థ గాధలే..

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

 సమీక్ష 27...

వురిమళ్ళ సునంద గారూ..

.సూర్యుని నెత్తికెత్తుకున్న తెగిపోని  నమ్మకం..ఆశలపంట..కండల కరగించి పారించినచెమటచుక్కలతో పుడమి అభిషేకాలు..నిప్పులకొలుముల్లో దగ్ధమౌతోన్న దేహాలు.. ఎడారులయ్యే కలల్లో ఒంపుకునే ఒయాసిస్సులూ..దిగులుమబ్బులూ..మొదలైన పద భావచిత్రాలను చక్కగా మేళవించిన తీరు హృద్యం మీకు అభినందనలు. 

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

 ‌‌‌‌‌‌‌‌‌‌మూర్తి శ్రీదేవి
కలం పేరు "గురుసౌభాగ్య"
అంశం:  కష్టజీవి
శీర్షిక: వందనం

💐💐💐💐💐💐💐

తొలకరితో పరవశించి నేలతల్లిని నిద్రలేపి
స్వేదబిందువులతో స్నానము చేయించి
విత్తన నైవేద్యం పెట్టి మట్టితల్లి పురుడుకై
ప్రతిక్షణం పరితపిస్తూ
పొత్తిళ్లలో ఉన్న
పసిపిల్లలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటూ
బాలింతరాలుకే తండ్రియై జోలపాడి
నిదుర పుచ్చే పితృమూర్తీ! నీకు వందనం...పాదాభివందనం

ఎదిగేకొద్దీ  ఒదగమని...ఒదిగేకొద్దీ
ఎదుగుదల ఉండునని నిన్ను నువ్వే ఉదాహరించుకుంటూ
ప్రకృతి వైపరీత్య శతృమూకలను ఎదుర్కొనే ఏక ఛత్రపతివై
పురుగుపుట్రలనే స్వామి ద్రోహులను ములుగర్రతో
హతమారుస్తూ ఆకలి పోరాటంలో సమిధలై
పోరాడమని తరువులకే శిక్షణనిచ్చే గురుదేవా!
నీకు వందనం...పాదాభివందనం !!!

త్యాగాంబలిని తాగుతూ మడినే మదిగా తలచి
కష్టమనే పదానికి “ఇష్టమనే”  నూతనార్ధాన్ని చెబుతూ
సుఖం నీకు శత్రువయినా  తరువులకే త్యాగము నేర్పిస్తూ
రేయింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసినా
డొక్కాడని బ్రతుకులతో పైరు పంటలనే సిరిసంపదలుగా
తలుస్తూ చిరునగవుల పద్మాలతో జాతికి ఆహారార్చన
గావిస్తున్న దేశభక్తుడా నీకు వందనం...పాదాభివందనం!!!

నీవు లేనిదే మా ఉనికి ఎక్కడ ?
నీవు కదలనిదే మా మనుగడ ఎక్కడ ?
నీ తనువును ఎండ కొలిమిలో పెట్టి  రక్తతర్పణం చేస్తూ
సకలజీవకోటికి ఆధారమయ్యే నిరంతర కృషీవలుడా!
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను?
అక్షరామృత కవితామాలతో అర్చించడం తప్ప ?
అడుగడుగునా నీవు పడే ఆవేదనను ఎలా
ఆదుకోగలను అశ్రుమాలిక సమర్పించడం తప్ప?

నీలోన దాగిన కష్టజీవి ముల్లోకాలకే ఆదర్శం
నీలోన నిదురించే నిరాడంబరుడు విశ్వానికే తలమానికం
నీ భిక్షను భక్షించే ప్రతిక్షణం మానవత నిండిన మనసైతే
ప్రతి మెతుక్కి ప్రణామం చేసి వృథాను అరికట్టాలి
ధననిధులు,
మణిమాణిక్యాలు నీముందు భళాదూరే
“కృషి” వంశోద్ధారకా! నీకు వందనం...పాదాభివందనం

*   *     *    *     *     *    *
[19/05, 12:31 pm] అరవింద:

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻.   

