నేను ఎవరు

సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
యేరువ ఇందిరా రెడ్డి
Telugu teacher and poetess
*************
న్యాయ నిర్ణేతః
శివునూరి లలితా కృష్ణ
***********
ఈరోజు 14/04/2020
 రమణమహర్షి మహితాత్మస్వస్థలానికి చేరిన రోజు
ఈ సందర్బంగా....
*నేను ఎవరు*
 అన్న అంశానికి స్పందించిన కవి
మిత్రులు
****
1.శ్రీహరి. ఏలెగారు
2.కోరాడగారు
3.డాక్టర్. రామకకృష్ణమూర్తి గారు
4.వల్లాల విజయలక్ష్మి గారు
5.భూపతి గారు
6.కుడికాలవంశీధర్ గారు
7.కొప్పుల ప్రసాద్ గారు
8.గోగులపాటి కృష్ణమోహన్ గారు
9.చివుకుల. శ్రీలక్ష్మి గారు
10.వకుళవాసు గారు
11.యేరువ. ఇందిరా రెడ్డి గారు
12.శ్రీభాష్యం అనురాధ గారు
13.శ్రీకాంత్ కడార్ల గారు
14.వరయూరు జానకీ రామ్ గారు
15.m.v  ఉమాదేవి గారు
16.ముదిగొండ సంతోష్ గారు
17..తులసి వెంకటరమణాచార్యులు గారు
18.శీలోజు శోభన్ బాబు గారు
19.విజయదుర్గగారు
20.డా. బల్లూరి ఉమాదేవి గారు
21.కూసుమంచి శ్రీదేవి గారు
22.ఉత్కర్ష గారు
23.మూర్తి శ్రీదేవి గారు
24.వురిమళ్ళ. సునంద గారు
25.వీరా గుడిపల్లి గారు
26.రమాదేవి బాలబోయిన గారు
27.గంజాం భ్రమరాంబ గారు
✳✳✳✳✳✳
1
నేను... ఎవరంటే.(వచన కవిత్వం)

నేను... ఒక  పట్నం సడక్ ని
నిచ్చె వచ్చి పోయెటోల్లకు,
శానా ఆపతీ, సాపతోల్లకు అక్కరొచ్చె దాన్ని
అదేదో కరోనా పురుగంట
కంటికి కనిపించదు,
కంటికి నిద్ర లేకుండా జేస్తుందంట
లోకం మొత్తం లాక్డౌన్ ల
కింద ఉందంట
యిప్పుడు నేను... ఒంటరి దాన్నైనా
నాకు ఎవరు కనపడ్త లేరు
ఇల్లే జైలు ఖానా కావాలని
ఖానూన్ వచ్చిందంట
ఆ ఇసం పురుగు పారకుండ
సఫాయోల్లు, పోలీసోల్లు
తెల్లకోటోల్లు రాత్రనక, పగలనక
లోకానికి సేవలు జేస్తుండ్రు
వసుదైక కుటుంబ బాగుండాల్నని
ఆల్లే... కుటుంబాలకు దూరంగా
పని జేస్తుండ్రు
దూరంగా ఉండి పురుగు ను దూరం జేస్కోండ్రి బిడ్డా...
ఎంతైనా నేను... పట్నం సడక్ని... బిడ్డా..

   -- శ్రీ హరి. ఏలె
     నల్గొండ.
2
తేదీ:  14-04-2020.
అంశం:-  నేనెవరు !?
కోరాడ నరసింహా రావు., "పూర్ణానంద
             స్వరూపం"
         ************
నే నెవరు ....?
నీవెవరో...నీవు తెలు సుకుంటే...ఈ ప్ర పం చంలో  నీకింక తెలు సుకో వలసిందంటూ ఏదీ ఉండదు !
నేను...నేనుఅనుకుంటున్న ఈ నేను అసలు నేను కానని
తెలుసుకోగలిగినరో జున...ఈవాదాలూ
వుండవు...బేధాలూ వుండవు...ఈఖేదా లూ వుండవు !
అచ్చంగా... నిన్ను నువ్వు... తెలుసు కున్న క్షణాన.,అదే
అదే నేనని...ఆ నేనే
నీవని...నీవే నేనని అంతా నేనేనని...
నేనే బ్రహ్మ నని...
నేనే విష్ణు నని...
నే నే ఆ సర్వేశ్వరు
డైన మహేశ్వరుడ
ననీ...అంతా నేనేనని
అన్నీ...నేనేనని.,ఈ సృష్టిలో నేను తప్ప  అన్యమైనదేదీలేదని
ఆనందపారవశ్యంతో
నిన్ను నువ్వు సమా ధానపరచు కుంటావ్
కేవలపూర్ణానంద స్వ రూపానివై.... ప్రకాశిస్తావ్....!!
*****************
...........కోరాడ.
3
పేరు:డా.రామక కృష్ణమూర్తి
తేది:14-4-2020
అంశం: నేను యెవరు?
శీర్షిక:నా లోనికి నేను
**************************

