రామరాజ్యం

సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
యేరువ ఇందిరా రెడ్డి
Telugu teacher and poetess
**********************
రామ రాజ్యం
12/04/2020
కవితలు పంపించిన వారు
*****************
1.తులసి వెంకట రమణాచార్యులు గారు
2.చంద్ర శేఖర్ శర్మ గారు
3.టీ.వీ.హన్మంత రావు గారు
4.కోరాడ నరసింహా రావు గారు
5.కొప్పుల ప్రసాద్ గారు
6.విజయ దుర్గ గారు
7.మహేందర్ జవ్వాజి గారు
8.గోగులపాటి కృష్ణ మోహన్ గారు
9.సునంద వురిమిళ్ళ గారు
10.ఉమాదేవి గారు
11.శ్రీదేవి కూసుమంచి గారు
12.సర్ఫరాజ్ అన్వర్ గారు
13.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
14.శ్రీలక్ష్మి గారు
15.పగిడిపల్లి సురేందర్ పూసల గారు
16.శివలక్ష్మి రాజు శేఖరుని గారు
17.అంబటి భాను ప్రకాష్ గారు
18.గురు సౌభాగ్య గారు
19.మర్రి జయశ్రీ గారు

***************************

కవులవేదిక :
పేరు: తులసి వెంకట రమణా చార్యులు.
అంశం :రామ రాజ్యం.

శీర్షిక:  శాంతమూర్తి పాలనే రామరాజ్యం!

రాజుయే రక్షకుడు ధర్మముఎరింగి పాలించే వాడే ప్రభువు
పెద్దల మాటలను వింటూ ధర్మ సూత్రాలను వల్లెవేస్తూ...
గురువుల సూచనలను శిరసావహించి కార్యాచరణలో దృష్టి నిల్పువాడే రాజు రారాజు

ప్రజలంటే తనపిల్లలే అనిభావించి..
కష్టపెట్టకుండా కరుణ చూపే యోధుడే ..దేవుడు
మానవరూపంలో అవతరించిన పరమపురుషుడు ఆ పరం ధాముడే...నిఖిల జనుల గుండెల్లో తారక నామమై మారుమోగే ...ప్రజాపతే
ఆ శ్రీ రామచంద్రుడు...

పాలనలో దక్షత..కర్తవ్యంలో కారుణ్యం...
గత పునాదుల మీద నడిచిన పాలనలో ...సమతుల్యం పాటిస్తూ...పాడి తప్పక
ప్రజారాంజకంగా పాలించే చైతన్యుడు...సమరవీరుడు
కౌసల్య సుతుడు...
పితృవాక్య పాలకుడు...

తల్లులు ఆరాధించే తత్వయోగి
సోదరులను ఆదరించే నిత్యయోగి...
కర్మలను ఆచరిస్తూ ...పుడమి తల్లి ఋణం తీర్చుకునే సిద్ధహస్తుడు ..స్మిత మితభాషి సహర్ధ హృదయమున్న సౌశీల్యుడు...

పాలనలో  అన్ని పాడిపంటలే..
అంత సుఖమయ జీవనమే కదా!
ప్రజలెల్లరు సుఖసంతృష్టులైరి
 రామ రాజ్యంలో....
రామయ్య బాట
రామయ్య  మాట
రామయ్య నడక
అంతా గురువులు నేర్పిన విద్యనే సుమా!
గురువు మాట పూలబాట
రామరాజ్యంలో రాజరికంలో రామయ్య ప్రతి మాట గురుతుల్యమే ...

అందుకే కష్టాలను ఎదిరించి జానకి తోడ..
సోదరుల ప్రేమతత్వంలో
ప్రజలందరినీ ఆదరించిన అయోధ్య రాజు ...ఇంకెవ్వరు మా రాముడే...
శ్రీ రామచంద్రమూర్తియే ...

ధర్మం అంటే ఆచరించి చూపడమే...
సత్య వాక్యు డై ,నియమ బద్ధుడై, నిర్మల హృదయుడై
యుగాలుమారిన నేటికి ఆమూర్తి పాలనను స్మరిస్తున్నాము అంటే..
సత్యము వర్ధిల్లుతుంది
శాంతమూర్తి శ్రీరాముని పాలనే
మరువలేని రామరాజ్యం.!!