సమీక్ష 28..

మూర్తి శ్రీదేవి గారూ...

నేలతల్లిని నిద్రలేపి  స్వేదబిందువులతో స్నానంచేయిస్తాడంటూ రైతు శ్రమైకజీవనాన్ని మీ కవితలో ఆవిష్కరించారు.. ఎదిగేకొద్ది ఒదగమనే పాఠాల్ని నూరిపోసే గురువుల మేథోశ్రమకు సముచిత ప్రాధాన్యతనిచ్చారు...త్యాగాంబలి అంటూ శ్రమజీవుల ఔన్నత్యాన్ని కవిత్వీకరించిన మీకు అభినందనలు.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

మర్రి జయశ్రీ
అంశం..కష్టజీవి

కోడి కూతతో ఆరంభించి
కొంగు నడుముకు బిగించి
నిద్రపోయే వేళదాకా
కుటుంబానికే పరిమితమై
తన సుఖం కోరుకుండా
సంతానం సౌఖ్యాలు కాంక్షిస్తూ
అలుపెరుగని శ్రమించే
అమ్మ ఒక కష్టజీవి

వేదనలు ఎన్ని ఉన్నా
మోమున చిరునవ్వులు చిందిస్తూ
బిడ్డల సంక్షేమమే కోరుకొని
బాధలెన్నో భరిస్తూ
కుటుంబ పోషణకై
నానా కష్టాలు పడుతూ
సంసార నావ సుడిగుండంలో చిక్కకుండా
చాకచక్యంగా నడిపే నావికుడు నాన్న కష్టజీవి
తన స్వేదజలంతో
మట్టిని బంగారంగా మార్చి
ముత్యాల ధన్యరాశుల పండించి
తాను పస్థులున్నా
అప్పుల వూబిలో కురుకుపోతున్నా
దేశానికి అన్నం పెట్టే అన్నదాత
అసలైన కష్ట జీవి
గనిలో పనిలో
కర్మాగారాలలో
భవన నిర్మాణాలలో
రక్తాన్ని స్వేదంగా చిందిస్తూ
అడుగడుగునా కష్టాలతో
దీన మైన బతుకులు భరిస్తూ
నైపుణ్యం ఉన్నా
మరుగున పడి
శ్రమ దోపిడీకి గురి అవుతున్న
కష్టజీవులెందరో
సరిహద్దులో సైనికుడు
భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువు
జీవిత పోరాటంలో
ప్రతి మనిషి ఓ కష్టజీవే
కరోనా కష్టకాలం లో
ప్రాణజ్యోతులై వెలుగుతున్న వైద్యులు
ప్రజలను కాపాడే రక్షకభటులు
పారిశుధ్యం కాపాడే
సఫాయి సిపాయిలు
అసలైన కష్టజీవులు
కష్టజీవి చెమట చుక్కలతో
తడిస్తేనే ఈ నేల పుణితమవుతుంది.
[19/05, 12:40 pm] అరవింద:

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 29...

మఱ్ఱి జయశ్రీ గారూ...

మీ కవితలో శ్రమజీవిగా అమ్మకు ప్రథమ తాంబూలమిచ్చారు...వేదనలను చిఱునవ్వుచాటున దాచుకునే ఆమెకు బిడ్డల సంక్షేమమే కాంక్షిస్తుందన్నారు..సుడిగుండాల్నుండి సంసారనావను తప్పించే నావికునిగా నాన్నను అభివర్ణించడం బాగుంది...సఫాయిసిపాయీలుగా పారిశుధ్యకార్మికుల్ని పేర్కొనడం నచ్చింది మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

అంశం : కష్టజీవి
రచన : ల్యాదాల గాయత్రి

రెక్కాడితే గాని డొక్కాడని
 నిరుపేదలే కష్టజీవులా..

