దుర్గా ష్టమిపాట /2020
నిర్వహణ
యేరువ ఇందిరా రెడ్డి
వీరా గుడిపల్లి
శివునూరి లలితాకృష్ణ
********************
కవివరుల జాబితా
1.కోరాడ గారు
2.కొప్పుల ప్రసాద్ గారు
3.తులసి వెంకట రమణాచార్యులు గారు
4.శ్రీలక్ష్మి గారు
5.యేరువ ఇందిరా రెడ్డి గారు
6.మన్నె లలిత గారు
7.భాగ్య లక్ష్మి గారు
8.మిట్టా లక్ష్మి గారు
9.సునంద వురిమిళ్ళ గారు
10.మర్రి జయశ్రీ గారు
11.డా.బల్లూరి ఉమాదేవి గారు
12.అయిత అనిత గారు
13.వల్లాల విజయ లక్ష్మి గారు
14.పిన్నక నాగేశ్వరరావు గారు
*********----
1
అంశం:- (గీతరచన)
కోరాడ నరసింహా రావు,!
*******************
సాకీ:-అమ్మా...దుర్గమ్మా
కరుణించి...మము బ్రోవగ రావమ్మా.....!
పల్లవి:-
జయ జయ జననీ ....
దుర్గా భవాని...వినుతిని గొనుమా, విజయము
నిమ్మా.....!
"జయ జయ జననీ"
చరణం:-
జగముల నేలగ...చల్లని
తల్లీ....,నవరూపములనుధరియించి...అసురుని జంపగ...విజయ దుర్గ వై....నీ భీకర రూపము జూపితివమ్మా ....!
"జయ జయ జనని"
చరణం:-
వింత-వింత రోగాలు...
ప్రక్రుతిదాల్చినవికృతులు
నేటి మనిషి బ్రతుకును...
చేస్తున్నవి అతలా కుతలం....!
ఈదుష్ఠశక్తులనుఅణచగ
నీవు...యే అవతారము నెత్తెదవో.,ఎటులమమ్ము
రక్షించెదవో....!!
కరుణించీ ...మము....
గావుము జననీ....!
"జయ జయ జననీ"
*******************
........కోరాడ.
2
[23/10, 8:09 PM] Koppula Prasad Poet: కవుల వేదిక
23/10/2020
అంశం :పాటల పోటీ
కొప్పుల ప్రసాద్,
నంద్యాల.
పల్లవి:
జయ జయ జననీ...
దుర్గ భవాని.. విను తిని గొనమా..
విజయములను నిమ్మా..
జగత్తును పాలించే తల్లి
చల్లంగా చూడవే మా యమ్మ
సకల సృష్టికి నీవే ఆధారం
మనసారా దీవించు దుర్గమ్మ
అమ్మలగన్న అమ్మ
ముగ్గురమ్మల రూపం
మదిలో స్థిరపడగా
నిన్నే కొలచి తిని తల్లి..!
!!జయ జయ జననీ దుర్గా భవాని!!
త్రిమూర్తులకు రూపమిచ్చి
పరిపాలనను అప్పగించి
సృష్టి లయలు క్రమబద్ధం చేసి
సర్వ జగత్తును పాలించే తల్లి..!!
!! జయ జయ జననీ దుర్గా భవాని!!
పసిడి కాంతులు వెదజల్లే
పరతత్వ మును బోధించి
దుష్ట శిక్షణ కావించి
విశ్వమంత రక్షించే తల్లి..!!
!! జయ జయ జననీ దుర్గా భవాని!!
బంగారు పట్టు వస్త్ర దారిని
ప్రకృతిని పచ్చగా చేసి
ధరణి మాతను అలంకరించి
నూతన ఉత్తేజం నింపిన తల్లి..!!
!! జయ జయ జననీ దుర్గా భవాని!!
ఆశ్వయుజ మాసము లో
నవరాత్రి ఉత్సవాలతో
నవ రూపమును ధరించి
కోరిన కోర్కెలు తీర్చే తల్లి..!!