ఇంతకీ నేను ఎవరు?
గర్భస్థ పిండాన్నా?
ప్రాణం పోసుకున్న జీవినా?
విజ్ఞానశాస్త్రం చెప్పే క్రోమోజోమునా?
తాత్వికులు,వేదాంతులు చెప్పే జీవాత్మనా?
జానపదులు పాడే బ్రహ్మ చేసిన బొమ్మనా?
ఎవరు? నేను ఎవరు?
పేరుతో పిలిచే నామ మాత్రుడినా?
సహజాతాలతో ప్రవర్తించే భూతాన్నా?
సంవేదనలతో కదిలే మాంసపుముద్దనా?
ఇంద్రియనిగ్రహాన్ని పాటించే తాపసినా?
ఐహిక సుఖాలను వదిలి ఆనందించే యోగినా?
పరమాత్మను అంతరంగంలో నిలుపుకొన్న అవధూతనా?
అవస్థాచక్రాలను దాటి ఊర్థ్వమండలానికి చేరిన వేదాంతినా?
ప్రాణాన్ని పెంచి పోషించి‌ బతుకునిచ్చే శ్వాసనా?
పంచభూతాత్మకమైన శబ్దమున్న ఓంకారాన్నా?
అహం బ్రహ్మాస్మి అనే అజ్ఞానం కలిసిన అహాన్నా?
ఎవరు? నేను ఎవరు?
సమసమాధిస్థితి నుండి వెలువడిన స్థితప్రజ్ఞతనా?
అరిషడ్వర్గాలనే అంతఃశ్శత్రువుల చేతుల్లో చిక్కుకున్న మోహాన్నా?
ఆలోచనాలోచనాల ఆవిష్కరణలో రాటుదేలిన శాస్త్రవేత్తనా?
సాధనతో బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న జ్ఞానినా?
మానవసేవతో దైవత్వాన్ని పొందిన దేవుడినా?
ఎవరు? నేను ఎవరు?
ఆత్మవిమర్శతో నిరంతరం కదిలే మానవుడినా?
అంతర్ముఖంతో,అంతఃచక్షువులతో లోకంతో విడివడ్డ మేధావినా?
ఐహికాముష్మిక అవగాహనలతో,గీతాజ్ఞానంతో
నిర్వచింపబడ్డ కర్మనా?
ఎవరు? అసలు నేను ఎవరు?
ప్రాణినై వచ్చాను,కర్మను అనుష్ఠిస్తాను
ఆత్మజ్ఞానం పొంది జీవాత్మగా పరమాత్మను చేరుతాను.
4
శీర్షిక:**నేను ఎవరిని**
--------************--------
*నేను ఎవరిని*' అనే సందేహం
ప్రతిమనిషికి ఎపుడో ఒకప్పుడొచ్చేదే!
దానికి భగవాన్ రమణమహర్షి సమాధానం
ఆయన చేసిన మార్గదర్శనం భోధనం అమూల్యం

"ఆసక్తికర సావధానశ్రవణం
సకల లోక మౌనభాషణం
మంచి మనసుచే సరళధ్యానం
మనకoదించు  ఆత్మజ్ఞానం.

ప్రాణాయామం మనోనిగ్రహానికి గట్టిమార్గం
మూగజీవులతో సహ(జ)వాసం
మెరుగైన పరిపూర్ణజ్ఞానసంకేతం
కర్మ అంటే ఏదోకాదు జడపదార్థం

ఈశ్వరుని ఎడ నిష్కామకర్మలు.                   మనసును పరిశుద్ధం గావిస్తాయి
ముక్తికి మూలకారణమౌతాయి
ఆత్మగాఉండటమే ఆత్మను తెలుసుకోవటం

జీవుడు దేవుడు వేరుకాదన్నదే అద్వైతవేదాంతం
దేవుడు శాశ్వతుడు-ఎక్కడికీ పోడు
ఆత్మజ్ఞానం కలిగినవాడే గురువు"
లక్ష్యం చేరాలంటే లెక్కచేయకు కష్టాన్ని"
అని చాటిన రెండో శంకరాచార్య!                 

జీవులన్నిట సమానాత్మల చూసిన విరూపాక్షగుహనిలయ!
ముప్పయేళ్ళు మౌనయాగం సలిపిన అరుణాచలవాసా!                                                                            నీవలె తామరాకు మీద నీటిబొట్టులా ఉండే               నిశ్చిత ఆలోచనలు కొన్ని మాకు చిక్కనీ!
చిదానందరూపాన్ని దర్శించే వీలు మాకు దక్కనీ!
;:వల్లాలవిజయలక్ష్మి,, ఆలేరు
5
[14/04, 8:07 PM]నేను యెవరు ?
""""""""""""""""
నీ అడుగులో అడుగునై
నీ గుండెల్లో నడతనై
నీ మనసులో ఆలోచననై
నిన్ను నడిపించె శక్తినై
నీ లక్ష్యానికి మార్గన్నై
నీలోనే ఉన్న నేను ఎవరు ?
నేను యెవరు? నేను యెవరు?

ప్రేమనా లేక అసూయనా !
బంధువునా లేదా ఆత్మబంధువునా !
ధన దాహం లోనా
అధికార మదం లోనా
పరపతి పరుగులోనా
హత్యలు అత్యాచారాలతో
దోపిడి దౌర్జన్యాలతో
కమ్ముకున్న చీకటి కాలంలో
స్వార్ధాన్నా లేక అహంకారాన్నా !
నేను యెవరు? నేను యెవరు?

నేడు
ప్రపంచ మానవాళికి స్వప్నమై
శాస్త్రజ్ఞులకు ప్రశ్నర్ధాకమై
కంటికి కనబడకుండా ......
శాస్త్ర విజ్ఞానాన్నికి దొరకకుండా...
మీ మేనులో మిళితమై..
మరణకాండకు మృదంగమై...
మ్రోగిస్తున్నా నేను ఎవరిని....
చివరగా నీవు కోరుకున్న...
కోరికలకు తథాస్తు అనే శక్తిని
నేను యెవరు? నేను యెవరు?
నేను యెవరు?  నేను నేనే.......!

-ఏ భూపతి,
6
[14/04, 8:16 PM] వంశీధర్: *కవుల వేదిక*
తేది : 14-04-2020
మంగళవారం అంశం: నేను ఎవరు?

*నేను.....*

నేను ఎవరు?
అందరిలో నీవు చూస్తున్న నేను
అద్దంలో నాకు కనిపిస్తున్న నేను
నేనంటే అంతేనా!

నేను ఎవరు?
మెత్తని ఆకులను పట్టుకొని
పుడమి తవ్వుకొచ్చిన విత్తునా?
నేనంటే అంతేనా!