తిండీ తిప్పలూ మానేసి
కంప్యూటర్ స్క్రీన్ కు అంకితమయ్యేవారూ కష్టజీవులే..

ముఖానికి రంగేసుకుని
మనసుకు ముసుగేసుకుని
సన్నివేశాన్ని పండించేవారూ కష్టజీవులే..

భూమాతను నమ్ముకొని
శ్రమశక్తి కి గిట్టుబాటు లేని
రైతన్నలూ కష్టజీవులే...

దారాల ఆధారంగా జీవన సమరాన్ని
ఈదుతూ తాళలేక విగతజీవులయ్యే
నేతన్నలూ కష్టజీవులే..

కానీ..

ఎంతటి కష్టమైనా ఇష్టంగా మలచుకొని
స్వార్థచింతన,స్వలాభాపేక్షల
దరిచేరనీక పదుగురికి
స్ఫూర్తి గా చిరంజీవులుగా
మిగిలేవారే కష్టజీవులు..!!

శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆస్వాదిస్తూ..ఆరాధిస్తూ..
ఎంచుకున్న బాటలో
దీటుగా పయనించే వారే
నిఖార్సైన కష్టజీవులు.‌..!!

[🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

సమీక్ష 30

ల్యాదాల గాయత్రిగారూ......

శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆరాధిస్తూ మడమతిప్పని వారే నిజమైన శ్రామికుల భావాన్ని కవితలో ఆవిష్కరించారు.. కష్టాన్ని ఇష్టంగా మలచుకోవడంలో పదుగురికీ స్ఫూర్తిగా నిలవడంలో ఉన్న ఆనందాన్ని కవితలో వ్యక్తీకరించారు.. మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

అంశం : కష్టజీవి
రచన : ల్యాదాల గాయత్రి

రెక్కాడితే గాని డొక్కాడని
 నిరుపేదలే కష్టజీవులా..

తిండీ తిప్పలూ మానేసి
కంప్యూటర్ స్క్రీన్ కు అంకితమయ్యేవారూ కష్టజీవులే..

ముఖానికి రంగేసుకుని
మనసుకు ముసుగేసుకుని
సన్నివేశాన్ని పండించేవారూ కష్టజీవులే..

భూమాతను నమ్ముకొని
శ్రమశక్తి కి గిట్టుబాటు లేని
రైతన్నలూ కష్టజీవులే...

దారాల ఆధారంగా జీవన సమరాన్ని
ఈదుతూ తాళలేక విగతజీవులయ్యే
నేతన్నలూ కష్టజీవులే..

కానీ..

ఎంతటి కష్టమైనా ఇష్టంగా మలచుకొని
స్వార్థచింతన,స్వలాభాపేక్షల
దరిచేరనీక పదుగురికి
స్ఫూర్తి గా చిరంజీవులుగా
మిగిలేవారే కష్టజీవులు..!!

శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆస్వాదిస్తూ..ఆరాధిస్తూ..
ఎంచుకున్న బాటలో
దీటుగా పయనించే వారే
నిఖార్సైన కష్టజీవులు.‌..!!

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

సమీక్ష 30

ల్యాదాల గాయత్రిగారూ......

శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆరాధిస్తూ మడమతిప్పని వారే నిజమైన శ్రామికుల భావాన్ని కవితలో ఆవిష్కరించారు.. కష్టాన్ని ఇష్టంగా మలచుకోవడంలో పదుగురికీ స్ఫూర్తిగా నిలవడంలో ఉన్న ఆనందాన్ని కవితలో వ్యక్తీకరించారు.. మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