Chandra Shekara Sharma:
మాటదప్పకతాను మర్యాదరాముడై
జగతికిజూపించె సత్యపథము

అవనీశపదవిని నటవివాసముజేయ
సమభావముజూపె చక్రవర్తి

కాఠిన్యముగతల్లి కైకేయిపలికినా
గౌరవమ్మునుజూపె ఘనుడతండు

నన్నదమ్ములతోడ నాత్మీయముగనుండి
నాదర్శమునుజూపె నాత్మబంధు

సహన శీలియై చలియించి సంఘమందు
నుచితననుచితకార్యము నుర్వియందు
చేయునప్పుడు మదిలోన చింత జేసి
ఫలితమూహించి గెలవగా యిలనుమనిషి
రామచంద్రుడుజూపించె రమ్యపథము


కవుల వేదిక
పేరు: టి‌.వి.హనుమంతరావు
ఊరు: విజయవాడ
అంశం: రామ రాజ్యం
కవితా సంఖ్య: 2



కపటమే ఎరుగక
సత్య వాక్యములతో
సకల గుణాలను కలిగినవారు...!!

నీల మేఘచ్ఛాయ
ధవళ వర్ణ నయనాలు
దీర్ఘ బాహువులు కలిగిన
సకల విద్యా పారంగతుడు...!!

పితృవాక్యా పరిపాలకుడు
ఆడిన మాట తప్పక
కుటిల తత్వమే ఎరగని వాడు...!!

దారిద్ర్యం లేకుండా
పచ్చని పొలాలతో
అన్నార్తుల హహకారాలు
దుర్భిక్షం లేకుండా
మూడు పువ్వులు ఆరు కాయలు లా
సాగినదే రామ రాజ్యం...!!


కవుల వేదిక
తేదీ:03-04-2020.
అంశం:-రామరాజ్యం
కోరాడ నరసింహా రావు .,
   * మరలా తేవాలి *
    **************
మనది....పవిత్ర...
భారతదేశం...!
శ్రీ రాముడేలిన...
నేల గా ప్రాశస్త్యం !
నేడు...శాంతీసౌఖ్యాలిట పూజ్యం !!
కాన రాకున్నది న్యాయం...,మనలేకున్నది ధర్మం !
వెదకిచూసినా...
సత్యం మృగ్యం !
రక్షణ కరువైన సామాన్య జనం !!
అన్యాయం,అక్రమం
స్వైర విహారం ...!
పె చ్చ రి ల్లె ను...
హింసా,దౌర్జన్యం !
హద్దులు దాటింది
స్వార్ధం...,!!
ప్రభావంచూపిస్తోందా
కలియుగం ...,!?
కాబోతోందా ...ముందుగానేయుగాన్తం!
లేదా దీనికి.... పరిష్కారం!  ఇపు
డేదీ గత్యంతరం ?!
పల్లవించాలి మాన వత్వం...పరిమళించాలిసుహృద్భావమ్
వెల్లివిరియాలి సమతా వాదం...!
చదవాలి....రామాయణం., అధ్యయనంచేయాలి
శ్రీరాముని జీవితం !
అది... ధర్మస్థాపనకే
అంకితం...!!
చెబుతున్నది...
అత్యుత్తమ జీవన విధానం...!
అను సరించాలి...
మనమంతా ఆ మా ర్గం...!
మరలా తేవాలి ...
ఆ రామ రాజ్యం...!!
*****************
.........కోరాడ.