!! జయ జయ జననీ దుర్గా భవాని!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
3
[23/10, 8:13 PM] Tulasi Venkata Ramana: కవుల వేదిక
పేరు:తులసి వెంకట రమణా చార్యులు.
కలం పేరు:మానస
ప్రక్రియ :పాట.
పల్లవి:
జయ జయ జననీ !!దుర్గా భవాని!!!
వినుతిగొనుమా...విజయము నిమ్మా.
చరణం;1
అమ్మ భవాని శాంభవి చంద్ర సహోదరీ నిన్ను కొలవంగా
కరుణించే కనక దుర్గ నీకు వందనాలు తల్లి.
పసుపు కుంకుమ పప్పు బెల్లములు సమర్పించిన కరునించే మాయమ్మ నీకు వందనాలు వేవేల వందనాలు.
చరణం2.
శరత్కాలంలో ఆశ్వీజ మాసాన నవరాత్రి ఉత్సవాల్లో నీదరి చేరి కొలవంగా ..
నీ చల్లని చూపుల ను అందించే ఆది పరాశక్తి వి నీవే కదా దుర్గమ్మ.
చరణం: 3.
అమ్మా మాయమ్మ రూపం ఒక్కటే అయినా ..
నవరాత్రుల్లో నవవిధ రూపాల్లో దర్శనమిస్తూ అభయం ఇచ్చే
దయగల తల్లివి నీవే జననీ అమ్మ దుర్గ భవాని.
మా తనవుల తలుపుల
నిన్ను తలచి కోలవంగా
శ్రీ లక్ష్మి గా కరుణించి సకల అష్టైశ్వర్యాలు ప్రసాదించే అమృత వర్షిణి వి నీవమ్మా.
పసుపు కుంకుమలు సౌ భాగ్య లు అందించే సౌభాగ్యా లక్ష్మి
జయము విజయము కల్గించే
విజయ లక్ష్మి
గైకొనువమ్మా
మంగళహారతులు ...
గైకొనవమ్మా మంగళహారతులు.
4
[23/10, 8:31 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవుల వేదిక
తేదీ 23-10-2020
అంశము పాట దుర్గా దేవి
పేరు: చివుకుల శ్రీలక్ష్మి
కవితా శీర్షిక: విజయదుర్గ
పల్లవి:
జయ జయ జననీ! దుర్గా భవానీ!
వినతులు గొనుమా! విజయమునిమ్మా!
1. బ్రహ్మ విష్ణు శివాంశలు నీవే
లక్ష్మీ సరస్వతి కాళీ స్వరూపము నీవే
మహిషాసురుని మర్దించిన దుర్గవు
మనుజుల కాపాడ మా తల్లి వైనావు
2 సత్వరజస్తమో గుణాల మూర్తివి
ప్రకృతిలోని చైతన్యశక్తివి!
అనంత మహిమలు ఇలను చూపుతూ
భక్తులగాచే కల్పవల్లివి!
3. నవవిధ నామాల నవదుర్గలుగా
నవ రాత్రులందు పూజలందుతూ
నవ చక్రాల నివసించేటి
శ్రీ చక్ర రూపిణి నీవమ్మా!
4. భక్తులు సిద్ధులు ఉపాసకులు
దీక్ష వహించి కొలిచేరు తల్లీ!
ఏ ఏ రూపుల కొలిచినవారికి
ఆయా ఫలములను అందించే తల్లీ!
5. సౌరమండలానికి అధి దేవతవు
కోరిన కోర్కెలు తీర్చే అమ్మవు!
శోక రోగ భయములు బాపే తల్లీ!
ఆయురారోగ్య సంపదలు కొల్లలుగా అందించే తల్లీ!
6. నవరాత్రులందున పూజలందుకొని మహిషాసురుని సంహరించితివి
విజయదశమియే ఆ సుదినము
సకల కార్యములకూ విజయం తథ్యం!