నేను ఎవరు?
నెత్తురు అత్తరు పూసుకుని
కడుపు చీల్చుకొచ్చిన విపత్తునా?
నేనంటే అంతేనా!

కదలనీయకుండా మూలాలు నేలలో లోతుగా ఉన్నా
కొమ్మల చేతులు సాచి
అకాశమే నా గమ్యం అన్నట్టు
నిటారుగా సాగుతున్నది నా పయనం
నేనంటే చెట్టేనా?

విత్తు కాదు, విపత్తు కాదు,
నేను చెట్టును కూడా కాదు
నాలుగు రోజుల మజిలీ తరువాత
మిగిలే మట్టిని నేను
గాలిలో పువ్వుల పరిమళం కలిసినట్టు
కాలం పుటలో మంచితనం నిలిపే మనిషిని నేను
* *
కవులవేదిక వాట్సాప్ గ్రూప్ పోటీల్లో "నేను ఎవరు?" అంశం కొరకు *కుడికాల వంశీధర్* రచన, 14-04-2020.
ఇది నా స్వంత రచన అని, ఎక్కడ ప్రచురితం కాలేదని హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు
*కుడికాల వంశీధర్* (*నానీల వసంతం*)
7
[14/04, 8:16 PM]
*నేను ఎవరిని...!!*
బీజం వేసిన తండ్రిని
రక్తమాంసాలు పంచిన తల్లిని
కంటికి రెప్పలా కాపాడిన నన్ను
వృద్ధాప్య సమయంన ఆశ్రమంలో వేసిన
మానవత్వాన్ని మరిచిన నేనెవరిని...!!

కడుపుకు తిండిని ప్రసాదించిన
పచ్చని పొలాలు పండించిన
సర్వజీవులకు ప్రాణం పోసిన
పెంచుతున్నట్టు వంటి భూమాతను
అరగని ప్లాస్టిక్స్ నేల మాతకు పెట్టి
తల్లి రోగాలకు కారణమవుతున్న నేనెవరిని...!!

ఎంతో సుందరంగా విరాజిల్లే ప్రకృతి
అనువనువు ఆనందంతో నింపుకొని
నయనానందకరమైన సోయగాలను
పుడమి సింగారించుకున పచ్చని చెట్లను
భూమాతకు బోడి గుండు కొట్టినట్టు
నరుకుతున్న నేనెవరిని...!!

సహజసిద్ధంగా పండే పంటలకు
అధిక దిగుబడుల కోసం ఆరాటంతో
వచ్చిన తెగుళ్ల నివారణ కోసం
రసాయనాలనే విషం ని చిమ్ముతూ
నేలతల్లి సారాన్ని  పిలిచి వేస్తున్నా నేనెవరిని..!!

ఆధునిక జీవితాన్ని సుఖమయం చేసుకోని
కావలసినవన్నీ కాళ్ల దగ్గరికి తెచ్చుకొని
విశ్వాన్ని అంతా చేతిలో ఇమిడి పుచ్చుకుని
కాలానికి తగినట్లు మారుతున్న
అంతర్జాలంలో అభివ్రుద్ది పంచుకొన్న
ఆకాశంలోను సముద్రంలో విహారం చేస్తూ
సహజత్వాన్ని కోల్పోయి నేనెవరిని...!!

 *కొప్పుల ప్రసాద్*
   *నంద్యాల*
8
[14/04, 8:29 PM
తేది: 14-04-2020, మంగళవారం
అంశం: నేనెవరు?
శీర్షిక : రమణుని తత్వము
రచన: గోగులపాటి కృష్ణమోహన్


అరుణాచలమందు
అవతరించినదేవ
మౌనముద్రతోటె
మహిమతెలిపె

భక్తివిశ్వాసాలె
ఆయుధంబని
మహిలోన తెలిపెను
రమణ మహర్షి

కోరికలు వలదంటు...
భారమే యదియంటు
మనసు మలినము
కానీయకంటాడు...

స్వర్గమన్నది
ఎక్కడో లేదంటు
నిశ్ఛలముగున్నదియే
స్వర్గమన్నాడు

మంత్ర తంత్రాలకు
రాలవేదన్నాడు
మంచిమనసున్న
అదియే సర్వమన్నాడు

చీకుచింతలున్న
చేరవు నీ ధరి
మనసు నిమ్మలమే
నీకు మేలన్నాడు

ఆకారము వలదు
అలంకారమూ వద్దు
నామ,రూప రహితమే
రమణుని భావము

శాంత రూపంబుతో
శాసించె భక్తులను
తెలిసిన వారికే తెలియు
రమణుని తత్వము

రచన: గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653
9
[14/04, 8:31 PM]
తేదీ: 14- 4- 2020
పేరు: చివుకుల శ్రీలక్ష్మి
ఊరు: విజయనగరం
అంశము: నేను ఎవరు?
కవితా శీర్షిక
                  ఎఱుక
అఖిలాండకోటి బ్రహ్మాండ విస్తరణలో
ఏడేడు పద్నాలుగు లోకాలలో
సప్త ద్వీపాలలో ఒకటైన జంబుద్వీపంలో
84 లక్షల జీవరాశులలో నేను ఒకరు!
భరత వర్షంలో
136 కోట్ల జనాభాలో నేను ఒకరు
అంతేనా??
యుగయుగాలుగా
జనన మరణాల చక్రంలో
తిరుగాడే ఆత్మను నేను!
పిపీలికానినీ, మశకానినీ కాదు
మేథ కలిగిన మానవ ఆత్మను!
ఈ మేనుని ఆశ్రయించి
పరమాత్మను తెలుసుకుని
అతనిలో ఐక్యమొందాలని
ప్రయత్నించే కర్మ జీవిని!
నేవెవరో తెలుసుకోవాలంటే
నిరంతర చింతనలో
సద్గురు అనే తెప్పనెక్కి
ఈ భవసాగరాన్ని దాటితే
నేనెవరో తెలుసుకోగలను!
జన్మ సార్ధకమవుతుంది
లేకుంటే అరిషడ్వర్గాలలో చిక్కుకుని
నేనెవరో? నా జననం ఎందుకో??
ప్రశ్నించుకోకపోతే
మాయలోపడి కొట్టుకుపోతాను
జన్మ నిరర్థకం అవుతుంది.
10
వకుళ వాసు
హన్మకొండ
అంశం- నేనెవరు

శీర్షిక-🍃నేను🍃

 నేను ఎవరికీ అర్థంకాని
 భావగీతాలాపాన్ని...