KoppulaPrasad Poet:
అంశం: రామ రాజ్యం*

*శీర్షిక:ఆదర్శనీయం*

ఆది కావ్యమై
             భారతీయ మై
బహుజనులకు ఆదర్శమై
               రామాయణమే రమణీయమై
జీవకోటికి తారకమంత్రమై
                   అన్నదమ్ముల అపురూపమై
సీతని ఆదర్శ వనితై
      రాముడే ఆదర్శపురుషుడై
అన్నదమ్ములకు రామలక్ష్మణులై
         అవనిపై నా నలుగురు అన్నదమ్ములై
తండ్రి మాటకు విలువ ఇచ్చిన వారై
         విశ్వానికి అంతా నిదర్శమై
తల్లి మాటలకు విలువై
       తండ్రి మాటకు ప్రాణమై
ఇచ్చిన మాటకు జీవమై 
       రామాయణమే నిలయమై
కుటుంబాలకే ఆదర్శమై
        భావితరాలకు నిదర్శనమై
భర్త మాటకు విలువై
        స్త్రీ రత్నాలకి ఆదర్శమై
సృష్టి ఉన్నంత వరకు సీతారాములే ఆదర్శమై
         భారతీయ జీవనానికి నిదర్శనాలై
పర స్త్రీ లకు వ్యామోహ మై
            వంశమే నాశనం సర్వనాశనమై
 చెడుకు దూరమై మంచికి దగ్గరై
       నీతికి నిలయమై దైవానికి దగ్గరై
  రామాయణం మనకు ఆదర్శం
         రాముడే మనకు ఆదర్శనీయం   
యుగాలు మారినా  ధర్మాలు తప్పిన
       మారని మంత్రం తారక మంత్రమే

✍ కొప్పుల ప్రసాద్
నంద్యాల
Vineelamma
: కవులవేదిక
పేరు : వినీల దుర్గ
కవితా శీర్షిక : రామరాజ్యం
తేదీ : 03/04/19

సమాజంలో ఓ మంచి నిర్ణయం..
మన జీవితాలకు పూల వనం..
సహకరిద్దాం కట్టుబడి అందరం..
మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు..
లంచగొండితనం చేసింది గందరగోళం..
కూసింత ఓర్వలేరు కావాలి
కోకొల్లలు సాయం..
ఎన్ని ప్రణాళికలు కుమ్మరించినా..
ఎన్ని ప్రాణాలు త్యాగం చేసినా..
స్వార్ద పరుల చేతిలో జారిపోయేను
నిర్వీిర్యం గా...
కాటికి కూడా రాదు డబ్బు
తగలెయ్యను తప్ప శవం ను..
ఆత్మీయతను పంచదు తన పని
విడదీయడం..
డబ్బు వ్యామోహం ఇంటికి,ఊరికి,దేశానికి గొడ్డలి పెట్టు..
పౌరులమై మన రక్షణ మనమే మరచి
లంచాలతో పీడించే భక్షకులం...
కోట్లు ఇస్తానంటే దేశాన్ని కూడా
అమ్మగల ధీరులం...
బాగు పడాలన్నా,మార్పు రావాలన్నా
ప్రజల మనసుల కావాలి వివేకం...
అప్పుడే నిస్వార్దమైన ఆశయం
నిర్ణయం పదిలంగా పని చేసే
పాశుపతాస్త్రం ....
మనకు మనం మారుదాం..
రాజకీయ నేతలను మారుద్దాం...
పాలకులకు అండగా నిలుద్దాం..
అప్పుడే విరాజిల్లేను రామరాజ్యం

                                     వినీల
[03/04, 8:24 PM] Mahender Javvaji: కవుల వేదిక
పేరు. మహేందర్ జవ్వాజి
అంశం.రామరాజ్యం.
శీర్షిక. శాంతి యుత పాలన

ధర్మాన్ని ఎరిగిన వారే పాలకులు తండ్రి మాట జవదాటని ఎకపత్నీ వతుడు

అదర్మాన్ని జయిస్తు ధర్మమే
తన ఆయుదమై నిలిచిన జన భాందవుడు మన జనకీ రాముడు..

తన రాజ్యంలో ప్రజలె తన ఆస్తిపాస్తులని సాగింది తన రాజ్య పాలనా..కష్టం తనుభరిచి సుఖాన్ని ప్రబోధ పరిచె భగవంతుడు ఆ అయెద్య రాముడు.

తనకు రాజ్యం అప్పగించి రాత్రి గడవకముందే వనవాసం చెసిన తండ్రికి తగ్గ తనయుడిగా ఖ్యాతిని గాంచిన పుణ్య సుతుడు ఆ శ్రీ రాముడు.
[03/04, 8:30 PM] Km New: తెలుగు కవనవేదిక
తేది : 03-04-2020
అంశం: రామరాజ్యం
శీర్షిక : రామరాజ్యమంటే?
రచన : గోగులపాటి కృష్ణమోహన్

రామరాజ్యం...అంటే...
కోట లోని రాజు కు
తోటలోని పేదకు
బేదం లేని రాజ్యం

రామరాజ్యం అంటే...
ప్రశాంత వాతావరణంలో
సుఖ శాంతులతో
విలసిల్లిన రాజ్యం

రామరాజ్యమంటే...
విరగాసిన పంటలతో
ధాన్యపు రాశులతో
తులతూగిన రాజ్యం

రామరాజ్యమంటే...
వర్గ పోరులు
వర్ణ పోరులు లేని
సువిశాల రాజ్యం...