5
[23/10, 8:43 PM] Indira Reddy Yeruva: యేరువ ఇందిర రెడ్డి
హైదరాబాద్
అంశము:: పాట
*****************
.పల్లవి::
జయ జయ జననీ..!!
దుర్గాభవాని...
వినుతి గొనుమా...విజయము నిమ్మా!!!!
చరణం::
మా ఆర్తి వినుమా
మము పాలించుమా
దయగల తల్లీ . దుర్గమ్మా..
//జయ//
మహిష మర్దిని దుర్గమ్మ..!!
ఇంద్రకీలాద్రి న వెలసిన
తల్లీ...
చిరునవ్వు మోమున
విప్పారిన తల్లీ..
నిను గాంచిన వారికి
అపద లీడేరు జననీ
కొలిచిన వారి కోర్కెలు
తీర్చేడి తల్లి వి నీవే
మా దుర్గమ్మ..!!
// జయ//
ఆది పరాశక్తి అమ్మవు నీవే
కరుణ ను మము బ్రోవు..మా అమ్మా దుర్గమ్మ..!!
త్రిశక్తి మాతా ..
సుందర రూపిణి
అమ్మా నీ మహిమలు
ఎంచగ తరమే
అఖిల జగాలకు అమ్మవు నీవే
మా అమ్మా దుర్గమ్మ
))జయ((
సౌభాగ్యదాయిని
ఐశ్వర్య ప్రదాయిని
దుష్టుల పాలిటి
సింహవాహిని నీవే
తల్లీ..మా అమ్మా దుర్గమ్మ.. !!
)) జయ((
_ యేరువ ఇందిర రెడ్డి
హైదరాబాద్.
*******************
6
[23/10, 9:02 PM] +91 74168 63289: కవుల వేదిక
తేదీ :23 /10 20 /20
అంశము :దుర్గాదేవి... పాట
పేరు: మన్నె పిన్నక లలిత
శీర్షిక: నవదుర్గ
పల్లవి :జయ జయ జననీ!! దుర్గా భవానీ !!
వినుతినిగొనుమా ....విజయమునిమ్మా !
లక్ష్మీ రూపిణీ !కాత్యాయనీ!!
త్రిమూర్తుల అంశ సృష్టి దేవీ!నమో నమః!!
దుర్గాదేవివై పార్వతీ దేవివై సరస్వతి దేవివై పూజలందుకున్న పుణ్యమూర్తిీ!!
నవరాత్రులు నవ రూపాలతో నవ్యతనిచ్చిన నవదుర్గా!
వందనం! అభివందనం !!
కాళరాత్రిలో కాని కార్యాలు చేసే
నేటి కామకాసురుల కాలబెట్టి
నీ వాహనమైన గాడిదపై ఊరేగించి
ఈ దసరా శుభాల దసరాగా ఆసరా ఇచ్చే
సార్థక నామధేయం శుభంకరీి !అభయంకరిీ!!
7
[23/10, 9:32 PM] Bhagya Laxmi Kanipakam Poetess KS 42: కవుల వేదిక
నారాయణ భాగ్యలక్ష్మి
పల్లవి:
జయ జయ జననీ....దుర్గా భవాని
వినుతిని గొనుమా.. విజయము నిమ్మా
చరణం:
అమ్మా జనని అఖిల భువన పాలిని
అంబ శాంభవి చంద్రమౌళి కపాలినీ
అర్ధనారీశ్వరి ఆశ్రిత వరదే గౌరీ
ఆపదల రక్షించి దైర్యశక్తి నొసగవే ఈశ్వరీ నమోస్తుతే..
జయ జయ జననీ.. దుర్గా భవాని
వినుతినిగొనుమా.. విజయము నిమ్మా..
వీణాపాణి విశ్వ కళ్యాణి
విద్యా దానకరీ విజ్ఞాన నిధి
వాగ్మయ వాగ్దేవి వాణి బ్రాహ్మణి
వినయ సద్గుణ జ్ఞానమునిమ్మా భారతి నమోస్తుతే..