కవితా కాన్వాసుపై నర్తించె
కావ్య శిల్పాన్ని....

ఒక్కోసారి నాకే అంతుపట్టని
 అగాధ సంద్రాన్ని....

నీ హృదిలో కమ్మిన చీకట్లను పారద్రోలే
 వెన్నెల కిరణాన్ని....

 స్వచ్ఛ స్నేహాన్ని కాంక్షించే పరిమళ
 పారిజాతాన్ని...

 వల్లిన మోమును పూయించే
చల్లని వర్షాన్ని....

నీ కనుదోయికి అపురూపంగా కనిపించే
 మంచుబొమ్మని....

మరి నన్ను నీ కన్నుల్లో పెట్టుకొని
 కాపాడుకుంటావో...

లేక నా కంటిలో నలకవై కన్నీరుగా
 మారుతావో...

నీ నిన్నకు నేటికీ  రేపటికీ వారధిగా
 నిలబెట్టుకుంటావో....

నీ మనుగడనే ప్రశ్నార్థకంగా
 మార్చుకుంటావో....

🍀🌹 వకుళవాసు 🌹🍀
11
భగవాన్ రమణ మహర్షి

ఏమని చెప్పను
ఆ దివ్య తేజోమయ
మణిరూపుని
మౌనముని రమణుల
ఆంతర్యం.!!

పిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి
ఇహమును మరచి
పరమాత్మ సన్నిధిలోనే
ధ్యానంలో గడిపిన
మనిషి రూపంలోని దేవుడని..!!
ఎలా చెబితే అర్దమౌతుంది అతని
మనుసు కూడా మాటాడ గలదని
ఆ చేతుల స్పర్శ
ముక్తిని ఒసగ గలదని. !!

తన తల్లికి మోక్షం ఒసగిన ఆ స్పర్శ గొప్ప తనం దేవుడికి గాక మనిషికి ఉండదని
సర్వ ప్రాణులను సమాదరించి న ఆ మహర్షి అరుణాచలేశ్వర అంశ స్వరూపుడని..!!

మౌనంతో సర్వం బోధించిన ఆ మహనీయుని
గురించి మాటలతో
సాధ్యం కాదేమో
మనం కూడా ధ్యానం చేసి తరించాలేమో..

మాటలతో సాధించలేని ప్రేమ తత్వం మౌనంతో చాటిన భగవాన్ రమణ మహర్షి కనుల తేజస్సు
దర్శనీయ ప్రదేశమే..
దిన దిన శోభాయమానం...

-యేరువ ఇందిర రెడ్డి
హైదరాబాద్
12
నేనెవరిని?...
*****************
ప్రకృతిలో ప్రతి వస్తువు అపురూపమే
పూలలోని సుగంధం, నీటిలోని చల్లదనం,
 పైర గాలి లోని ఆహ్లాదం, పండులోని తీపిదనం, కొండల ఔన్నత్యం,
 నదీ ప్రవాహపు నాదాలు, ఇవన్నీ....... ప్రకృతి మనకందించిన ప్రసాదాలు, అవే జీవనానికి వరాలు మనిషి మనుగడకి గమనాలు...                మనిషి స్వార్ధానికి
ఈ లోకంలోని ప్రతిదీ నాదంటూ.......... కబళిస్తున్న వేళ         పూలలో కృత్రిమ వాసనలు తన ఉనికినే మార్చిన ఉదకములు ,    కలుషితమైన పైరగాలి, చప్పబడిన పండ్ల తీపి, కొండలు బండలయిన తీరు ఆగిన ప్రవాహపు జోరు,..... మనిషి ప్రకృతిని- వికృతిగా మార్చిన వైనం'
... అందుకే ...చెలగాటం ఆడకు ,
"నేనెవరిని "?.......
వికృతిగా మార్చడానికి అనుకుంటూ పోతే ..
మనిషి నిర్మలత్వం గా మారితే .....అవుతుంది జగమే ప్రకృతికి ప్రతీక.... అందరూ బాగుంటారు అందులో మనం ఉంటాము
**********************
డా.శ్రీభాష్యం అనూరాధ
13
పేరు:శ్రీకాంత్ కడార్ల
ఊరు:హన్మకొండ
తేది :14/4/2020

అమ్మ నాన్నల గారాల బిడ్డనా
తల్లితండ్రులు పెట్టిన పేరునా
ఎవరిని నేనెవరిని??

ఆనందాలు పంచడానికి వచ్చిన
చందురుడినా
సంతోషాలు పెంచడానికి వచ్చిన
ఇందురుడినా
ఎవరిని నేనెవరిని??

నాకోసమే ఎదిగే మొలకనా
ఎంతో ఎత్తుకు ఎగరాల్సినా చిలకనా
ఎవరిని నేనెవరిని??

అద్దంలో కనబడే నేనే నేనునా
రూపంతో ఒదిగిన ఆహార్యమే నేనునా
ఎవరినీ నేనేవరిని???

ఇంతకీ మంచోడినా ముంచటోడినా
ప్రశ్ననా సమాదానమా అసలేంటి
ఎవరిని నేనెవరిని??