రామరాజ్యమంటే...
యుద్దమన్నదే
ఎరుగని అయోద్య
పవిత్ర రాజ్యం...

రామరాజ్యమంటే...
కరువు కాటకాలు
దొంగల బాధలు
లేని దొరల రాజ్యం

అందుకే...
ఎన్నియుగాలైనా...
అందరూ కోరుకునేది
రామరాజ్యం..

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653
[03/04, 8:31 PM] సునంద ఉరిమిళ్ళ: తేదీ::03-04-2020
కవుల వేదిక
పేరు::వురిమళ్ల సునంద,ఖమ్మం
అంశం:: రామరాజ్యం
శీర్షిక:: మళ్ళీ వచ్చేనా
:::::::::::::::::::::::::::::::::::::
రెండు వందల యేండ్ల
బానిసత్వ సంకెళ్ళు విడిపించి
స్వేచ్ఛా స్వాతంత్ర్యం సాధించిన
మహనీయుల మాటల్లో...

మనకు మనంగా పాలించుకునే
ప్రజాస్వామ్యంలో
మనసా వాచా కర్మణా కోరుకున్న
త్యాగమూర్తుల భావజాలంలో..
సురక్షిత సుభిక్షంగా ఉండాలని
మన దేశం రామరాజ్యం కావాలనే
కోరిక
గగన కుసుమమవుతుంటే..

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి
సంబర పడగానే సరిపోదోయి..
ఆన్న మహాకవి మాటలు అక్షర సత్యాలు
అనుభవ పూరకాలు అవుతుంటే
మనం కోరుకున్న రామరాజ్యం
మళ్ళీ వచ్చేనా..!?

కష్టాలు కన్నీళ్ళూ
కూడూ గూడు బాధలేని
సకల జనుల సంతోషాలను
కళ్ళారా కనగలమా!

యుగానికో రూపంలో అవతరించే
విష్ణువు
మళ్ళీ జన్మిస్తే
ధర్మం నాలుగు పాదాలతో
ఈ నేలపై నడయాడితే  తప్ప
 రామ రాజ్యం  మనందరినీ ఊరించే సుందర స్వప్నమే...
[03/04, 8:34 PM] Uma Devi MV: కవుల వేదిక
తేది -3-4-2020
ఎం. వి. ఉమాదేవి
అంశం - రామరాజ్యం
శీర్షిక - సర్వ జనామోదం
**********************

గతితప్పనట్టివై ఋతుపవన
శోభలతో
ముక్కారు పంటలతో మాగాణి
మెట్టలూ
రైతులే మురిసేటి రామరాజ్యం !

నైతికత పౌరులకు నిర్భీతి నివ్వగా..
మహిళలకు రక్షణగా రామ రాజ్యం !
విద్యతో వినయమును విజ్ఞాన
ప్రభలుగా
బాలలకు అందించు రామరాజ్యం !

వ్యాపార సూత్రాలు దేశాభివృద్ధి
కై, ధర్మముగా నడిపించే రామ రాజ్యం !
సంసార బంధాలు సమ్మోహనా
లుగా..
గృహజీవితం సాగు రామరాజ్యం !

 కులవృత్తులకు మేలు కూర్చేటి
సాయము,
భవ్యముగా అందించు రామ రాజ్యం !
పాలకులు,పాలితులు మానవత బంధంగా
రమ్యంగా పాలించు రామ రాజ్యం !!
సకల జనామోదమౌ రాజ్యం !
*************************
[03/04, 8:37 PM] Kusumanchi Sreedevi: కవుల వేదిక
శ్రీదేవి సురేష్ కుసుమంచి
అంశం-రామ రాజ్యం
శీర్షిక-యాడనుందయ్య
--------------------------------------
అమ్మ మాట
నాన్న బాట
గురువు బోధ
ఓ అమృతకలశమని
సత్యమార్గాన్ని చూపిస్తూ
కొన్ని సూక్తులు పెద్దరిక భావనలో వల్లివేస్తున్నట్టున్నారు..