జయ జయ జననీ..దుర్గా భవానీ
వినుతినిగొనుమా..విజయము నిమ్మా..
సరిలేని సిరిబోణి శ్రీ హరిరాణీ
సకల సంపదల సౌభాగ్య ప్రధాయిని
సర్వగతుల భ్రోవుమా ఐశ్వర్య విధాయిని
సరసిజ నేత్రి చంద్ర సహోదరి మహాలక్ష్మీ
నమోస్తుతే..
జయ జయ జననీ.. దుర్గ భవాని
వినుతిని గొనుమా.. విజయము నిమ్మ.
8
[23/10, 9:34 PM] +91 94400 97002: కవుల వేదిక
23 /10/ 2020
అంశం :పాట
...................
మిట్టాలక్ష్మి
చిత్తూరు
చరవాణి :9440097002
........................
శీర్షిక: అమ్మలగన్నయమ్మ
...........................
సాకీ:అమ్మా ..... అమ్మలగన్నయమ్మ
జయ జయ జననీ దుర్గ భవాని వినితిని గొనుమా విజయము నిమ్మా
1.జగతిని ఏలు మాతవు నీవు
చరణం నీదే శరణం అమ్మా
శరణును కోరి వచ్చితినమ్మా
కరుణను జూపి పాలన చేయి
2.గిరిజా మాత నీవే నమ్మా
గీర్వాణి రూపం నీవే నమ్మా
సిరుల తల్లివి నీవే నమ్మా
దుర్గమ్మ తల్లివి నీవే నమ్మా
అమ్మలగన్న అమ్మ వు నీవు
3.నిన్నే నేను తలతును తల్లీ
సదా నిను కొలతును అమ్మా
దుర్గమమన్నది లేనేలేదమ్మా
సుగమమే నీ కృపతోడను
దుర్లభమన్నది లేదు కాదమ్మా
సులభమే ఏం కార్యమైనా
4.భక్త సులభవు ,సబలవు
లలితవుబాలవుగాయత్రివి,
శక్తివి , యుక్తివి
మహిషాసుర మర్దిని వి
వినతిని గొనుమా విజయము నిమ్మా
జయజయ జనని దుర్గ భవానీ:
జయ జయ కళ్యాణి గౌరీ వాణి::
..............................
ఈ పాట నా స్వీయ రచన దీనికి అనుకరణ కాదు.
...............................
9
[23/10, 9:48 PM] సునంద ఉరిమిళ్ళ: *కవుల వేదిక*
తేదీ:23-10-2020
పేరు వురిమళ్ల సునంద ఖమ్మం
అంశం:పాట
*******************
పల్లవి::
మంగళం మంగళం మాతల్లీ దుర్గా
జయ మంగళం మంగళం
జననీ జయ దుర్గా!
1:-
సకల లోకములు పాలించే తల్లీ
సర్వ లోపములు హరియించే మాతా
సృష్టి కర్తకు ప్రియమైన సరస్వతీ
లయకారుని అర్థ భాగం శ్రీ పార్వతీ!
ముగురమ్మల మూలపుటమ్మవు నీవైతివీ!
!! మంగళం!!
2:-
ఆశ్వయుజ మాసాన నిను చూడగా
రెండు కళ్ళు చాలవు మా కెవరికీ
శరన్నవరాత్రులు నవ దుర్గలు
బాల త్రిపుర సుందరి గాయత్రివై
అన్నపూర్ణా కాత్యాయనీ లలితా దేవీ
శ్రీమహాలక్ష్మి సరస్వతీ మహిషా సుర మర్ధిని! రాజ రాజేశ్వరీ దేవి రూపాలలో
దర్శనమిచ్చే దుర్గమ్మా ! మము కాపాడుమా
!! మంగళం!!
3:-
అండ పిండ బ్రహ్మాండ నాయికవై
అఖిల లోకాలు పాలించే జగన్మాతవై
నిను శరణన్న వారిని కరుణించగా
కష్ట నష్టములు తొలగించి జ్ఞానమనే ఇవ్వుమా
జయ మంగళమని నీకు హారతిలిత్తుమూ
జయములెన్నో మా కొసగి దీవించుమా!!