ఈ ప్రశ్నల సంవేధనతో
నా ఆలోచనలను చిలకగా
ఒలకిన సమాధానమే నేను

నా కన్నవారి కి కన్నీరు రాకుండా
చూడగలిగే దీపాన్ని నేను

నా తోబుట్టువులకు తోడుంటాడనే
ధైర్యాన్ని నేను

నా మిత్రులకు సహాయాన్ని
అందించగలిగే హాస్తాన్ని నేను

సమాజానికి చేయూతనిచ్చే
సమిధను నేను..

నేను స్పందించే హృదయాన్ని
సాయం అందించే నేస్తాన్ని...
14
అంశం: నేనెవరు
శీర్షిక: అంతరాత్మ

పదే పదే ప్రశ్నిస్తోంది
నా అంతరాత్మ నేనెవరిని!
ఎన్నోమార్లు తరచి చూసా నేనెవరిని!
అసంతృప్త సమాధానమే!

ఏ జవాబైన
తత్కాలానిదే,
తద్ధర్మకాలానిదే!

నేనెవరంటే
ఒక తాత్కాలిక చిరునామానే!

నేనెవరిని
దీర్ఘంగా ఆలోచిస్తే
చాలా వేదికల పైన
ధరించిన
విభిన్న రకాల పాత్రను!

నేనెవరంటే
ఈ సమయానికి
కవుల వేదిక సభ్యుడను
అంతే!!!

నమస్సులతో,
వరయూరు జానకిరామ్...
15
ఎం. వి.ఉమాదేవి
అంశం - నేనెవరు
శీర్షిక - నాలోని నీవు
తేది -14-4-2020
**********--*********

ధర్మాచరణ విధానంలో ఫలా
పేక్ష పంచభూత సమన్విత దేహమే నేను !
ద్వైదీ భావనలేదు,కర్మల సాధనే నిశ్చలత్వం !

నిర్మోహ తరంగాల జలధిలో
కోర్కెల నురగల రూపమే నీవు
పుట్టడం,క్షణం నిలిచి నిష్క్రమణ !

ఆకలి,ఆవేదన సర్వజీవులకీ
ఒకటే...
నిన్ను నీవు తెలుసుకోవాలంటే
క్షుద్భాధ రూపాలను చూడు !
బాహ్యాకలి తీర్చు !
జ్ఞానక్షుతి తీరేలా అలమటించు
అంతర్యామి సాక్షిగా !

ఖాళీ చేతులు ఎంతో ఇవ్వగలవు దివ్యాత్మ లై...
గిరులూ, తరులు ప్రకృతిలోకి
నిన్ను ఆహ్వానించినాయి !
సాధనలో పూజలూ,పెద్ద ఎత్తున సామాగ్రి దేనికో...
పంకంలాంటి మనసులో శుద్ధి
కోసమే ఆత్మ శోధన !
నిన్ను నీవు తెలుసుకో... !
*************************
16

సంతోష్ ముదిగొండ
నేను ఎవరిని
శీర్షిక. నేను
నేను అనంతాన్ని
హద్దులు లేని దిగతాన్ని
ఆది నేను అంతం నేను
కడలి లోతు నాలో
కనుపాప రూపు నాలో
నేను కాలాన్ని , కాలకూట విషాన్ని,
నాలో అమృతం ఉంది
చిగురాకు ప్రాయం నాది
ఎండిన మోడు నేను
వెన్నెల వాన నేను
నక్షత్రాల తళుకు నేను
నేను గడ్డిపోచ, సప్తగిరుల కొండ
నా నుండి తప్పింది లేదు
నాలోని లేనిది లేదు
పులా సుగందాన్ని నేను
పసిపాప నవ్వును నేను
నేను జగత్తును
నేను శూన్యాన్ని
రాగల జరులు నాలో పొంగుతాయి
ఎడారి మంటలు నాలో రేగుతాయి
అన్నిటికి నేను సాక్షిని
నేను యుగయుగల మౌనాన్ని
అజరామరమై వెలిగే దీపాన్ని
చీకటి గుహల గోళాన్ని
నాకు ఉగాదులు ఒక్కటే ఉషస్సులు ఒక్కటే
నేను అంతర్ నాటకాన్ని
నేను అంతరాత్మను

17
పేరు:తులసి వెంకట రమణా చార్యులు.
అంశం:నేనెవరు...?

శీర్షిక:అంతర్వేషణే నేను ఎవరు!

నేను ఎవ్వరిని ప్రశ్నిచుకొనే తత్వం వ్యక్తి అస్థిత్వ భావన.
"నేను"అనే పదం మొదటిది పరందాముని నామం..
నాది నేను  అని మదిలో మెదిలే భావమే అహం
సర్వ జీవులందు కరుణ కల్గి ఆదరించడమే కాక, రసాత్మకమైన సంభాషణలు చేస్తూ...
ప్రకృతి తో సహజీవనం చేయడమే ధర్మోక్తి
నేను నీనుగా చేసింది ఏమీలేదు...
నాది నాది అని వ్యామోహం పెంచుకోవడమే పతనానికి నాంది.
పుట్టుక.. చావుల మధ్య జీవన చక్రంలో బతుకు మాయాజాలం
అంతుచిక్కని ఆశలతో అహం పెంచుకొంటూ ..
వేరొకరి నైజాంను ప్రశ్నించే తార్కిక  శక్తి సంఘర్షణలో ఉద్భవించే చైతన్యమే "నేను"
నాకు నీనుగా ఎదగాలంటే మానసిక పునరుత్తేజానికి "నమ్మకమే బలిమి.
మౌనం వహించి మనస్సును ప్రజ్వలింప చేసే ఆలోచనాలోచన దృష్టియే
సృష్టి స్థితి లయ కారకత్వా
అంతర్వేషణే"నేను ఎవరు"
రమణ మహర్షి జీవన  వైవిధ్య భక్తి తరంగ సమారాధనే  ..
జీవన ప్రమాణాల  సమ్మోహన ఔనత్యమే  లౌకికత్వానికీ ఆదర్శప్రాయం.
18