అయ్యో ! ఇది తండ్రి మాట జవదాటని కృతయుగపు రామరాజ్యమనుకున్నావు కాబోలు....

జగదభి రాముడి కాలములో తపస్సు కెళ్ళి ఈనాడు కళ్ళు తెరిచినావో ఏందో!

ఓ మారు వినుకోవయ్యా
మహానుభావ!
తండ్రి మాటనా అది ఏనాడో బాధ్యతానంతరం వృధ్ధాశ్రమములో పుస్తకపఠనము చేసుకుంటుంది..

నేడు రాజంటే..
ఓటుకు నోటు
గెలిచేకా అధికారపు వేటు

మంచి మాట్లాడే నోరు
చేతకానితనానికి ప్రతీక..
మాయచేసే మాట
తేనెల పుట్ట...
గోముఖవ్యాఘ్రాల
మధ్య హృదయకవాటాల సవ్వడి..

ఎదుటి వారి కన్నీటి
కడుపు మంటలపై
బృందావనాలు నిర్మించుకునే
మహారాజులున్న యుగము..
యాడ నుందయ్య నేడు రామరాజ్యము..

రావయ్యా! రామయ్యా
చిటికెన వేళ్ళుపై నివసిస్తున్న
హృదయమున్న మనుషులు సంఖ్య పెంచవయ్యా!

సర్వేజనా సుఖినోభవంతూ అంటూ..కదిలి రావయ్యా!
[03/04, 8:40 PM] Sarphraj Anwer Poet: 🌸 *అస్తిత్వ సంఘర్షణ..*🌸

నా చుట్టున్న ప్రతికూల పరిస్థితులకు
గుండెగదిలో చెలరేగే
*ఆత్మవిశ్వాస నిప్పుకణికలకు*
సమాజపు *చిన్నచూపుల ముల్లుకట్టెకు*
నాలోని సాహసాల బతుకు చెట్టుకు
పరిసరాల అక్రమాల కొరడాలకు
ధైర్యసాహసాల *గుండెసీసా బిరడాకు*
మధ్య నిత్య సంఘర్షణయే

ఆలోచనలకు అందని నింగి వైచిత్రికి
అనంత క్షమాగుణ ధరిత్రికి
సంఘంలోని ఆరాటఆర్భాటాలకు
నాలోని పోరాటపటిమకు నడుమ
సదా సమరభేరీయే..

*అంతరంగానికి, ఆలోచనా తరంగానికి*
*హృదయాకర్షణకు, మస్తిష్కఅవగాహనకు*
నడుమ నిరంతర సమరమే.
*చీకటి సామ్రాజ్యానికి, వెలుగుల కాగడకు*
*సత్యసంధతకు, అసత్యవింధ్యా పర్వతానికి*
మధ్య ఎడతెగని జగడమే

*జగడమున్నచోటే జీవముంటే,*
అది ఉన్నచోటే అస్తిత్వమున్నది
విచక్షణాపోరాటమే లేని
*జీవితం మరణసదృశమైతే*
ప్రకృతితో మనుగడకై *సంఘర్షణాజగడం*
చేయని ఏ జాతి కూడా మిగిలినట్టు చరిత్రలోనే లేదు..

*సర్ఫరాజ్ అన్వర్..*✍🏻
[03/04, 8:42 PM] Ramaka: కవులవేదిక:
తేది:3-4-2020
అంశం:రామరాజ్యం
రచన:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.
శీర్షిక: రామభూమి
**************************

ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు
పారే ఏరులు,స్వచ్ఛమైన గాలులు
ప్రకృతి పులకరింతలు,చక్కని వర్షాలు
శాంతి,సామరస్యాలు
సిరిసంపదలు,సౌభాగ్యాలు
ఐక్యత,భద్రత
సౌభ్రాతృత్వం, సౌశీల్యం
న్యాయం,ధర్మం
సత్యం, చట్టం
సుపరిపాలన నడచిన భూమి
కష్టాలంటే ఏమిటో తెలియని
ప్రజల జీవనం
నేరములే లేని సమాజం
సమష్ఠిభావన,రాజ్యభక్తి
ఏలికపై ప్రేమ,భక్తి, విశ్వాసం
కన్నబిడ్డల వోలె ప్రభువు లాలన
రామరాజ్యం సకలశ్రేయోదాయకం
సంస్కృతి,సభ్యత
యజ్ఞం, దానం
సేవ,పరోపకారం
రామరాజ్యం ప్రజారాజ్యం.
[03/04, 8:44 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవుల వేదిక
అంశం: రామ రాజ్యం
తేది:03-04-2020
పేరు: చివుకుల శ్రీలక్ష్మి
శీర్షిక:.     ఆదర్శ రాముడు

పుణ్యభూమి మన భారతదేశం
పురుషోత్తములకు నెలవైన భూమి
శ్రీ రాముడు నడిచిన నేల
షోడశధర్మాలు ఆచరించిన నేల!

గురువైనా జనకుడైనా
మాటకు విలువ ఇచ్చిన వాడు
'సత్యం వచ' అని పలికినవాడు

అడవుల కేగినా ఆలిని వీడినా
ధర్మం కోసం నిలిచిన వాడు
'ధర్మో రక్షతి రక్షితః'

రాజును బంటును  ఒక్క రీతిగా
మైత్రీ భావన నిలిపిన వాడు
'శరణాగత జన రక్షకుడితడు!'

రామ జననం మురిసేను పుడమి
రామ కళ్యాణం జగతికి కలిమి
రామ పట్టాభిషేకం జనులకు చెలిమి

ఆదర్శ రాముని పాలన రామరాజ్యమే!
ఎందరెందరికో స్ఫూర్తిదాయకమ్మిది
'రామో విగ్రహాన్ ధర్మః!'

చివుకుల శ్రీలక్ష్మి
విజయనగరం
ఫోన్ 9441957325
[03/04, 8:55 PM] Pagidipally Surender Poosala: కవుల వేదిక
పగిడిపల్లి సురేందర్ పూసల
03-04-2020
అంశం:- రామరాజ్యం
 శీర్షిక:- సకలం శాంతి

తండ్రి మాటకే విలువనిచ్చి
రాజ్యభారం మోసిన

నిజాయితీ పాలనకే
సమస్త జనుల సౌకర్యం కోసం
ధర్మాన్ని నాలుగు వైపుల చాటిన
జనమెచ్చిన భాందవుడు శ్రీరాముడు

ప్రజల సుఖ సంతోషాలే
తన నిబద్దతకు మూలసోపానలు
పేద గొప్ప బేధం లేకుండా
సమానంగా పరిపాలన గావించిన
నిత్య కార్య దిక్షతే రామరాజ్యం

క్షేమమే పరమావధిగా
అనివార్య యుద్దమే కాంక్షగా నిలిచి
కరువు కటకం ఆలోచన లేకుండా
మనోదైర్య సుందర క్షేత్రమై
 రైతు పంటల సువిశాల మేనుమంత్రమే
రామరాజ్యం..సకల శాంతి మయం
[03/04, 9:20 PM] Lakshmi Chamarthi Khammam: కవుల వేదిక
 పేరు: శ్రీ శివ లక్ష్మి రాజశేఖరుని
 తేదీ:04/04/2020
 అంశం: రామ రాజ్యం
 శీర్షిక: ఆ తత్వం ఆదర్శవంతం


 మోసాలు ద్వేషాలు
 వీసమెత్తు ఎరుగని సమాజం
 ఆకలెరుగని జనుల గుండెల్లో ఆరాధ్యదైవం
 ప్రజా వాక్య పాలనే శిరోధార్యం
 ఆదర్శమౌ వ్యక్తిత్వం
 రాజే ప్రజలకు మార్గదర్శకం అని చెప్పిన తత్వం
 తీర్చిదిద్దిన మూర్తిమత్వం
 సకల జీవరాశుల పట్ల మానవత్వం
 నరుడైనా వానరుడైన ప్రతి ప్రాణి సమానత్వం
 ఉద్ధరించెను తడిమి ఉడత జాతిని సైతం
 అందుకే ఆ రామాయణ మంత్రం
 నాటికీ నేటికీ ఆదర్శవంతం
[03/04, 9:49 PM] అంబటి Bhanu Prakash: 🌷🌿🌷🌿🌷🌿🌷

కవుల వేదిక
అంబటి భాను ప్రకాశ్
04.04.2020.

