ఇందిరమ్మ సూక్తులు

నిర్వహణ ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
************************
యేరువ ఇందిరా రెడ్డి
***************************
ఇందిరమ్మ సూక్తులు
*****************************-*******************

ఇందిరమ్మ సూక్తులు
******************::
 1.

మనుసు చెప్పిందల్లా మనం వినడం కాదు.
మనం చెప్పినట్లు మనుసు వినేలా చేసుకోవాలి.
2)
మన జాతి జీవనాన్ని
ఐక్యతా భావమును
ఆత్మ విశ్వాసాన్ని జాగృత పరచి
అక్ష యం గా ఉంచితెనే
ఎలాంటి క్లిష్ట పరిస్టులలో నైన మనగలుతుంది.
3)
రామ నామం లో ర, ఆ, మ అను మూడు అక్షరాలలో 'ర కారం అగ్ని బీజము, ఆ కారం సూర్య బీజము, మ కారము చంద్ర బీజము.
ఈ ముగ్గురు తేజస్వరూపుల తేజస్సు రామ అనే పేరులో కలదు. అందుకే రామ నామము అంత శక్తి కలది .
 4
మన సంస్కృతి ధర్మం ఆధారంగా విలసిల్లింది
అది ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతూ నే ఉంటుంది.

5
ఇవ్వడం,తీసుకోవడం,దాపరికం లేకుండా రహస్యాలు చెప్పడం, అడుగడం తినడం,
తినిపించడం అనే ఆరు లక్షణాలు స్నేహమున్న
చోటనే ఉంటాయి

6)
సత్ సంస్కారం తో కూడిన వ్యావ హారిక జీవనాన్ని కలిగి ఉండటానికి కఠోర శ్రమ చేయాలి.

 7)
ఉన్నదాంట్లో తృప్తి పడటం సంతోషానికి
మూలం.
లేని దాని కోసం అర్రులు చాచడం అశాంతి కి మూలం.

8.
కులం కన్న గుణం మిన్న.
మతం కన్న మానవత్వం మిన్న

9
ప్రయత్నమే చేయకుండా ఫలితం
ఆశించడం గాలికి దీపం పెట్టీ దేవుడా నీవే దిక్కు అని మొక్కినట్లు ఉంటుంది.

10
దైర్యంగా నువ్వు ఒక్క అడుగువేస్తే విజయం  పది అడుగులు ముందుకు పడ్తుంది.
11
పుట్టుక చావు మన చేతిలో లేవు. బతికిన నాళ్లు మనజీవితం ఎలా మలచుకోవాలో
అన్నది మన చేతిలోనే ఉంటుంది.

: 12)
తెలివైన వాడు
మంచినీ ఎక్కడనుండైనా స్వీకరిస్తాడు

13)
నిరంతర కృషి  సాధించాలి అనే పట్టుదల లే విజయ
రహస్యాలు.

14
నిజంగా ప్రేమించే వారెవరైనా ప్రపంచం లో కెల్ల అందమైన వారిని కోరుకోరు.తనకోసం ప్రపంచాన్ని అందంగా
మార్చ గలిగే వారిని కోరుకుంటారు.
15
సంకల్పం మంచిదైతే
ఎవ్వరు అడ్డుకుందాం అనుకున్న నెరవేరుతుంది.

16
మంచి పనికి జనంతో
మనం కాదు.
మనమే జనం ముందు నడిచి బాట వేయాలి.

17
మన జాతి జీవన విధానాన్ని
ఐక్యతా భావమును
ఆత్మ విశ్వాసాన్ని జాగృత పరచి
అక్ష యం గా ఉంచితెనే
మన భారత జాతి ఎలాంటి క్లిష్ట పరిస్టులలో నైన మనగలుతుంది.

18)
ఇతరుల కొరకు కార్చే కన్నీరు బేల తనానికి
నిదర్శనం కాదు.
సహృదయతకు  సంకేతం.

19)
ప్రతీ ఒక్కరు తమ గుణ గణాల వల్ల ఏకాత్మని సాక్షాత్కారం చేసుకొని పరమాత్ముని కి సేవ చేయడమే పరమ ఉత్కృష్టమైన కర్తవ్యము.

 20
తనకు మాలిన ధర్మం
మొదలు చెడ్డ బేరం.

21
క్రమ పద్దతిలో చేసిన పని మాత్రమే సమాజంలో మన పని వేగాన్ని పెంచుతుంది.

22)
విమర్శలు గాలిపటం లాంటివి.  ఎదుగుదలకు సంకేతాలు.

23
మన సంతోషంలో పాలు పంచుకునే వాళ్ళు కాదు ఆత్మీయులు అంటే దుఖంలో కూడా
తోడుండే వాళ్ళే నిజమైన ఆత్మీయులు.