శీలోజు శోభన్ బాబు
అంశం నేనెవరు
శీర్షిక పచ్చని వనం

ఎక్కడో ఊరికి దూరంగా
ఎవ్వరూ లేనిచోట
కొండ కోనల మధ్య
నేనుంటాను

నీకోసం ఎదురు చూస్తూ
నీకోసం స్వచ్ఛ మైన గాలిని ఇస్తూ
నీకు కావలసిన ఫలాలు అందిస్తూ
వంటచేరుకును సమకూరుస్తూ
ఉంటాను నీకై

నువ్వంటే నాకు చాల ప్రేమ
నేను లేకపోతే నీకుండదు మనుగడ
నీకు పిచ్చెక్కినట్టుంటుంది
నీకు నేను గాలిని ఇవ్వకపోతే
నేను లేకపోతే
వర్షాలు రావు
పంటలు పండవు
ఆహారము దొరకదు
ఆక్సిజన్ లభించదు
నేను కనబడక పోతే
నేను




నువ్వుకూడా నావైపు చాలా
అప్యాయంగా  ఉన్నప్పుడే
నన్ను కాపాడుకొన్నప్పుడే
ఈ ప్రకృతి సమతుల్యం
ఉంటుంది
అప్పుడే
నీకు మనుగడ ఈ ధరణి పైన

చల్లని చిరుగాలిలో హాయిగా
నీవు  నిదురిస్తావు
ఈ ప్రపంచంలో
నాకు మోసం చేయకు
నేను నీలాంటి మనిషిని కాదుకదా

నేను నీకు నీడనిచ్చే పచ్చటి అడవిని

శీలోజు శోభన్ బాబు
పాలకుర్తి
19

పేరు: విజయదుర్గ
కవితా అంశం : ఎవరిని నేను(రమణమహర్షులు)

కవితా సంఖ్య: 16
తేదీ: 14/04/20

కారణజన్ముల జన్మలు
అవనికి అపురూపాలు
మహోన్నత సద్గుణాల
నిలయం....!!

ఎవరిని నేను అన్న ప్రశ్నలో
అన్వేషితయై
పరమేశ్వరుని సన్నిధిలో నిలిచిన
ఆద్యాత్మక పుష్పం....!!

స్వీయ శోధన చక్రాలతో
ఆత్మజ్ఞాన ద్వారాలను తెరిచిన
మహా తపస్వి
మౌన పూలను దైవానికి చల్లుతూ
మౌనముద్రలను తెలిపే సద్గురువు....!!

బాహ్యప్రపంచానికి దూరంగా
అంతర్గత శోధనకు సమీపంగా
పరిపూర్ణ శాంతి కళలతో
తేజోమయము ....!!

ప్రశాంతమైన నిలకడ మనసుతో
దైవాన్ని చూడగలిగిన
రమణమహర్షి ఉపనిషత్తులను
అవపోసనపట్టి జ్ఞానకేంద్రంగా నిలిచారు....!!

ప్రతి ఒక్కరికి స్వీయ శోధనే
ముఖ్యమన్న మహాత్ముడు
అతని ఆత్మశోధనే మహర్షిగా
నిలిపి భగవంతుని రూపంగా నిలబెట్టిన అద్భుతం....!!


                           వినీల
20
 తేదీ :14/ 4 /20
డా.బల్లూరి ఉమాదేవి
అంశం నేనెవరు
శీర్షిక: నేను నేనే

ఎవరిని నేనెవరిని

అందరిలోనూ ఉంటాను

అవసరాన్ని బట్టి పైకొస్తాను

నేను మీలోనే ఉంటే మీకు క్షేమం

బయటికి వస్తే మీకే నష్టం

సుఖ దుఃఖాలకు అతీతాన్ని

ఎవరినైనా ఇట్టే ఆకొట్టు కొంటా


 ఆకాశానికి ఎత్తేసినా నేనే

 పాతాళానికి తొక్కేసేది నేనే

నేను చెప్పిందే సరి అంటాను

కాదంటే కదం తొక్కుతాను

 తెలిసిందా ఇప్పటికైనా

నేనెవరో మీకేవరుసో

 నేనే నేనే అహాన్ని

మీ  హిత శత్రువును

నన్ను కట్టడి చేయడం మీకే సాధ్యం
21

శ్రీదేవి సురేష్ కుసుమంచి
అంశం నేనేవరిని?
రమణ మహర్షి
-----------------------------
అయ్యో !
ఎన్నో రహస్యాలను ఛేదించడానికి నింగికి క్షిపణిని విడిచిపెట్టిన రోజు !ఓహో ఎంతో గర్వంగా చెప్పుకున్నాను
నేను శాస్త్రవేత్తనని

ఫోర్భ్స్ పత్రికలో మొదటి స్థానములో ఉంటే నేనే కుబేరునిని అనుకున్నా!

కనుచూపులతో అమాయకులను భయపెట్టగల్గినప్పుడు ..హోహో!నేను పెద్ద రాజకీయనాయకుడినే  అని మీసాలు మెలిపెట్టుకున్నా!

కాని నేడు కంటికి కానరాని ఓ సూక్ష్మ జీవికి భయపడి
తలుపులు మూసుకుని
ఇంటిలో దాక్కున్న నేడు
మనసు నుండి రమణ మహర్షి గారి సిధ్ధాంతము మనో తెరపై కి వచ్చీ నేనేవరినీ అనే ప్రశ్న
శరములా యుధ్ధానికి వస్తుంది..