     *శ్రీ రామరాజ్యం*

సీ.మా.

ధర్మమే రాముడై ధాత్రియే బొగడంగ
        సద్గుణ రాశియై , జగతినేలె 
తల్లిదండ్రి గురుల చల్లగా దీవించ
      నిత్యమై సత్యమై నిలిచినాడు
తండ్రి మాటను తలదాల్చి కాలనకేగి
      పదునాల్గువర్షముల్ బాధలనడు
నన్నదమ్ముల ప్రేమ నవనిజనులు మెచ్చ
     సోదరు ల్ప్రేమతో జూచినాడు
యేకపత్నివ్రతుడై లోకము ల్బొగడగా
      నాదర్శమూర్తియై నడిచినాడు
దీనులైన జనుల దీనత్వమును బాప
      ధీరుడై మేలైన దీక్షబూనె

ఆ.
బాణమొకటి నాదు భార్యయొక్కతి యంచు
మాట యొకటె నంచు మాన్యుడగుచు
దేవదానవు లయి  దిక్పాలురైనను
నిలువగలరె పుడమి నిత్యముగను.

సీ.మా.
సౌభాగ్య సంపదల్ సంతరించ జనులు
      సంతసంబు నిల్పి సాగినాడు
నీతివర్తనులయ్యి నేరముల్ జేయకే
      కీర్తినందగజేసి నార్తిదీర్చి
ధర్మకార్యము జేయు తలపుజేసినగాని
      దీనజనులు లేనిదినము గాగ
పాలించెరాముడే పావనమూర్తియై
     కన్నబిడ్డలవోలె కనులగాంచి
పాలకుండెటులైన ప్రజలదా నీతియే
     నాచరింతురకట నక్షయముగ
ఆ.
రామ రాజ్యమన్న కామితములుదీరి
కనులపండు గైన కాలమయ్యి
పాపభీతి లేక పావనమైనదై
రాముపాలనుండె రమ్యముగను.



అంబటి భాను ప్రకాశ్.

🌿🌷🌿🌷🌿🌷
[03/04, 9:50 PM] Murthy Sreedevi Poetess: కవుల వేదిక
మూర్తి శ్రీదేవి
కలం పేరు " గురుసౌభాగ్య"
అంశం: రామరాజ్యం
శీర్షిక :  ఆదర్శ రాజ్యం
తేది : 3.4.20

అణువణువు ఆనందించేది
ప్రతి రేణువు పులకరించేది
కరుణాకృపను గాంచి దయారసము
సేవిస్తూ... జేజేలతో  నినదించేది

ప్రకృతిమాత ఎల్లప్పుడు పచ్చని చీరె
ధరించి మంధహాస మోముతో శోభనిచ్చేది
రెక్కలున్న మారాణులు గగనవీధిలో
విహరిస్తుంటే నాలుగు కాళ్ళు కూడిన
ఆప్తమిత్రులు పరోపకార జలాలను తాగుతూ
నమ్మినవారిని నట్టేట ముంచకుండా చేదోడు
వాదోడుగా ఉండి బతుకుసేద్యంలో సాయపడేవారు

వానమ్మ ఎప్పుడెప్పుడు  నేలను ముద్దాడాలా
అని ఆతృత పదుతుండగా
మంచె నిర్మాణానికి
మంచి ముహూర్తమెప్పుడా అని అన్నదాత
ఆరాటపడేవాడు...

 కీర్తించే నోర్లే కాని అర్థించే
అవసరంలేని ఆ నందనవనంలో వేవేల పుష్పాలు
తమ పుప్పొడితో నిర్మల మనసులకు స్వాగత
మాలలు అల్లుతూ చిరునవ్వుతో ఆహ్వానించేవి

అంగవైకల్యం సోకని ధర్మదేవత, కల్మషభావం
లేని న్యాయదేవత, పక్షపాతం తెలవని పదవులు
గతాన్ని గొప్పగా చెప్పడమే తప్ప సమకాలీన 
శిక్షలు,  భావిహెచ్చరికలు బహు అరుదే అక్కడ
 