తులసి వెంకట రమణా చార్యులు.
అంశం: కష్ట జీవి.
శీర్షిక: ధీరశాలి కష్ట జీవి

కష్టమనే పరుగు పందెంలో నీవుఒక క్రీడకారుడవే సుమా!
కాలగమనంలో కదిలిన ప్రతిక్షణం  నీకో అవకాశం ఇస్తూ ..
కష్టమనే పదానికి అసలు వారసురాలు పుడమితల్లే కదా!!
పుడమి తల్లిని ప్రేమిస్తూ స్వేదం చిందిస్తూ..రక్తం కారుస్తూ...
బంగారు భవితకై బక్కచిక్కిన జోడెడ్లను అలంబనంగా చేసుకొని ఆకాశాన్ని నమ్ముకున్న ఆశావాది రైతన్న
కష్టమనే ఫలానికి త్యాగధనుడు కష్టజీవి...
అదృష్టాన్ని నమ్ముకొన్నవాడు నిరాశావాది...గెలుపుకోసం ఆరాటపడే తత్వం తప్ప..
శ్రమైక జీవనానికి అలవాటుపడని
కలుపుమొక్క నిరాశావాది!

పలుగు పార చేతపట్టి కొండను పిండిచేసే ధీరశాలి సహసవంతుడు కష్ట జీవి...
కొలిమిలో నిప్పుకూడా శ్రమిస్తేనే కదా..పదును పెట్టే గుణం బయటపడేది!
గనుల్లో, కార్ఖానాల్లో ...ఎర్రసూరీడితో పోటీపడుతూ...
జీవన మనుగడకు అలుపెరగని శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి..
స్వేద ఫలాన్ని ఆశించే అల్పజీవి కష్టజీవే సుమా!!
బుక్కెడు బువ్వ కోసం కొండను ఢీకొట్టే ధైర్యవంతుడు కష్ట జీవి ఒక్కడే సుమా!
విత్తనం నులివెచ్చని భూపోరల్లో శ్రమిస్తేనే కదా అంకురంగా మారేది!
ఆ శ్రమే పైరు ఫలితాన్ని ఇచ్చి
పైరును నమ్ముకొన్న రైతన్నకు "నేస్తం శ్రమనే " సుమా!
కష్టం అనేది ఒక నిరంతర ప్రక్రియ...
వెలుగు నీడలా వెన్నంటి ఉండే స్నేహజ్యోతి కష్టమే సుమా!
తల్లికి... తరువుకు కష్టం అనేది సహజత్వంగా సిద్దించే గొప్ప వరం ...
అందుకే కాబోలు ఎన్ని యుగాలైనా...భారాన్ని మోసేది
ఫలితాన్ని ఇచ్చేది తల్లి తరువే సుమా!
శ్రమ లేని సాధనం ఏది లేదు..
చెమట చుక్కల్ని రంగరిస్తే వచ్చే ఫలితమే కష్ట జీవికి నిండుతనం...
ఈ అక్షర సేద్యంలో సిరా చుక్కల్ని చిందిస్తేనే ఓ సార్ధకత..
కష్టమును ఇష్టంగా మల్చుకుంటే బంగారు భవితవ్యం మనదే సుమా!!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

సమీక్ష 31..

తులసి వేంకటరమణాచార్యులు గారూ...

కష్టాన్ని పరుగుపందెంగా అభివర్ణిస్తూ కష్టజీవిని ఆటగాడిగా పోల్చి ప్రతీఅడుగు అభివృద్ధిపథాన నడవాలనే మీ ఆకాంక్ష బాగుంది..విత్తనం సైతం భూమిపొరల్లోంచి మొలకెత్తడానికి శ్రమిస్తేనే అంకురమౌతుందని సందేశాన్నిచ్చారు..మీకు అభినందనలు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

పిన్నక నాగేశ్వరరావు.

అంశము :-- కష్టజీవి.

1. తేటగీతి.
వివిధ పంటలు పండించి, విశ్వమందు
ప్రజల యాకలిఁ దీర్చగ, ప్రతి దినంబు
క్షేత్రమున కేగి కష్టమున్ జేయుచుండు
రైతు కెవ్వరు సాటి యిలను కనంగ.