!! మంగళం!!
10
[23/10, 9:57 PM] మర్రి జయశ్రీ: కవుల వేదిక
మర్రి జయశ్రీ
అంశం..పాట
పల్లవి
జయ జయ జననీ!!దుర్గా భవాని!!
వినతిని గోనుమా..విజయము నిమ్మా.
చరణం
అమ్మా భవాని లోకాలనేలే శక్తి స్వరూపిణి
నిను వేడుకున్న చాలు తొలగును భయాలు
నిను కీర్తించిన చాలు కలుగు శుభాలు
జయ జగన్మాత ఆది పరాశక్తి
దయ చూపుమమ్మా కనకదుర్గమ్మ.....జయ.జయ.జననీ.
చరణం
ఆశ్వీయుజ మాసంలో
అత్యంత భక్తితో పూజించేము
నవరాత్రి పూజలందుకొమ్మా
మా తల్లి బంగరు దుర్గమ్మ
ముగురమ్మల మూలపుటమ్మా
అమ్మలగన్న అమ్మ మా తల్లి కల్పవల్లి...జయ..జయ..
చరణం
నవ దుర్గలుగా తొమ్మిది రూపాలలో
రోజోక్క తీరుగా పూజించేము
నైవేద్యాలు సమర్పించేము
కుంకుమార్చనలతో
నిను పూజించేము
అన్ని పీడలను బాపి ఆపదలు తొలగించి
అను నిత్యము మా తోడుండుము
మా తల్లి దుర్గ...జయ..జయ..
11
[23/10, 9:58 PM] Balloori Umadevi Poetess: కవుల వేదిక
డా. ఉమా దేవి
అంశం :పాట
పల్లవి: జయ జయ జననీ దుర్గ భవాని వినతి విజయ ము నిమ్మా//
1 ముగ్గురమ్మల అంశను పొంది
దుష్ట రక్కసుల అనంతము చేసి
సురలకు మునులకు మోదము కూర్చి
జగతిని చల్లగ కాచే తల్లి//
2 శైల పుత్రిగ బ్రహ్మచారిణి గా చంద్ర గంట గా కుష్మాండ గౌరీ గా స్కందమాత కాత్యాయని గా
కాలరాత్రి మహాగౌరి సిద్ధ ధాత్రిగా
నవరాత్రులలో పూజలు పూజలు గొనుమా తల్లి
3
సింహవాహినిగ నిలిచితివ మ్మ
శ్రీచక్రము న వెలసితి వమ్మ తీర్థం
భక్తుల పాలిటి చింతామణివై
కోర్కెలు తీర్చే కనకదుర్గ
12
[23/10, 9:58 PM] Anitha Aitha Poetess: *కవుల వేదిక*
శీర్షిక: *పాహిమాం దేవి..!*
*ప*
సింహాసనేశ్వరివై
సిరులనొసిగే తల్లీ!
చతుర్భాహు సమాన్వితవై
లోకాలను పాలించే తల్లీ!!
1.పున్నాగపూల పరిమళాలతో
సౌగంధికవై వర్దిల్లే తల్లీ!
ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల మేళవింపై
త్రిగుణ ప్రసాదిని నీవే తల్లీ!!
2.మృదు మధుర మంజులవై
భక్తులకు కొంగుబంగారమైన తల్లీ!
నీ సహస్రనామ పారాయణం చేసినంతనే
వరాలిచ్చే మమతల తల్లీ!!
3.సూర్యప్రభను వదనంలో చూపి
చిరునవ్వును అధరాలపై పరిచి
కరుణారసాన్ని కన్నుల్లో నింపి
పుష్పబాణ ధరివై మము కాచేతల్లీ!