ఎవరని చెప్పాలి నేనిప్పుడు..
అహాంకారముతో నేను అన్న భావానికి.. నేటి స్థితి ఏమటని చెప్పాలి?
22

పేరు: ఉత్కర్ష
ఖాజీపేట
తేది: 14.9.20
అంశం: నేనెవరు
శీర్షిక: *'చిమ్మ చీకట్లో చిరుదివ్వెవు'*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃

ఏమిరా ఏమైందని ఈ చింత
నేనెవరు అని ఈ వెతుకులాట
వెళ్ళరా వెతుక్కో ఆ చిమ్మ చీకట్లో
ఎదురు చూస్తుందేమో ఓ
చిరుదివ్వె నీ కోసం

ఆలస్యం చేస్తావేం రా
వెలుగు పరుచుకో నీ దారిలో
కాంతి నింపు ఎడారి జీవితాల్లో
కలత చెందితే అంథకారమే
కరిగిపొయ్యేది నీ జీవితమే

నీ చెయ్యేరా నీ కన్నీరు తుడిచేది
నీ హృదయమే నీపై
జాలి కురిపించేది
ఎందుకు ఈ నిరాశ

జీవితం నీటిబుడగంటావు
క్షణికం అంటావు...ఏమో
అది ఆరిపొయ్యేలోగా
విశ్వాన్ని నీ వశం చేసుకుంటావేమో

జాబిలికి ఆ వెన్నెల సొంతమనుకుంటున్నావా
నీ లాంటి సూరీడే తనకు వెలుగు
నింపాడని తెలుసుకో
ఏమో ఏదో రోజు
ఆ విశ్వాన్ని
నీ గుప్పిట బంధిస్తావేమో

నా జీవితం నాదనే భావాన్ని
నువ్వు మరిచిననాడు
అంతా నీవై నిండి పోతావు
సమస్తం నీ సొంతం చేసుకుంటావు
అందరి హృదయాల్లో
నిండి పోతావు.

23
మూర్తి శ్రీదేవి
కలంపేరు "గురుసౌభాగ్య"
అంశం :  నేను యెవరు
శీర్షిక :  గెలుపు
తేది : 14 - 4- 20

వెంకట్రామన్ అయ్యర్
గా జన్మించి
యుక్తవయస్సులో మోక్షజ్ఞానం పొంది
అరుణాచల పర్వతాలపై స్థిరపడి ' అతియాశ్రమిగా' ప్రకటించుకున్న
 భారతీయ ఋషి
"రమణమహర్షి"

స్వీయ శోధనే ఉత్తమమని
మోక్షముకు ఇదే సూటిమార్గమని ....
ప్రతి ఒక్కరికి " నేనెవరు" అని ప్రశ్న పరిశుద్ధున్ని
గావిస్తుందని బోధిస్తూ
"మౌనముద్ర" ను పాటించిన జ్ఞానయోగి "రమణమహర్షి"

రమణమహర్షి బోధనలు మనిషిలో ఉన్న మానవున్ని పవిత్రంగా చూపిస్తాయి

వేదాంత ఉపనిషత్తుల
సారాన్ని గ్రహించి "నేను
ఎవరో' తెలుసుకుంటూ
ఐహిక సుఖాలకు లొంగక
బాహ్య సౌందర్యం కొరకు
ఆత్మ సౌందర్యంను
నిర్లక్ష్యం చేస్తూ నన్ను నేను మరిచిపోతున్నాను

పరమానందాన్ని కలిగించే
భక్తి మార్గంలో పయనిస్తూ
నన్ను నేను తెలుసుకుని
అంధకారఛాయలు తొలగించుకుంటు
వెలుగు దివ్వెల కొరకు ఆరటపడతాను

సకల ప్రయత్నానంతరం
నేనొక నామమాత్రపు
పాత్రధారినేనని
అంతా విధాత సంకల్పమేనని
గ్రహించి విధిని అనుసరిస్తూ బతుకు నావ సాగించడమే మానవ ధర్మమని నాకు నేను చెప్పుకున్నాను....
24
పేరు::వురిమళ్ల సునంద, ఖమ్మం
అంశం నేను యెవరు?
శీర్షిక:: ఈ జీవన రంగస్థలంపై..
:::::::::::::::::::::::::::::::::::
ఈ జీవన రంగస్థలంపై
నేను ఎవరో తెలుసుకోవాలనే జిజ్ఞాస
అనుక్షణం నన్ను వెంటాడే ప్రశ్నల కరవాలం!

మనసునెంత నిశ్చల తటాకాన్ని చేసినా
లోలోపల వెలిగే దివ్య జ్యోతిని దర్శించేందుకు
మమకారాల మాయా వీచికలు
మనసును మసకబారేలా చేస్తూనే ఉన్నాయి!
బంధాల అనుబంధాల ముడులు
విడివడక
మోహ పాశాలకు కట్టిపడేస్తూనే ఉన్నాయి!

నిరంతర నిరీక్షిణా తపో దీక్షలో
నన్ను నేను పుటం పెట్టుకుంటున్న క్షణాలు
నాలో ముప్పిరి గొన్న అనేకానేక సంవేదనలు!
జీవాత్మ పరమాత్మ లో అనుసంధానం లో
నేనెవరో  తెలుసుకోవాలనుకునే అంతరాన్వేషణకో రూపమిచ్చి
నీవు నీవే నీ ఉనికి నీదిగా నిలవాలంటే..

సత్కర్మల ఆచరణలే
సర్వ జీవుల సమాదరణలే
జీవన ప్రమాణాలకు గీటురాయి అంటూ
తళుక్కున మెరిసి చేసిన జ్ఞానోపదేశం
నన్ను నన్నుగా నడిపిస్తున్న మహర్షి తత్వం!
25
ఇది వీరా గుడిపల్లి కవిత
అంశం ః నేనెవరు
14/04/2020
**********************
నేనెవరు

అమ్మ నాన్న చెల్లి తమ్ముడు
బంధాలన్నీ బందీలను చేస్తుంటే
నూటాముప్పై కోట్లమందెవరు
ఆపై ఆరొందల కోట్లెవరు?