24
ఆలోచన విధానం మారిన ఆశయం మారకూడదు.

25
ఆత్మ స్తుతి, పరనింద ఈ రెండు మానవుని మనసులోని ప్రశాంత తను విషపూరితం చేసి
 వ్యక్తుల మధ్య ఉండే
సామరస్యాన్ని భగ్నం చేస్తాయి.

26
విస్తృత మైన పదం ధర్మం.అనగా కర్తవ్యము. ధర్మం అనేది సంప్రదాయానికి
జీవనానికి లంగరు వంటిది.

27)
అనుమానము అనేది  తీయటి తేనెలో వేసిన విషం చుక్క
అది మనుషుల మనసును చంపి వేసి
అనుబంధాలను దూరం చేస్తుంది.

28)
అవకాశాలు,అదృష్టం సూర్యోదయం లాంటివి సమయానికి  మేలు కొకపోతే ఎప్పటికీ అంద కుండా పోతాయి.

 29)
చేనులో కలుపు తీసినట్లు
అసూయ ద్వేషాలను. మన
మనసు లో నుండి తీసేయాలి.
అప్పుడే ప్రశాంత జీవనం మనస్వంతం

30)
స్వార్థపరుల నుండి
సమాజ శ్రేయస్సును కాంక్షించడం అరచేతిలో ఆవాలు
మొలిపించడం లాంటిదే.

31
అందర్నీ కలుపుకని పోయె మనసు ఉన్న వాళ్ళు ఎక్కడైనా రాణిస్తారు

32
మనం వేసే ప్రతీ            అడుగు
భవితకు దిక్సూచి కావాలి.

33
దైవం మానుష రూపేణ
దేవుడు మంచి మనిషి రూపం లో వచ్చి మనకు సహాయ పడుతాడు.ఒక వేళ నిజంగా వచ్చిన మనం నమ్మం కాబట్టీ.

34
పిరికి వాడు రోజు చస్తూ బతుకుతాడు
దైర్య వంతుడు ఒకేసారి చస్తాడు.


35
మంచి వారితో స్నేహం
మంచి గంధపు పూత వంటిది. చెడ్డ వారితో
స్నేహం  ముసుగు లాంటిది.

36
ప్రతీ మనిషి ఒక పుస్తకం తో సమానం .
ఒక్కో మనిషిలో ఒక్కో మంచి గుణం ఉంటుంది.వారిలోని
మంచిని మాత్రమే
గ్రహించాలి.

37
దేవుడు ఎక్కడో ఉండడు.మంచి మనుషుల హృదయాలలో కొలువై ఉంటాడు.

38

స్త్రీని మించిన పుస్తకం లేదు, కళ లేదు,ఆమె హృదయాన్ని చదువ గల్గితే అన్ని పుస్తకాలు చదివినట్లు సమస్త కళలు నేర్చినట్లు.

39
నేను ఎదుగాలి అనుకోవటం లో తప్పు లేదు. నేను మాత్రమే ఎదుగాలి అనుకోవటం స్వార్థము.

40
మనం ఇతరులకు మేలు చేయక పోయిన సరే హని చేయకుండా ఉంటే చాలు.
41
త్యాగం వల్ల సదాచారం, సత్ప్రవర్తన వలన మానవ జన్మ సార్థకం అవుతాయి.

42
చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని తిట్టుకుంటూ
కూర్చోవడం కంటే ప్రయత్నించిన చిన్న
చిన్న దీపాన్నయిన వెలిగించడం మంచిది.

43
తన పిల్లలను అద్భుతంగా తీర్చ గల్గిన తల్లి వందమంది ఉపాధ్యాయులతో సమానం.

44
మంచి పనులన్నిటికి మూలం క్రమశిక్షణ.

45
మన ఆరాధనా పద్దతులలో మతభేదం లేదు. ఉన్నా అవి వ్యక్తి గత ఉపాసనా చిహ్నాలు మాత్రమే.

46
చరిత్రను చదవడమే
కాదు మనమే చరిత్రను
సృష్టించాలి.

47
మనిషిలో ఏ గుణం సన్నగిల్లినా మానవత్వం మృతి చెందకుండా ఉంటే చాలు.
మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది.

48
మందు తినుట కంటే
పథ్యం ముఖ్యం.
పూజల కంటే సదా
చార సద్గుణాలు ముఖ్యము.

49
జీవితమనే మకరందమును గ్రోలుటకు మనం తుమ్మెద వలె భగవద్
వాణి నుండి వెలువడిన గీతామకరందమును
ఆస్వాదించాలి.

50
కలలు చెదిరి కన్నీరు అయినప్పుడు  నిన్ను నీవే  ఓదార్చుకో ఎవరికోసం ఎదిరిచూడకు .

Comments

Popular posts from this blog

కధానిక 22102020

కవి సమయం 6

Results