కప్పుకో పొయ్యి, ఇంటికో తాళం వలె మనసుకో
త్యాగం, తనువుకో వినయం ఆస్తిగా ఉండేవి
“కిరీటధారుని”  గాంచి గర్వపడ్డారే కానీ దుర్భాష
లాడిన క్షణాలు లేవు కారణం ధర్మానికి నిలయం

విచక్షణ నిర్ణయాలు తీసుకునేది, ఆ నిర్ణయాలు
న్యాయదేవతకు ప్రీతిపాత్రమయ్యేవి...
సాయం కోరిన చేతులు నిండేవి, ముంచే చేతులు
మండేవి... తన, మన అంతా బోనుకు చుట్టాలే
కానిపనికి బానిసలైనప్పుడు...

కరువు ఖంగు
తినేది, రోగాలు భయపడేవి సంస్కార సుగంధాలకు...
కుర్చీలో ఉన్నోడికి దణ్ణం, ముసుగులో ఉన్నోడికి
మూడో  రోజు దినం... చెప్పేదే ఆచరణ, చేసేదే
దండోరా...

ప్రతి శ్వాస ధ్యాస భగవద్భక్తి...
ప్రతి అణువు సానుకూల సరాగాల నిలయం
గతానికి భేషుగ్గా, వర్తమానానికి స్ఫూర్తిగా
భవిష్యత్తుకు జ్యోతిగా వర్ధిల్లింది “రామరాజ్యం”
మున్ముందు తరాలు వినగలవే కానీ చూడలేము
[03/04, 9:57 PM] మర్రి జయశ్రీ: కవుల వేదిక
మర్రి జయశ్రీ
అంశం.రామరాజ్యం

సకాలంలో వర్షాలు కురిసి
సమృద్ధిగా పంటలు పండి
ధాన్యరాసులతో అన్నదాతలు
సంబరాలు చేసుకునే
సంతృప్తినిచ్చే పాలన
ఏ వివక్షలు లేని
అసూయాద్వేషాలకు తావులేని
అసమానతలు కనిపించని
అవినీతి అక్రమాలు
మచ్చుకైనా కనిపించని
ఆయురారోగ్యాలతో ప్రజలు
సుఖసంతోషాలతో వర్దిల్లే
సమర్ధవంతమైన పాలన
ప్రకృతి పచ్చదనం శోభను కలిగిస్తూ
కారువులు కాటకాలు లేని
మోసాలు ద్వేషాలు
స్వార్థం,దగా ఎరుగని
నిష్కల్మషమైన పాలన
సత్యం,ధర్మం తో కూడిన
శాంతియుతపాలన
ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటూ
ప్రజావాసరాలకు తగ్గట్లుగానేనడుచుకుంటూ
పన్నుల భారం లేకుండా
బంధుప్రీతి వీడి
నిస్వార్థంగా ప్రజల క్షేమమే తన క్షేమమని తలచి
సంస్కృతీ సంప్రదాయాలు గౌరవిస్తూ
కళలకు ప్రాధాన్యమిస్తూ
స్త్రీలను గౌరవిస్తూ
ప్రజలకోసం ప్రాణాలు సహితం లెక్క చేయకుండా
శత్రువులకు సింహస్వప్నమై నిలిచి
ప్రజలకు నమ్మకంగా ఉంటూ
ప్రశాంతంగా పరిపాలన కొనసాగిన నాడే
నిజమైన రామరాజ్యం
అది అందరికీ ఆదర్శమై నిలుస్తుంది.


Comments

  1. బాగుంది బ్లాగు.. బహు బాగుబాగు

    ReplyDelete
  2. వీరా గారూ! నమస్తే!
    మా కవితలు చిరస్థాయిగా ఉండిపోయే మార్గమిది.
    కవులను ఆధునిక సాంకేతికతవైపు చేయిపెట్టి నడిపించే మీకు ధన్యవాదములు తెలుపుతూ శ్రీలక్ష్మి చివుకుల

    ReplyDelete
  3. సూపర్,ఎంత చక్కటి ప్రయత్నం సార్...హృదయ పూర్వక ధన్యవాదములు వీరాసార్ &ఇందిర మేడం

    ReplyDelete
  4. మంచి ప్రయత్నం,ధన్యవాదాలు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కధానిక 22102020

కవి సమయం 6

Results