ఆది మూలం కాంతిరేఖై
అవనిపైనే విస్తరించిన జీవజాలపు ఉనికి యెక్కడ
డీ యన్యే లేని యానం ఆరెన్యేకెలాసాధ్యం
ఈథరైనా సరే యానక మవసరం
ఆధారం లేకుండా సాగలేని చైతన్యం

నేనెవరిని
మూలాల వెతుకులాట చేసేదెవరు
ప్రతిబింబానికి ప్రాణం
తెరపై భీభత్సం
చూసేదెవరు? చూపే దెవరు?
ఎగిసిన మంటలు యేమౌతున్నాయి
ఎమ్సీస్క్వేర్ లో ఈయెందుకు కనిపించదు
చూసేదెవరు చూపేదెవరు
తరగని శోధన ఆగని శోషణ
అందని కోణపు కొలతలు
వేసేదెవరు? కొలిచేదెవరు??

మేనే నీవా,నీవే మేనా
ఎక్కడినుండొచ్చానో ఎందుకని వచ్చానో
నాకు భిన్నంగా యేమీ లేదు
నేనంటే సమస్తం
సమస్తం నేనే
ఈ నేనులెన్ని నేనులుగా చూస్తున్నా
సరే
............. *వీరా గుడిపల్లి*
26

రమాదేవి బాలబోయిన
అంశం...నేనెవరు
~~~~~~~~~~~
ఆత్మజ్ఞానపు తొలిమెట్టు
తననుతాను తెలుసుకునే ప్రయత్నమే
అజ్ఞానతిమిరాలకు గొడ్డలిపెట్టు
అపరితజ్ఞాన సమీకరణ మంత్రమే

గురోపదేశపు వేళనుండి
మొదలయ్యే జ్ఞానావ్వేషణలో
సమస్త విశ్వం ఓ తెరిచిన పుస్తకమవుతుంది

అణువు నుండి అనంతం దాకా
పరిశోధనలో భాగమవుతుంది
నేనెవరూ అనే ప్రశ్నకు
నేర్చుకుంటూ నుదిటిరాత మార్చుకో
అనే "నేను" స్పష్టమవుతుంది

అపుడు నేనెవరినో తెలిసి
ఏ కార్యసాధనకై జన్మించామో తెలిసి
సఫలజన్మ చెసుకునే మార్గం సుగమమవుతుంది

మృదువిరి
వరంగల్
------------------------------
27
గంజాం భ్రమరాంబ
తిరుపతి

నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మించావు?

నీ తల్లిదండ్రులు
నీకు ఊపిరి పోసిన
నిమిషం లోనా....

లేదా
నీ మానవజన్మకు
అర్థం, పరమార్థం
వుందని తెలుసుకున్న
మరుక్షణంలో నా ....

రత్నాకరుడు
వాల్మీకిగా,

సిద్ధార్థుడు
బుద్ధుడుగా,

నరేంద్రుడు
వివేకానందుడుగా,

గాంధీజీ
మహాత్ముడుగా,

ఠాగూర్
కవీంద్రుడుగా,

అంబేద్కర్
రాజ్యాంగ నిర్మాతగా

సావిత్రి భాయి
తొలి ఉపాధ్యాయినిగా

థెరెసా
విశ్వమాతగా,

ఇలా ఎందరెందరో...
పునః జన్మించడానికి

సంవత్సరాల కాలం
యుగాంతాల త్యాగం
జన్మాంతరాల
మేథో మధనం
వెరసి
వారి జన్మ సాఫల్యం

మరి
నిజం చెప్పు
నీవెప్పుడు
జన్మిస్తావు?

 అసలు నీవెవరో
నీవెప్పుడు గుర్తిస్తావు

గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918

Comments

  1. మంచి అంశం,స్పందించి వ్రాసిన నా సహ కవి మిత్రులందరికీ అభినందనలు

    ReplyDelete
  2. నన్ను‌ ద్వితీయ బహుమతికి ఎంపొక చేసిన న్యాయనిర్ణేత లలితకృష్ణగారికి ధన్యవాదాలు. నా సహ విజేతలందరికీ అభినందనలు.

    ReplyDelete
  3. చాలా సంతోషంగా ఉంది ,,నా రచనను
    ద్వితీయ బహుమతికి ఎన్నిక చేసిన న్యాయ నిర్ణేత లలితాకృష్ణ గారికి,,వీరారెడ్డి సార్ గారికి,,ఇందిరా మేడం గారికి నా హృదయ పూర్వక అభివందనాలు,,తోటి విజేతలందరికీ హార్ధిక అభినందనలు

    ReplyDelete
    Replies
    1. వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు

      Delete
  4. అకాల అనారోగ్యం వల్ల తొమ్మిదవ తరగతి లోనే అక్షరాభ్యాసం ఆగినా... నాన్న తెచ్చే పకోడీ పొట్లం లో అచ్చయిన కవితల సాక్షిగా... చందమామ కథల స్ఫూర్తిగా... యద్దనపూడి, యండమూరి నవలల ప్రేరణతో...
    ఆరు పదుల వయస్సు చేరువలో...
    విధి ఆడిన వింత నాటకం లో...
    బాసర సరస్వతీ సమక్షంలో...
    కోడలు డా. రమాదేవి ప్రోద్బలంతో...
    తన కవితాక్షరాభ్యాసం తిరిగి ప్రారంభించి...
    పలు నూతన కవితా ప్రక్రియలలో ప్రతిభ చూపి...
    "నేనెవరు" లో స్థానం సంపాదించిన మదీయ మాతృమూర్తి "శ్రీమతి ఎం వి ఉమాదేవి" గారిని గుర్తించి తృతీయ స్థానంతో ప్రోత్సహించినందులకు కృతజ్ఞతలు.
    ఇట్లు,
    కళ్యాణ్
    8886171254.

    ReplyDelete

Post a Comment