4.జయజయ భార్గవి దుర్గే లలితే
మణిద్వీప వాసిని మహిమాన్వితవే
దుష్టుల ధనుమాడే రుద్రరూపివే
మగువల సౌభాగ్యం నిలిపే అమ్మలగన్న అమ్మవు నీవే!!
పాహిమాం దేవి పాహిమాం
అయిత అనిత
13
[23/10, 9:59 PM] విజయ లక్ష్మి యాదాద్రి: పల్లవి:*
జయ జయ;జనని దుర్గాభవాని!*
*వినతిని వినుమా!విజయాలనిమ్మా!*
చ.1)
అమ్మలగన్న అమ్మవు నీవమ్మా!
ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మా!
ఇలలోని ఈశ్వరి!చిన్ని వినతిదే!
ఉమాచండీ నీ రూపు ఊహాతీతమే!
ఔరా!అనిపించే అద్భుత౦ నీవమ్మా
అంబా!నీ దయ అంబరమేనమ్మ!
కన్నుల్లో నీరూపు కొలువుతీరనివ్వు!
కాలస్వరూపిణి మూలశక్తి జగాన నీవు!
చ.2)
గణనీయం గాయత్రీమాత నీదు చరితమ్ము
గణగణ గంటల వీరరస భరితమ్ము!
చరాచరములకు చలనమునొసగు సావిత్రీ!
జగమును నడిపించే మా ప్రియ జనయిత్రి!
జనులను కరుణించుమా జగద్ధాత్రి!
కరోనాను పారదృోలవే శుభదాత్రి!
నవరాత్రి వేడుకల్లో నిను దర్శించలేని
దౌర్భాగ్యస్థితిలో ఉన్నాము మాయమ్మ!
చ.3 )
తల్లుల గన్న లోకాల పావనమా!
దయచూపవే ప్రపంచ పెద్దమ్మ!
నవనీత హృదయిని అమ్మా పార్వతీ!
నీ కథ పాడగ ఈయవే ఆనతి!
భయమును తరుమవే మా భువనేశ్వరి!
మహామహివై మసలుచు కాపాడు!
ఆయుస్సునిచ్చి ఎల్లర దీవించు!
రమ్యమైన పరిపూర్ణ జీవితమివ్వు!
*సింహవాహిని*!చెడును దునుమాడవె
త్రిమూర్తిరూపిణి మము కాపాడవే!
వేల నామాల ఓంకారీశ్వరీ విజయాలనీయవె
వినుతిని వినవే లోకాలనేలె తల్లి!
(పల్లవి.)
::వల్లాల విజయలక్ష్మి,,,,
ఆలేరు,,
యాదాద్రి భువనగిరి
13
[23/10, 9:59 PM] Pinnaka Nageshwar Rao: కవుల వేదిక. 23--10--2020.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- దుర్గా భవాని (పాట).
జయజయ జననీ -- దుర్గా భవాని!
వినుతిని గొనుమా -- విజయమునిమ్మా!
తొమ్మిది రోజులు -- అమ్మను గొలువగ
భక్తులందరు -- ముక్తిని కోరుచు
వచ్చుచు నుండగ -- వరముల నిచ్చి
కనకదుర్గవై -- కరుణించవమ్మా! 1
ఇంద్రకీలాద్రిపై -- వెలసిన తల్లీ
నవ రాత్రుల్లో -- నవ రూపములుగ
దర్శనం మిచ్చెడు -- దుర్గాదేవీ
విజయదశమికి -- విజయములిమ్మా! 2
లోక కంటకులై-- శోకము మిగిల్చు
మహిషాసురులను -- మట్టుబెట్టుచు
దుష్టుల శిక్షించి-- శిష్టుల రక్షించెడు
కారుణ్య మూర్తీ -- కాపాడవమ్మా! 4
సూక్ష్మ క్రిమి యొకటి -- లక్షల మందిని
బలిగొను చుండగ -- నిలబడి చూడక
రక్షణ చేయగ -- తక్షణమే కదిలి
మహమ్మారిని -- సంహరించుమా! 3
************************************

Comments
Post a Comment