2. తేటగీతి.
దేశ సరిహద్దు లందున దీక్ష తోడ
బాధ్యతల నిర్వహణ...దేశ భద్రత కెటు
వంటి లోపమ్ము లేక చేపట్టుచున్న
సైనికుని కష్టము మరువ జాలము గద!

3. తేటగీతి.
కర్మగారము లందున గనులయందు
కొండ,గుట్టల యందున బండరాళ్ళు
పగుల గొట్టెడు శ్రామిక పనుల యందు
ఘర్మ జలమును చిందించు కష్టజీవి
శ్రమను ధారవోయును దేశ ప్రగతి కొఱకు.

4. తేటగీతి.
కూలి పనికేగి  ప్రతిరోజు కూటి కొఱకు
ఖర్చు పెట్టుచు దంపతుల్ మర్చిపోక
కూడబెట్టును సంతుకై కొంత డబ్బు
నిట్టి శ్రామికుల విలువఁ గట్టగలమె?
*********************************

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

సమీక్ష 32....

పిన్నక నాగేశ్వర రావు గారూ...

మీ తేటగీతి పద్యాలతో కూడిన పద్యకవితలో రైతు సైనికుడు కార్మికుడు దినసరికూలీల శ్రమకు చక్కని పద్యరూపాన్నికల్పించారు..నిజం..రైతుకెవ్వరు సాటి యిలను కనంగ..మకుటాయమానమైన పద్యపాదంతో రైతుకు శాలువా కప్పినట్లు సైనికుని శ్రామికుని దారిలో పూలు పరచిన ఛందాన పద్యగుచ్ఛము చక్కగా అమరినది అభినందనలు.         

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

అంశం:కష్టజీవి
శీర్షిక:ఎవరు కష్టజీవి

ఎవరు కష్టజీవి......
ఆరుగాలం కష్టించే రైతన్న
అడుగడుగు పుట్టిన బిడ్డకై
శ్రమియించే తల్లి
ఆద్యంతం పోషించే తండ్రి
అవమానాలు ఎదుర్కొని అనుబంధాలను నిల్పుకోని
కష్టపడే ఆడపిల్ల
కనిపించని మహమ్మారికై
పోరాడే వారందరూ
కనపడే శత్రువుతో
సహనత్వం చూపించే వారు
రేపవలు స్థిరత్వంతో
కాపలదారులు రక్షకభటులు
వైద్యో నారాయణో హరిః
అంటూ రక్షించే దైవస్వరూపులు
స్వచ్ఛమైన దేశంకై
పాటుపడే పారిశుధ్య కార్మికులు
నిత్యావసర వస్తువులు అందించే మానవతామూర్తులు
భరించే శక్తి ఉన్న
సహించే గుణం ఉన్న
ఒకటి తర్వాత ఒకటి కాదు ఎన్ని కష్టాలొచ్చిన ఎదుర్కొనే మనుషులు
వారే కష్టజీవులు
కష్టాన్ని ఇష్టంగా స్వీకరించి
పది మందికి ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించే ఘనులు
మన చుట్టూ ఉన్న కష్టజీవులు
శ్రమధూతలు......

అనుముల తేజస్విని
నర్సంపేట

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 

సమీక్ష 33

అనుముల తేజస్విని గారూ...

ఎవరుకష్టజీవి అని ప్రశ్నిస్తూనే..శ్రమజీవుల శ్రమస్ఫూర్తిని ప్రతీవాక్యంలో ప్రతిబింబింపజేశారు..కష్టాన్ని ఇష్టంగా స్వీకరించే వారి నైజాన్ని కొనియాడుతూ శ్రమదూతలుగా అభివర్ణించడం బాగుంది

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

Popular posts from this blog

నేను ఎవరు